14, అక్టోబర్ 2020, బుధవారం

శీర్షోపనిషత్

 *|| గణపత్యథర్వ శీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) ||*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నోబృహస్పతి’ర్దధాతు ||


ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||


ఓం నమ’స్తే గణప’తయే | త్వమేవ ప్రత్యక్షంతత్త్వ’మసి | త్వమేవ కేవలం కర్తా’‌உసి | త్వమేవ కేవలం ధర్తా’‌உసి | త్వమేవ కేవలం హర్తా’‌உసి | త్వమేవ సర్వం ఖల్విదం’ బ్రహ్మాసి | త్వం సాక్షాదాత్మా’‌உసి నిత్యమ్ || 1 ||

ఋ’తం వచ్మి | స’త్యం వచ్మి || 2 ||


అవ త్వం మామ్ | అవ’ వక్తారమ్” | అవ’ శ్రోతారమ్” | అవ’ దాతారమ్” | అవ’ ధాతారమ్” | అవానూచానమ’వ శిష్యమ్ | అవ’ పశ్చాత్తా”త్ | అవ’ పురస్తా”త్ | అవోత్తరాత్తా”త్ | అవ’ దక్షిణాత్తా”త్ | అవ’ చోర్ధ్వాత్తా”త్ | అవాధరాత్తా”త్ | సర్వతో మాం పాహి పాహి’ సమంతాత్ || 3 ||


త్వం వాఙ్మయ’స్త్వం చిన్మయః | త్వమానందమయ’స్త్వం బ్రహ్మమయః | త్వం సచ్చిదానందా‌உద్వి’తీయో‌உసి | త్వం ప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వం ఙ్ఞానమయో విఙ్ఞాన’మయో‌உసి || 4 ||


సర్వం జగదిదం త్వ’త్తో జాయతే | సర్వం జగదిదం త్వ’త్తస్తిష్ఠతి | సర్వం జగదిదం త్వయి లయ’మేష్యతి | సర్వం జగదిదం త్వయి’ ప్రత్యేతి | త్వం భూమిరాపో‌உనలో‌உని’లో నభః | త్వం చత్వారి వా”క్పదాని || 5 ||


త్వం గుణత్ర’యాతీతః | త్వమ్ అవస్థాత్ర’యాతీతః | త్వం దేహత్ర’యాతీతః | త్వం కాలత్ర’యాతీతః | త్వం మూలాధారస్థితో’‌உసి నిత్యమ్ | త్వం శక్తిత్ర’యాత్మకః | త్వాం యోగినో ధ్యాయ’ంతి నిత్యమ్ | త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ || 6 ||


గణాదిం” పూర్వ’ముచ్చార్య వర్ణాదీం” స్తదనంతరమ్ | అనుస్వారః ప’రతరః | అర్ధే”ందులసితమ్ | తారే’ణ ఋద్ధమ్ | ఎతత్తవ మను’స్వరూపమ్ | గకారః పూ”ర్వరూపమ్ | అకారో మధ్య’మరూపమ్ | అనుస్వారశ్చా”ంత్యరూపమ్ | బిందురుత్త’రరూపమ్ | నాదః’ సంధానమ్ | సగ్ంహి’తా సంధిః | సైషా గణే’శవిద్యా | గణ’క ఋషిః | నిచృద్గాయ’త్రీచ్ఛందః | శ్రీ మహాగణపతి’ర్దేవతా | ఓం గం గణప’తయే నమః || 7 ||


ఏకదంతాయ’ విద్మహే’ వక్రతుండాయ’ ధీమహి |

తన్నో’ దంతిః ప్రచోదయా”త్ || 8 ||


ఏకదన్తం చ’తుర్హస్తంపాశమం’కుశధారి’ణమ్ | రదం’ చ వర’దం హస్తైర్బిభ్రాణం’ మూషకధ్వ’జమ్ | రక్తం’ లంబోద’రం శూర్పకర్ణకం’ రక్తవాస’సమ్ | రక్త’గంధాను’లిప్తాంగం రక్తపు’ష్పైః సుపూజి’తమ్ | భక్తా’నుకంపి’నం దేవంజగత్కా’రణమచ్యు’తమ్ | ఆవి’ర్భూతం చ’ సృష్ట్యాదౌ ప్రకృతే”ః పురుషాత్ప’రమ్ | ఏవం’ ధ్యాయతి’ యో నిత్యం స యోగీ’ యోగినాం వ’రః || 9 ||


నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే‌உస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే

నమః || 10 ||


ఏతదథర్వశీర్షం యో‌உధీతే | స బ్రహ్మభూయా’య కల్పతే | స సర్వవిఘ్నై”ర్న బాధ్యతే | స సర్వతః సుఖ’మేధతే | స పంచమహాపాపా”త్ ప్రముచ్యతే | సాయమ’ధీయానోదివసకృతం పాపం’ నాశయతి | ప్రాతర’ధీయానో రాత్రికృతం పాపం’ నాశయతి | సాయం ప్రాతః ప్ర’యుంజానోపాపో‌உపా’పో భవతి | ధర్మార్థకామమోక్షం’ చ విందతి | ఇదమథర్వశీర్షమశిష్యాయ’ న దేయమ్ | యో యది మో’హాద్ దాస్యతి స పాపీ’యాన్ భవతి | సహస్రావర్తనాద్యం యం కామ’మధీతే | తం తమనే’న సాధయేత్ || 11 ||


అనేన గణపతిమ’భిషించతి | స వా’గ్మీ భవతి | చతుర్థ్యామన’శ్నన్ జపతి స విద్యా’వాన్ భవతి | ఇత్యథర్వ’ణవాక్యమ్ | బ్రహ్మాద్యాచర’ణం విద్యాన్న బిభేతి కదా’చనేతి || 12 ||


యో దూర్వాంకు’రైర్యజతి స వైశ్రవణోప’మో భవతి | యో లా’జైర్యజతి స యశో’వాన్ భవతి | స మేధా’వాన్ భవతి | యో మోదకసహస్రే’ణ యజతి స వాఞ్ఛితఫలమ’వాప్నోతి | యః సాజ్య సమి’ద్భిర్యజతి స సర్వం లభతే స స’ర్వం లభతే || 13 ||


అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రా’హయిత్వా సూర్యవర్చ’స్వీ భవతి | సూర్యగ్రహే మ’హానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా సిద్ధమ’ంత్రో భవతి | మహావిఘ్నా”త్ ప్రముచ్యతే | మహాదోషా”త్ ప్రముచ్యతే | మహాపాపా”త్ ప్రముచ్యతే | మహాప్రత్యవాయా”త్ ప్రముచ్యతే | స సర్వ’విద్భవతి స సర్వ’విద్భవతి | య ఏ’వం వేద | ఇత్యు’పనిష’త్ || 14 ||


ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నోబృహస్పతి’ర్దధాతు ||


ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||


🕉🚩🕉🚩🕉



శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్


గణేశుని పరబ్రహ్మముగా కీర్తించునది ఈ ఉపనిషత్తు. అథర్వమనగా స్థిరమైనది. శీర్షమనగా చిత్తము లేక బుద్ధి. అథర్వశీర్షమనగా స్థిరచిత్తము లేక స్థిర బుద్ధి. దాని కొరకు ఉపాసింప తగినదే అథర్వశీర్షోపనిషత్తు. ఇది అథర్వ వేదమునకు సంబంధించినదనీ, అథర్వుడను ఋషిచే

త దర్శింపబడినదనీ కూడ చెప్పుదురు.


ఓమ్ నమస్తే గణపతయే = ఓంకార స్వరూపుడైన గణపతికి నమస్కరించుచున్నాను.


త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి = నీవే సకలరూపములుగా భాసించు బ్రహ్మ తత్త్వము.


త్వమేవ కేవలం కర్తాసి = నీవే సకలమునూ సృష్టించువాడవు, చేయువాడవు.


త్వమేవ కేవలం ధర్తాసి = నీవే సకలమునూ పోషించువాడవు.


త్వమేవ కేవలం హర్తాసి = నీవే సకలమునూ నాశనము చేయువాడవు. (నీవే త్రిమూర్తిస్వరూపుడవు).


త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి = నీవే కద సర్వసృష్టిగనూ వ్యాపించి ఉన్న బ్రహ్మమునవు!


త్వం సాక్షాదాత్మాసి నిత్యం = నీవే కాలాతీతమైన, ప్రత్యక్షానుభవముచేత తెలియబడుచున్న ఆత్మ స్వరూపము.


ఋతం వచ్మి = సృష్టినియమమును పలుకుచున్నాను.


సత్యం వచ్మి = ఉన్నదానిని పలుకుచున్నాను.


అవ త్వం మామ్ = నీవు నన్ను రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ వక్తారమ్ = దీనిని పలుకుచున్నవానిని రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ శ్రోతారమ్ = దీనిని వినుచున్నవానిని రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ దాతారమ్ = దీనిని ఇచ్చుచున్నవానిని (ఉపదేశించుచున్న వానిని) రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ ధాతారమ్ = దీనిని పట్టుకున్నవానిని (ఉపాసించువానిని) రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవానూచానమవ శిష్యమ్ = భక్తితో అభ్యసించువానిని, నేర్చుకొనువానిని రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ పశ్చాత్తాత్ = పడమటిదిశ నుండి రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ పురస్తాత్ = తూర్పుదిశ నుండి రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవోత్తరాత్తాత్ = ఉత్తరదిశ నుండి రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ దక్షిణాత్తాత్ = దక్షిణదిశ నుండి రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవ చొర్ధ్వాత్తాత్ = ఊర్ధ్వదిశ నుండి రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


అవాధరత్తాత్ = అధోదిశ నుండి రక్షింపుము / వెలిగింపుము / స్వీకరించుము.


సర్వతో మాం పాహి పాహి సమన్తాత్ = అన్ని దిశల నుండి, అన్నిచోట్లా నన్ను రక్షింపుము.


త్వమ్ వాఙ్మయస్త్వం చిన్మయః = నీవు సకల శబ్ద స్వరూపుడవు, చైతన్య స్వరూపుడవు.


త్వమానన్దమయస్త్వం బ్రహ్మమయః = నీవు ఆనంద స్వరూపుడవు. నీవే అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మము.


త్వమ్ సచ్చిదానన్దాద్వితీయోఽసి = నీవు అద్వితీయమైన సచ్చిదానంద స్వరూపుడవు.


త్వమ్ ప్రత్యక్షం బ్రహ్మాసి = నీవు సాక్షాత్ పరబ్రహ్మమునవు.


త్వమ్ జ్ఞానమయో విజ్ఞానమయోఽసి = నీవు జ్ఞానస్వరూపుడవు. సకల శాస్త్ర స్వరూపుడవు.


సర్వమ్ జగదిదమ్ త్వత్తో జాయతే = ఈ సకల సృష్టియునూ నీనుండియే పుట్టుచున్నది.


సర్వమ్ జగదిదమ్ త్వత్తస్తిష్ఠతి = ఈ సకల సృష్టియునూ నీవలననే నిలబడియున్నది.


సర్వమ్ జగదిదమ్ త్వయి లయమేష్యతి = ఈ సకల సృష్టియునూ నీయందే లీనమగును.


సర్వమ్ జగదిదమ్ త్వయి ప్రత్యేతి. ఈ సకల సృష్టియునూ నిన్నే చేరుకొనును.


త్వమ్ భూమిరాపోఽనలోఽనిలో నభః = నీవే భూ తత్త్వము, జల తత్త్వము, అగ్ని తత్త్వము, వాయు తత్త్వము, ఆకాశ తత్త్వము.


త్వమ్ చత్వారి వాక్పదాని = నీవు పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అను నాలుగు రూపములు కలిగిన వాక్ స్వరూపుడవు.


త్వమ్ గుణత్రయాతీతః = నీవు త్రిగుణములకు పైన ఉన్నవాడవు. (సత్వ, రజస్, తమస్సులు త్రిగుణములు).


త్వమ్ దేహత్రయాతీతః = నీవు మూడు దేహ స్థితులకూ అతీతుడవు. (జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనునవి మూడు దేహస్థితులు).


త్వమ్ కాలత్రయాతీతః = నీవు భూత, భవిష్యత్, వర్తమానములనబడు త్రికాలములకూ అతీతుడవు.


త్వమ్ మూలాధారస్థితోఽసి నిత్యం = నీవు ఎల్లప్పుడూ మూలాధార కేంద్రమున నిలచి యుండెడి వాడవు.


త్వమ్ శక్తిత్రయాత్మకః = నీవు ఇచ్ఛా, జ్ఞాన, క్రియలనెడు మూడు శక్తుల సమాహార స్వరూపము.


త్వామ్ యోగినో ధ్యాయన్తి నిత్యమ్ = యోగులందరూ నిన్నే సదా ధ్యానించుచుందురు.


త్వమ్ బ్రహ్మా = నీవే చతుర్ముఖ బ్రహ్మవు.


త్వమ్ విష్ణుః = నీవే విష్ణువు.


త్వమ్ రుద్రః = నీవే రుద్రునవు.


త్వమిన్ద్రః = నీవే ఇంద్రునవు.


త్వమగ్నిః = నీవే అగ్నివి.


త్వమ్ వాయుః = నీవే వాయువు.


త్వమ్ సూర్యః = నీవే సూర్యునివి.


త్వమ్ చన్ద్రమాః = నీవే చంద్రునివి.


త్వమ్ బ్రహ్మ భూర్భువః స్వరోమ్ = నీవే భూ, భువః, స్వః (భౌతిక, శక్తిమయ, ప్రజ్ఞామయ) అను మూడు లోకములుగా వ్యాపించిన ఓంకార స్వరూపమైన బ్రహ్మము.


గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదింస్తదనంతరమ్ = గ అను శబ్దమును (గణ అను పదములోని మొదటి శబ్దము) ముందు ఉచ్చరించి తర్వాత అకారమును (మొట్టమొదటి అక్షరమును) ఉచ్చరించవలెను (గ్ + అ).


అనుస్వారః పరతరః = బిందువు తరువాత వచ్చును (గ్ + అ + ం).


అర్ధేన్దు లసితమ్ = అది అర్ధబిందువుతో కూడియుండును. (గ్ + అ + ం + ఁ)


తారేణ ఋద్ధమ్ = అది ఓంకారముతో కలిసి వృద్ధిచెందును. (ఓం గంఁ)

[తారేణ ఋద్ధమ్ = అది తారస్థాయిలో వృద్ధి చెందును. (గంఁ అని దీర్ఘముగా తార స్థాయిలో ఉచ్చరించవలెను)]


ఏతత్తవ మనుస్వరూపమ్ = ఇదియే నీ మంత్ర స్వరూపము.


గకారః పూర్వరూపమ్ = గ అను అక్షరము మొదటి రూపము.


అకారో మధ్యమ రూపమ్ = అ అను అక్షరము మధ్య రూపము


అనుస్వారశ్చ్యాన్త్యరూపమ్ = అనుస్వారము (మకారము) చివరి రూపము.


బిన్దురుత్తర రూపమ్ = బిందువు తరువాతి రూపము.


నాదః సంధానమ్ = ఈ రూపములను (అక్షరములను) శబ్దము కలుపును (ఈ అక్షరములు శబ్దముతో పూరింపబడవలెను).


సంహితా సంధిః = వేదము (మంత్రము) వీటిని (అక్షరములను, శబ్దమును) కలుపును.


సైషా గణేశీ విద్యా = ఇదియే గణేశీ అనబడు విద్య.


గణక ఋషిః = గణకుడు అను ఋషి దీనిని దర్శించెను.


నిచృద్ గాయత్రీ ఛందః = ఈ మంత్రము నిచృద్ గాయత్రి అను ఛందస్సులోనున్నది.


శ్రీ మహాగణపతిర్దేవతా = ఈ మంత్ర దేవత శ్రీ మహాగణపతి.


ఓం గం గణపతయే నమః = ఓం గం గణపతయే నమః అనునది మంత్రము.


ఏకదన్తాయ విద్మహే వక్ర తుణ్డాయ ధీమహి | తన్నో దన్తిః ప్రచోదయాత్ || = ఏకదంతుని తెలియుచున్నాము. వక్ర తుండము కలవానిని ధ్యానించుచున్నాము. ఆ ఏకదంతుడు మమ్ములను శక్తిమంతులుగా చేయుగాక||


ఏకదన్తమ్ చతుర్హస్తమ్ పాశమంకుశ  ధారిణమ్ = ఒకే దంతము కలవానిని, నాలుగు చేతులు కలవానిని, పాశమును, అ‍ంకుశమును ధరించినవానిని.


రదం చ వరదం హస్తైర్బిభ్రాణమ్ = దంతమును, వరముద్రను (వరుసగా నాలుగు) చేతులలో ధరించినవానిని


మూషక ధ్వజమ్ = ఎలుక తన ధ్వజ చిహ్నముగా కలవానిని


రక్తం లంబోదరమ్ శూర్పకర్ణకమ్ రక్తవాససమ్ =ఎఱ్ఱనివానిని, స్థూలమైన పొట్ట కలవానిని, చేటలవంటి చెవులు కలవానిని, ఎఱ్ఱని వస్త్రములు ధరించినవానిని


రక్తగంధానులిప్తాఙ్గమ్ = ఎఱ్ఱని చందనమును శరీరమంతటా పూసుకొన్నవానిని


రక్తపుష్పైః సుపూజితమ్ = ఎఱ్ఱని పుష్పములచేత పూజింపబడువానిని


భక్తానుకంపినమ్ = భక్తులపట్ల దయకలవానిని


దేవం = భగవ‍ంతుని


జగత్కారణమచ్యుతమ్ = ఈ జగత్తునకంతటికీ కారణమైన వానిని, నాశనము లేని వానిని


ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరమ్ = సృష్టి ప్రారంభమున ఆవిర్భవించినవానిని, ప్రకృతికీ, పురుషునకూ అతీతమైన పరబ్రహ్మ స్వరూపుని


ఏవం ధ్యాయతి యో నిత్యం = ఈ విధముగా నిత్యమూ ఎవడు ధ్యానించునో


స యోగీ యోగినాం వరః = అతడు యోగి, యోగులలో కెల్ల శ్రేష్ఠుడు.


నమో వ్రాతపతయే = వ్రాతములు అనబడు సమూహములకు అధిపతి అయినవానికి నమస్కారము.


నమో గణపతయే = గణములకు అధిపతి అయినవానికి నమస్కారము.


నమః ప్రమథపతయే = ప్రమథ గణములకు అధిపతి అయిన వానికి నమస్కారము.


నమస్తేఽస్తు లంబోదరాయైకదన్తాయ = లంబోదరునకు, ఏకదంతునకు నమస్కారములు అర్పింపబడుగాక.


విఘ్న వినాశినే = ఆటంకములను పోగొట్టువానికి,


శివసుతాయ = శివుని కుమారునకు,


శ్రీవరదమూర్తయే నమః = వరములిచ్చు శుభస్వరూపునకు నమస్కారము.


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: