14, అక్టోబర్ 2020, బుధవారం

అమ్మతనం

 అమ్మతనం యొక్క మాధుర్యం వర్ణనాతీతం 


మాతృమూర్తి


ఇద్దరూ బిడ్డలు మొదట బిడ్డ తాళి కట్టిన భర్త,రెండవ బిడ్డ గర్బాన దాచి తొమ్మిది మాసాలు మోసి కన్న బిడ్డ!!

కానీ వీరి పుట్టుక ఎక్కడ, ఎలా!!!


స్త్రీ మూర్తి మెడలో తాళి పడిన క్షణం అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతుంది స్త్రీ!!!


మాతృత్వంలో ఉన్న అ పిలుపు మాధుర్యం అటువంటిది!!


ఎదుట ఎందరో తల్లుల బాధని చూసి ఉంటుంది బిడ్డ పుట్టుక ఇవ్వడానికి కానీ వెనకాడదు స్త్రీ మూర్తి!!!


మొదటి మూడు నెలలు నీవు స్థిరం అయ్యే వరకు గర్బాన ఎన్ని కలలో తల్లీ కంట్టిన!!!


నాలుగవ నెల వచ్చే సరికి నీవు గర్బాన చేసే వింత పనులకి తల్లికి ఎన్ని వాంతిపులు.

తినాలి అని ఉన్నా తిననీవు కదా నీవు గర్బాన!!!


ఐదవ నెల కుదుట పడ్డావు అనుకుంటూ నీతో ఎన్ని మాటలో తల్లీకి ఎదుట నిను చూసుకుంటూ నిన్ను లాలిస్తుంది తల్లీ!!!


ఆరవ నెల ఎన్ని ఎన్ని చెప్పను నీవు కోరే కోరికలు ఒకట రెండా నీవు గర్బాన ఎన్ని కోరిన తల్లీ కాదు అనదు ఎంత కష్టమైన తాళి కట్టిన భర్తతో తెపించ్చుకొని నీకు తినిపిస్తుంది తన నాలం ద్వారా నీ కడుపు నింపుతుంది అప్పుడ్డే కుదుట తల్లీ మనసు!!!


ఏడవ నెల ఇక నీ చేష్టలు ఎన్నో ఎన్నో గర్బాన నీ చిన్ని చిన్ని పాదలతో తల్లిని ఓ వైపు కూర్చోనీవు ఓ వైపు నిద్రపోనీవు నీవు ఎన్ని చేసిన తల్లీ సంతోషం పడుతూ గర్బాన దాస్తుంది నిన్ను!!!


ఎనిమిదవ నెల ఇక నీకు నిద్ర లేదు కదా తల్లికి నిద్ర లేదు నీ ఆకలికి సమయం లేదు నీవు గర్బాన తిరుగుతూ ఉంటే తల్లీ తల్లడిల్లీ పోతుంది. నీవు నిద్రించకుండా అటూ, ఇటూ తిరుగుతుంటే గర్బాన కుమిలి పోతుంది నా బిడ్డకి నేను కడుపు నింపలేదా అని బాధతో కానీ దేవుడు అంటాడు తల్లీ బాధపడకు గర్బాన నీ బిడ్డ అనందంతో ఆటలు అడుకుంటున్నాడు అని చెప్పగానే ఉపొంగ్గి పోతుంది తల్లీ అనందంతో!!!


తొమిదవ నెల నీవు చేసే యుద్ధాలు అన్ని ఇన్ని కావు కదా దేవుడితోనే వాదన పడితివి ఏమిటి మూడు రోజుల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని దేవుడు వివరణ నీవు బయట ప్రపంచంలోకి వెల్లు సమయం ఆసన్నమైంది అని చెప్పగానే నేను బయటికి వెళ్ళను ఈ గర్బానే ఉంటాను అని నా తల్లీ నన్ను చాలా బాగా లాలిస్తుంది అని వాదిస్తే తల్లి గర్బాన ఇంత లాలన చూసావు తల్లీ వడిన చేరు ఎంతగా లాలిస్తుందో నీ కంటిలో నలుసు కూడా పడనీవదు తల్లీ అని చెప్పి సెలవు భగవంతుడు!!!


ఇక నీ యుద్ధం తల్లీతో ఎప్పుడ్డు, ఎప్పుడ్డు నేను నీ వడిన చేరును అని నీ పచ్చని కాలితో తన్నుకుంటూ మొదలు పెడ్తివి బయటకు రావటానికి!!!

నీవు బయటికి వచ్చు సమయం తల్లీ ఎముకలు కటకటా అంటూ విరగుతున్న కాలయముడు వెంట పడ్తున్నా నీకు ప్రాణం పోస్తుంది తల్లీ ఎంత ఏడ్చిన ఎంత బాధ పడిన నిన్ను చూసిన క్షణమే తల్లీ బాధ మరచి ముద్దుడాతుంది!!


తల్లీ అమ్మతత్వం మాతృమూర్తి మాతృదేవోభవ!!!🙏🙏

కామెంట్‌లు లేవు: