22, డిసెంబర్ 2020, మంగళవారం

వేదములు

 *34-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*14.(A) వేదశాఖలు*

((((((((((🕉))))))))))


*వేదాలు అనంతములు (అనంతా వై వేదాః). వేదాంతమంటే వేదాలయొక్క అంతం. ''అనంతమైన వేదాలకి అంతమేమిటి''?వేదాల ముఖ్యోద్దేశం ఆత్మసాక్షాత్కారం. ఇదే ఆధ్యాత్మిక సత్యాలకు చివరిమెట్టు. దీని గురించి చెప్పటం వల్ల వేదాంత మయింది. మరో విధంగా చెప్పాలంటే, వేదాల అన్వేషణకు అంతమన్నమాట. వేదాల చివరిలో ఉంటుంది వేదాంతం. ఏ కారణాలనీ అడుగకుండా, విధిగా తమ వేదశాఖని అధ్యయనం చెయ్యాలి. అభ్యసించాలి.*



 *వేదశాఖకి సంహిత, బ్రాహ్మణము, ఆర్యణకము, చిట్టచివర ఉపనిషత్తు ఉంటాయి. వేదశాఖకి చివరిది ఉపనిషత్తు. అనంతమైన వేదాలను శాఖలుగా విభజించటంలో అంతరార్థమేమిటి? ఆధ్యాత్మిక ప్రగతి సుసాధ్యం కావటానికి మనిషికి అన్ని విషయాలూ బోధించాలి. మొదటిది, వేదాధ్యయనం, వేదాలని వల్లె వేయటం. ఆ తరువాత యజ్ఞాలూ ఇతర కర్మలూ అభ్యసించాలి, ఆచరించాలి.*



*వీటికి సంబంధించిన మంత్రాలను నేర్చుకోవాలి. ఆ తరువాత యజ్ఞాల ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. చిట్టచివరికి పరమాత్మ తత్త్వాన్ని పఠించి, అనుభవసిద్ధం చేసుకోగలగాలి. వేదాన్ని పఠించే విద్యార్థికి ఇవన్నీ నేర్పాలి. ఆత్మసాక్షాత్కారానికి సరిపడినంత నేర్పాలి. అన్ని వేదశాఖలనూ క్షుణ్ణంగా తెలుసుకోవటం అసాధ్యం. కొన్ని వేల సంవత్సరాలు పఠించిన తరువాత కూడ భరద్వాజ ముని వంటి వారికి వేదమనే పర్వతం నుండి గుప్పెడు మట్టి మాత్రమే లభించిందట.*



*కాబట్టి, మనిషికి మనస్సు క్షాళనమై, పరమాత్మలో లీనమవటానికి సరిపడినంతమేరకు అనంతమైన వేదాలని కూర్చి వర్గీకరించారు. ఇవే వేదశాఖలు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ బ్రాహ్మణుడు నిర్వహించ వలసిన విధులను వేదశాఖ వివరిస్తుంది. ఆరంభంలో శాఖను అధ్యయనం చెయ్యాలి. అంటే, సంహితలోని మంత్రాలను కంఠస్థం చెయ్యాలి. ఆ తరువాత బ్రాహ్మణాలలోని మంత్రాల సహాయంతో యజ్ఞాలను చెయ్యాలి.*



 *ఆ పిదప వెలుపలి కర్మకూ లోపలి అనుభవానికీ గల అంతరాన్ని కలిపే ఆరణ్యకాలను మననం చెయ్యాలి. ఆ తరువాత ఆంతరసత్యం గురించి తెలిపే ఉపనిషత్తులని జీర్ణం చేసుకోవాలి. అంతరము, బాహ్యము అన్న భేదభావం సమసిపోయే మోక్ష స్థితిని అందుకోవాలి. ప్రతి శాఖకీ ఇదే ప్రణాళిక, ఇదే ఉద్దేశం.పరిణితాత్మునికి ఒక్క మంత్రమే చాలు సత్యాన్ని గ్రహించటానికి. కాని సామాన్యుడు ఎన్నో కర్మలను ఆచరించాలి, ప్రతి దశలోనూ అధ్యయనం, మననం చేస్తూనే ఉండాలి. అందువల్లనే ప్రతిశాఖలోనూ సామాన్యుడు ముక్తినొందటానికి కావలసిన మంత్రాలు, కర్మలు, ఆధ్యాత్మిక ఆదేశాలు ఉన్నాయి.*



 *వైదిక కర్మలు, అనుష్ఠానాలు చేయలేని వారికి తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చటం, మానసికోన్నతికి, ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తాయి. ఏ వర్గానికి చెందినా, విధ్యుక్త ధర్మాన్ని నిజాయితీతో నెరవేర్చి, ఫలితాన్ని భగవంతునికి వదిలితే గమ్యం చేరవచ్చు. కృష్ణ భగవానుడు గీతలో ఇలా అన్నాడు.*



*''స్వ కర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దన్తిమానవాః''       (18 : 46) యుద్ధాన్ని చేసి దేశాన్ని రక్షించటం కొందరి ధర్మం. మరొకడు వ్యాపారి. ఇంకొకడు పశులకాపరి, గోవులను పరిరక్షిస్తాడు. మరొకడు కాయకష్టం చేస్తాడు, కూలి వాళ్లని సమకూరుస్తాడు. తన రంగంలో పనిచేసుకొంటూ భగవత్సాక్షాత్కారాన్ని పొందవచ్చు.*



*లోకంలో అందరూ సుఖప్రదంగా ఉండటానికి అనువైన వృత్తులనూ ధర్మాలనూ కొందరు ఆచరిస్తూంటే బ్రాహ్మణుని విధి ఏమిటి? జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సమాజశ్రేయస్సు కోసం దైవానుగ్రహం సంపాదించటం. అటువంటి అనుగ్రహాన్ని సంపాదించటం బ్రాహ్మణుని విధి. భగవంతునికి సామంతులనదగ్గ దేవతల అనుగ్రహాన్ని కూడ బ్రాహ్మణులు అందరికీ లభించేట్టు పాటుపడాలి. అతడు పఠించే వేదమంత్రాలూ, చేసే వైదిక కర్మలూ సమాజంలోని అందరి శ్రేయస్సుకీను - తన ఉన్నతికోసమే కాదు. అలౌకిక శక్తులతో వ్యవహారం కాబట్టి అతను మంత్రాలను నేర్చుకోవాలి. ఆ మంత్రాలిచ్చే శక్తి సంపాదించాలి. దానికై మిగిలిన వారి కంటె ఎక్కువ నియమమూనిష్ఠా అనుసరించాలి.*



 *బ్రాహ్మణునికి వలె అంతటి దీక్ష యితరులకి అవసరం లేదు. బ్రాహ్మణుని విధ్యుక్త ధర్మం లోక శ్రేయస్సు కోసమే ప్రార్థన చేయటం, కృషి చేయటం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే కొన్ని విద్యలకు బ్రాహ్మణుల కొరకే నియుక్తమై నాయన్న తప్పుడు అభిప్రాయం పోతుంది. అంతేకాక, ఇతర కళలను శాస్త్రాలను పనులను చేయటాన్నీ కూడ బ్రాహ్మణుడు అభ్యసించాలి. అట్లా చేస్తేనే ఇతరులకు తమ విధులను గురించి బోధించ గలుగుతాడు. బోధనే అతని వృత్తి. మిగిలిన వృత్తుల గురించి ఎరుక కలిగి యుండాలి వాటిని నేర్పటానికి మాత్రమే. తనకి విధింపబడని వృత్తులను చేపట్టరాదు.*



*దేశ రక్షణ, వ్యాపారము, వ్యవసాయము ఇతర వృత్తులను అతడు చేపట్టక ఆయా వృత్తులను ఆశ్రయించిన వారికి తగిన శిక్షణ ఇవ్వకలిగి, తద్వారా వారి శీలాన్నీ, మనస్సునీ, బుద్ధినీ రూపొందించ గలగాలి. అందుచేత, బ్రాహ్మణునిది గురుతరమైన భాద్యత. ఈ భాద్యతని నిర్వహించే వానికి చిత్తశుద్ధీ, పరిణిత బుద్ధీ లేకపోతే సత్ఫలితముండదు. అతని మనస్సూ, బుద్దీ బాగా వికసించి యుండకపోతే ఇతరులకు ఉన్నతి నెట్లా కలిగించ గలుగుతాడు? కాని అతనికి ఒక పెద్ద ఆటంకముంది. తాను ఎప్పుడూ బుద్ధితోనే పనిచేస్తాను కదాని తాను ఇతరుల కంటే అధికుడనన్న భావం కలిగితే అది పెద్ద ఆటంకమవుతుంది.*



 *ఈ కారణాల వల్ల బ్రాహ్మణుడు ఎంతోపరిశుద్ధతతో ఉండాలి. అతని అహంకార మధికమవటానికి ఎన్ని కారణాలున్నా, అతను ఎంతో వినమ్రుడై, స్వార్థరహితుడై యుండాలి. అందువల్లనే అతని అహంకారమూ, ఇతర వికారాలు సమసిపోయి, సాధువవటానికి - అతనికి నలభై సంస్కారాలు విధించారు.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: