*జై శ్రీమన్నారాయణ*
09.03.2025,ఆదివారం
*ఎండలు ముదురుతున్నాయ్.. జర జాగ్రత్త...*
ఈ ఏడాది దేశంలో మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచి కొట్టుతున్నాయి.. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. రాష్ట్రంలోని 301 మండలాలు 'హేట్ వేవ్స్' నమోదయ్యే ప్రాంతంలో ఉన్నాయని, వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రాంతం మెట్ట నేలలతో కూడుకుని ఉండటంతో భూమి త్వరగా వేడెక్కుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు...
*ఇలా ముదురుతున్న ఎండలకు - మనం తీసుకోవల్సిన జాగ్రత్తలు..*
* శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే.. జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్ హీట్‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే మెదడు దెబ్బతింటుంది. అంతర్గత అవయవాల పనితీరును కూడా పాడవుతుంది.
* ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
* ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
* తగినన్ని నీళ్లు తాగుతూ డి హైడ్రేట్ కాకుండా ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి.
* అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.
* తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్లు ధరించాలి.
* మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. సాయంత్రం పూట బయటికి వెళ్ళాలి. (ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.)
* కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.
* కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.
* ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ
* చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగిపోతాయి.
* ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
* ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి