17, సెప్టెంబర్ 2020, గురువారం

*ఆచార్య సద్భోదన*

మనలోని *నేను* ని తొలగిస్తే గానీ భగవంతుని పొందలేం. విచారణ ద్వారా మనలోని స్వార్థాన్ని పోగొట్టుకోగలమని భావిస్తున్నారా? కానీ దానిని ప్రేమ ద్వారా మాత్రమే తుడిచి వేయగలం. మనకు మనం అనాలోచితంగా, నిరపేక్షంగా ఉన్నత కేంద్రం పై దృష్టి నిలప గలిగితే మహోన్నత శక్తి మన ద్వారా పని గావిస్తూ గొప్ప కార్యాలను సాధింపజేస్తుంది. ఇది లెక్కలు కట్టే గుణం ద్వారా సాధించబడదు. నిష్కామ ప్రేమ అనే గొప్ప నిధి మానవునిలో దాగి ఉంది. దాని ద్వారా సర్వస్వాన్ని అర్పించగలం, తిరిగి సమస్తాన్ని చేజిక్కించుకోగలం. అయితే ముందుగా స్వార్థాన్ని త్యజించ గలగాలి.
సర్వేజనా స్సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: