25, మే 2021, మంగళవారం

ఒక సూటి ప్రెశ్న

ఈ పోస్ట్ ఆసాంతం శ్రద్ధగా చదవండి. 


నేను అందరికి ఒక సూటి ప్రెశ్న వేయ దలుచుకున్నాను అదేమిటంటే మీరు లక్షల్లో ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి సమర్ధులా? 

మీ జవాబు సమర్దుడిని అయితే మీరు ఈ పోస్టు చదవాల్సిన పని లేదు 

ఒక వేళా మీ జవాబు నేను సమర్దుడిని కాదు నాకు స్వల్ప ఖర్చుతో నా ఆరోగ్యం కాపాడుకోవాలి అన్నది మీ జవాబు అయితేనే ఈ పోస్టు చదవండి. 

నేను మీకు ఒక మందు పేరు చెపుతున్నాను ముందే చెపుతున్నాను అది కరోనాకు మందు కాదు.  మీరు అడగవచ్చు అటువంటప్పుడు ఎందుకు చెప్పటం అని.  నాకు చెప్పండి వాక్షీనులు అదేనండి 

కవిషీల్డ్, కావాక్సీన్, స్పుటినిక్ వి, ఫైజర్ ఇవి కరోనాకి మందులా అక్షరాలా అవి మందులు కావు.  మరి మనమందరము లైనులు కట్టి మరి ఎందుకు తీసుకున్నాము.  వాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా వస్తుందని అన్నారే ఆ విషయం తెలియదా మీకు.  తెలుసు కానీ వాక్సిన్ తీసుకున్న వారికి ప్రమాదం తక్కువ అని అనటం వలన మనమందరం వాక్సిన్ తీసుకున్నాం. 

నేను చెప్పే మందు వాక్సిన్లాగ  పనిచేయదు. మరైతే ఎందుకు తీసుకోవాలి అనే సందేహం వస్తుంది. 

ఒక రైతు చేనులో రోజు రాత్రిపూట పశువులు పడి పంటను పాడు చేస్తున్నాయి అనుకోండి అప్పుడు ఆ రైతు ఏమిచేస్తాడు. తన చేనుకు ఒక దట్టమైన కంచ కడతాడు. ఆ కంచ పశువులను ఆపుతుంది.  అట్లా అని పూర్తిగా కంచెమీద ఆధారపడితే ఏదో ఒకరోజు బలమైన పశువు కంచెను కూడా   దాటి  రావచ్చు. కానీ కంచ చాలావరకు రక్షణ కలిగిస్తుంది. నేను చెప్పే మందు కూడా కంచ లాంటిది,  దీనిని క్రమం తప్పకుండ వాడితే మీ శరీరాన్ని ఒక కంచె లాగ కాపాడుతుంది. 

ఇప్పుడు మందు ఏమిటి అది యెట్లా పనిచేస్తుంది, ఎలా వాడాలి తెలుసుకుందాము. 

చావనప్రస్:(CHEVANAPRAS) దీనిని చేవనుడనే మహర్షి కనుగొన్నదని చెపుతారు.  ఆ మహర్షి వంశంలోనే నేను పుట్టానని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. 

ఈ మందు ఒక లేహ్యం రూపంలో దొరుకుతుంది. దీనిని రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో ఉదయం, సాయంత్రం గోరువెచ్చని పాలతో కానీ, నీళ్ళతోకాని తీసుకోవాలి. (దీనిలో చెక్కర సంబంధ పదార్ధాలు ఉండటం వలన దీనిని షుగరు వ్యాధి గ్రస్తులు వైద్యుల పరివేక్షణలో మాత్రమే సేవించాలి) 

ఈ మందు ఒక చక్కటి టానిక్ ఇది శరీరానికి దృఢత్వము, ముఖ్యంగా ఊపిరితిత్తుల దృఢత్వము,  చేకూరుస్తుంది. ఈ ముందుకు గుర్తించ తగిన సైడ్ అఫక్ట్స్ లేవనే చెప్పాలి.  కానీ మోతాదు మించి వాడితే కొంత యిబ్బంది కలగ వచ్చు.  ఒకరకంగా చెప్పాలంటే అన్నివిధాల సేఫ్ డ్రగ్. 

అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి.  మీకు నచ్చిన కంపనీ మందు కొనవచ్చు. పతంజలి కంపనీలో కూడా దొరుకుతుంది. 

ఈ మందు 500 గ్గ్రాములు, 1 కిలో సీసాలలో లభిస్తుంది. మీరు కిలో సీసానే తీసుకోండి. 

రేపటినుండే చవనాప్రాస  వాడటం మొదలు పెట్టండి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. 

నేను ఒక ప్రాక్టీసింగ్ న్యాయవాదిని నా పని వివిధ న్యాయస్థానాలలో కేసులు వాదించటం మాత్రమే నాకు వున్న డిగ్రీలు ఆ పని చేయటానికి మాత్రమే ఉపకరిస్తాయి.  

నేను డాక్టర్ని కాదు. కానీ నాలో వున్న స్వల్ప వైద్య జ్ఞానంతో ఈ పోస్టు వ్రాస్తున్నాను. నేను మీకు మందులు సూచించటానికి నాకు ఏరకమైన అర్హత లేదు. గమనించగలరు 

కామెంట్‌లు లేవు: