చ.పరులకుఁ జెప్పు సూక్తులవి వర్ధిలుచుండు వినోద హేతువై
నిరతము శ్రీ ప్రతిష్ఠలననేక విధమ్ములఁ బెంచుఁ గాని యా
విరచిత భాషణమ్ములు వివేకముఁ గూర్చును చిత్త శుధ్ధితో
నరయుచు ధర్మ మార్గమున నాచరణమ్మునఁ జూప భారతీ!౹౹73
శా.శంభో శంకర భక్త రక్షక మహేశా యంచు సర్వజ్ఞు హే
రంబున్ పట్టిగ గాంచి నట్టి భవు నీలగ్రీవు ప్రార్థించి సం
రంభమ్మొప్పగ రక్ష సేయగల సర్వాత్మున్ సదా గొల్చెదన్
దంభమ్మేమియు లేని రీతి మదిలో ధ్యానించుచున్ భారతీ!౹౹ 74
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి