7, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీలక్ష్మి పూజా

శ్రీలక్ష్మి పూజా విధానము


దీపావళి కథ:-ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీ క్రుష్ణ భగవానుని చేతులు జోడించి "క్రుష్ణా! మేము కోల్పోయిన రాజ్యసంపదను తిరిగి పొందే ఉపాయాన్ని తెలియజెయ్యి" అని కోరాడు.

        అప్పుడు భగవానుడు ఇలా బదులు పలికాడు-రాక్చసరాజు బలిచక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో ఆ రాజ్యంలోని ప్రజలంతా సుఖజీవనులై ఉండేవారు. బలిచక్రవర్తి నాకు అత్యంత ప్రియమైన భక్తుడు. ఒకసారి అతడు శతాశ్వమేధ యజ్ఞాలు జరపడానికి ప్రతిన బూనేడు. 99యఙ్ఞాలు నిర్విఘ్నం గా ముగిశాయి. కానీ ఆఖరిది 100వది మిగిలింది. అప్పుడు ఇంద్రుడికి సింహాసనం హరింపబడుతుంధనే భయం పీడించసాగింది. వంద అశ్వమేధ యాగాలు నిర్వర్తించినవాడు ఇంద్రపదవికి అర్హుడవుతాడు. భయకంపితుడైన ఇంద్రుడు రుద్రాదిదేవతల కడకు పయనమయ్యాడు. కానీ వారు ఏవిధమైన ఉపాయాన్ని సూచించ లేకపోయారు. ఆపైన ఇంద్రుడు వైకుంఠానికి చేరి క్చీరసాగరంలో ఆదిశేషువు మీద పవళించిన విష్ణుమూర్తి ని పురుషసూక్తాది వేదమంత్రములు తో స్తుతించి సేవించాడు. అప్పుడు స్వామి కరుణించి ఇంద్రుని కడగండ్లను శ్రద్ధగా విన్నాడు. ఇంద్రా! కలత చెందకు నీ దుఃఖం ను పోగొడతాను అని అనునయించి పంపాడు.

           ఇక్కడ బలిచక్రవర్తి వందవ యాగం సన్నాహంలో ఉన్నాడు. విష్ణుమూర్తి వామనావతారం దాల్చి బయలుదేరారు. రాజును మూడుఅడుగుల భూమిని దానంగా కోరాడు. దాన సంకల్పం ను చేతిలోకి తీసుకుని ఒక పాదాన్ని ప్రథివీతలమంతా రెండవపాదాన్ని అంతరిక్ష మంతా ఆక్రమించేలా చేసి మూడవపాదం బలిచక్రవర్తి శిరంపైనే మోపాడు. బలిచక్రవర్తి భక్తికి, దానశీలతను మెచ్చి భగవానుడు వరం కోరుకోమన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి తన కోరికను హే ప్రభో! కార్తీకమాస క్రుష్ణ పక్షంలో త్రయోదశి, చతుర్దశి అమావాస్య తిథులలో ఈ భూమండలం మీద నా రాజ్యం ఉండేలా అనుగ్రహించు. ఈ దినాలలో ప్రజలందరూ దీపదానాలు చేసుకొంటూ, దీపావళి జరుపుకొంటూ దీపారాధన సలుపుతూ పండుగ చేసుకునేలా తద్వారా లక్ష్మి వారి ఇంటనివాసముండేలా కరుణించు. అలా కాని పక్షంలో లక్ష్మీ దేవి క్రుద్ధురాలవుతుంది అని విన్నవించు కున్నాడు. అది విని విష్ణుమూర్తి ప్రసన్నుడై బలిచక్రవర్తి కోరిన విధంగా వరమనుగ్రహించాడు. అది విని విష్ణుమూర్తి ప్రసన్నుడై బలిచక్రవర్తి కోరిన విధంగా వరమనుగ్రహించాడు. ఈ రోజుల్లో లక్ష్మీపూజ చేసిన వారి ఇంట, దీపావళి పండుగ జరుపుకున్న వారి ఇంట లక్ష్మీదేవి తన నివాసమేర్పరచుకుంటుంది. ఆ భక్తులు అంత్యకాలంలో నా పరమధామాన్ని కూడా చేరుకొంటారు. ఆ విధంగా వరాలనొసగి విష్ణుభగవానుడు బలిచక్రవర్తి ని పాతాళానికి రాజును చేశాడు. ఇంద్రుడి భయాన్ని దూరం చేశాడు. అప్పటి నుండి దీపావళి రోజుల్లో శ్రీమహాలక్ష్మి ని కొలిచి పూజాదులు నిర్వహించుకొనే సంప్రదాయం ఏర్పడింది. ఫలితంగా అట్టి భక్తులు ఇంట సిరి తాండవిస్తుంది. దారిద్య్రములు అన్నీ పటాపంచలవుతాయి.

🍁🍀🍁🍀🍁🍀🍁🍀

కామెంట్‌లు లేవు: