30, ఏప్రిల్ 2025, బుధవారం

అక్షయ తృతీయ

 


శ్రీభారత్ వీక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు 🌹 అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఆ రోజున బంగారం కొనాలా? కొంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? అసలు అక్షయ తృతీయ నాడు ఏం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి? వంటి ఆసక్తి కరమైన ఎన్నో అంశాలకు వివరణ ఇచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ధాతు పౌష్టిక లేహ్యము

 ధాతు పౌష్టిక లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -


         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 


  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 


 *  శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 


 *  నీరసం , నిస్సత్తువ తగ్గును . 


 *  శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 


 *  గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 


 *  నోటివెంట రక్తము పడుట తగ్గును . 


 *  శరీరము నందు రక్తము వృద్ది అగును . 


 *  రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 


 *  థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 


 *  మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 


 *  ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 


 *  ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 


 *  కాలేయమునకు బలమును ఇచ్చును. 


 *  ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 


 *  వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 


 *  గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 


 *  నరాల సంబంధ దోషాలను నివారించును . 


 *  కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 


 *  చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 


• చిన్న పిల్లలలో అద్భుతమైన జ్ఞాపకాలు శక్తి, శరీర పుష్టి, రోగనిరోధక శక్తి పెంపోందించును. 


•. మగవారిలో మరియు ఆడవారిలో కలుగు హార్మోన్ సంబంధ సమస్యలకు ఇది అత్యద్భుతముగా పనిచేయును. 


•. నాడీ సంబంధ దోషాలు నివృత్తి అగును. శరీరము నందు వ్యాపించి ఉన్న 72 వేల నాడులు శుద్ధి అగును. 


•. జ్ఞానేంద్రియల శక్తి పెరుగును. 


•. మగవారిలో వీర్యశక్తి పెరుగును. వీర్యకణాల ఉత్పత్తి, శక్తి పెరుగును. 


•. సంసార సంబంధ బలహీనత తగ్గును. 


°. కీల్లానొప్పుల మీద కూడా ప్రభావాన్ని చూపించును.  


పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 


      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 


ముఖ్య గమనిక - 


      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 


           ఈ లేహ్యం కావల్సినవారు డైరెక్టుగా కాల్ చేయగలరు . 

   సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

మహా వాక్యాలు

 🙏మహా వాక్యాలు🙏

ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యము

అహంబ్రహ్మస్మి యజుర్వేద మహావాక్యము

తత్త్వమసి సామవేద మహావాక్యము

అయమాత్మాబ్రహ్మ అథర్వణ మహావాక్యము


ప్రజ్ఞానం బ్రహ్మ


ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది.అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.


అహంబ్రహ్మాస్మి


యజుర్వేద మహావాక్యము ‘అహంబ్రహ్మాస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి


సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.



అయమాత్మాబ్రహ్మ


నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.

ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వాఙ్మయ వికాసము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏 రెండవ భాగము

               

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి.కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను (సాహిత్యమును) మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

 13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసనము (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు. 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు. 



మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ద్రావిడ పదం *తెన్ (దక్షిణం) నుండి "దక్షిణం/దక్షిణ దిశలో నివసించిన ప్రజలు (సంస్కృతం, ప్రాకృతం మాట్లాడే ప్రజలకు సంబంధించి) నుండి ఉద్భవించింది. 

అమరావతిలోని నాగబు అనే పదము విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.


6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉంది ) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.


ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీసము (పద్యం) పద్యాలున్నాయి. వేయి ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.

తెలుగు బాష కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుకుంది.తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడవంటిది . అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.

                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పరశురామజయంతి

 🔯 *రేపు పరశురామజయంతి* 🔯


*అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతస్సశరం ధనుః౹*

*ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి॥*


‘ఇది భగవాన్‌ పరశురాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టే శ్లోకం.

పరశురాముడి ముందు భాగాన-అంటే ముఖంలో నాలుగు వేదాలు, వెనుక వైపున అంటే వీపు మీద బాణాలూ, విల్లూ. 

ఇదే బ్రాహ్మణత్వం! ఇదే క్షాత్రం! శాపాలు పెట్టడంలోనూ, శరాలను సంధించడంలోనూ! విడమరిచి చెప్పుకోవాలంటే... పరశురాముడిలో వేద విజ్ఞానం ఉంది. శపించే శక్తీ ఉంది. అది బ్రాహ్మణ లక్షణం. ఆయన వెనక వైపున విల్లూ, బాణాలున్నాయి. శరసంధానం చేసి తునుమాడే శక్తీ ఉంది. అది క్షత్రియ లక్షణం. 

అంటే పరశురాముడిలో బ్రాహ్మణత్వమూ, క్షత్రియత్వమూ పెనవేసుకుని ఉన్నాయన్నమాట! 

వేదవిజ్ఞానఖని అయిన బ్రాహ్మణుడిలాగా ఆయన శపించి, తపింపజేయగలడు. ధనుర్విద్యానిపుణుడైన క్షత్రియుడిలాగా శరపరంపర చేత పరలోకానికి పంపనూగలడు. భగవాన్‌ పరశురాముడిలో ఈ రెండు లక్షణాలూ మహా తీక్షణమైనవే. ద్విముఖమైన ఈ విశిష్ఠతతో బాటు ఆయనలో మరెన్నో విశిష్ఠతులున్నాయి.


పరశురాముడు శ్రీరామచంద్రుడి కన్నా ముందు జన్మించాడు. 

రామావతార సమయంలో ఉన్నాడు. రామావతారం ముగిసిన తర్వాత కూడా ఉన్నాడు. శ్రీకృష్ణావతార కాలంలో కూడా ఆయన ఉన్నాడు. 

అంటే రామాయణ కాలమైన త్రేతాయుగంలోనూ, భారత భాగవతాల కాలమైన ద్వాపర యుగంలోనూ పరశురాముడు సజీవంగా ఉన్నాడు. ఆయనకు రామయణంతోనూ మహాభారతంలోనూ ప్రత్యక్ష సంబంధంఉంది. పరశురాముడు శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారం. ఆయన భృగువంశంలో అవతరించాడు. అందుకే ఆయనకు భార్గవరాముడు అనే నామధేయం కూడా ఉంది. భృగు వంశానికి మూల పురుషుడు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భృగువు. భృగు మహర్షి భార్య పులోమ. ఆమె హిరణ్యకశ్యపుడి కూతురు. పులోమా భృగుమహర్షి దంపతుల కుమారుడు చ్యవనుడు. చ్యవనుడికి ఇద్దరు భార్యలు. సుకన్య ప్రథమ పత్ని. ద్వితీయ పత్ని ఆరుషి. ఔర్వుడు చ్యవనుడి పుత్రుడు. తల్లి ఆరుషి. తల్లి యొక్క ఊరువు(తొడ) నుండీ జన్మించిన కారణంగా చ్యవన పుత్రుడికి ఔర్వుడు అనే సార్థక నామధేయం లభించింది. ఔర్వునికి ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు ‘రుచీకుడు’.రుచీకుడు విశ్వామిత్ర మహర్షి అక్కగారైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతీ రుచీక దంపతులకు జన్మించిన వాడే జమదగ్ని. జమదగ్ని భార్య రేణుక. జమదగ్నీ రేణుకల పుత్రుడే పరశురాముడు.

రామాయణం

 🌹🌷🏹🪔🚩🪔🏹🌷🌹

*🪷బుధవారం 30 ఏప్రిల్ 2025🪷*


            *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...



    *వాల్మీకి రామాయణం*

           *24వ భాగం*

                    

ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు.


తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు, వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు.


అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి...”మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడగండి, ధూపం వెయ్యండి, పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవెయ్యండి, నాటకాలు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని సిద్ధంచెయ్యండి, అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడవైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి” అని అన్నాడు.


సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. 

అప్పుడు రాముడు ‘నేను రామవర్మని వచ్చాను’ అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. 


రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చుసుకున్నట్టు ఉంది.


అప్పుడు దశరథుడు...”రామా! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు, అయినా ఒకసారి విను...‘నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనల్ని నాశనం చేస్తాయి, కావున వాటిని దగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము.(కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది, జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములను వేరొకరి దగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది, సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది, కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని అపహరించాలని పిస్తుంది,అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలని పిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) 

రామా నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి!”అన్నాడు దశరథుడు.


అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు.


అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి… “రాముడిని మళ్ళీ తీసుకుర”మ్మన్నాడు.


రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు… “నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఎన్నో యజ్ఞాలు చేశాను, పితృ ఋణం, దేవతా ఋణం, ఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే, ‘మీరు ఎందుకింత తొందర పడుతున్నారు’ అని అడుగుతావేమో.నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు, ప్రజలు దిక్కులేనివారు కాకూడదు, అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మారిపోకముందే చేసెయ్యనీ. భరతుడు చాల మంచివాడు, ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు, భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి,నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను, సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి,దర్భల(గడ్డి) మీద పడుకో!” అని చెప్పి పంపించాడు.


దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు.


ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి - నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు.


దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు.


అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు.


రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది, సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు (ఉపవాసం అంటె, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాత్విక ఆహారం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు).


అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది.


*రేపు...25వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

మిత్రులు

 👌 _*సుభాషితము*_ 👌

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️


_*పృచ్ఛకో మార్గదర్శీ చ*_

_*ధైర్యశాలీ విదూషకః!*_

_*విశ్వాసీతి సుహృద్భేదాః*_

_*నరస్యావశ్యకా ఇహ!!*_


ప్రశ్నించేవాడు, సన్మార్గం చూపువాడు, ధైర్యం కలవాడు, నవ్వుతూ నవ్వించేవాడు, నమ్మకస్తుడు అను ఈ అయిదు రకాలైన మిత్రులు ఈ లోకంలో మానవుడికి ఉండాలి.


⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

29, ఏప్రిల్ 2025, మంగళవారం

తాము శ్రమమ్ము నందియు వదాన్యత మేలునుఁ జేయఁ జూతు రా

ఉ॥

తాము శ్రమమ్ము నందియు వదాన్యత మేలునుఁ జేయఁ జూతు రా 

కామిత కార్యదక్షులు నకారణ వత్సలపూర్ణచిత్తులై 

ప్రేముడి నీడనిచ్చి పెనువేసవిఁ బండ్ల నొసంగు వృక్షముల్ 

భూమిని నిల్చునట్లు సురభూజములౌగద! యుత్తముల్ మహిన్ 

*~శ్రీశర్మద*

తెలుగు భాషావిర్భావము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏

             మొదటి భాగము 

తెలుగు మాట్లాడేవారు వారిని తెలుగు వారు అని అంటారు తెలుగుకు పాత రూపాలు తెనుంగు తెలింగా, తెనుగు అనునవి.

తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.

శాసనాలను పరిశీలించిన అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనుమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞా,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,,స,హ,ళ.వర్ణములు వాడుకయందుండెను. కాగా అందుశకట రేఫము ఒకటి.ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవు చున్నది.సుమారు క్రీస్తు పదవశతాబ్ది అంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాసించువఱకు శాసనములందు 'ఱ'అనురూపమున వ్రాయబడు అక్షరముండెడిది.ఇది బండి 'ఱ' లోని అడ్డుగీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు,వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అదిక్రమముగా కొన్నిచోట్ల 'డ'గాను,కొన్ని చోట్ల 'ళ'గాను,మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి.ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లు న్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగా శాసనములనుబట్టి తెలియుచున్నది.అది 'చోఱ' 'పదములలో(ఱలో లోపలి గీత తొలగించగా మిగిలిన అక్షరము దాన్ని డ్జ గా పలికే వారు ఈ వ్యాసములో ఎక్కడ ఱ వ్రాసినను బండి ర గా పలక కూడదు డ్జ గా పలకాలి పూర్తి సంయుక్తము గా కాకుండా కొంచెం తేలికగా పలకాలి ఈ విషయం మరచిపోవద్దు ) 'చోఱ ( చోడ్జ గా పలకాలి కన్నడిగుల వల్లనే డ్జ అని పలకాలని ఉచ్చారణ తెలిసింది ఈ అక్షరం కన్నడం లో ఎక్కువ కాలము ఉంది.) అనే పదం చోడ' లేక 'చోళ' అనియు;'నోఱంబ' పదములో 'నోళంబ' అనియు,ఱెందలూరు అనుచోట దెందులూరు గాను, క్టిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'ఱ' క్ఱొచె'అనుపదము 'క్రొచ్చె';వ్ర్ ​కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదము లలో వాడబడుచున్నదని కొందరు భావించారు.తెలుగు శాసనములలో చొఱ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది. కనుక 'ఱ' ( బండి ర కాదు డ్జ) అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.

 అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు అని చరిత్రకారులు పేర్కొన్నారు . పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది అని తెలుస్తోంది

                          సశేషం .

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

28, ఏప్రిల్ 2025, సోమవారం

తంత్ర శాస్త్రం వివరణ

 తంత్ర శాస్త్రం వివరణ - చిట్టి తంత్రాలు - 2. 


. మునపటి పోస్ట్ నందు మంత్రం, యంత్రం, తంత్రం గురించి వివరించాను. ఇప్పుడు మీకు తంత్రంలోని బేదాల గురించి వివరిస్తాను. వీటిలో ముఖ్యమైనవి 7 రకాలు. అవి. 


•. సజీవ తంత్రాలు. - 


. జీవము గల పదార్ధాలు, జీవ రాశులతో చేయు తంత్రాలు. 


•. ఔషదీ తంత్రాలు. = 


. వనమూలికలు, దివ్య ఔషధులతో చేయబడినవి. 


•. గర్భిత తంత్రాలు. -. 


. భూమిలో నుండు వస్తువులతో ఆచరింబడునవి. 


•. మంత్రమయ తంత్రాలు. - 


. కొన్ని మంత్రాల కలయిక కలిగి ఉండునవి.  


•. యంత్రిక తంత్రాలు. -. 


. కొన్ని యంత్రాలతో పెనవేసుకొని ఉన్నవి. 


°. మిశ్రమ తంత్రాలు. -. 


. అనేక విధాలైన ప్రక్రియలతో సంభంధం కలిగినవి. 


°. స్వతంత్ర తంత్రాలు. -. 


. మంత్ర, యంత్రాలతో గాని, ఔషదాలతో గాని, జీవ పదర్దాల తో గాని ఏ విధమైన సంభంధం లేకుండా అతిసారమైన ప్రక్రియలతో కూడి ఉండునవి.  


. ఇవేకాక వాక్ తంత్రాలు, ఉచిత తంత్రాలు, ఆశా తంత్రాలు, కుతంత్రాలు అనేవి కూడా ఉన్నాయి. వీటిని యుద్ధముల యందు, ప్రజా విప్లవముల యందు పూర్వీకులు ప్రయోగించి ఉన్నారు.  


. ఇప్పుడు ఈ తంత్రాలలో కొన్ని ముఖ్యమైన వాటిని మీకు తెలియచేస్తాను. 


•. నాలుగు చిన్న మేకులు తీసుకొని నృసింహ మంత్రాన్ని చెప్తూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించండి. ఎలాంటి దుష్టత్మాలు మీ ఇంట్లో ప్రవేశించవు.  


•. ఇంట్లో వచ్చే ముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవవద్దు. 


•. ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడే వారు భైరవుని పేరు మీద కొంచం మద్యాన్ని తీసుకొని భైరవాష్టాకం చదివి తాగేవారికి ఇవ్వండి. 


•. తాంబూలం లో కొద్దిగా జాజికాయ కలిపి వేసుకోవడం ద్వారా ముఖములో చక్కని వర్చస్సు పొందగలరు. 


•. కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది ప్రక్కలా చల్లండి. భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు.  


•. శుక్రవారం రాహు కాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. రాహు గ్రహ దోషాల నుండి విముక్తి కలుగును. 


•. గణపతి ప్రీతి కొరకు మీకు వీలైనప్పుడల్లా పిల్లలకు తీపి పదార్ధాలు పంచండి. 


 •. బ్యాంకు నందు డబ్బు వేసే ముందు లక్ష్మి మంత్రాన్ని జపించండి. 


•. డబ్బుని పొదుపు చేయడం భరణి నక్షత్రంలో మొదలుపెట్టండి. 


•. ఆర్ధికముగా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడినప్పుడు నిత్యం సుందరాకాండ పారాయణం చేయండి. 


•. చిన్నపిల్లలు రాత్రిపూట 

దడుచుకుంటున్నచో తలగడ వైపు ఒక నిమ్మకాయ ఉంచండి.  


•. ఇంటిలో పెద్దవారు ఆకాల మరణం చెందుతుంటే సర్పశాపముగా భావించి తగు పరిహారాలు చేయించండి. 


•. తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే. కుజ గ్రహ సంబంధ పూజలు చేయించుకోండి. 


•. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురైనా శని గ్రహ పూజలు చేయించుకోవాలి.  


. ఇలా కొన్ని వందల తాంత్రిక సంబంధ చిట్కాలు ఉంటాయి. కొన్నింటిని మాత్రమే మీకు వివరించాను.  


. సమాప్తం.  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

Vaisakha Puranam -- 1

 Vaisakha Puranam -- 1


వైశాఖ పురాణం - 1.


1వ అధ్యాయము - వైశాఖమాస ప్రశంస


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.

మూడు విషయాలు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏       🏵️జీవితంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు.. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు.. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం ఆసలు బాధ పడనవసరం లేదు🏵️విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది.. ప్రాణం లేని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు బోదించినా ఒక్కటే..నిజాలు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటారు.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పే వారి మాయలో ఈజీగా పడిపోతారు.. నిజాన్ని తెలుసుకునే లోపు  మంచిగా మాట్లాడే నా అనుకునే వాళ్ళని దూరం చేసుకుంటావు🏵️నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు.. అలాగే ఒప్పు అనిపించేది ఒప్పు కాదు.. ఆది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది.. జీవితం శాశ్వతం కాదు.. డబ్బు శాశ్వతం కాదు.. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే.. మన మంచితనం.. ప్రేమగా ఒక పలకరింపు🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావుశ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

అమృతాన్ని ఆరగించాలి

 Sreenivasa Murthy Chittamuri:

అమృతాన్ని ఆరగించాలి

అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట భారతీయులందరికీ తెలిసినదే.


'అన్నాద్భవన్తి భూతాని...' అని ప్రాణికోటి ఉత్పత్తికి ఆధారం అన్నమని తెలిపారు. తిన్న అన్నంలో అత్యంత స్థూలభాగం మాలిన్యంగా వెలికి వస్తుందనీ, సూక్ష్మ సూక్ష్మాంశాలు క్రమంగా ప్రాణశక్తిగా, తేజస్సుగా, మనస్సుగా మారుతాయని ఉపనిషద్వచనం. అందుకే అన్న విషయంలో అనేక నియమాలను ఏర్పరచారు మన పూర్వీకులు, మన అలసత్వంతో, చాపల్యంతో వాటిని 'చాదస్తాల'ని కొట్టేసి - నియమరహిత ఆహారాన్ని సేవించి బుద్ధినీ, శరీరాన్ని కాలుష్యపరచుకుంటున్నాం.


అన్న వ్యాపారం పెరిగి - వీథికో 'శీఘ్రహారకేంద్రాలు' వెలిశాయి. జిహ్వచాపల్యంతో మనుషులు వాటి ముందు బారులు, గుంపులు కడుతున్నారు. ఇంటిలో వండుకొనే అవకాశం లేని దరిద్రులు, లేదా పనిపై ప్రయాణంలో భాగంగా క్రొత్త ఊరికి చేరుకున్నవారు కడుపు నింపుకొనడానికై వాటిని స్వీకరించడం ఫరవాలేదు. గతిలేని పరిస్థితులవి.


కానీ ఉన్న ఊళ్లో, వండుకొనే అవకాశం ఉన్న గృహిణులు కూడా ఇంటిల్లిపాదితో కలసి హెూటళ్లకి పోయేలా ప్రేరేపించి 'ఎంగిలి - అంట్ల' నియమాల్లేని కూడు కోసం కక్కుర్తిగా మందవిందులకు ఎగబడడం శోచనీయమే. పెళ్ళిళ్ళలో ఆప్యాయంగా వండి వడ్డించడాలు పోయి, 'బఫే' పేర్లతో అనాచార, అనారోగ్య ఆహారాన్ని విందుల పేర్లతో ఆరగించడం బాధాకరం.


మన గృహస్థ సంప్రదాయం ప్రకారం శుచిగా అన్నాన్ని వండి భగవంతునికి నివేదించి, అతిథులకు వీలైనంత పెట్టి తాము తినడం పవిత్రం.... అని భావిస్తాం.


'యజ్ఞ శిష్టాశినః అమృతభుజః' అని శాస్త్రవచనం. “యజ్ఞము చేయగా మిగిలినది అమృతం. దానిని అరగించాలి". పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా మార్చడం వలన, భగవత్ప్రసన్నతాశక్తి మనలో ప్రసరిస్తుంది. తద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, మంచి సంతానం కలుగుతాయి.


ఆచార సంపన్నుల గృహాలలో అంట్లు ఎంగిళ్లు... అనే నియమాలుండేవి. సంస్కృతి, నాగరికత ఉన్నచోట్ల నియమాలు, నిబంధనలు పెరుగుతాయి. ఎంతో నాగరికతని సాధించిన దేశం కనుక - ఈ దేశంలో ఆహార నియమాలు బాగా ఉన్నాయి. వైజ్ఞానికంగా ఆలోచించినా - ఇంటి వంట ఒంటికి మంచిదని ఋజువవుతున్నదే. మంది భోజనాలు ప్రమాదకరమే. కేవలం బ్రతకడం కోసం కడుపులో కూడు పడేసుకోవడం పశుప్రవృత్తి. అంతేకాదు... ఇళ్లల్లో కూడా అంట్ల-ఎంగిలి నియమాలు వదులుకుంటున్నారు. కాస్త నాలికపై క్షణకాలం నిలిచే రుచికోసం ఉదరాన్ని హింసించి మానసిక శారీరక రోగాలకు బలవుతున్న దుఃస్థితులు నేడు కనిపిస్తున్నాయి.


చక్కగా స్నానం చేసి, తడిపి ఆరవేసిన పొడిబట్టను కట్టుకుని, శుభ్రపరచిన పొయ్యిపై భగవత్ స్మరణంతో వంట వండి, దేవుని దగ్గర దీపం వెలిగించి, ఆ అన్నాన్ని నివేదించితే అది అమృతమే అవుతుంది. దానిని ఆరగించడం శ్రేయస్కరం. వండేవారి మనః ప్రవృత్తి కూడా వంటపై ప్రభావం చూపిస్తుంది కనుక, శుచిగా దైవనామంతో వండుతున్నప్పుడు, ఆ దేవతాశక్తి అన్నానికి కూడా ఆవహిస్తుంది.


ఆహారాన్ని అరగించేటప్పుడు కూడా మనలో జఠరాగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరునికే నివేదిస్తున్నాం అనే భావన ఉండాలి. అందుకే పరిషేచన, దేవతాస్మరణ చేసి అన్నాన్ని తినడం ఈ దేశ సంప్రదాయం.


మన కడుపులోని అగ్నిహోత్రంలో అన్నాన్ని ఆహుతులుగా సమర్పిస్తున్నామనే భావనలో ఎంతో సంస్కారం గోచరిస్తోంది. ఈ స్ఫురణతో అన్నాన్ని స్వీకరించడం యజ్ఞం చేస్తున్నట్లే. జఠరాగ్నిలో పచనమైన ఆహారం రసంగా, శక్తిగా పరిణమించి ఇన్ద్రియ దేవతలకు చైతన్యాన్ని ప్రసాదిస్తోంది.


ఈ దర్శనం చేతనే మనకి అన్న నియమాలు, అన్నదానాలు ఏర్పడ్డాయి. పవిత్రమైన అన్నం పవిత్రమైన ఆలోచనలనిస్తుంది. 'అభక్ష్య భక్షణ'(తినరానివి తినడం) మహాపాపం... అని మన శాస్త్రాలు పదే చెబుతున్నాయి. అన్నానికి భౌతికమైన దోషాలను పోగొట్టడానికై వండే ముందు పదార్థాలను శుభ్రపరచడం చేస్తాం.


అవికాక - అన్న సంపాదనలో మనకు తెలిసీ, తెలియక జరిగిన దోషాలు, అన్న పచనంలో తప్పనిసరిగా జరిగిన హింస... మొదలైన సూక్ష్మమైన దుర్లక్షణాలను - భగవన్నివేదన వలన పరిహరించవచ్చు. తద్వారా శుద్ధమైన సంస్కారాలు మనలో మేల్కొంటాయి.


స్నానం కూడా చేయకుండా, పడుకుని లేచిన వస్త్రాలతోనే వంట వండి, ఆ అనాచార భోజనాన్ని 'కేరీజ్'లో సర్దుకుని పరుగు పరుగున ఆఫీసులకి దౌడుతీసి, ఏదో కడుపు నింపుకునే పద్ధతి నుండి కాస్త శ్రద్ధను ఉపయోగించి సదాచార విధానంలోకి మళ్లేందుకు ప్రయత్నించాలి.


మహాభారతంలాంటి ఇతిహాసాల్లో కూడా అన్న నియమాలు చాలా చెప్పబడ్డాయి. సాత్విక - రాజస-తామసాహారాల గురించి భగవద్గీతలో పరమాత్ముడే అద్భుతంగా వివరించాడు. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక ప్రగతికి సాత్వికాహారం శ్రేష్ఠం. వండిన వెంటనే ఎక్కువ ఆలస్యం కాకుండా భుజించడం శ్రేష్ఠమని కృష్ణవచనం. నాలుగు గంటలకు పైగా ఉన్న అన్నం చెడుతుంది. ఎంత 'చల్ల బీరువా'లో దాచినా దాని రసం క్షీణిస్తుంది. వైద్య, ఆరోగ్య శాస్త్రాలు కూడా వీటిని నిషేధించాయి.


మాంసాహార నిషేధం కలిగినవారు కూడా అతి లవణ, అతి కటు, అతి ఆమ్లా(పులుపు) కాని శాకాహారాన్ని భుజించడం మంచిదంటారు. మాంసాన్ని స్వీకరించేవారు కూడా ఆదివారం, శుక్రవారం లాంటి పవిత్ర దినాలలో మాంసాన్ని భుజించరాదని శాస్త్రం చెబుతోంది. పూర్ణిమ, అమావాస్య, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, పండుగ దినాలు, జన్మదినం వంటి ప్రత్యేక దినాలలో- మాంసాహారం తినరాదన్నారు. అంతేకాదు - ఆషాఢం నుండి నాలుగు నెలలు (చాతుర్మాస్యం) మాంసం తినకూడదని మహాభారతం చెబుతోంది. ఇది 'నిర్మూలన' కన్నా 'నియంత్రణ'ని అందిస్తుంది. దీని ద్వారా రాజస - తామస భావాల నిగ్రహణ సాధ్యమౌతుంది. క్రమక్రమంగా మాంసం తినే అలవాటున్న జాతులవారు కూడా మాంసాన్ని మానడం వలన యజ్ఞఫలం లభిస్తుందని వ్యాసుని మాట.


ఇక - ఏ ఆహారం స్వీకరించినా... 1. నిలబడి తినరాదు. 2. ఎంగిలి తినరాదు. 3. తినే పళ్లానికి ఎడమ చేయి తగల్చరాదు. 4. పళ్లానికి ఎడమ చేయి తగిలితే తిరిగి కడుక్కోవాలి. కడగకుండా అదే చేత్తో, లేదా తింటున్న చేత్తో ఆహార పదార్ధాన్ని ముట్టుకుంటే అది కూడా ఎంగిలవుతుంది. ఆ ఎంగిలి భోజనం మరొకరు తినరాదు. 5. చెమ్చాలతో తిన్నా ఆ చేయి ఎంగిలి చేయే. 6. ఆహారం (ఫలహారమైనా, అన్నమైనా) స్వీకరించాక పళ్ళెరాన్ని తీశాక, ఆ చోట నీటితో శుద్ది పెట్టాలి. ఆ నీటిలో పెరుగు చుక్కలైనా పసుపైనా వేసి శుద్ధి చేయాలి. 7. తాను తింటూ వడ్డించరాదు.... ఇవన్నీ శాస్త్ర నియమాలు.


'ఇవి చాదస్తాలు' అని పొగరెక్కిన బుద్ధులతో ఎంగిలి మంగలాలను దేవుకుంటున్న పశుప్రాయులు తాము ఏం కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు. తప్పనిసరై, ఆరోగ్యాది హేతువుల కోసం కొన్ని నియమాలను అతిక్రమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందిలేని కొన్ని చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. ఆహారశుద్ధి వలన సత్త్వ(ప్రాణశక్తి )శుద్ధి, సత్త్వశుద్ధి వలన చిత్తశుద్ధి... సమకూరతాయని సంప్రదాయం. 'ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?' అని అన్నప్పటికీ, ఆచారం లేనిదే ఆత్మశుద్ధి రాదన్నదీ వాస్తవమే. న్యాయంగా ఆర్జించినది, శుచిగా వండినదీ, ఈశ్వరునికి నివేదించినదీ మాత్రమే మనిషి తినవలసిన ఆహారం.


అతిథులకు, పేదలకు కూడా అటువంటి ఆహారాన్నే సమర్పించాలి, అది మనుష్య యజ్ఞం. మనమెంత నియమంగా వండినా, ఎక్కడ ఎలా తిన్నా భగవంతుని స్మరించితే అది పూర్ణశుచిని పొందుతుంది. "అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః" అని స్మరించి, ఇష్టదేవతా ప్రార్ధనతో భోజనం చేయడం ఉత్తమం. ఆచారం ఆయువును రక్షిస్తుంది. సదాచార సంపన్నమైన ఆహారం వలన మానవజాతిని తీర్చిదిద్దగలిగే బుద్ధిశక్తి సంపన్నులు ఆవిర్భవిస్తారు.

Beautiful Lines

 Beautiful Lines👍

-------------------------------

"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి 

"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని 

రెండక్షరాల "అవ్వ "తాత "

"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "

అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ 

రెండక్షరాల "గురు " వు దగ్గర 

రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని 

రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి 

రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే 

బంధాలను ఏర్పరచుకొని

రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ 

రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ 

రెండక్షరాల "బాధ "ని భరిస్తూ 

రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని 

రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి 

రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి 

రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ 

రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ 

రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ 

రెండక్షరాల "ముప్పు " వచ్చి

రెండక్షరాల "చావు " వచ్చే వరకు 

రెండక్షరాల "ముఖం "పైన 

రెండక్షరాల "నవ్వు "ఉంటే 

రెండక్షరాల "స్వర్గం "మన 

అరచేతిలో ఉన్నట్లే..!!

ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే 

ఉన్నప్పుడైనా, పోయాకైనా మన కోసం 

నలుగురుంటారు.....🙏😊


*ఇది నిజంగా అద్భుతం *


భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరా లను ఒక దోహాలో క్రమంగా పేర్కొన్నాడు.అత్యంత ఆశ్చర్యం

కలిగిస్తుంది ఈ అంశు. దోహాలోని అక్షరాల వరుసనూ కింద పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలనూ పరిశీలించండి.


"రామ నామ జపతే 

అత్రి మత గుసి ఆవు"


"పంక మే ఉగోహమి 

ఆహి కే ఛబి ఝాఉ"


రా - రాజస్థాన్

మ - మహారాష్ట్ర

నా - నాగాలేండ్

మ - మణిపూర్

జ - జమ్మూ కాశ్మీర్

ప - పశ్చిమ బెంగాల్

తే - తెలంగాణ

అ - అస్సామ్

త్రి - త్రిపుర

మ - మధ్యప్రదేశ్

త - తమిళనాడు

గు - గుజరాత్

సి - సిక్కిం

ఆ - ఆంధ్రప్రదేశ్

ఉ - ఉత్తర ప్రదేశ్

పం -పంజాబ్

క - కర్నాటక

మే -మేఘాలయ

ఉ - ఉత్తరాఖండ్

గో - గోవా

హ - హరియాన

మి - మిజోరమ్

అ - అరుణాచల ప్రదేశ్

కే - కేరళ

ఛ - ఛతీస్ ఘడ్

బి - బిహార్

ఝా - ఝార్ఖండ్

ఉ - ఉడిసా


ఇది నిజంగా అధ్బుతమైన అక్షరాలు 

రామ నామ మంత మధురానుభూతిని కలిగిస్తుంది.

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:


సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ 

తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే (2)


జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే (3)


అర్జునా.. కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీదా ద్వేషం, కోరిక లేనివాడు నిత్యసన్యాసి. సుఖదుఃఖాది ద్వందాలు లేకుండా అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు.

శ్రీ దులాడియో ఆలయం

 🕉 మన గుడి : నెం 1094


⚜ మధ్యప్రదేశ్  : ఖజురహో


⚜  శ్రీ దులాడియో ఆలయం



💠 దులాడియో దేవాలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న ఆలయం.  

ఈ ఆలయం లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది 


💠 'దులోడియో' అంటే "పవిత్ర వరుడు" అని అర్థం.

ఈ ఆలయాన్ని "కున్వర్ మఠం" అని కూడా అంటారు.  

ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు  1000–1150 నాటిది.  చండేల కాలంలో నిర్మించిన దేవాలయాలలో ఇది చివరిది.  

ఈ ఆలయం ఏడు రథాల ప్రణాళికలో (సప్తరధ) వేయబడింది.  


💠 ఖజురహోలోలో  శివునికి ఉన్న 22 దేవాలయాలలో దులాడియో దేవాలయం ఒకటి, మధ్య భారతదేశంలోని చండేలా పాలకులచే సృష్టించబడిన 87 దేవాలయాలలో ఇవి కూడా ఉన్నాయి.  


💠 కున్వర్ మఠం అని కూడా పిలువబడే దులాడియో ఆలయం, జైన దేవాలయాల సమూహానికి నైరుతి దిశలో 700 మీటర్ల దూరంలో , ఖుదర్ నదికి సమీపంలో ఉంది.


💠ఇది ఖజురాహోలోని గొప్ప దేవాలయాలలో చివరిదని నమ్ముతారు, ఇది 1130 లో చందేల్ల రాజు మదనవర్మన్ పాలనలో నిర్మించబడింది.


💠 ఆలయ లోపలి భాగం ఖజురాహోలో కనిపించే మునుపటి దేవాలయాల కంటే చాలా సరళంగా ఉంటుంది మరియు పాశ్చాత్య భారతీయ నిర్మాణ సంప్రదాయాల ప్రభావాలను చూపిస్తుంది.

గర్భగుడిలో లింగం యొక్క కేంద్ర చిహ్నం ఉంది, ఇది ఆలయానికి సమకాలీనమైనదిగా పరిగణించబడదు కానీ తరువాత భర్తీ చేయబడింది.


💠 ఆలయ గర్భగుడిలో ఒక అందమైన శివలింగం ఉంది. 

ఆలయం యొక్క ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే, పవిత్రమైన శివలింగం ఉపరితలంపై చెక్కబడిన 999 లింగాలు ఉన్నాయి. 

శివలింగం యొక్క ప్రదక్షిణ  తీసుకోవడం 1000 ప్రదక్షిణలకు సమానమని నమ్ముతారు. 


💠 శివలింగంతో పాటు, ఆలయంలో గణేశుడు, పార్వతి దేవి మరియు గంగా దేవి వంటి ఇతర దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు ఉన్నాయి.


💠 ఈ ఆలయంలోని శిల్పాలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని జామ్సోర్‌లోని ఒక ఆలయ అవశేషాలలో లభించిన శిల్పాలతో బలమైన గుర్తింపును కలిగి ఉన్నాయి . ఈ సారూప్యత నుండి రెండు ప్రదేశాలలోని శిల్పాలు ఒకే శిల్పుల చేతిపని అని మరియు అవి 1060 నుండి 1100 వరకు, కీర్తివర్మన్ పాలనలో సృష్టించబడ్డాయని ఊహించబడింది . 


💠 ఆలయంలోని అనేక ప్రదేశాలలో లిఖించబడిన వాసల అనే పేరును బట్టి, ఆ పేరు శిల్పాలను సృష్టించిన ప్రధాన శిల్పి పేరు అని ఊహించవచ్చు.


💠 ఈ ఆలయాన్ని నిరంధార ఆలయంగా వర్గీకరించారు . 

నిరంధార అంటే సంచార మార్గం లేని ప్రదేశము అని అర్ధం.

ఇందులో సంచార స్థలం లేని గర్భగుడి, వసారా, ప్రధాన హాలు ( మహా-మండపం ) మరియు ప్రవేశ ద్వారం ఉన్నాయి. 

ఆలయములో  ప్రదక్షిణ మార్గం లేదు, ఇది 12వ శతాబ్దంలో చందేల పాలనలో నిర్మించబడిన దేవాలయాలలో చివరిది కావడం వల్ల కావచ్చు, ఆ సమయంలో వాటి నిర్మాణ దశ గరిష్ట కాలం గడిచిపోయింది.


💠 ఆలయ శిఖరం మూడు వరుసల చిన్న శిఖరాలలో సృష్టించబడింది .

 దీని లక్షణాలు సాధారణంగా ఖజురాహో సముదాయంలోని ఇతర దేవాలయాల కోసం స్వీకరించబడిన వాటికి అనుగుణంగా ఉంటాయి. స్మారక చిహ్నాల భౌతిక లక్షణాల ప్రకారం వర్గీకరణ ఒక ఎత్తైన స్థావరాన్ని కలిగి ఉంటుంది, ఇది ఒక ఉప నిర్మాణం, దానిపై గొప్పగా అలంకరించబడిన నిర్మాణం పైకి లేచి గొప్ప శిల్పాలతో కప్పబడి ఉంటుంది. 

నిర్మాణ శైలి నాగర , ఇది శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని సూచిస్తుంది .


💠 ఆలయంలోని ప్రధాన హాలు చాలా పెద్దది మరియు అష్టభుజాకార ఆకారంలో ఉంటుంది. 

దీని పైకప్పు సొగసైన చెక్కబడిన దివ్య నృత్యకారులు ( అప్సరాలు ) ఉన్నారు. అప్సరసలతో చెక్కబడిన ఇరవై బ్రాకెట్లు ఉన్నాయి, ప్రతి బ్రాకెట్‌లో ఒకదానికొకటి రెండు లేదా మూడు అప్సరసలు ఉన్నాయి మరియు పైకప్పులో వృత్తంలో అమర్చబడి ఉన్నాయి. 


💠 చెట్ల చుట్టూ నృత్యం చేసే ఆడపిల్లలు మరియు శృంగార భంగిమల్లో ఉన్న మహిళలు కూడా ఆలయ నిర్మాణంలో భాగం.

 ఇది "ఖజురహో నిర్మాణ మరియు శిల్ప నైపుణ్యం యొక్క చివరి ప్రకాశం" అని చెప్పబడింది. 

ముఖభాగంలోని పై వరుసలలో అతీంద్రియ జీవుల ( విద్యాధార ) శిల్పాలు శక్తివంతమైన రీతిలో ఉన్నాయి. 


💠 సమయాలు:

 ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు.



రచన

©️ Santosh Kumar

17-07-గీతా మకరందము

 17-07-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక మూడువిధములైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గూర్చి చెప్పుచున్నారు - 


ఆహార స్త్వపి సర్వస్య 

త్రివిధో భవతి ప్రియః | 

యజ్ఞస్తపస్తథా దానం 

తేషాం భేదమిమం శృణు || 


తాత్పర్యము:- ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణములనుబట్టి) మూడు విధములుగ ఇష్టమగుచున్నది. ఆలాగుననే యజ్ఞము, తపస్సు, దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమును గూర్చి (చెప్పెదను) వినుము.


వ్యాఖ్య:- ఆహారాదులను నాలుగింటిని గుఱించి చెప్పదలంచి భగవానుడు వానిలో ఆహారమును గూర్చియే మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధనక్రమములో ఆహారశుద్ధి ప్రప్రథమమైనది. ఆహారశుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగలేనిచో మనస్సున్ను మలినముగానుండుటవలన దానివలన లక్ష్యప్రాప్తి చేకూరకయేయుండును.


ప్రశ్న:- ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్నివిధములుగ ప్రియమై  యుండును? 

ఉత్తరము:- వారివారి గుణముననుసరించి మూడు విధములుగ ప్రియమైయుండును (సత్త్వగుణము గలవారికి సాత్త్వికాహారము - ఈ ప్రకారముగ).

తిరుమల సర్వస్వం -222*

 *తిరుమల సర్వస్వం -222*

 *శ్రీవేంకటేశ్వరుని సేవలో దాసభక్తులు-1* 


 శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ప్రాభవాన్ని, మహిమలను, ఆశ్రితపక్షపాతాన్ని ఎందరెందరో భక్తులు, కవులు, వాగ్గేయకారులు రసరమ్య భరితంగా వర్ణించారు. అటువంటి వారిలో శ్రీనివాసుణ్ణి తమ అమూల్యమైన పదబంధాలతో కీర్తించి తరించిన *'కర్ణాటక హరిదాసులు'* అగ్రగాములుగా నిలిచారు. వారు రచించి, ఆశువుగా కీర్తించిన వేలాది కృతులను *'దాససాహిత్యం'* గా పేర్కొంటారు. ఈ దాసపరంపరకు చెందినవారు శ్రీవేంకటాచలాధీశుణ్ణి కన్నడభాషలో వర్ణించినందువల్ల, ఆ సాహితీసంపదను అత్యధిక సంఖ్యలో ఉన్న శ్రీవారి తెలుగు భక్తులకు సులభంగా అర్థమయ్యే అచ్చ తెలుగుభాషలోకి అనువదించి, ప్రచారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని *‘దాససాహిత్య ప్రాజెక్టు’* పేరుతో తి.తి.దే. చేపట్టింది. *'అన్నమాచార్య ప్రాజెక్టు'* ద్వారా అన్నమయ్య కీర్తనలను అందరికీ అర్థమయ్యే సాధారణ తెలుగులోకి ఎలా తర్జుమా చేసి జనబాహుళ్యం లోకి తెచ్చారో, అదే విధంగా *‘దాససాహిత్య ప్రాజెక్టు'* ద్వారా కన్నడభాషలో ఉన్న కీర్తనలను కూడా తెనిగీకరించుతారన్నమాట!



 *దాస సాహిత్యం ప్రాముఖ్యత* 


 కొన్ని శతాబ్దాల క్రితం వరకు వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు సామాన్య మానవులకు అంతగా ప్రవేశం లేని సంస్కృతభాషలో నిక్షిప్తమై ఉండేవి. కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు మహాపండితులు దేవనాగరిలిపిలో ఉన్న సాహిత్యాన్ని సాధారణ జనస్రవంతి లోకి తీసుకు వెళ్ళే ఉద్దేశ్యంతో, ఆ సాహిత్య నిక్షేపాలన్నిటినీ విస్తృతంగా వాడుకలో ఉన్న సాధారణ కన్నడభాషలోకి అనువదించి; కుల, వర్ణ, లింగ వివక్షత లేకుండా ప్రజలలో ప్రచారం చేయాలని సంకల్పించారు. దానితో బాటుగా ఎందరో హరిదాసులు శ్రీవేంకటేశుని మహిమలను వీనులవిందుగా వర్ణించి తరించారు. తమను తాము భగవంతునికి దాసులుగా భావించుకుని, శ్రీవారిసేవకే తమ జీవితాలను సమర్పించుకున్న ధన్యజీవులను 'హరిదాసులు' లేదా 'దాసభక్తులు' గా అభివర్ణిస్తారు. హరికథలు, కీర్తనలు, దేవరనామాలు, భజనలు వంటి కళారూపాల్లో ప్రత్యక్షంగా, లేదా దృశ్య శ్రవణ మాధ్యమాల సాయంతో విస్తృతంగా శ్రీవేంకటేశ్వరతత్వాన్ని ప్రచారం చేయటం ద్వారా; పండితులకే పరిమితమైన ‘వ్యాససాహిత్యం’ అందరికీ అందుబాటులో ఉండే 'దాససాహిత్యం' గా రూపుదిద్దుకుంది. తద్వారా గడచిన కొద్ది శతాబ్దాలలో వేదాల, ఉపనిషత్తుల, ఆధ్యాత్మికతత్వ సారం కర్ణాటక ప్రాంతంలో నలుదెసలా విస్తారంగా వ్యాప్తి చెందింది. తరువాతి కాలంలో విజయనగరసామ్రాజ్య పతనం మరియు పురందరదాసు, కనకదాసుల వంటి ప్రఖ్యాత దాసభక్తుల నిర్యాణంతో; ప్రోత్సాహం కరువై ఈ ఉద్యమం మరింత ముందుకు సాగలేదు. పై నేపథ్యంలో అప్పటికే విస్తృతప్రచారంలో ఉన్న దాససాహిత్యాన్ని తెలుగుభక్తుల చెంతకు తీసుకురావడం కోసం తి.తి.దే. చేపట్టిన *దాససాహిత్య ప్రాజెక్టు* యొక్క పూర్వాపరాలు తెలుసుకునే ముందు, కొందరు ప్రముఖ దాసభక్తులను స్మరించుకోవాలి.


 *దాసభక్తులు* 


 దాససాహిత్య వ్యాప్తిని తమ భుజస్కంధాలపై వేసుకుని కర్ణాటక దేశమంతా విస్తృతంగా పర్యటించిన కర్ణాటక హరిదాసులను తలచుకునేటప్పుడు మొట్టమొదటగా శ్రీపాదరాయలు వారిని, తరువాత వ్యాసరాయలు వారిని ముఖ్యంగా పేర్కొనాలి. ఆ తరువాత కర్ణాటక సంగీత పితామహులుగా పేరుగాంచిన ఆనాటి *పురందరదాసు, కనకదాసు, విజయదాసు, గోపాలదాసు, జగన్నాథ దాసు* లతో పాటుగా ఈమధ్య కాలం నాటి *శ్యామసుందర దాసు* కూడా స్మరణకు తెచ్చుకోదగ్గవారు. వీరిలో కొందరు అతి ముఖ్యులైన దాసభక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 *శ్రీపాదరాయలవారు* 


 కర్ణాటక దాసులను మననం చేసుకునేటప్పుడు,


*‘నమః శ్రీపాదరాజయ నమస్తే వ్యాసయోగినే!* 

*నమః పురంధరార్వాయ విజయార్యతే నమః'*


అంటూ మొట్టమొదటగా దాససాహిత్యానికి ఆద్యుడయినటువంటి శ్రీపాదరాయలు వారిని ప్రస్తావించడం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. భౌతికమైన ఈ మాయా ప్రపంచం నుంచి తనను రక్షించువాడు, ఇహలోకం లోని క్లేశాలను దూరం చేయువాడు ఆ వేంకటాచాలాధీశుడే అని శ్రీపాదరాయలు వారు నమ్మారు. శ్రీవారి మూలరూపం మరియు శ్రీమహావిష్ణువుకు యొక్క అవతార రూపాలకు బేధం లేదని ప్రతిపాదించి, శ్రీమహావిష్ణువును ఉపాసన చేసి తన జీవితాన్ని పండించుకున్నారు.


 శ్రీకృష్ణదేవరాయలుతో పాటుగా ముగ్గురు విజయనగర సామ్రాట్ లకు రాజగురువుగా సేవలందించి, శ్రీవెంకటేశ్వర భక్తితత్వాన్ని దక్షిణభారత దేశమంతటా చాటిచెప్పిన శ్రీ వ్యాసరాయల వారి గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. స్వామిపుష్కరిణీ తటాన, వారు పెక్కు సంవత్సరాల పాటు త్రికాల సంధ్యావందనాదు లొనర్చిన *'వ్యాసరాజ ఆహ్నీకమండపాన్ని',* ఈనాడు కూడా తిరుమలలో ప్రధానాలయపు ఉత్తర మాడవవీధిలో, ఆదివరాహస్వామి ఆలయానికి ఎదురుగా చూడవచ్చు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*360 వ రోజు*


*అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట*


అశ్వత్థామ నారయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారయాణాస్త్రాన్ని పాండవసేనల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రధాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు పిక్కటిల్లాయి. సముద్రములు పొంగాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. కాని దాని ధాటికి తాళ లేక పోతున్నారు. నారయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూసాడు. అర్జునుడు మాటాడ లేదు. ధర్మరాజు అర్జునుడు, కృష్ణుడు వినేలా ధృష్టద్యుమ్నుడు సాత్యకులతో ఇలా అన్నాడు. " ఆ ద్రోణుడు ఎంత క్రూరుడంటే నాడు నిండు కొలువులో ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ ఉఉరుకున్నాడు కాని ఒక్క మాట అన లేదు. బాలుడైన అభిమన్యుని మరణానికి కారణమయ్యాడు. సూర్యాస్తమయం అయితే అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలని తెలిసీ మనలను అర్జునుడికి సాయంగా వెళ్ళ నీయక అడ్డుకున్నాడు. మరి అలాంటి ధర్మపరునితో మనం సరి తూగగలమా ! ఈ నారాయణాస్త్ర సాక్షిగా చెప్తున్నాను. మీరంతా పారి పోయి మీ ప్రాణాలను దక్కించుకొండి. అప్పుడు అర్జునుడు కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడేమి చేస్తాడో ఆయన ఇష్టం " అని నిష్టూరంగా అన్నాడు. ఇక కృష్ణుడు ఊరక ఉండలేక రధము మీద నిలబడి " ఓ సైనికులారా ! పాండవ వీరులారా ! భయపడకండి. మీరంతా మీ మీ రథములు వాహనములు గజములు హయములు దిగి ఆయుధములు కింద పడవేయండి. నారాయణాస్త్రానికి ఇదే విరుగుడు. వేరు ఉపసంహారం లేదు " అన్నాడు.


*నారాయణాస్త్రాన్ని భీముడు ఎదుర్కొనుట*


శ్రీకృష్ణుడి మాటలకు సైనికులు తమ తమ వాహనములు దిగుతుండగా భీముడు " మహా వీరులారా ఆగండి వాహనములు దిగకండి వీరోచితంగా పోరాడండి. నేను ఉన్నాను, మహాస్త్రాలను ప్రయోగిస్తాను, నా గదతో అందరిని గెలుస్తాను " అని ఎలుగెత్తి అరచి తన గధ తీసుకుని అశ్వత్థామ మీదకు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని మీదకు మళ్ళించాడు. భీముని మాట వినక అందరూ తమతమ వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టారు. ఆ నారాయణాస్త్రము వారిని విడిచి ఆయుధధారి అయిన భీముని వెంటబడింది. అది చూసి భీముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వారుణాస్త్ర ప్రభావానికి నారాయణాస్త్రం శక్తి కొంత తగ్గింది. వెంటనే అశ్వత్థామ దాని శక్తిని పెంచాడు. ఆ నారాయణాస్త్రం భీముడిని భీకర అగ్నిజ్వాలలను విరజిమ్ముతూ చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునులు తమ ఆయుధములను రధము మీద ఉంచి రధము దిగి భీముని రధము వద్దకు పరుగెత్తి అతడిని రధము మీద నుండి కిందకు దించుటకు ప్రయత్నించారు. భీముడు రధము దిగక మూర్ఖంగా అలాగే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు " భీమసేనా ! మహా వీరా! ఈ అస్త్రమును ఉపసంహంరించే శక్తి అశ్వత్థామకు కూడా లేదు. దీనికి ఆయుధములు కింద పెట్టడమే విరుగుడు. నా మాట విని ఆయుధములు విడిచి రథము దిగవయ్యా " అంటూ కృష్ణుడు బతిమాలుతూ భీముని చేతి నుండి ఆయుధములు లాగాడు. అర్జునుడు, కృష్ణుడు కలసి ఒక్క తోపుతో రధము నుండి కిందకు తోసారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేతా ఆయుధములు లేక పోయే సరికి ఆ ఆయుధము శాంతించి వెను తిరిగింది. వెంటనే అందరిని ఆయుధములు ధరించి యుద్ధముకు సిద్ధం కమ్మని కృష్ణుడు ఆదేశించడంతో పాండవసైన్యం తిరిగి కౌరవ సైన్యంపై విజృంభించింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

10 గ్రాముల బంగారం మార్కెట్ ధర Gold

 1925 నుండి 2025 వరకు 100 సంవత్సరాల 

10 గ్రాముల బంగారం మార్కెట్ ధర 

____________________

సంవత్సరం రూపాయలు 

1925. 18.75

1926. 18.43

1927. 18.37

1928. 18.37

1929. 18.43

1930. 18.05

1931. 18.18

1932. 23.06

1933. 25.05

1934. 28.81

1935. 30.81

1936. 29.81

1937. 30.18

1938. 29.93

1939. 31.75

1940. 36.05

1941. 37.43

1942. 44.05

1943. 51.05

1944. 52.93

1945. 62.00

1946. 83.87

1947. 88.62

1948. 95.87

1949. 96.18

1950. 97.18

1951. 98.00

1952. 76.81

1953. 73.00

1954. 77.00

1955. 79.00

1956. 90.00

1957. ‌ 90.00

1958. ‌ 95.00

1959. 102.00  

1960. 111.00

1961. 119.00

1962. 119.00

1963. 97.00

1964. 63.00

1965. 72.00

1966. 84.00

1967. 102.00

1968. 162.00

1969. 176.00

1970. 184.00

1971. 193.00

1972. 202.00

1973. 278.00

1974. 506.00

1975. 540.00

1976. 572.00

1977. 576.00

1978. 685.00

1979. 937.00

1980. 1330.00

1981. 1700.00

1982. 1645.00

1983. 1800.00

1984. 1970.00

1985. 2130.00

1986. 2140.00

1987. 2570.00

1988. 3130.00

1989. 3140.00

1990. 3200.00

1991. 3466.00

1992. 4334.00

1993. 4140.00

1994. 4598.00

1995. 4680.00

1996. 5160.00

1997. 4725.00

1998. 4045.00

1999. 4680.00

2000. 4400.00

2001. 4300.00

2002. 5000.00

2003. 5600.00

2004. 5850.00

2005. 7000.00

2006. 8400.00

2007. 10800.00

2008. 12500.00

2009. 14500.00

2010. 18500.00

2011. 26400.00

2012. 29500.00

2013. 29600.00

2014. 28734.00

2015. 26845.00

2016. 29560.00

2017. 29920.00

2018. 31730.00

2019. 36080.00

2020. 48480.00

2021. 50000.00

2022. 53000.00

2023. 60000.00

2024. 80000.00

2025. 96000.00

___________________


తేదీ.17.04.2025 వ నాటి వరకు ధర.


మీరు పుట్టిన సంవత్సరం 

మీకు పెళ్లైన సంవత్సరం 

మీకు పిల్లలు పుట్టిన సంవత్సరం 

మీ పిల్లల పెళ్లిళైన సంవత్సరం 

మీరు పదవీ విరమణ చేసిన సంవత్సరం లో 

బంగారం ధర ఎంత ఉందో చూడండి.

ఈ రోజు ధర ఎంత ఉందో చూడండి.

మీ మనవళ్లు మనవరాళ్లు పుట్టినప్పుడు వారి పెళ్లిళ్ల సందర్భంగా బంగారం ధర 

 ఎంత ఉంటుందో ఊహించుకోండి.

ముందు తరాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దుబారా ఖర్చులు తగ్గించుకుని 

కొంచెం కొంచెం బంగారం కొని దాచండి.

ఎందుకంటే ఒక్కో చుక్క నీరే సముద్రమౌతుంది.

        

          😊 🙏🙏🙏🙏😊

వైశాఖ మాసం :

 *వైశాఖ మాసం :


వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసం గా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో *ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది.* వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.


ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో, వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. 

చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి *వైశాఖ మాసం* అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.


ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా

పేరుపొందిన *వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.* అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే.

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.


వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - భరణి -‌‌ ఇందు వాసరే* (28.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

27, ఏప్రిల్ 2025, ఆదివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 28 ఏప్రిల్ 2025🕉️*


           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం*

             *22వ  భాగం*

                   

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.


దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు.కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే...

```

*తేషామపి మహాతేజా రామో రతికరః పితుః।*

*స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః॥*```


రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏమిటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు (ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము),ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైనా కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు (అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, ‘అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే’ అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరముకాని పని చేసేవాడు కాదు (మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికీ తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే...```

*ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్।*

*లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః॥*```


గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.


ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. 


*రేపు...23వ భాగం*

        

*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 28 ఏప్రిల్ 2025🕉️*


           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం*

             *22వ  భాగం*

                   

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.


దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు.కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే...

```

*తేషామపి మహాతేజా రామో రతికరః పితుః।*

*స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః॥*```


రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏమిటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు (ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము),ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైనా కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు (అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, ‘అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే’ అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరముకాని పని చేసేవాడు కాదు (మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికీ తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే...```

*ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్।*

*లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః॥*```


గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.


ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. 


*రేపు...23వ భాగం*

        

*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

సోమవారం🕉️* *🌹28, ఏప్రిల్, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    *🕉️సోమవారం🕉️*

*🌹28, ఏప్రిల్, 2025🌹*

   *ధృగ్గణిత పంచాంగం*                          

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - కృష్ణపక్షం*


*సూర్యరాశి : మేషం*

*చంద్రరాశి : మేషం/వృషభం*

*సూర్యోదయాస్తమయాలు ఉ 05.44*

*సా 06.26* 

*విజయవాడ*  

*ఉ 05.52*

*సా 06.36* 

*హైదరాబాద్*


*తిథి      : పాడ్యమి* రా 09.10 వరకు ఉపరి *విదియ* 

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : భరణి* రా 09.37 వరకు ఉపరి *కృత్తిక*


*యోగం  : ఆయుష్మాన్* రా 08.03 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం  : కింస్తుఘ్న* ఉ 11.05 *బవ* రా 09.10 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.00 - 07.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 05.26 - 06.50*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*


*వర్జ్యం            : రా 09.02 - 10.26*

*దుర్ముహూర్తం  : ప  12.30 - 01.21 సా 03.03 - 03.53*

*రాహు కాలం    : ఉ 07.19 - 08.55*

గుళికకాళం       : *మ 01.40 - 03.15*

యమగండం     : *ఉ 10.30 -  12.05*


*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.44 - 08.16*

సంగవకాలం         :*08.16 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.53*


*ఆబ్ధికం తిధి         : వైశాఖ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.26*

ప్రదోష కాలం         :  *సా 06.26 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.42*

నిశీధి కాలం          :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.58*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

మర్కట కిశోర న్యాయం

 🙏మర్కట కిశోర న్యాయం, మార్జాలకిశోర న్యాయం🙏

మర్కటము అంటే కోతి.. మార్జాలము అంటే పిల్లి.. కిశోరము అంటే చిన్న బిడ్డ.

ఇక్కడ కర్తలు కిశోరాలే . మర్కటము యొక్క కిశోరము. మార్జాలము యొక్క కిశోరము. (వాటి తల్లులు కాదు. )

పిల్లల చర్యలే ఇక్కడ గ్రాహ్యాలు.తల్లులవి కాదు . అని నా భావము


కోతిపిల్ల తన తల్లిని వదలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది.

నా తల్లిని పట్టుకొన్నాను, నాకేమీ కాదు అని గట్టి ధైర్యం.

తల్లిని తన ప్రయత్నంతో బిడ్డ పట్టుకొని ఉండడం "అన్యథా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ" అని.


ఇక్కడ జీవుడికి భగవంతుణ్ణి పట్టుకోవడం తెలుసు. ఆ ప్రయత్నమూ తెలుసు.


తీర్థ యాత్రలూ, పూజలు, యజ్ఞాలూ , జప తపాలూ చేయడం.. తన ప్రయత్నం బహుళంగా ఉండడం. తానే భగవంతుణ్ణి పట్టుకోవడం.


పిల్లి పిల్లలు తల్లి ఎక్కడ వదిలితే అక్కడే తిరుగుతూ తల్లి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాయి . తల్లే వచ్చి తీసుకుపోవాలి.. తల్లి తమను పట్టించుకోవాలి. తాము తల్లిని వెతికి పట్టుకోలేవు. ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేవవి. అపుడు తన కూనలను తానే నోట కరచుకొని తీసుకుని పోతుంది ఆ తల్లిపిల్లి.


తెలిసి భగవంతుణ్ణి తానే గట్టిగా పట్టుకొని నిర్భయంగా ఉండడం మర్కట కిశోర న్యాయం.


నాకేమీ తెలియదు ( న మంత్రం నోయంత్రం అన్నట్టు). నిన్ను తలచుకోవడం ఒకటే తెలుసు . నన్ను కడతేర్చు— అని దీనంగా ఆక్రోశిస్తూ ఉన్న ఆ బిడ్డను ఆ భగవంతుడే దిగి వచ్చి, అతడికి ఏ కష్టమూ లేకుండా తన ధామం చేర్చుకొంటాడు. కూన ప్రయత్నం లేకుండానే తల్లి ఆ బాధ్యత అంతా తానే స్వీకరిస్తుంది.

జ్ఞానేనైవ తు కైవల్యం.. అనేది ప్రసిద్ధ వాక్యం. భగవంతుడు వేద వేద్యుడు గాబట్టి వేద విహిత కర్మలు చేసి


ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ (భరతర్షభ! )


న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే


అని చెప్పిన వాక్యాలు ప్రమాణంగా అన్ని దశలూ దాటి కడకు జ్ఞానియై కైవల్యం చెందడం (బహూనాం జన్మనాం అంతే జ్ఞాన వాన్ మాం ప్రపద్యతే —అని ఉన్న ది గాబట్టి ) శాస్త్ర సమ్మతం..


జ్ఞాని/ యోగి వాసుదేవస్సర్వం అని దర్శిస్తాడు.. ఇది మర్కట కిశోర పద్ధతి . తెలిసి , ఆశ్రయించే విధానమూ తెలిసి భగవంతుణ్ణి పట్టుకోవడం ఈ యోగి చేసేది..


మార్జాల కిశోరంలో ఆర్తి ఉంది.. తనకే తన వేదన చెప్పుకొంటూ ఉంది. అది విని , తల్లి నోట గరుచుకొని తీసుకుని పోయి , దాని భయాన్ని పోగొడుతూ ఉన్నది...

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

తంత్ర శాస్త్రం

 తంత్ర శాస్త్రం వివరణ - చిట్టి తంత్రాలు - 1. 


సమస్త ప్రపంచం  మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సిద్ధాంతాలపైన ఆధారపడి ఉంటుంది. ఏ పని అయినా సులభముగా సిద్ధింప చేసుకొనుటకు తంత్రం చాలా సులభమైన మార్గం. ఇప్పుడు మీకు వీటి గురించి స్వల్పముగా వివరిస్తాను. 


. ఈ ప్రపంచంలో కొన్ని లక్షలకొట్ల శక్తులు అదృశ్య రూపములో సంచరిస్తూ ఉంటాయి. మనం కూర్చునేంత చిన్న స్థలములోనే కొన్ని లక్షల శక్తులు ఉంటాయి. వీటిని ఉత్తేజిత పరుచుటకు కొన్ని ప్రత్యేక శబ్దక్రియలు ఉంటాయి. ఆ శబ్దములనే "మంత్రములు " అంటారు. ఈ మంత్రములను ఉచ్చరించినపుడు ఉత్తేజితులు అయిన శక్తులు దేనికోసం అయితే మనం ఆ ఉచ్చారణ చేశామో ఆయా క్రియలును అవి సంపూర్ణం చేస్తాయి. ఇక్కడ మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. "శాపం " అంటే అందరికి తెలుసు కదా. ఏ వ్యక్తి అయితే పరిపూర్ణమైన శక్తితో, ఆగ్రహముతో ఎదుట వారిని శపించినప్పుడు ఆ శాపమును నిర్వర్తించే బాధ్యత ఆ చుట్టూ పక్కన ప్రదేశములో ఉండే ఏదో ఒక శక్తి తీసుకొని ఆ శాపమును అమలుపరిచే వరకు ఆ వ్యక్తిని వేటాడుతుంది. ఇదే వాక్కుకి ఉండే శక్తి అందుకే పెద్దవారు ఏదన్నా అన్నప్పుడు పైన "తధాస్తూ దేవతలు " ఉంటారు తప్పుగా అనొద్దు అని నివారిస్తారు. ఆ తధాస్తు దేవతలే ఈ శక్తులు. ఇలా ఉండేదే మంత్రశాస్త్రం ఇది ముఖ్యముగా వాక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో హోమాలు, జపాలు ఈ క్రియ క్రిందకు వస్తాయి.


. రెండొవది అయినా "యంత్రం" అనగా ఏదైనా ఒక శక్తిని ఒక ప్రదేశములో దిగ్బందన చేయడాన్ని 

" యంత్రప్రక్రియ " అని పిలుస్తారు. ఇది గృహములకు, దేవాలయాలయాలో శక్తిని నిక్షిప్తం చేయడానికి ఈ ప్రక్రియ వాడతారు.  


. మూడోవది మరియు చివరిది అయిన " తంత్రం ". దీన్ని ఆంగ్ల భాష యందు "మెస్మరిజం" అంటారు తెలుగులో కనికట్టు అని కూడా అంటారు. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేయడం. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇది కొన్ని పెద్ద పెద్ద పనులు చేయుటకు, కొన్ని రకాల గ్రహ దోషాలు పోగొట్టడానికి ఇది అతి సులభ విధానం. 


. ఈ తంత్ర శాస్త్రం ఎంత సులభం అయినదో ఉదాహరణ చెప్తాను. శని సంబంధ దోషం ఉన్నప్పుడు మంత్రం శాస్త్రం శనికి అభిషేకం, జపాలు, హోమాలు ఇలాంటివి సూచిస్తుంది. కానీ అదే తంత్ర పద్ధతిలో పారే నీళ్లలో సారా, ఇనుప మేకులు, ఎండు మిరప కాయలు వదిలి వెనక్కు తిరిగి చూడకుండా రావాలి అని ఉంటుంది. అదే విధముగా రాహు సంబంధ దోషముకు coffebite చాక్లేట్స్ పిల్లలకు పంచమని చెప్తారు. ఇలా సులభమైన పద్ధతులు ఉంటాయి. 


. ఇలాఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఒక గ్రంధమే అవుతుంది. అందుకే స్వల్ప మోతాదులో వివరిస్తున్నాను. 


. మరింత విలువైన సమాచారం తరువాతి పోస్టు నందు వివరిస్తాను. 



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

తోలుబొమ్మలాట

 🙏తోలుబొమ్మలాట -ప్రదర్శన -చరిత్ర 🙏                        మొదటిభాగం


తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.

తోలు బొమ్మలాట ఆట చూద్దాము చదవండి 

ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. మైకులు వంటి సాధనాలు లేకుండా విశాలమైన మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వారి గొంతు స్థాయిని ఊహించుకొనవచ్చును.ఏ వ్యక్తి బొమ్మలను ఆడిస్తాడో ఆ వ్యక్తి తానే పాడుతూ, పాటకు అనుగుణంగా బొమ్మను ఆడిస్తాడు. రెండు బొమ్మలను ఆడించే సమయంలో బొమ్మలమధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మలను చేతితో కొట్టిస్తాడు. అదే సమయానికి క్రింది బల్లచెక్క టకామని నొక్కుతాడు. ఈ సమయంలో మిగిలిన వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళూ, డబ్బాలూ, ఈలలూ, కేకలతో బీభత్సం సృష్టిస్తారు.



తోలుబొమ్మ లాటలలో గాయకులకు హార్మోనియం శృతిగా ఉంటుంది. తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతే కాదు, వాళ్ల కాళ్ళక్రింద బల్లచెక్కలుంటాయి. ఆయా ఘట్టాలననుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాలలో ఈ చెక్కలు టకటకా త్రొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. నగారా మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. ఉరుములు ఉరిమినట్టూ, పిడుగులు పడ్డట్టూ డబ్బాలు మ్రోగిస్తారు.


తోలుబొమ్మలు

తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక,   దుప్పి, మేక ఈ మూడు రకాల జంతువుల తోళ్ళను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోను, గ్రీసుదేశంలో ఒంటె చర్మంతోను తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చితోళ్ళను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండమీద లేదా చదునైన చాపమీద పరచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పల్చటి చర్మపుపొరను పదునైన కత్తి సహాయంతో తీసివేసి మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహాయంతో చతురస్రాకారపు చెక్కకు బిగించి ఆరవేస్తారు. ఈవిధంగా చేయడం వల్ల మిగిలిన కొద్దిపాటి నలకలు ఉంటే అవిపోతాయి. ఇన్ని దశల్లో శుభ్రపరచిన తోలు పలచనిపొరగా, పారదర్శకంగా తయారై దీపపుకాంతి ప్రసరించే విధంగా అవుతుంది.


జింక చర్మాలను దేవతలు, పౌరాణిక కథానాయకులలాంటి ముఖ్యమయిన పాత్రల బొమ్మలను తయారు చెయ్యడంలో ఉపయోగిస్తారు. లేడి చర్మం బాగా మన్నిక గలది గనుక దీనిని భీముడు, రావణుడు లాంటి యోధుల బొమ్మలను తయరు చెయ్యడానికి ఉపయోగిస్తారు. హాస్యపాత్రల వంటి మిగిలిన బొమ్మల కోసం సులభంగా దొరికే గొర్రె చర్మాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక్కొక్క బొమ్మ తయారు చెయ్యడానికి ఒక చర్మం సరిపోతుంది. కానీ రావణుడు వంటి కొన్ని బొమ్మలు తయారు చెయ్యడానికి ఎక్కువ చర్మం అవసరమవుతుంది. రావణుడి బొమ్మను తయారు చెయ్యడానికి కనీసం నాలుగు చర్మాలు అవసరమౌతాయి. శరీరం కోసం ఒక చర్మం, కాళ్ళ కోసం ఒక చర్మం, రెండు జతల చేతుల (ఒక్కొక్కటి ఐదు చేతులు) కోసం రెండు చర్మాలు. ఎంపికచేసుకున్న బొమ్మలకు రేఖాచిత్రాల ఆధరంగా ప్రకృతిసిద్దమైన కరక్కాయ, చింత గింజలపొడి, అన్నభేది మొదలైన రంగులచే తోలుబొమ్మలకు ఇరువైపుల రంగులు వేస్తారు. ప్రస్తుతం ఆధునికులు పారదర్శకమైన రంగులను ఉపయోగిస్త్తున్నారు.

                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కృష్ణుడు ఆరాధ్యుడు

 🔔 *కృష్ణం వందే* *జగద్గురుమ్*🔔


*శ్రీకృష్ణుని*

*జీవితం...దారుణమైన ముళ్ళబాట.*


సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. 


పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు.


*కానీ... ఆత్మహత్య చేసుకోలేదు.* 


కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు. 


కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన. 


అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా! 


*అయినా ఆత్మహత్య చేసుకోలేదు.*


జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. 


రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు ఆమె తండ్రియైన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయింది కృష్ణునికి. 


*కానీ ఆత్మహత్య చేసుకోలేదు.* 


చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. 


తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! 


కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. 


*ఆత్మహత్య చేసుకోలేదు.* 


యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. 


*ఆవేశం కాదు ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి.* 


నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం. కాని, కృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు.


*భగవంతుడిని పూజించటం కాదు... ఆచరించాలి

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం...

 🎻🌹🙏 శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం... అరసవిల్లి...!!


🌸 శ్రీ సూర్యనారాయణ దేవాలయాలు భారతదేశంలో అరుదుగా వున్నాయి. ఒరిస్సాలోని పూరీకి సమీపంలో కోణార్క్ సూర్యదేవాలయం వుంది.

శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్య నారాయణస్వామి దేవాలయం వుంది. 

ఇది గొప్ప సూర్యక్షేత్రం. 


🌿 ఓం ఆదిత్యాయ నమః..అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం!


🌸 భక్తులు సూర్యభగవానుని శరణుజొచ్చి, పూజలు, అభిషేకాలు సూర్య నమస్కారాలు జరిపి తమ కోర్కెలు ఫలించడంతో హర్షభరితులై తమ ఇండ్లకు వెళతారు. 


🌿అందుకే ఈ క్షేత్రానికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని, అదే వాడుకలో అరసవిల్లి అయిందని అంటారు.ఈ క్షేత్ర స్వామి గ్రహాధిపతి కావడం వల్ల దర్శన మాత్రముననే సర్వగ్రహారిష్ట శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


🌸 సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడింది. 

దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. 

కంచిలోని ఏకామేశ్వరాలయంలో కూడా యిలాంటి ఏర్పాటు వుంది.


🌿 ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. 


🌹🙏 స్థల పురాణం 🙏🌹


🌸 కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్ర లకు బయలుదేరాడు. కరువు కాటకాలతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా


🌿 అతను తన ఆయుధమైన హలం (అనగా నాగలి వలన) ని భూమి పై నాటి జలధార వచ్చేటట్లుగా చేసాడు. 

బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినకి కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలివబడుతుంది. 


🌸ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు.

 అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు. 


🌿 అలాగే ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు. అప్పటికే కాలాతీతమైంది. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించాడు.


 🌸పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు. అపుడు నందీశ్వరుడుకు ఆగ్రహం వచ్చి కొమ్ములతొ ఒక విసురువిసిరాడు. ఇంద్రుడు ఆ కొమ్ములవిసురుకు కొంతదూరంలో పడ్డాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలంనే ఇంద్ర పుష్కరిణి అంటారు. 


🌿 అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని" చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికింది.


🌸దానితోపాటు ఉష,ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించాయి. అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రం.


 🌿అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. 


🌸స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.


🌿 అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.


🌸అరసవిల్లి నందు ఏకశిల పై యున్న సూర్యుని విగ్రహం, ఆయన రథ 

సారధి అమారుడు, ఉష, పద్మిని, ఛాయాదేవి, సనకుడు, సివందుడు, మారరుడు, పింగళుడు వంటి సూర్యభగవానుడి పరివారం కూడా దర్శన మిస్తారు. 


🌿“సూర్యకఠారి ” చురకత్తిని కూడా ఇక్కడ సతీసమేతంగా రథమున అధిరోహించిన శ్రీసూర్యనారాయణుని నడుమునందు దర్శించవచ్చు.


🌹 రథసప్తమి పర్వదినం :🌹


🌸ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. 

స్వామివారికి త్రిచ, సౌర, అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు, అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహిస్తారు.

 ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు


 🌹సూర్యనమస్కారాలు: 🌹


🌿రోజూ రూ. 50 చెల్లిస్తే కుటుంబం పేరు మీద అర్చకులు సూర్యనమస్కారాల సేవ చేస్తారు... స్వస్తి..🌞🙏

లక్ష్మీదేవి

 *🪷లక్ష్మీదేవి పద్మముపై ఎందుకు ఉంటుంది🪷* 


🪷శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. “పద్మాననే పద్మ ముఖే పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. 


🪷పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. బురద నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. 


🪷సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం.నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం.


🪷ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది.విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటు పద్మం నుండి పుట్టి అక్కడనుండి సృష్టి ఆవిర్భావం.ఆ బ్రహ్మ తత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం.అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. 


🪷వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో అష్ట లక్ష్ములు గా దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. 


🪷లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి 


🪷జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం ఇస్తుంది.

💎💎💎💎💎💎💎💎💎💎

శ్రీ కాళహస్తీశ్వర శతకము

 శు భో ద యం 🙏


శ్రీ కాళహస్తీశ్వర శతకము

                       (200)

(400 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన "ధూర్జటి" మహాకవిచే ఆవిష్కరించబడినది.


వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్

వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్

నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం

జెనకుం జీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం

శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. రానున్న దుర్మరణము తలుచుకొనగా - ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మంచి సాధించనివాని నగుదునే?? నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.


(శివ భక్తుడైన శ్రీ ధూర్జటి ఆత్మ నివేదన -మీలో కొందరిని 'పద్య భాగం' అలరింపచేయలేక పోయివుండవచ్చు గాక. కానీ భావం ద్వారా నైనా ఆయన హృదంతరాళాల్లోని ఆర్తిని మీరు గ్రహించి వుంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో..మనకు కూడా వర్తిస్తుంది కనుక!


శతకసాహిత్యం సౌజన్యంతో-🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*కర్తా కారయితా చైవ

 





*కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః*

*సుకృతం దుష్కృతం వాఽపి చత్వార స్సమభాగినః*


అన్నట్లు ఆ దోషంలో అందరూ భాగస్వాములౌతారు.



*   

ఎక్కడి తల్లిదండ్రి

 శు భో ద యం 🙏


"ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం

బెక్కడ జీవుँడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా

డొక్కడె,పాప పుణ్య ఫల మొందిన నొక్కడె, కానరాడువే

ఱొక్కడు? వెంటనంటి భవ మొల్లనయా! కృప జూడుమయ్య!నీ

టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణా పయోనిధీ. ॥ 92 ॥"🌷🌷🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 27 ఏప్రిల్ 2025🌞*

           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం*

             *21వ  భాగం*

           

అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవిక తోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జరిపించారు.


అలా వివాహం జరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు.   


ఆ రోజ జరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.


మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.


అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి.


ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు.


ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, “ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావ”న్నారు.


ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, “నేను ఈ రోజే విన్నాను,శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామా, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు!” అన్నారు.


ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి....“మహానుభావా! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు.ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు” అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.


అప్పుడు రాముడు ఇలా అన్నాడు… “పరశురామా! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను” అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. “నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి, నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను” అన్నాడు.


అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు “రామా! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను,o అప్పుడాయన నన్ను రాత్రి పూట                          ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను” అని అన్నాడు.


“అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు (తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను” అన్నాడు రాముడు.


పరశురాముడు “సరే” అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు.


వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, “నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలే”దని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.


దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.


సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు.....``` 


*ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి।*

*గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే॥*```


రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే,’మా తండ్రిగారు నాకు తగిన భార్య’ అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. అలా ఆనందంగా కాలం గడిచిపోతోంది.


*రేపు...22వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఆదివారం🌞* *🌹27, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

  *🌹27, ఏప్రిల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                    


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి : అమావాస్య* రా 01.00 వరకు ఉపరి *వైశాఖ మాసారంభః*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం : అశ్విని* రా 12.38 వరకు ఉపరి *భరణి*


*యోగం  : ప్రీతి* రా 12.19 వరకు ఉపరి *ఆయుష్మాన్* 

*కరణం : చతుష్పాద* మ 02.55 *నాగ* రా 01.00 ఉపరి *కింస్తుఘ్న*


*సాధారణ శుభ సమయాలు:* 

                 *-ఈరోజు లేవు-*

అమృత కాలం : *సా 06.20 - 07.44*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*


*వర్జ్యం : రా 09.08 - 10.32*

*దుర్ముహూర్తం : సా 04.44 - 05.35*

*రాహు కాలం : సా 04.50 - 06.26*

గుళికకాళం : *మ 03.15 - 04.50*

యమగండం : *మ 12.05 - 01.40*

సూర్యరాశి : *మేషం* 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయాస్తమయాలు:

*ఉ 05.45* 

*సా 06.26*

 *విజయవాడ*

సూర్యోదయాస్తమయాలు

ఉ 05.54 

సా 06.35 

*హైదరాబాద్*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.45 - 08.17*

సంగవకాలం         :*08.17 - 10.49*

మధ్యాహ్న కాలం  :     *10.49 - 01.21*

అపరాహ్న కాలం   : *మ 01.21 - 03.53*


*ఆబ్ధికం తిధి       : చైత్ర అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.53 - 06.26*

ప్రదోష కాలం         :  *సా 06.26 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.42*

నిశీధి కాలం          :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.59*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం*🌝 


*మహాత్మానౌ చక్రవాక*

 *చకోరప్రీతికారకౌ |*

*సహస్రషోడశకళౌ* 

*సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹