శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః(5)
యథా௨௨కాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్
తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ (6)
ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలనూ సృష్టించి, పోషిస్తున్నప్పటికీ వాటిలో వుండదు. సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్లే సర్వభూతాలూ నాలో వున్నాయని తెలుసుకో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి