🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈశ్వర పాదధ్యానం ఎల్లప్పుడూ తమ మనస్సునందు ఉండుగాక అని శంకరులు ఈ శ్లోకం లో చెప్పారు.*
*శ్లోకం : 74*
*ఆశాపాశ క్లేశ దుర్వాసనాది*
*భేదోద్యుక్తై ర్దివ్య గంధై రమందైః*
*ఆశాశాటీకస్య పాదారవిందం*
*చేతః పేటీం వాసితాం మేతనోతు "!!*
*తాత్పర్యము :-*
*ఆశాపాశములు, మనోదేహ క్లేశములు దుష్ట సంస్కారములు మొదలగువానిని భేదించుటకు సిద్ధములైన (సమర్థములైన) అమోఘములూ, దివ్యములూ అయిన సువాసనలచే దిగంబరుడైన శివుని యొక్క పాదమనెడి పద్మము నా చిత్తము అనే పెట్టెను సువాసనగల దానిగా చేయును గాక !*
*వివరణ :-*
*శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించు కున్నారు.*
*"ಓ ఈశ్వరా ! నామనస్సనే పెట్టెలో చాలా భయంకరమైన దుష్ట వాసనలున్నాయి. అందులో మొదటిది ఆశాపాశము. అంటే ఆశ అనే పాశం. పాశమంటే త్రాడు. ఆ ఆశ అనేత్రాడు నామెడకు ఉరిలా బిగుసుకుపోయి, ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతే కాకుండా దానికితోడుగా క్లేశాలూ బాధిస్తున్నాయి.*
*ఆ క్లేశాలు ఐదు:-*
*పంచక్లేశాలలో మొదటిది "అవిద్య ". నా స్వరూపమేమిటో నాకు తెలియక పోవడమే అవిద్య. (అవిద్యా _స్వరూప + అజ్ఞానం.*
*రెండవది "అస్మిత". అస్మి అంటే ఉన్నాను అని అనుకోవడమే దాని లక్షణం. పుట్టడం క్షణక్షణానికీ మార్పు పొందడం, చివరికి నశించడం అనే స్థితులతో, తుస్సుమనే తోలుతిత్తియే నేను అని భావించడం. అంటే దేహాభిమానం.*
*మూడవది "రాగం". విషం వంటి విషయం మీద అనగా శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైన దాని మీద అనురక్తిని "రాగం " అంటారు. (ఇష్టవిషయే అనురక్తిః _ రాగః)*
*నాలుగవది "ద్వేషం " ఇష్టం కాని విషయాలను అసహ్యించు కోవడం (అనిష్టవిషయే అప్రీతిఃద్వేషః)*
*ఐదవది "అభినివేశం " . పనికిమాలిన పనులపై కర్తవ్య బుద్ధి పెట్టుకోవడం, "అభినివేశం". (వ్యర్థేషు కర్మసు కర్తవ్యత్వాగ్రహః అభినివేశః ).*
*పైనచెప్పిన ఆ ఆశా,ఈ పంచ క్లేశాలూ నాహృదయంలో చేరి కుళ్ళు కంపు కొడుతున్నాయి. ఇంకా ఇటువంటివిచాలా వున్నాయి. వాటిని దూరంగా తోలివేయాలి.*
*హృదయ పేటికలో ఎంత దట్టంగా ఆశాపాశ క్లేశములు అనే దుర్వాసనలు నిండియున్నా శివపాదపద్మ పరిమళాలు వాటిని క్షాళనం చేసి హృదయపేటికను పరిమళభరితంగా చెయ్యగలవని శంకరులు సూచించారు.*
*ఉదయాద్రిపై సూర్య కిరణాలు పడగానే, చిమ్మ చీకట్లు పటాపంచలవుతాయి. అలాగే హృదయంలో భగవంతుని పాదములు నిలువగానే పాశములవంటి ఆశలూ పాపసంస్కారములూ,క్లేశములూ వాటంతట ఆవియే పటాపంచలవుతాయని గ్రహించాలి.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి