26, జులై 2020, ఆదివారం

⚜️ *:పులి కాపు:*⚜️

 *పుల్లని వస్తువుతో పరిశుద్ధం చేయటం పులికాపు.* వైష్ణవ పరిభాషలో తమిళ భాషలో 'పులిక్కాపు'. దేవతా విగ్రహాలను అప్పుడప్పుడు చింతపండుతో తోమి శుభ్రం చేసి పునరావాహన చేసి ప్రతిష్ఠించి పూజిస్తారు. ఈ దేవకార్యానికి కాలక్రమాన ''దేహశుద్ధి'' అనే అర్థం వచ్చింది. ''ఒళ్ళు కడగటం'' అనే అసలర్థమున్న దేహశుద్ధి లాగానే పులికాపు అనేమాటక్కూడా "తోమటం", "కొట్టడం" అనే అర్థాలు వాడుకలో నిలిచాయి. *మంత్రపూతంగా విగ్రహాలను శుద్ధి చేయటమనే* శాస్త్రార్థం స్థానంలో *చావగొట్టడమనే* అర్థం వాడుకలో నిలిచింది. పులికాపు పెట్టడం అంటే "తన్నటం". వైష్ణవ విద్యార్థుల వాడుకలో ఈ అర్థం బలీయం తప్పు చేసినందుకు ఆచారికి వాళ్ళ నాయన *పులికాపు* పెట్టాడు (తన్నాడు) అనే వాడుక ఉంది.
********************************

కామెంట్‌లు లేవు: