*ఆదిలోనే హంసపాదు*
ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు. గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోత్తాన్ని తమ భుజంపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు. హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది. వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి. ప్రారంభంలోనే అవాంతరం ఏర్పడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.
అలాగే
వ్రాసేటప్పుడు తప్పిపోయిన పదాన్ని చెప్పడానికి అక్కడ ఒక గుర్తు పెట్టి దానిని మరొక చోట లేదా పుట క్రిందనో చూపుతారు.
అంటే మొదట్లో నే అవాంతరం ఏర్పడినది అని తెలపడానికి ఈ సామెత వాడతారు.
ఇది సాధారణంగా తాటియాకు మీద ఘంటంతో వ్రాసేటప్పుడు గాని వ్రాసిన తరువాత గాని ఎక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసినప్పుడు చెరిపి వేయడానికి గాని చేర్చడానికి గాని వీలుపడదు. అప్పుడు అంచపాదం గుర్తు పెట్టి ఆవతల వ్రాస్తారు.
ఈ వ్యవహారాలు నేడు ఇప్పటికీ దస్తావేజులు వ్రాసే వ్రాయసగాండ్రు చేస్తూ ఉండడం పరిపాటే.
మూల తాటియాకు ప్రతులల్లో కూడా ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి