15, జులై 2025, మంగళవారం

జగద్గురువులూ చతురులే*

 *జగద్గురువులూ చతురులే*

    ఒకసారి విద్వాంసుడు శృంగేరీ 34వ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీమహస్వామివారి దర్శనానికి శృంగేరీ వెళ్ళాడు. స్వామివారికి బిక్షావందనం చేసి...స్వామివారితో ఇలా అన్నాడట.

 "భగవద్గీతలో తాను నిష్టాతుడనని తనకెంతో ప్రావీణ్యం ఉన్నదని ఎన్నో దేవాలయాల్లో, సభల్లో భగవద్గీతమీద ప్రవచనాలు చేస్తానని, అందుకు తమరు కూడా శృంగేరీ పీఠ అనుబంధ శాఖల్లో తనకు అవకాశము ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రార్ధించాడు.

 మహాస్వామివారు ఆ విద్వాంసుని గౌరవపూర్వక అభ్యర్ధనని విని సంతృప్తిగా తగిన ఏర్పాట్లను బెంగుళూరులో ప్రథమంగా చేయించారు.

 వారి మొదటిరోజు భగవద్గీత ప్రవచనానికి వందమంది వరకు శ్రోతలు హాజరయి ఆ ప్రవచనాన్ని విన్నారు.

 రెండోరోజు శ్రోతల సంఖ్య బాగా తగ్గింది. ముప్ఫయి మంది వరకు ఆశీనులై విన్నారు.

 మూడోరోజున కేవలం ఒక ఐదుగురు వరకే వచ్చారు. సమావేశ మందిరం వెల వెల బోయింది. ఈ విషయం జగద్గురువుల దరికి చేరింది.

ఆ విద్వాంసుడు శృంగేరీకి వెళ్ళాడు.

అదే రోజు రాత్రి స్వామివారి పూజానంతరం, ఆ పండితుడు జగద్గురువులతో " ఇదేం పట్టణమండీ! భగవద్గీత అంటే బొత్తిగా ఎవరికీ ఇష్టం లేనట్లు ఉంది" అని మిక్కిలి బాధతో స్వామివారికి వినమ్రపూర్వకంగా విన్నవించారు. 

అందుకు స్వామివారు చిరు దరహాసంతో తమ అమృత వాక్కుతో ఇలా అన్నారు " ఎందుకు తమరు అంతలా చింతిస్తారు! భగవద్గీతను శ్రీకృష్ణుడు ఈ విశ్వానికి తెలిసేలా చెప్పినప్పుడు విన్నది ఎంతమందో కాదు కదా! కేవలం అర్జునుడొక్కడేగా!" అని ఆయన్ని సముదాయించి పంపారట.

కామెంట్‌లు లేవు: