17, సెప్టెంబర్ 2023, ఆదివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 24*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 24*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


        *జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే*

        *తిరస్కుర్వ న్నేతత్స్వమపి వపురీశ స్తిరయతి |*

        *సదాపూర్వ స్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః*

        *తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయోర్భ్రూ లతికయోః||*


ఈ శ్లోకం లోనూ తరువాతి శ్లోకంలోనూ అమ్మవారు సర్వ దేవతాగణములను ఏ విధంగా నిర్వహిస్తారో చెప్తున్నారు.


అందరు దేవతల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే అమ్మవారి నామాల్లో సర్వ దేవతల నామాలూ వస్తాయి. ఇప్పుడు అమ్మవారి  ఆజ్ఞననుసరించి..


జగత్సూతే ధాతా = బ్రహ్మ జగత్తును సృష్టిస్తున్నాడు.


హరి రవతి = విష్ణువు రక్షిస్తున్నాడు.


రుద్రః క్షపయతే = రుద్రుడు క్షయింపజేస్తున్నాడు.


తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్తిరయతి = మహేశ్వరుడు  జగత్తునంతటినీ మరుగుపరుస్తూ తానూ మరుగవుతున్నాడు.


సదాపూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః = సదాశివుడు మళ్ళీ సృష్టి కలిగేటప్పుడు జగత్తును బయలుపరుస్తున్నాడు.


తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూ లతికయోః = నీ ఆజ్ఞను స్వీకరించి నీ కనుబొమల కదలికల సంజ్ఞలతో పంచకృత్యములను నిర్వహిస్తున్నారు వీరంతా. (కనుబొమల మధ్య 'ఆజ్ఞా' చక్రము కదా!)


ఇక్కడ రుద్రుడు,  మహేశ్వరుడు, సదాశివుడు, అంటున్నారు.అందరూ ఒకరే కాదా అనే సందేహం కలుగుతుంది. మొదట్లోనే చెప్పుకున్నట్లు ఈశ్వరుడు ఒక్కడే, శక్తీ ఒక్కటే. వివిధ కర్తవ్యాల నిర్వహణకు వివిధ రూపాలు, నామాలు. *ఏకం సత్ విప్రా: బహుథా వదంతి* అన్నది వేదం.


ఈ పంచకృత్యాలు ఏమిటో మరొక్కసారి చెప్పుకుందాం.


సృష్టి = కల్పారంభ సృష్టి. 

మన లౌకిక వ్యవహారంలో ఉదయం నిద్ర లేవటం.


స్థితి = జగద్రక్షణ. 

మన విషయంలో రోజంతా మన కార్యనిర్వహణ.


లయ = కల్పాంత ప్రళయం. మనకు రాత్రి నిద్ర.


తిరోధానము = ప్రళయకాలంలో జగత్తును మరుగు పరచటం. 

మనం, నిద్రలో మన వ్యవహారాలన్నీ మరవటం.


అనుగ్రహం = తిరిగి నూతన కల్పారంభ సృష్టి. 

మనం నిద్రనుండి లేవగానే, నిద్రలో మరుగుపడిన అన్నివ్యవహారాలు తిరిగి జ్ఞప్తికి రావటం.


ఇవన్నీ అమ్మ ఆజ్ఞ మేరకు జరిగేవే.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: