12, అక్టోబర్ 2023, గురువారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 61*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 61*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*"ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది"?*


దేశం, భాష, జాతి, మతం ఇత్యాదులన్నింటికీ అతీతంగా తాత్త్వికులందరినీ సతమతం చేసిన ప్రశ్న ఏదైనా ఉందా అంటే అది ఇది: "ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి  పలువురు ప్రయత్నించకపోలేదు. కాని సబబైన సమాధానం లభించని ప్రశ్నగానే అది మిగిలిపోయింది. జీవితం సుఖదుఃఖ మిశ్రితం. ఎవరూ పరిపూర్ణ సుఖంతో జీవించలేరు.


 అదే విధంగా జీవితమంతా దుఃఖమయంగానూ గడపరు. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే అనేక మహత్కార్యాలు సాధించిన మహనీయులందరికీ సుఖం కన్నా దుఃఖమే ఉత్కృష్ట మార్గ దర్శిగా విరాజిల్లింది. దుఃఖాలే వారిలో నిద్రాణావస్థలో నున్న అనేక శక్తులనూ, ప్రతిభలనూ అభివ్యక్తం చేశాయి.


 తన ఇరవై నాలుగవ ఏట నరేంద్రుడు అటువంటి దుఃఖభరితమైన ఘట్టాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.1884 (సం) నరేంద్రుని బి.ఏ. పరీక్షలు  పూర్తయ్యీ , న్యాయశాస్త్ర అధ్యయనం నిమిత్తం నరేంద్రుడు ఇంగ్లాండు వెళ్లగోరాడు. విశ్వనాథ్ అందుకు అంగీకరించాడు. కాని విధి వక్రీస్తుందని ఎవరి కెరుక!


నరేంద్రుని తండ్రి (విశ్వనాధ్) గుండెపోటుతో మరణించాడు.విశ్వనాథ్ సహాయసహకారాలతో తమ జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకొన్న బంధువులు ఈ శోచనీయ స్థితిలో శత్రువుల్లా వ్యవహరించారు. నరేంద్రుని కుటుంబాన్ని శాశ్వతంగా ఇంటి నుండి బయటకు పంపివేయడానికే న్యాయస్థానంలో దావా వేశారు. కుటుంబానికి ఎలాంటి ఆదాయమూ లేదు. కాని ఐదారుగురిని పోషించవలసిన పరిస్థితి. కనుక నిమాయిచరణ్ వద్ద తాను పొందుతున్న న్యాయశాస్త్ర శిక్షణను సగంలోనే నరేంద్రుడు మానుకొని, మైల రోజులు పూర్తికాక మునుపే ఉద్యోగం కోసం పలుచోట్ల తిరగసాగాడు.


 కాలం కలసిరానప్పుడు వందలాది ప్రయత్నాలు సైతం విఫలమవడంలో ఆశ్చర్యం లేదు. ఎలాంటి ఉద్యోగమూ లభించకపోవడంతో నరేంద్రునికి అన్ని వైపులా శూన్యమే కానవచ్చింది. నరేంద్రునికి శ్రీరామకృష్ణుల స్మృతులు విశ్వాస సంకేత దీపాల్లా భాసిల్లాయి. మైల రోజులు ముగియక  మునుపే, నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లి శ్రీరామకృష్ణులను దర్శించాడు. శ్రీరామకృష్ణులు రెండు నెలల క్రితం క్రిందపడ డంతో ఆయన చేయి ఎముక స్థానభ్రంశం చెందింది. చేతికి కట్లు కట్టారు. నొప్పితో ఇంకా బాధపడుతున్నారు. నరేంద్రుడు ఇతర భక్తులతో పాటు కూర్చున్నాడు. 

 

బ్రహ్మసమాజ భక్తుడైన త్రైలోక్యుడు పాడుతున్నాడు. నరేంద్రుని దుఃఖం చూసిన శ్రీరామకృష్ణుల ఆవేదన వర్ణనాతీతం. అయినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా నరేంద్రునితో ఏమీ చెప్పలేదు. పాట పూర్తయ్యాక ...


లోకం, భగవంతుని గురించి పలు అభిప్రాయాలు వెలిబుచ్చి, “దేహం ఉండేది రెండు రోజులు మాత్రమే, భగవంతుడు ఒక్కడే సత్యం. దేహం ఇదుగో ఉంది, మరు క్షణం లేదు..... దేహానికి సుఖదుఃఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుణ్ణే తీసుకోండి - తండ్రి మరణించాడు, ఇంట్లో అలవికానన్ని కష్టాలు, ఏ దారీ కానరాదు. భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాలలో దుఃఖంలో ముంచెత్తుతాడు" అని అన్నారు.( 'నరేంద్రుణ్ణి ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీరామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. మధ్యమధ్యలో ఆయన నరేంద్రుణ్ణి ఆప్యాయంగా చూస్తున్నారు.)🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: