30, జూన్ 2025, సోమవారం

అంతర్ముఖంగా చూడాలి*

 *ఎవరిలోనైనా భౌతిక సౌందర్యాన్ని చూడరాదు - అంతర్ముఖంగా చూడాలి*


ఒకానొక సమయంలో పరమభాగవతోత్తముడు , త్రిలోకసంచారియైన నారదమహర్షి , 

పర్వత మహర్షి, ఒక మహారజు  భవనంలో ఆతిధ్యం  స్వీకరించి అక్కడ

నివసించారు. 

మహా రాజు

ఆ మునుల సేవలకై తన పుత్రిక అయిన దమయంతిని నియమించాడు. 


అందం, వినయం, తెలివి తేటలు, కలిగిన దమయంతి నారదునికి అధికంగా సేవలు చేసేది.

ఇది పర్వత మహర్షి కి ఈర్ష్య , ఆగ్రహం కలిగించింది.

నారదుడు అందంగా వున్నందునే దమయంతి అతనికి అధిక సేవలు చేస్తోందని మహర్షి భావించాడు. 


నారదుని ముఖం వానర ముఖంగా మారాలని శపించి  అక్కడ నుండి  యాత్రలకు బయలుదేరి వెళ్ళి పోయాడు.


ఆ ముని శాపం వలన నారదుని ముఖం కోతి గా మారిపోయింది.

అయినా , 

దమయంతి  తన నిర్మలమైన సేవలను ఆపలేదు. 


ఆమె నారదుని

భౌతిక సౌందర్యాన్ని చూడలేదు. 

నారదుని ఆంతరంగిక  సౌందర్యాన్ని

కోరుకుంది.  


నారదుడు ఆమె గుణాలకు  సంతోషంపొంది, దమయంతి ని తనకిచ్చి వివాహం చేయమని మహారాజును  అడిగాడు.


నారదుని కోరికను మన్నింప మహారాజు సందేహించాడు, కానీ , ఆయన కుమార్తె

దమయంతి నారదుని భగవత్చింతన, సద్గుణాలను తండ్రికి తెలిపి, ఒప్పించింది. 


మహారాజు కూడా ఆనందంతో

దమయంతి వివాహం

నారదునితో జరిపించాడు.


కొన్నాళ్ళ తర్వాత ,తిరిగి వచ్చిన పర్వత మహర్షి , జరిగినది తెలుసుకొని తన తప్పుకు చింతించి నారదుని క్షమాపణలు కోరి ,నారదుని కి శాప విమోచనం కలిగించాడు.


భౌతిక  సౌందర్యానికి మైమరచి అహంకారపూరితులు కాకుండా , యింద్రియ నిగ్రహంతో ఆత్మ జ్ఞానాన్ని  సంపాదించాలని

జగద్గురువు ఆది శంకరాచార్యులవారు

బోధించారు నీతి సందేశం....


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: