6, నవంబర్ 2020, శుక్రవారం

భాగవతము

 ⇠🙏🌺 భాగవతము    ఏకవింశత్యవతారములు⇢🌺🌺

1-69-మ.మత్తేభ విక్రీడితము🌺🙏


భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం

తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం

త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్

దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.


🙏భావం🙏

ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

కామెంట్‌లు లేవు: