6, నవంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 65*

 *ధార్మికగీత - 65*

                                  


      *శ్లో:- శబ్దాదిభిః పంచభి రేవ పంచ ౹*

             *పంచత్వ మాపు: స్వగుణేన బద్ధా:౹*

             *కురంగ మాతంగ పతంగ మీన ౹*

            *భృంగా నరః పంచభి రంచితం కిమ్?*



శబ్దాదిగానుండి శాసించుచుండెడి 

            పంచేంద్రియంబులు బలయుతములు 

శబ్దంబులోనున్న శ్రావ్యత వినియును 

            వేట గానికి జిక్కి వీగు లేడి 

మగకరి కడనుండు మదగంధమును బీల్చి

            కరి పడిపోవును కందకమున 

కాంతిరూపము జూచి కడువడి దూకియు 

           మ్రగ్గును శలభమ్ము మంటలందు 

రుచికి తా  లొంగి  నెరుగక యెర యనుచు 

            గాలమ్మునకు జిక్కి గడచు చేప 

వాసనభ్రమకును వశ్యమై తుమ్మెద 

           అరయ కుసుమమందె యంతమౌను 

ఇటుల లేడి గజము మిడుతయు  మీనమ్ము

భృంగముల్  సుదూర దృష్టి లేక 

యాశతోడ తుదకు యంతమ్ము వొందును

మనుజు డట్లు నుంట మాన్య తగునె ?


✍️ గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: