6, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర🕉️*

 *🕉️మద్దిమడుగు శ్రీ  పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర🕉️*


*నల్లమల కీర్తికిరీటంగా వెలుగొందుతున్న అమ్రాబాద్ మండలం మద్దిమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో పిలిస్తే పలికే దైవంగా మద్దిమడుగు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు . నల్లమల కొండల్లో కృష్ణానది ఉత్తర వాహినిగా ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది . ఈ నదికి పడమర నుంచి దుందుభి నది కలిసేచోట దుందుభేశ్వరం అనే పురాణ క్షేత్రం వెలసింది . ఈ క్షేత్రానికి పడమరన 12 కిలోమీటర్ల దూరములో మద్దిమడుగు అనే రేవు పట్టణం క్రీస్తుశకం మూడో శతాబ్ది కాలంలో ఒక పెద్ద కోటను నిర్మించారు . కోట నాలుగు మూలల యందు నాలుగు బురుజులు , దక్షిణాన ఒక బురుజు , నైరుతిన ఎత్తైన ప్రాకారం , పైన రాజు ఉండే నివాసం నిర్మాణమై ఉంది . ఇది వాస్తు నిర్మాణంలో ఉంది . కోటలో స్వామి వారు ఈశాన్య ప్రాంతంలో వెలసి పుట్ట నుంచి బయటకు వచ్చినట్లు ఉ న్నాడు . చుట్టూ నాలుగు అడుగులు , ఒక గజం ఎత్తు కలిగిన ప్రాకారపు గోడలు చిన్న ఆలయంంలో వెలసి మద్దిమడుగు క్షేత్రపాలకునిగా ఉన్నాడు . స్వామి తన మహిమలతో భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు . కాలగర్భంలో అనేక ఏళ్ళు గడిచిన తదుపరి మద్దిమడుగు రేవుపట్టణంగా రూపొందింది . రాజుల కాలంలో వర్తక వ్యాపారాలు కొనసాగాయి . అనేక మార్పులు చెంది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది . రాజుల రాజ్యాలు పతనమైపోయినా నాటి అవశేశాలు నేటికి మద్దిమడుగు పడమర భాగాన నాలుగు కిలోమీటర్ల పొడవున పాతరాతి కట్టడాలు కనిపిస్తున్నాయి . స్వామివారి మూల విరాట్టు విగ్రహం మూడవ శతాబ్ది కాలం నాటిదని చారిత్రక పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు . నల్లమల అడవి ప్రాంతంలో ఉండే చెంచులు పండ్లు , పాలు , తేనె నైవేద్యంగా సమర్పించుకొని అనునిత్యం స్వామిని ఆరాధించేవారు . నల్లమల అడవుల్లో వుండే పశువుల కాపరులు స్వామిని ఆరాధించడం ప్రారంభిచారు . పశు వుల కాపరులు స్వామిని ఆవు పాలతో అభిషేకించి రొట్టెలు , బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు .*


        *నేడు కూడ భక్తులు తేనె ,   ఆవుపాలు , పొంగళితో నైవేద్యం , గోధుమ రొట్టెలు , బెల్లం కలిపి సమర్పించు కుంటున్నారు . స్వామివారి గర్భాలయం ఎదురుగా రాజులకాలం నాటి నుంచి అగ్నిహోమం నిరంతరం వెలుగుతుంది . కోట ఈశాన్యం బురుజుకు కోటమైసమ్మ అనే దేవత వెలసి ఉన్నది . ఆమెను భక్తులు ప్రతి ఆదివారం దర్శించి పూజలు చేస్తారు . శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారి మాలధారణ 1992 కార్తీక మాసంలో శ్రీ కె . జయరాం , గురుస్వామి ఆధ్వర్యంలో 15 మందితో మొదటిసారిగా ప్రారంభమైంది . ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదిగింది . స్వామి వారి సంకల్పం మేరకు శ్రీ కె . జయరాం గురుస్వామి మరియు వారి శిష్యులు గురుస్వాములైన వారు పల్లె నుండి పట్టణం దాకా మద్దిమడుగు అంజన్న మాలల మహత్మ్యం సాక్ష్యాధారలతో ఋజువు పరిచారు . మహబూబ్ నగర్ , నల్లగొండ , రంగారెడ్డి , గుంటూరు , ప్రకాశం , కర్నూలు , హైదరాబాదు జిల్లాల నుండి వేలాది మంది స్వాములు మాల ధరించి మద్దిమడుగు వస్తున్నారు .*


           *1998 లో శ్రీ జయరాం గురుస్వామి ఆదేశం మేరకు డి . నరసింహులు , తెల పండితుల దర్శకత్వంలో దీక్షా స్వాములే స్వయంగా పాడిన " మద్దిమడుగు ఆంజనేయ స్వామి భక్తి గీతాలు " పాటల క్యాసెట్ ప్రప్రథమంగా తెలుగు మరియు లంబాడా భాషలలో కమల్ ఆడియో ద్వారా నిర్మించబడి ప్రస్తుతం సూర్యపేట సత్యం క్యాసెట్ సెంటర్ లాంటివారు ఎన్నెన్నో ఆడియో , వీడియో క్యాసెట్లు విడుదలచేసి స్వామి వైభవాన్ని దశదిశల చాటుతున్నారు .*


          *శ్రీ ఆంజనేయ ఆవేశితుడైన శ్రీ జయరాం గురుస్వామి నేతృత్వంలో సుమారు 15సం || ల నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి మాలాధారణ వైశాఖ బహుళ దశిమి హనుమాన్ జయంతి సందర్భంగా ఏదుల ఏర్రగట్టు వీరాంజనేయ స్వామి మాలాధారణ కార్యక్రమాలు కూడ అత్యంత వైభవోపేతంగా జరుగుచున్నవి . మద్ది మడుగు మాలాధారణయే వీటికి ప్రేరణగా చెప్పవచ్చును .*


               *గత ముప్పై సంవత్సరాల నుండి ఆంజనేయ స్వామి సేవలో తరించి , ఎందరికో తరుణోపాయం చెప్పి గురుస్వాములకే గురుస్వామియైన శ్రీ జయరాం గురుస్వామి గారు హైదరాబాదుకు సమీపాన లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయము మరియు హనుమాన్ దీక్ష గురు పీఠము స్థాపించారు . ప్రతి శనివారం అచ్చంపేట స్వగృహం నందు , ప్రతి మంగళవారము హైదరాబాదు పీఠము నందు భక్తులకు , సందర్శకులకు అందుబాటులో ఉంటున్నారు . మిగతా రోజులలో దేశాటనము చేస్తూ హనుమాన్ భక్తి మహాత్మ్యాలను తెలియజేస్తున్నారు . మద్దిమడుగు ఆంజనేయ స్వామి తన సేవకై జయరాం స్వామిని పూర్తికాలం వినియోగించుకోవడం విశేషం . శ్రీ ఆంజనేయస్వామి సేవా సమితి , రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రాధ్యక్షులుగా స్వామి వారి శిష్యులు పేస్ బుక్ హనుమాన్ దీక్ష గురు పీఠం హనుమాన్ శక్తి య్యూటుబ్ చానల్ తో సేవలందించటం మరీ విశేషం !*


           *1993-94 సం || లో దేవాదాయ ధర్మాయ శాఖ ఈ ఆలయాన్ని గుర్తించి తన ఆధీనంలో చేర్చుకుంది . రూ || 13 లక్షలు వెచ్చించి స్వామి వారి గర్భాలయం , ముఖ మండపం , శివాలయం , శిఖరాల నిర్మాణం చేశారు . ప్రతి శుక్ర , శని , ఆది , మంగళ వారాలలో భక్తులు వేల సంఖ్యలో దర్శించుకొని ముక్తి పొందుతున్నారు .*

కామెంట్‌లు లేవు: