12, అక్టోబర్ 2023, గురువారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-72🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-72🌹*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*పూలబావి*


అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరంవైపున వెలసి ఉన్న బావి పూలబావిగా ప్రసిద్దిచెందింది. పుష్పాలంకార ప్రియుడైన శ్రీవారి అలంకరణకు ఎన్నోరకాల పూలమాలలు ఉపయోగపడుతున్నాయన్నది విదితమే. స్వామివారికి సమర్పించే తులసి, పుష్పం, పూలమాలలను వేరెవరూ ఉపయోగించకుండా ఈ పవిత్రమైన బావిలో వేస్తారు. అందుకే దీనిని పూలబావి అని పేరువచ్చింది. చారిత్రక ప్రాశస్థ్యం నేపథ్యంలో ఈ బావిని ‘తీర్థం’గా కూడా వ్యవహరిస్తారు. సాక్షాత్తూ భూదేవి తిరుమలలో ఏర్పాటుచేసిన తీర్థం కనుక దీనికి ఆ పేరు సిద్ధించింది. అయితే కాలాంతరంలో ఈ తీర్థం ఇక్కడే నిక్షిప్తమైపోయింది. అనంతరకాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఓ బావిని త్రవ్వగా ఈ భూతీర్థం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ స్వామివారి పూజకై సంపంగి, చామంతి తోటలను పెంచాడు. తరువాతి కాలంలో రంగదాసే తొండమాన్ చక్రవర్తిగా పునః జన్మించాడని చరిత్ర చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి గత జన్మలో రంగదాసు నిర్మించిన శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించగా తొండమానుడు ఈ బావిని రాతితో కట్టి అవసరమైనపుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళుతుండేవాడు. వరాహపురాణాంతర్గత వేంకటాచల మహత్యం అనుసారం ఒకప్పుడు శత్రువులతో యుద్ధంలో తరమబడిన తొండమానుడు ఈ రహస్యబిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడు. ఈ సమయాన తన ఉభయ దేవేరులతో ఏకాంతంలో స్వామివారు ఉన్నారు. అయితే తటాలున వచ్చిన తొండమానుని చూసి శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనూ, భూదేవి అమ్మవారు సిగ్గుతో బావిలో దాక్కున్నారని తెలుస్తుంది. శ్రీ వేంకటాచల ఇతిహాసమాల ప్రకారం భగద్రామానుజులవారు తిరుమలకు వేంచేసినపుడు భూదేవి బావిలో దాక్కున్నదన్న పురాణ నేపథ్యంలో ఈ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి తీర్థ్ధాపతిగా స్వామివారికి అరచనాది నివేదనలు జరుగుతున్నాయని అంతేగాక స్వామివారికి అలంకరించబడి తొలగించబడిన నిర్మల్యాన్ని (పూమాలలు, తులసిమాలలు వగైరా) భూదేవి కోసమే ఈ బావిలో వేస్తున్నారని తెలియజెప్తున్నది.


*శంఖనిధి - పద్మనిధి*


మహాద్వారానికి ఇరుప్రక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలే సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తున్నాయి. కదా ! వీరే శ్రీ వేంకటేశ్వర స్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత, రెండు చేతుల్లోనూ రెండు శంఖాలు ధరించి ఉండటం గమనించండి! ఈయన పేరు ‘శంఖనిధి’ ఇలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరింపబడి ఉన్నాయి. ఈయన పేరు ‘పద్మనిధి’. ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణంగల రాతి విగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండటం గమనించండి. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుత దేవరాయలిది. బహుశా అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చు. ఆగమశాస్త్రం ప్రకారం సాదారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకారం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటుచెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతున్నది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం. రెండవది విమాన ప్రదక్షిణం. మూడవది సంపంగి ప్రదక్షిణం. మహద్వార దేవతలైన శ్రీ శంఖనిధి, పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరిద్దాం.


*జయ విజయులు*


తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని తిరమమహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంఖుచక్ర గధాధారులై ద్వారపాలకులగు జయవిజయులు నిలచి ఉండి స్వామివారిని సదా సేవిస్తుంటారు. సుమారు 10 అడుగుల ఎత్తుగల ఈ పంచలోహ విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ద్భాక్తులతో వ్యవహరించండని సూచిస్తున్నట్లుగా జయుడు కుడిచేతి చూపుడువేలును విజయుడు ఎడమచేతి చూపుడువేలును చూపిస్తూ ఉంటాడు. రెప్పపాటు కాలం ఏమరుపాటు చెందకుండా స్వామి భక్తిపరాయణులగు జయవిజయులు స్వామివారి సన్నిధికి వేయికళ్ల కావలికాస్తుంటారు. తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తూ శ్రీ మహావైకుంఠాన్ని తలపించేరీతిలో వీరు బంగారువాకిట కావలి కాస్తారు.


*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: