22, డిసెంబర్ 2020, మంగళవారం

స్వేచ్ఛకు సంకేతం పక్షి*

 *స్వేచ్ఛకు సంకేతం పక్షి*


రాత్రి పొదిగిన గుడ్డు తెల్లవారు సూర్యుడు పుడమిని ప్రభవించేసరికి పిట్టై పరివర్తన.


గుడ్డు పిట్టకావడం పక్షి జాతికి ఎంతో సంబరం. కాలం లెక్క తెలియని పక్షులు, తమ రెక్కల మీదుగా ఉదయాస్తమయాల మధ్య వాటి పయనం.


పొద్దు పొడవడం వాటికి మహదానందం, మరోసారి  కొత్త ఆకాశం దొరికినందుకు సంబరం.


దాచుకోవడం దాచిపెట్టి కూడబెట్టడం తెలియని పక్షి జాతికి కొమ్మను నమ్మి కాదు తమ రెక్కల కష్టం పైనే నమ్మకం. 


అందుకే వాటికి అంతరాలు వివక్ష వర్ణ భేదాలు లేవు, తెలియవు. ఇదిగో ఇక్కడిదాకా అన్న పరిమితులు లేవు వాటికి.  అనంతాకాశమే అవకాశం. 


మానవ తప్పిదాల వల్లే వాటికి వాటిల్లే ముప్పు, నీటికి గూటికి తిప్పలు. 


స్వేచ్ఛ అంటే ఏమిటో పక్షివైతే తప్ప, మనకు ఎప్పటికీ తెలియదు. 


మల్లేశ్వరరావు ఆకుల

కామెంట్‌లు లేవు: