6, నవంబర్ 2020, శుక్రవారం

సార్ధకత

 సార్ధకత



మనం ధారతో కలిసి ప్రవహిస్తుంటే మనకి ఎలాంటి బాధ ఉండదు. కానీ మనం ఎదురీదే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం లో అహంకారం నిర్మితమౌతుంది. కానీ కాల ప్రవాహానికి ఎదురు వెళ్లలేము. ఆ ప్రవాహం వెనుక ఏమీ ఉండదు. అది విలీనమైపోతూ ఉంటుంది. అందుకని జీవితం ఏది తీసుకువచ్చినా దాన్ని పరమానందంతో స్వీకరించాలి. వాటియందు కొంచెం కూడా స్వీకరించక పోవడం అనే భావన ఉండకూడదు. జీవితానికి సబంధించిన ఫిర్యాదులు లేని వాడే ధార్మికుడు.


మనం ఒక ఎండిన ఆకులా ఉండాలి. ఎండిన ఆకుకి తన ఇష్టం అనేది ఏదీ ప్రత్యేకంగా ఉండదు. ఎలాంటి ఆకాంక్ష ఉండదు. తాను ఎక్కడకు వెడుతున్నాను అనేది తెలియదు. ఎక్కడకు వెళ్ళాలో అనేది కూడా తెలియదు. గాలి ఎక్కడికి తీసుకువెడుతుందో అక్కడకు వెడుతుంది.


 ఎండుటాకు తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. మన వాసనలే మన అస్థిత్వము. జనన మరణాలు మన చేతుల్లో లేవు అనే విషయం గ్రహించిన నాడు, నీవు నిమిత్తమాత్రుడుగా వుండగలవు.


ఎవరు జీవితం యొక్క సార్ధకతని తెలుసుకుని, జీవన ఆనందాన్ని పొందుతారో, వారు మృత్యువు వలన వేదనకు గురైన దాఖలాలు లేవు.


 అయ్యో! ఈ జీవితం వ్యర్థం అయిపోయిందే అనే బాధ మరణించేటప్పుడు కలుగుతుంది. ఆ బాధ మృత్యువుకి సంబంధించినది కాదు, జీవితానికి సంబంధించినది.

కామెంట్‌లు లేవు: