శ్రీమాత్రేనమః. బాబు దేవీదాస రావు .
మ ||అణువున్ బ్రాణము నాదమున్ బలము వృత్తాకార మౌ చక్రమం
దున బింద్వాకృతినొంది విందుగనలందున్ జ్ఞానమున్ జూడగా
నన నొప్పారెడు చొప్పుగంటి నెదలో నన్నాను , నన్నాను న
చ్చిన నన్మెచ్చిన , ఆత్మకూరునిలయా శ్రీ రాజరాజేశ్వరీ !
భావము :-అమ్మా ! శ్రీరాజరాజేశ్వరీ ! నేను శ్రీచక్రములోని కేంద్రబిందువును , అణుబిందువుగను , జీవ బిందువుగను , శక్తిబిందువుగను , శబ్దబిందువుగను కన్పించు చు ఆ నాలుగు సృష్టుల రహస్యములను మాకు తెలియ జేయుచున్నదని దర్శించితిని . ఇది యంతయును సాధన చేత ఆత్మానుభవమునకు వచ్చినదను సత్యమును పలికితిని. నీకీ సత్య కథనము నచ్చినచో మరియు నీవు నన్ను మెచ్చినచో నీవు ఈ నాలుగు విధములుగా నాలో నిలిచి యుండుమని ప్రార్థించుచున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి