25, ఆగస్టు 2020, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*651వ నామ మంత్రము*

*ఓం విజ్ఞాత్ర్యై నమః*

విజ్ఞానమును ప్రసాదించు జ్ఞానశక్తి స్వరూపిణికి నమస్కారము.

ఇంద్రియములలో చైతన్యము ప్రసాదించి శక్తిని అనుగ్రహించు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విజ్ఞాత్రీ*  అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం విజ్ఞాత్ర్యై నమః*  అని ఉచ్చరించుచూ ఆ విజ్ఞాన స్వరూపిణిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించు సాధకునికి ఎనలేని జ్ఞానసంపదల నొసగి తద్వారా ఆధ్యాత్మికతా భావము ఇంకొక ప్రక్క లౌకిక పరమైన సుఖసంతోషములు ప్రసాదించును.

పరాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి. అంటే మనలోని ఇంద్రియములకు తొలుత ఉన్న జడత్వముతో, వాటికి పనిచేసేశక్తి లేని స్థితి నుండి చైతన్యము కలిగించి ఆయా ఇంద్రియములకు వాటికి గల సహజసిద్ధమైన  శక్తిని ప్రసాదించి, ఆయా జీవులకు పూర్వజన్మ  వాసన ప్రకారం ఆయా ఇంద్రియములకు ఆయా స్థాయిలో శక్తిని ప్రసాదించును. కొందరు మూగవారు, కొందరు అంధులు, కొందరు బధిరులు, కుంటివారు కూడా ఉంటారు. ఎందుకని అవి వారి ప్రారబ్ధాలు. మరికొందరు అఖండ ప్రజ్ఞావంతులు, విజ్ఞానవంతులు, మహర్షులు, అత్యున్నత స్థానంలో ఉన్న మహారాజులు, కూటికి కూడాలేని పేదవారు ఇదంతా పూర్వజన్నకర్మలవాసన మాత్రమే.  జీవుని శరీరంలోని ఇంద్రియములకు చైతన్యము, శక్తిని ప్రసాదించు సృష్టికి కారణభూతురాలైన పరాశక్తియే దీనంతటికీ కారణభూతురాలు. *కార్యకారణ నిర్ముక్త* గా స్తుతింప బడే విజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత జీవునికి విజ్ఞాన ప్రదాత అందుచేతనే ఆ తల్లిని *విజ్ఞాత్రీ* అను నామ మంత్రముతో వశిన్యాదులు స్తుతించారు.

విజ్ఞానమును ప్రసాదించు జగదీశ్వరికి నమస్కరించునపుడు *ఓం విజ్ఞాత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
***************************

కామెంట్‌లు లేవు: