Men ను కలుపుకొని women అయింది
He ను నింపుకొని she అయింది
మహిళ అనే పదంలోనే "మహి"(ప్రపంచం) ఉంది
దేవుడు సృష్టించిన అద్భుతం- జీవజాతులలో అపూర్వం
అణుకువ ఆమె సొంతం-అందం ఆమె పాదక్రాంతం
ఆకలేస్తే అన్నపూర్ణ -అరాచకం చేస్తే ఆదిశక్తి
కష్టం వస్తే కన్నతల్లి- ఓపికలో నేలతల్లి
పేగు బంధాన్ని పంచే అమ్మ-కొత్త బంధాల్ని పెంచే భార్య
అనురాగంలో అక్క- చిలిపిదనంలో చెల్లి
ఆమె చేసిన బొమ్మలం-ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం?
ఆమె చేయని పాత్ర లేదు-నెరవేర్చని ఘనతలేదు
ఉద్యోగం లో రానించగలదు-రాజ్యాన్ని సైతం పాలించగలదు.
ఎంత గొప్పవాడైనా ఆమె గర్బాన గడపాల్సిందే!
ఎంత మొనగాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే!
*మహిళామనులందరికీ మరియు మహిళ నడిపించే మనుషులందరికి "మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు*
ఇట్లు
ఓ మహిళ మలిచిన మనిషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి