12, అక్టోబర్ 2023, గురువారం

ధర్మాచరణ కర్తవ్యం*

 *ధర్మాచరణ    కర్తవ్యం*


ఎంత దార్శనిక శ్రేష్టుణ్ణైనా ధర్మాచరణ నాకూ కర్తవ్యమే అని ఆచార్య శంకరులు అనుకున్నారు. వాళ్ళు ఎవరూ కూడా ధర్మమార్గంలో తమకు మినహాయింపు ఉంది అని ఎవరూ అనుకోలేదు. అటువంటప్పుడు మనమంతా ఏరీతిగా ఉండాలి. మనకు ఇంకొక దుర్దైవం ఏమి వచ్చింది అంటే పాశ్చాతుల అంధానుకరణం అనేటటువంటిది మనవాళ్లలో వస్తున్నది, గుడ్డిగా పాశ్చాతులను అనుసరించటం అని. ఆ పాశ్చాతులలాగా నేనుంటే నేను పెద్దమనిషిని అవుతాను గొప్పవాడినినైతాను అనే ఒక భ్రమ మనవాళ్లలో వస్తున్నది. అది చాలా పొరపాటు. పాశ్చాతులను మనం ఎన్నడూ అనుకరించకూడదు. వాళ్ల సంస్కృతి వాళ్లకు, వాళ్ల రీతి వాళ్లకు, అది మనకు అనుకరణీయం కాదు. అది తప్పా, సరా? అనేటటువంటి విమర్శ మనకు అక్కర్లేదు, కానీ మనకు అనుకరణీయం కాదు.  


మనము ఏ పరంపరలో ఏవచ్చామో ఏ ధర్మ మార్గంలో వచ్చామో అదే మనకు అనుకరణీయంకాని, అన్యులది మనకు అనుకరణీయం కాదు. అది ఎప్పుడు అనుకరణీయం అవుతుంది అంటే మనకు ఉన్న ధర్మమార్గం మనకు శ్రేయఃప్రదం కాకపోతే వాళ్లయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం అనటానికి ఏమైనా ప్రమాణం ఉంటే అప్పుడు వాళ్ళది మనకు అనుకరణీయం అవుతుంది. వాళ్ళది మనకు శ్రేయఃప్రదం అనటానికి ప్రమాణం లేదు, మనయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం కాదు అనటానికి ప్రమాణం లేదు.


అలాంటప్పుడు మనం అన్యధర్మాన్ని అనుసరించాలి. సర్వదా మనకు అది అనుకరణీయం కాదు. ఏ విధంగా చూచినా మనయొక్క ధర్మాన్ని ఉపేక్షించటానికి ఏ విధమైన కారణం కనపడదు. అందువలన పాశ్చాతుల అంధానుకరణం మనకు పనికిరాదు.


--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతితీర్థ మహాస్వామి వారు.*

కామెంట్‌లు లేవు: