12, ఆగస్టు 2020, బుధవారం

"మనసులో కొనసాగే ఆలోచనలు బాధిస్తున్నాయి, వాటి నుండి విడివడేదెట్లాగ ?"*_



_*💖కోపం, అసూయ, ద్వేషం, అసహనం, చికాకు, మోహం వంటి గుణాలకు మనసులో కొనసాగే ఆలోచనలు కారణం అవుతున్నాయి. అందుకే అవి మనను బాధిస్తున్నాయి. మన ప్రతి ఆలోచన మనలో కలిగే కోరికకు అనుగుణంగా మన జ్ఞాపకాల పరిధిలోనే ఉంటుంది. కేవలం మనకు వచ్చే ఆలోచనలనే మనం మనసుని అనుకుంటున్నాం. ఆ ఆలోచనలకు కారణమైన జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను కారణమైన కోరికలు, ఆలోచనలకు ఫలంగా లభించే సంతోష-దుఃఖాలు అన్నీ కలిపితేనే మన మనసు. సాధారణంగా సాగే ఆలోచనలు మనను ఇబ్బంది పెట్టటంలేదు. చేస్తున్న పనికి అంతరాయం కలిగించే ఆలోచనలే మనని బాధపెడుతున్నాయి. మనం ఆలోచనల నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తుంటాం. ఆలోచన స్వరూపాన్ని అర్ధం చేసుకునేందుకు కారణాలు విశ్లేషించుకుంటే తప్ప వాటి నుండి పూర్తిగా బయటపడలేం. మనకు నిజానికి ఆలోచనలవల్ల బాధ రావటం లేదు. ఆ ఆలోచనతో పాటు మనలో కలిగే గుణాలవలనే బాధ కలుగుతుంది. ఆ గుణాలే.. కోపం, అసూయ, ద్వేషం, అసహనం, చికాకు, మోహం. ముందుగా వీటి నుండి బయటపడాలి !*_

*"💖శాంతిని కలిగించే గుణాలు ఏమైనా ఉన్నాయా ?"*_

💖_*నిర్గుణత్వమే శాంతి. అన్ని గుణాలు నీరుగారిపోతే మిగిలేది నిర్గుణత్వమే. విజయవాడ లో ఒక వీధిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు అనేక గుణాలు కలుగుతాయి. ఒక దుకాణాన్ని చూడగానే ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది. మరొక దుకాణాన్ని చూడగానే పాత గొడవ గుర్తుకు వచ్చి ద్వేషం వస్తుంది. ఇలా కనిపించే ప్రతి దృశ్యం ప్రతి వ్యక్తి ఏదోక గుణానికి కారణం అవుతూవుంది. అదే మనం తాడేపల్లి వైపుకు వెళ్తున్నప్పుడు దారిలో పచ్చని పొలాలు, పంటకాల్వలు, పక్షులు కనిపిస్తాయి. అయితే అవి మనలో ఆహ్లాదం తప్ప ఎలాంటి గుణాలను ప్రేరేపించటం లేదు. ఈ రెండింటికీ తేడా ఏమిటి? మనం ఊళ్ళో తిరుగుతున్నప్పుడు కనిపించే ప్రతి దృశ్యం, వ్యక్తి మనలో ఏదోక కోరికను కలిగించేవై ఉంటాయి. కానీ ఏ గుణం లేని ప్రకృతిని చూస్తున్నప్పుడు మనకు ఆ నిర్గుణంలోని శాంతే అందుతుంది !*_

కామెంట్‌లు లేవు: