7, డిసెంబర్ 2020, సోమవారం

త్రిపుండ్రం త్రిగుణాత్మకమ్

 త్రిపుండ్రం త్రిగుణాత్మకమ్ తరువాత :ఈవిధంగా త్రిపుండ్రధారణ జేసే బ్రహ్మచారి అయినా గ్రుహస్థుడైనా వానప్రస్థుడు, చివరికి సన్యాసి అయినా అయినా అతడు మహాపాతకాలనుండి, ఉపపాతకాలనుండి విముక్తుడు అవుతాడు. అతడు సకల దేవతలను ఎరిగినవాడు (ఙ్ఞాత) అవుతాడు. సర్వభోగాలను అనుభవించి చివరకు శివలోకాన్ని చేరతాడు. పునర్జన్మ రహితుడు అవుతాడు.

       మొదట ఎడమచేతితో తరువాత కుడి చేతిలో గంగ, భగీరథి మొదలైన తీర్థాల మ్రుత్తికను లేదా గాహాందాత్యౌపాసన యొక్క అగ్ని భస్మాన్ని గ్రహించి దానికి జలాన్ని సమ్మిశ్రితం చేశాక కుడిచేతిలో భస్మాన్ని గ్రహించి జలాన్ని కలిపిన తర్వాత కుడిచేతిలో భస్మాన్ని మర్దన చేయాలి. ప్రాతఃకాలం లో జలం మిశ్రితంగా, మధ్యాహ్నం చందన మిశ్రితంగా, సాయంకాలం జలం మిశ్రితంగా భస్మాన్ని ధరించాలి. భస్మాన్ని ఈ క్రింది మంత్రాలలో అభిమంత్రించాలి.

ఓం అగ్నిరితి భస్మ! ఓం వాయురితి భస్మ!

ఓం జలమితి భస్మ! ఓం స్థలమితి భస్మ! ఓం వ్యోమితి భస్మ! ఓం సర్వహవా ఇదం భస్మ!

ఓం మమ ఏతాని చక్షుషి భస్మా నీతి!

తర్వాత క్రింద పేర్కొన్న మంత్రాలతో విభిన్న అంగాలకు భస్మాన్ని ధరించాలి.

ఓం ప్రసహ్యభస్మనాయోనిమపశ్చ

ప్రుథ్వీ మగ్నే!

ఓం త్రయాయుష జ్జమదగ్నే రితి లలాటే!

ఓం కశ్యపస్య త్రయాయుషమితి

దక్షిణాంగ!

ఓం యద్దేవేషుం త్రయాయుషమితి దక్షిణాంగ!

ఓంతన్నోం అరస్తు త్రయాయుషమితి హ్రది!

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు: