5, సెప్టెంబర్ 2020, శనివారం

శ్రీకృష్ణుడు ఉద్ధవునితో

మహాభారత యుద్ధం ముగిసిన తరువాత , శ్రీకృష్ణుని అవతార సమాప్తి ముగియపోవనుండగా, శ్రీకృష్ణుడు, ఆయన చిన్ననాటి స్నేహితుడు అయిన ఉద్ధవుడు ముచ్చటించుకుంటున్నారు.

శ్రీకృష్ణుడు ఉద్ధవునితో అందరూ నా వద్దనుండి ఏవేవో పుచ్చుకున్నారు. ఇంతవరకు నువ్వు ఏమీ కోరుకోలేదు. ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు ఉద్ధవుడు, మోక్షం నా వంటి వారికి ఈ లౌకిక ప్రపంచం లో దొరకడం కష్టం. ఇప్పటివలే నీకు సేవ చేసే భాగ్యం కంటే ఇంకేమీ నాకు అవసరం లేదు అని అన్నాడు.
అయినా కొన్ని సందేహాలున్నాయి, అవితీర్చు కృష్ణా అన్నాడు..

అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సరే అడుగు అన్నాడు...

నీకు భూత, భవిష్య వర్తమానాలు తెలుసు కదా, ఎందుకు జూదాన్ని ఆపి నీ స్నేహితుడైన ధర్మ రాజుని రక్షించలేదు అన్నాడు అని అడిగాడు..

అందుకు శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు వివేకంతుడు. తనకు జూదం తెలియదు అని తెలిసి శకుని ని ముందునుంచి ఆడమన్నాడు. కానీ ధర్మరాజు జూదం ఆడుట శ్రీకృష్ణునికే తెలియకూడదు అనుకున్నాడు. ద్రౌపధియే ఆఖరున ఆపదలో నన్ను తలచుకుంది. వెంటనే నేనొచ్చేసా...
వెంటనే ఉద్ధవుడు, అయితే నువ్వు పిలిస్తే గానీ రావా..?
అవును నేను పిలిస్తేనే వస్తాను. అంతవరకూ ఒక సాక్షి గానే ఉంటాను. మనుషులు చేసే కర్మలలో నేను కలుగచేసుకొను. ధర్మరాజు అజ్ఞానం చేత, అతను జూదం ఆడడం నాకు తెలియదు అనుకున్నాడు. కర్మలను భట్టి ఫలితం ఉంటుంది. జ్ఞానం ఉత్తమ కర్మల చే మానవుడు జీవించాలి. కనీసం నాకు అన్నీ తెలుసు, నా సాక్షి గా మానవుడు కర్మ లను చేస్తున్నాడు అని భావిస్తే అధర్మము చేయుటకు సాహసించరు అని అందరితో చెప్పుము అని శ్రీకృష్ణుడు అన్నాడు.

హిందూత్వం లోని తత్వాలు ఇలానే ఉంటాయి.

కామెంట్‌లు లేవు: