*2155*
*కం*
మొక్కల నాటెడి వారలు
పెక్కుగ కలరీ పుడమిన విలువేమిటయా!?.
చక్కగ(ని) చెట్లను గాచెడు
మక్కువ కాడొక్కడైన మాన్యుడు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మొక్కలు నాటేవారు ఎంతో మంది ఉండి విలువయేమిటి!!?? చక్కని చెట్లను కాపాడేవాడు ఒక్కడైననూ గొప్ప వాడే.
*సందేశం*:-- ఏదో ఒక సాకు తో ఏళ్ల నాటి వృక్షాలను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అటువంటి చెట్ల ను నరకబడకుండా కాపాడేవాడే పూజ్యుడు. చెట్లు మనకు చేసే ఉపకారాలు చాలా ఎక్కువ.అవి మనం వేరేవిధంగా పొందలేము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి