22, డిసెంబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 117*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 117*

                                       *****

            *శ్లో:- దరిద్రాయ కృతం దానం ౹*

                   *శూన్యలింగస్య పూజనం ౹*

                   *అనాథ ప్రేత  సంస్కారం ౹*

                   *అశ్వమే థాధికం  విదుః  ౹౹*

                                      *****

*భా:-1. లోకంలో విధి వంచితులు, దైవో పహతులు, అన్నార్తులు, దీనార్తుల కేమీ కొదువ లేదు. అలాంటి కూడు, గూడు, గుడ్డ లేని  దరిద్ర నారాయణులకు  దానము చేయుట; 2. కనీస ధూప దీప నైవేద్య పూజాది సంస్కారాలు లేకుండా శిథిలమైన గుడిలో పడియున్న శివలింగానికి శ్రద్ధాసక్తులతో  అర్చనము చేయుట; 3. నా అనే దిక్కు, మొక్కు లేక దైన్యంగా, నిర్లక్ష్య భావంతో బహి: ప్రదేశాన వదిలివేయబడిన అనాథ ప్రేతకు దైవీభావంతో అంతిమ సంస్కారము చేయడము - 4.అనబడే యీ మంచి మనసుతో చేసే క్రియా కాలాపాలు అశ్వమేథ యాగము చేయడం కంటే  మిక్కిలి మిన్నగా దైవప్రీతికి పాత్ర మౌతాయి. మనం యజ్ఞ యాగాలు, క్రతువులే చేయనవసరం లేదు. పైన తెలిపిన విధంగా ఆయా సందర్భాలలో భగవ దర్పణముగా చేసే చిన్న దానమైనా,ధర్మమైనా,సాయమైనా ఫలప్రదము, శుభప్రదము, శ్రేయస్కరమై మనలోని దివ్యత్వానికి, ఉత్తమ గతికి సోపానమౌతుంది. మానవాళి మానవీయత, మాననీయత సుగంధభరితమై దశదిశలా గుబాళిస్తుందని సారాంశము.*

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి* 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: