25, ఆగస్టు 2020, మంగళవారం

వాము -- ఆయుర్వేదం

వాము అనేది ప్రతి ఒక్కరి వంటగదిలోనే ఉంటుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. వాము ఘాటుగా కాస్త కారంగా ఉంటుంది. మన అమ్మమ్మల కాలం నుండి వామును ఇంటి చిట్కా గా వాడుతున్నారు. కాస్త కడుపునొప్పి అనిపిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త వాముని నోట్లో వేసుకుని నమలండి అని చెబుతారు. వాము తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడి కడుపు నొప్పి, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ప్రస్తుతం వానలు వస్తున్నాయి కదా… ఈ వాన కాలంలో దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి తరచుగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వేడిపాలల్లో వాము పొడి కలుపుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తల నొప్పి కూడా తగ్గుతుంది. వాము లో ఉండే పోషకాలు గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేయడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే వాము లో విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారి ఆహారంలో వామును చేర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
శ్రీ శర్మద
***************

కామెంట్‌లు లేవు: