*June 15th Happy Fathers day*
--------------------------------------------------
ఎద రహదారి పై జీవన గమనం!
నాన్న ఇచ్చిన చిటికెన వ్రేలుతో
నా ప్రయాణం ప్రారంభం!!
అప్పుడు తెలియదు....
ఆ చిటికెన వ్రేలు నన్ను
ఆకాశపుటంచుల దాకా తీసుకెళ్తుందని!
అప్పుడు తెలియదు...
అది చిటికెన వ్రేలు మాత్రమే కాదని,
బ్రతుకు పోరాటంలో అహర్నిశలు
నన్ను కాపాడే అస్త్రమని!!
ఆశలు, ఆశయాలు
సుఖాలు, సంతోషాలు
విందులు, వినోదాలు....
చివరకు తన జీవితాన్ని కూడా
బిడ్డలకు అర్పణ చేసే
ఏకైక నిస్వార్థ జీవి నాన్న!!
నాన్నంటే గమనం, నాన్నంటే గమ్యం!
నాన్నంటే ఆశ, నాన్నంటే శ్వాస!
నాన్న ఉంటే గెలుపు,
నాన్న వెంటే జీవితపు మలుపు!
కష్టాలు తనవి, సుఖాలు బిడ్డలవి!
కన్నీటిని తాగుతాడు,
కలిమిని పంచుతాడు!
వెన్నంటే ఉంటాడు,
వెన్నుదన్నుగా నిలుస్తాడు!!
నిద్ర లేని రాత్రులు నాన్నవి,
విందు వినోదాలు బిడ్డలవి!
కన్న వారి కళ్ళల్లో సంతోషంతో
తన కడుపు నింపుకునే పిచ్చి న్నాన్న,
ప్రేమకు ప్రతి రూపం నాన్న!
దేవుని రూపంలో నాన్న!!
-----------------------------------------------------
*A. Dattatreya, Zphs Veljerla*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి