*
దేశ గణ తంత్ర దినోత్సవము/స్వపరిపాలన (26-1-1947) నాటికి అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల పట్టిక ప్రకారం అమెరికా దేశపు డాలర్ తో పోల్చినప్పుడు ఒక డాలర్ విలువ 4 రూపాయల 76 పైసలు. నేడు అనగా 2025 సంవత్సరంలో ఒక డాలర్ విలువ 87 రూపాయల 81 పైసలు. రూపాయి మారకం విలువ తగ్గిపోయినందుకు కారణం...అమెరికన్ డాలర్ బలపడటమే అని తేలికగా చెప్పేసి, నెపాన్ని ఇతర దేశాలపై రుద్దేస్తున్నాము. కాని, వాస్తవానికి రూపాయి మారకం విలువ ఇంతగా దిగజారడానికి ముఖ్య కారణం నీతిమాలిన వ్యక్తుల యొక్క స్వార్థ పూరిత చర్యలు.
ఈ తగ్గుదలను ద్రవ్యోల్బణము అని వ్యవహరిస్తూ ఉంటాము. ఈ ద్రవ్యోల్బణము వలన క్రమంగా కొనుగోలు శక్తి నశిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి నానాటికీ అధిక శాతం ప్రజలను బీదరికం వైపు నెట్టుతుంది. *ఈ పరిస్థితి ఆందోళనకరమే గాకుండా అభివృద్ధి చెందాలనుకున్న దేశాలన్నిటికీ హానికరము గూడా*.
ముందు మన దేశంలోని నల్ల బజారు బడా బాబులను మరియు అక్రమ రవాణా దురంధరుల విషయం సమాలోచించుదాము. ప్రభుత్వ పరిధులు, పరిమితులు, చట్టాలకు లోబడని క్రయ విక్రయాల లావాదేవీలను నల్ల బజారు వ్యవహారంగా పరిగణించ వచ్చును. ఉదాహరణకు బియ్యం, గంజాయి, ఎర్ర చందనం, కలప అక్రమ, అక్రమ ఇసుక రవాణా. ఆపత్కాలంలో ప్రాణ రక్షణ మందులు, నాసి రకం వస్తువులు అధిక ధరలకు విక్రయించడం. విదేశీ మాదక, మత్తు మందులు (Drugs), పొగాకు, నకిలీ ఆయుధాలు, మానవ అవయవాలు చట్టం విరుద్ధంగా అమ్మడం. జనరంజక సినిమా టికెట్లు, జనాకర్షక బంగారం నల్ల బజారులో ఉంచడం. అక్రమ వెంచర్లు, దొంగ నోట్లు ముద్రణ ఇత్యాది.
దేశంలో ఇన్ని రకాల మోసాలు, అక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడేమయ్యిందని గగ్గోలు పెట్టేవారికి సమాధానం ఏమని చెప్పాలి? ఎవరు చెప్పాలి. ?
మళ్ళీ మన వాళ్ళే అంటారు...ఇవన్నీ చూడడం చట్టం మరియు భద్రతా అధికారుల బాధ్యత, మాకేమీ సంబంధం అని. *సమాజంలో ఉంటూ దేశద్రోహ మరియు ఆర్థిక క్షీణత కార్యక్రమాలు జరుగుచుంటే ఉదాసీనంగా ఉండడం నాగరికం కాదు*.
ధన్యవాదములు
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి