12, ఆగస్టు 2020, బుధవారం

*అగస్త్య భ్రాత*



శ్రీమద్రామాయణం లో శ్రీరాముడు వనవాస కాలంలో అగస్త్య మహర్షిని, ఆయన సోదరుని(అగస్త్య భ్రాత) దర్శించినట్లు చెప్పేరు. ఆ సోదరుని 'పేరు' చెప్ప బడలేదు. ఆయన కూడా అగస్త్యుని యంత పండితుడు, తపస్సంపన్నుడూను. 'అగస్త్య భ్రాత' యని మాత్రమే ఉన్నందున ... లోకంలో ఒక నానుడి యేర్పడింది...పెద్ద పేరు గలవారి బంధువుల కు 'అగస్త్యభ్రాత' యని ...వీరెంతవారైనా.. ఆ లబ్ధ ప్రతిష్ఠుల ముందు తక్కువై యుండడం వల్ల.

కానీ .. రామాయణం లో లేకున్నా.. *సనత్కుమార సంహిత* లో ఆ అగస్త్యభ్రాత పేరు *సుదర్శనుడు* యని చెప్పబడింది.
*"యవీయాన్ ఏష మే భ్రాతా 'సుదర్శన' ఇతి స్మృతః* ".

కామెంట్‌లు లేవు: