17, సెప్టెంబర్ 2023, ఆదివారం

లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*వ్యాపార అభివృద్ధి*


తంత్ర శాస్త్రంలో నిమ్మకాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నిమ్మకాయలను ఉపయోగించి అనేకరకాల సమస్య నుండి బయటపడవచ్చు. సాధారణంగా అమ్మవారి దేవాలయాలలో మంగళవారం శుక్రవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. నిమ్మకాయ దీపాలు వెలిగించడం వలన అంతః శత్రువులు బాహ్య శత్రువులు తొలగిపోతారు ఆరోగ్యము ఐశ్వర్యము అభివృద్ధి చెందుతుంది నరదృష్టి తొలగిపోతుంది. నిమ్మకాయతో వ్యాపారం అభివృద్ధి చెందడానికి కొన్ని రకాల పరిహారాలు పాటించవచ్చు. వ్యాపార స్థలంలో ఒక గాజు గ్లాసులో నీరు పోసి దానిలో ఒక నిమ్మకాయ ఉంచుతూ ఉంటారు దీనివలన నరదృష్టి వ్యాపార స్థలం పై ఉండకుండా పోతుంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మరొక పరిహారం షాపు తెరిచిన తరువాత ఒక నిమ్మకాయ తీసుకుని షాపులోని నాలుగు గోడలకు తాకించాలి తరువాత దానిని నాలుగు ముక్కలుగా కోసి నాలుగు గోడల దగ్గర ఉంచాలి. ఆరోజు షాపు మూసివేసే ముందు ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలను చేతితో తాకకుండా తీసి ఎవరు తొక్కని స్థలంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. ఈ పరిహారం వ్యాపార స్థలంలో నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరొక మంచి పరిహారం ప్రతి బుధవారం షాపు తెరిచిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దానిలో నాలుగు లవంగాలు గుచ్చండి లవంగాలు గుచ్చిన ఆ నిమ్మకాయను మీ క్యాష్ బాక్స్ లో ఉంచండి. ఆరోజు షాపు మూసివేసే సమయంలో ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్లేస్ లో వేసేయండి ఈ విధంగా చేస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

కామెంట్‌లు లేవు: