12, అక్టోబర్ 2023, గురువారం

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       ***** ప్రతిపక్ష సభ్యునిగా చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక చెప్పకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు రాజకీయనాయకులు పాటించే ఏకైక సిద్ధాంతం ఇదే! ---- జాన్ గ్లాస్ వర్డ్.           ***** రచయితలు గాలిలో మేడలు కడుతుంటారు. పాఠకులు అందులో కాపురముంటారు. పబ్లిషర్స్ అద్దెలు వసూలు చేసుకొని బ్రతుకుతుంటారు.                ***** ఈ దేశంలో ఒకరోజు నీతి వాహ్యాళికని పొరబాటున బయటకు వచ్చింది. అసత్యం, అన్యాయం, అధర్మం ఆమెను మానభంగం గావించాయి. ఫలితంగా ఆమె "" అవినీతిని"" ప్రసవించి, ఆపై మరణించింది. మనం ఆ "" అవినీతి"" ని గత 75 సంవత్సరాలుగ పోషిస్తున్నాం.                        ***** అందరూ "" సమత్వం, సమత్వం"" అంటూ కేకలు వేస్తూ కాలం గడిపేవారే! ఈ సమత్వం గతంలో లేదు. భవిష్యత్తులో ఉండబోదు. సమత్వం బ్రతకడంలో కనుపించడం లేదు. అందరికీ సమాన అవకాశాలను మనం కల్పించినా అందరి బుద్ధి వైభవం ఒకేతీరుగా ఉండదుకదా! అందరి తెలివితేటలు సమానంగా ఉండవుకదా!                         ***** మతాన్ని నమ్మినప్పటికీ మనుషులు ఇంత క్రూరత్వంతో ఉన్నారంటే , అసలు ప్రపంచంలో మతమనేది లేకపోతే లోకం ఏమవుతుందో? ---- ఫ్రాంక్లిన్.                                ***** ఈ శతాబ్దంలోని దురదృష్టం ఏమిటంటే నేర్చుకోవడం మానివేసినవారంతా ఎగబడి బోధించడం ప్రారంభిస్తున్నారు.                 ***** ఐదు కిలోల మాంసాన్ని , రెండు ఆల్ఫేషియన్ కుక్కల మధ్య ఉంచి గది తలుపులు మూసివేస్తే , అవి ఆహారాన్ని తినకుండా ,తెల్లవార్లూ కొట్లాడుకొని, గాయపరచుకొని , రొప్పుతూ, రోజుతూ గాయాలతో మరునాడు ఉదయాన దర్శనమిస్తాయి. అదే ఐదు మేకలకు ఇంత చెట్ల ఆకులు, పచ్చని గడ్డి ముందు వేసి తలుపులు మూసివేస్తే తెల్లవారేసరికి ఒకదానిపై ఒకటి పడుకొని దర్శనమిస్తాయి. మొదటిది అనైక్యతకు, రెండవది ఐక్యతకు సంకేతాలు.              ***** పల్లె తల్లివంటిది. పట్నం ప్రియురాలివంటిది. పల్లె రమ్మంటుంది. ప్రియురాలు తెమ్మంటుంది. అంతే తేడా!                          ***** గుడి లో మ్రొక్కులు అందుకొనేది ఒక.రాయి. గుడి మెట్లు కూడా రాయే. ఒకటి కోటి చేతులతో నివాళులందుకొంటూవుంటే, మరొకటి కోటి పాదాలతో తొక్కబడుతున్నది. అదృష్ట, దురదృష్టాలకు ఇంతకంటే ఉదాహరణ వేరెక్కడ మీకు దొరుకుతుంది.                       ***** పగలంతా ఎండలో రాళ్ళు కొట్టిన చెయ్యి, సాయంత్రానికి క్రిందికి వస్తున్నది అంటే లోపం "" అనాటమీ"" లో లేదు. బోడి "" ఎకానమీ"" లోనే ఉంది.      ----------------------------------------------                                  Sharpen your mind!         1* Why did grandma put wheels on her rocking chair?                   2* What is a mathematician's favourite dessert?          3* What gives you the strength and power to walk through walls?        4* What stays where it is when it goes off?     (For proper answers you have to wait 25 Hrs only.)                           ******************************.                               తెలుగు వారి పొడుపు కథలు మరియు విడుపులు.                            1* ముళ్ళుంటాయి గాని గుచ్చుకోవు. పళ్ళుంటాయి గాని తినలేదు. ఏమిటది?       (దువ్వెన)                              2* ముళ్ళకంచెలో మిఠాయి పొట్లం. తెచ్చుకొందామంటే గిచ్చుళ్ళు తప్పవు. ఏమిటది? ( తేనెతుట్టె)           3* మూటతెరిస్తే ముత్యాల సరాలు. మధ్యలో కదిలే చేప. ఏమిటవి? ( నోట్లో దంతాలు , మధ్యలో నాలుక)                                 4* మూట విప్పితే రత్నాలు రాలతాయి. ఏమిటవి? ( దానిమ్మ గింజలు)               5* మూడవ అక్షరం " క" ష్టంలో ఉంటుంది. నష్టంలో మాత్రం కాదు. ఏమిటది?      (రామచిలుక)                        తేది 12--10--2023, గురువారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: