6, నవంబర్ 2020, శుక్రవారం

మహాలక్ష్మీ_ఆహ్వానం

 ఖవ్వం_సవ్వడి మహాలక్ష్మీ_ఆహ్వానం 🙏


 పూజగదిలో ఈ వస్తువు కనుక ఉందీ అంటే ఆ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు అని పెద్దలు చెబుతూఉంటారు.  అంత అత్యత్భుతమైనటువంటి సిరిసంపదలను కలిగించేటటువంటి ఆ వస్తువు ఏమిటంటే  *ఖవ్వం.* అందుకే మీరు గమనిస్తూ ఉంటే గృహప్రవేశం సమయంలో కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటటువంటివారు ఖవ్వాన్ని కూడా పూజాసామగ్రితో పాటుగా తీసుకుని వెళుతూ ఉంటారు. "ఖవ్వానికి అధిపతి లక్ష్మీదేవి". ఏ ఇంట్లో అయితే ఖవ్వం ఉందో... ఆ ఇంట్లో పెరుగు ఉందీ అని అర్ధం. ఎందుకంటే ఖవ్వం ఉన్నది పెరుగు చిలకటానికే కాబట్టి. పెరుగు ఉందీ అంటే పాలు ఉన్నాయి అని అర్ధం. పాలు ఉన్నాయీ అంటే ఆ ఇంట్లో పశుధనం ఉందీ అని అర్ధం. పశుధనం ఉందీ అంటే వారికి పొలం ఉందీ అని అర్ధం. పొలం ఉందీ అంటే వారికి సిరిసంపదలు ఉన్నాయీ అని అర్ధం. ఎందుకంటే పాలు, పెరుగు,సిరిసంపదలు ఏమిలేనివారికి ఖవ్వంతో పనిఏమీ ఉండదు కాబట్టి, ఖవ్వం ఇంత విశేషమైనటువంటి లాభాన్ని మీకు కలిగిస్తుంది. అందుకని ఒక చక్క ఖవ్వాన్ని మీరు పూజగదిలో పెట్టుకోండి. పూజగదిలో ఎట్టి పరిస్థితిలోనూ కూడా స్టీలుఖవ్వన్నీ, ఇనుపఖవ్వలూ మరియు అల్ల్యుమినియం ఖవ్వాలను అస్సలు పెట్టకూడదు. ఒక చక్క_ఖవ్వాన్ని కొనుక్కుని దానికి కొంచం గంధము,కుంకుమ బొట్టుపెట్టి మీ పూజగదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. ఈ రోజుల్లో ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంకుబాలన్సు ఉంది అనేదాన్ని బట్టి శ్రీమంతుడు ఎవరు అని చెబుతున్నారు. కాని పూర్వకాలంలో మాత్రం ఇంటి ముందు, ఎంత పశుసంపద ఉంటే వారు అంత శ్రీమంతుడు అని గుర్తు. అంటే వారికి అన్నీ పొలాలు ఉన్నాయి, అన్నీ ఎకరాలు ఉన్నాయి అని గుర్తు. కాబట్టి ఆ ఇంట్లో పాడిపంటలు, సుభి పశుసంపద ఉంది అని గుర్తు. లక్ష్మీదేవి ఆ ఖవ్వం రూపంలో వారి ఇంట్లో ఉందీ అంటే వారికి సిరిసంపదలు కలిగి తీరుతాయని గుర్తు. కాబట్టి ఖచ్చితంగా మీ పూజగదిలో ఆ ఖవ్వాన్ని ఉంచండి. అదేవిధంగా వీలైతే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా ఆ చక్క ఖవ్వంతో పెరుగును చిలకండి. ఏ ఇంట్లో అయితే పెరుగు చిలకబడుతుందో, ఏ ఇంట్లో అయితే ఆ ఖవ్వం పెరుగులో తిరుగుతూ తిరుగుతూ శబ్దం వస్తుందో, ఆ శబ్దం లక్ష్మీదేవి యొక్క ఆహ్వానానికి సంగీత సంకేతమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని ఖవ్వంతో మీ ఇంట్లోకి ఆవాహం చేసుకోండి. లక్ష్మీ అనుగ్రహం పొందండి.


“సర్వేజనా సుఖినోభవంతు”🙏

కామెంట్‌లు లేవు: