*ఈ మాయా ప్రపంచం లో - పంచాక్షరి మహా మంత్రం ఏమిటి??*
*_"దేవుడున్నాడు "_*
ఈ సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే అర్ధమయ్యేది, ఏమిటంటే ఈ సృష్టి కి మూలాధార మైనది 'మహత్తు' అంటాము, *అదే దైవం*...
ఆ దైవశక్తే తన దివ్య శాసనాన్ననుసరించి, సృష్టి స్థితి, లయములను నడుపుతోంది.
జరిగేది సర్వం దైవసంకల్పమే, స్వయం కృషితో పైకి వచ్చానని గర్వపడకు, బాగా పరిశీలిస్తే, భగవంతుని అదృశ్య హస్తం గోచరిస్తుంది...
దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడని సతతం స్మరించు, అదే పంచాక్షరి మహా మంత్రం...
అలా స్మరిస్తుంటే ఆయన నీలోనే ఉన్న అనుభవం కలుగుతుంది.
సుఖాలలో దైవాన్ని విస్మరించి, కష్టాలలో శాంతి వ్రతాలు చేయడం అవివేకం.
కష్టాలకు కృంగకు,
అదినీకర్మ ఫల ప్రక్షాళన గా భావించు,
దైవ విశ్వాసము ఉంటే అది భరించే శక్తి నీకు వస్తుంది, బాగా తెలుసుకో, నీకున్న నిస్వార్థ బంధువు భగవంతుడు ఒక్కడే.
ఈ ప్రాపంచిక బంధములన్నీ ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యాపార సూత్రం మీద ఆధారపడినవే, అంతే కానీ ఏదీ శాశ్వతం కాదు, భగవంతుడు ఒక్కడే శాశ్వతం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి