7, డిసెంబర్ 2020, సోమవారం

త్రిపుండ్రం త్రిగుణాత్మకమ్

 త్రిపుండ్రం త్రిగుణాత్మకమ్ 🌳


       శూన్యలలాటంతో చేసే శివ పూజ వ్యర్ధమే అని దేవీ భాగవతము పేర్కొంది. సాధకుడు ఏదో ఒక భస్మము ధరించాలి. పవిత్ర భస్మాన్ని ఈ క్రింది విధంగా ధరించాలి. కుడిచేతి మధ్యాంగుళీత్రయంతో అనగా ఐదువ్రేళ్ళలో బొటనవ్రేలు, చిటికెన వ్రేలు మినహాయించి మిగిలిన మూడు వ్రేళ్ళలో నుదుట త్రిపుండ్రాన్ని ధరించాలి. అది ఈ కంటి కొన నుంచి ఆ కంటి కొనదాకా ఉండేలా త్రిరేఖలు తీర్చిదిద్దుకోవాలి. మూడు వ్రేళ్ళతో భస్మాన్ని త్రిరేఖలు గా ధరించాలి. ఈ రేఖలలో అనామిక కు అకారమనీ, మధ్య మాంగుళిని ఉకారమని, తర్జనని మకారమని అంటారు. అనగా చిటికెన వ్రేలు ప్రక్కవేలు అకారము, మధ్య వ్రేలు ఉకారము, చూపుడువేలు మకారమని అంటారన్న మాట. ఈ మూడు వ్రేళ్ళు తో ధరించిన త్రిపుండ్రాల త్రిగుణాత్మకమ్, ప్రణవాత్మకము(అకార ఉకార మకారలతో ఓంకారం అన్నమాట) అడుగున ఉండే అనామిక రేఖ బ్రహ్మ తత్వం రజోగుణానికి సూచకం కాగా, మధ్య వ్రేలి గీత విష్ణు తత్వం సత్వ గుణ సూచకం, అలాగే చివరిది తర్జనీరేఖ శివతత్వం తమోగుణము. ఈవిధంగా త్రిపుండ్రం త్రిగుణాత్మకమ్ త్రిమూర్త్యాత్మకంగా గ్రహించాలి.

కామెంట్‌లు లేవు: