31, మార్చి 2026, మంగళవారం

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 31.03.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి భౌమ వాసర పూర్వఫల్గుని నక్షత్రం గండ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: చతుర్దశి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 68*


*బాణసృణిపాశకార్ముకపాణిమముం కమపి కామపీఠగతమ్।*

*ఏణధరకోణచూడం శోణిమపరిపాకభేదమాకలయే॥*


*భావము :*


*తన చతుర్భుజములలో బాణము, అంకుశము, ధనుస్సు, పాశము వంటి ఆయుధములుగాను, బాలచంద్రుని సిగలో ఆభరణముగాను ధరించి, కామపీఠమును అధిరోహించిన అరుణవర్ణయైన మాతనుస్మరిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ।

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 33 ।।



ప్రతిపదార్థ:



సదృశం — దానికి తగినట్లుగా; చేష్టతే — క్రియలను చేయును; స్వస్యాః — తమంత తామే; ప్రకృతే — ప్రకృతి గుణములు; జ్ఞానవాన్ — జ్ఞానులు; అపి — కూడా; ప్రకృతిం — సహజ స్వభావం; యాంతి — అనుసరించుట; భూతాని — అన్ని ప్రాణులు; నిగ్రహః — నిగ్రహించి; కిం — ఏమి; కరిష్యతి — చేసెదరు.


తాత్పర్యము : 


   

వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?



 వివరణ:


శ్రీ కృష్ణుడు మళ్లీ, అకర్మ కన్నా కర్మయే శ్రేష్ఠమనే విషయం సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా, అనంతమైన పూర్వ జన్మ సంస్కారాలని (వారి ధోరణులు, అభిప్రాయాలు), ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ (అసంఖ్యాక పూర్వ జన్మల నుండీ పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా, ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధి) ని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఆ అలవాట్ల, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలు అన్నీ పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే, అదొక అయోమయమైన/అస్థిర మైన పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్ల, సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ఆధ్యాత్మిక పురోగతి మొదలుపెట్టాలి; ఇది చేయాలంటే మన ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని అర్థం చేసుకుని, అంగీకరించి అక్కడినుండి మెరుగుపరుచు కోవాలి.


జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అణుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు. చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా, తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి, ఇది మానవ సమాజంలో కనిపించటం అరుదు. ఒక ఆవుకి తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే, దూడ ఒక్క క్షణం కనిపించక పోయినా ఆవు ఆందోళనకి లోనవుతుంది. మానవులెవరికీ సాధ్యం కాని అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా, మనం మానవులం కూడా మన సహజ స్వభావంచే నడిపింపబడుతాము. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు, ‘నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది (భగవద్గీత 18.59)’; ‘నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది (భగవద్గీత 18.60)’. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ ప్రాప్తి దిశగా మార్చటం ద్వారా, మరియు, మన విధులను రాగ ద్వేష రహితంగా, భగవత్ సేవ రూపంగా చేయటం ద్వారా, ఆ సహజ స్వభావాన్ని పవిత్రమొనర్చుకోవాలి

ఆంజనేయ స్తుతి🙏

  🌸ఆంజనేయ స్తుతి🙏

    ॐॐॐॐॐॐॐ

సీ౹౹పావన!హనుమయ్య పాలింపరావయ్య!

                        భక్తులబ్రోచెడి పరమపురుష!

     సంజీవ రాయుడా! సర్వజ్ఞ! సామీర!

                 సత్వరమే రమ్ము! సాధు చరిత !

     వీరాంజనేయుడా! వినుమయ్య వినతి నీ

                     సేవయే మాకును చింత తీర్చు!

      జలధిని! లంఘించి జానకి !జాడను 

                   తెలిపిన తేజస్వి! ధీరహనుమ!

తే౹౹ సూర్యునిదరికిని జనుచు శ్రుతులనేర్చి

       వ్యాకరణపండితుడవైన వాయుపుత్ర!

       రామసుగ్రీవులకుమైత్రి! లక్షణముగ

      నెఱపినట్టి ప్రసన్నాంజనేయ !శరణు !


                "సాహితీ శ్రీ " జయలక్ష్మి పిరాట్ల

రామాయణం - 21)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 21)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (30-3-'26 పోష్టు తరువాయి భాగము)


శ్రీరాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనస్సును గ్రహించి, బాణం సంధించగానే జగత్తంతా కంపించింది.


ధనస్సును ఎక్కుపెట్టి, శరాన్ని సంధించి, 

కోపంతో రాముడు ఇలా అన్నాడు.


 "ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవగుట చేతను,

 విశ్వామిత్రునకు బంధువు వగుట చేతను,

 నాకు పూజ్యుడవు. 

అందువలన, నీ ప్రాణములు హరించేందుకు ఈ శరాన్ని, ప్రయోగింపజాలను.


శ్లో//ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్/

లోకా న ప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి//


(భార్గవరామా! నీ పాదగమన శక్తిని గాని,

తపోబలముతో నీవు సంపాదించుకున్న,సాటిలేని ఉత్తమ లోకములను గాని,

ఈ బాణముతో కొట్టివేసెదను.

నీకు ఏది ఇష్టమో చెప్పుము).


దివ్యమైన ఈ వైష్ణవ శరము వ్యర్ధమగుటకు వీలు లేదు.


శ్లో//వరాయుధ ధరం రామం ద్రష్టుం సర్షిగణాఃసురాః/

పితామహం పురస్కృత్య సమేతా స్తత్ర సంఘశః//

గంధర్వాప్సరసశ్చైవ సిద్ధ చారణ కిన్నరాః//

యక్ష రాక్షస నాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్//


అది ఒకఅద్భుత సన్నివేశం. 

శ్రీ మహావిష్ణువు తన స్వంత ధనస్సును, మానవుడుగా ధరించడం,అనే దివ్య సన్నివేశం.

విష్ణుధనస్సు ధరించి, తాను స్వయంగా విష్ణువునేనని చెప్పకుండా చెబుతున్న ఆ రాముని చూడడానికి,

 అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చాడు. 


" పుంసాం మోహన రూపాయ" (పురుషులను కూడా మోహింపజేసే అందమైన రూపం కలవాడు రాముడు).


వైష్ణవ ధనస్సును ధరించిన ఆ రాముని దివ్యమంగళ రూపాన్ని చూడటానికి,

దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు,యక్షులు, రాక్షసులు, నాగులు, మొదలైనవారు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. 


శ్రీరాముడు వైష్ణవ ధనస్సును స్వీకరించగానే, అవతార ప్రయోజనము పూర్తి అయిన పరశురాముడు నిర్వీర్యుడైనాడు


శ్లో// జడీకృతే తదా లోకే రామే వర ధనుర్ధరే/

నిర్వీర్యో జామదగ్న్యో౽సౌ రామో రామ ముదీక్షత//


(రాముడు, శ్రేష్ఠమైన ఆ ధనస్సును ఎక్కుపెట్టగానే, అత్యంత ప్రభావంతో కూడిన ఆ దివ్య వైష్ణవ శరమును చూచి లోకమంతా భయపడి, స్తంభించి పోయింది. 

పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయినాడు.

ఆయన రామునివంక అత్యాశ్చర్యముతో చూచాడు).


ఆయనకు జ్ఞానోదయం అయింది.

ధర్మరక్షణకు అవతరించిన శ్రీ మహావిష్ణువే రాముడని పరశురాముడు అప్పుడు గ్రహించాడు.

రామునకు నమస్కరించాడు.


శ్లో//అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్/

ధనుషో౽స్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప//


(ఈ ధనస్సును గ్రహించుటవల్ల, నీవు అక్షయుడవు, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడవు, సర్వదేవతలకు ఈశ్వరుడవు అయిన శ్రీమహావిష్ణువు వని తెలుసుకొన్నాను. ఓ పరంతపా! నీకు స్వస్తియగుగాక.)




త్రిలోకనాధుడవైన నీ చేత నిర్జింపబడటం వల్ల నేను సిగ్గుపడటం లేదు. 

అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ భూమిని కశ్యపునకు దానమిచ్చినందున నేను మహేంద్ర పర్వతముపై నివసిస్తున్నాను. 

నేను అక్కడకు వెళ్ళాలి. అందువల్ల నా గమన శక్తిని నశింపజేయవలదు.

నీ బాణం ప్రయోగించి నేను తపశ్శక్తితో సంపాదించిన పుణ్యలోకాలు నశింపజేయుము,అన్నాడు.


బ్రహ్మజ్ఞానికి, పుణ్యము పాపము, రెండూ ఉండకూడదు కాబట్టి, పరశురాముని కోరిక ప్రకారము, రాముడు ఆ పుణ్యలోకాలనన్నింటినీ బాణప్రయోగంతో నశింపజేశాడు.


పరశురాముడు, దశరథ రాముని స్తోత్రం చేసాడు.

ప్రదక్షిణము చేసి మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు

చీకటి తొలగి దిక్కులన్నీ ప్రకాశించినవి.


విష్ణుధనస్సును ధరించిన రాముని దేవతలు,ఋషులు స్తుతించారు.


శ్లో// గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః/

వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం//


(ప్రశాంత మనస్సుతో కూడిన రాముడు, పరశురాముడు వెళ్లిన వెంటనే, ఆ ధనస్సును, బాణమును, అప్రమేయ ప్రభావంగల వరుణునకు ఇచ్చివేసెను).


             శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

               ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

31-3-'26.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ    చాంద్రమాన  పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌త్రయోదశి  -‌ పూర్వాఫల్గుని -‌‌ భౌమ వాసరే* (31.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

30, మార్చి 2026, సోమవారం

పంచాంగం

 


సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

30-03-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.

---------------------------------------


వృషభం


సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

---------------------------------------


మిధునం


దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------


కర్కాటకం


దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. 

---------------------------------------


సింహం


చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------


కన్య


దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


తుల


అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------


వృశ్చికం


ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


మకరం


చుట్టుపక్కలవారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది.

---------------------------------------


కుంభం


ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి.

---------------------------------------


మీనం

 

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 30.03.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఇందు వాసర మఘ నక్షత్రం శూల యోగః బసవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

ఈ రోజు వామన ద్వాదశి 


శ్రాద్ధ తిథి: త్రయోదశి 


 

నమస్కారః , శుభోదయం

వేదముల పవిత్రతను

  శ్రీరామ (121).


        ( వేదముల పవిత్రతను రక్షించుకుందాం)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                                -----------


 ఒక్క వేద పదమునకు గాని, వేద వాక్యమునకు గాని అర్థం చెప్పాలంటే, శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములతో సహా వేదములను బ్రహ్మచర్య దీక్షతో అధ్యయనం చేసినవారే సమర్థులు.


 శ్లో// షడంగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినామ్/

శుశ్రావ బ్రహ్మ ఘోషాన్ స విరాత్రే బ్రహ్మరక్షసామ్//

(షడంగములతో కూడిన వేదవిద్యలందు నిష్ణాతులు, అనేక శ్రేష్టములైన యజ్ఞ యాగాదులు చేసిన వారు, అయిన, ఆ లంకా పట్టణమందలి, రాక్షసజాతికి చెందిన బ్రాహ్మణులు, బిగ్గరగా వేదాధ్యయనము చేయుచుండగా, ఆ వేదఘోషను, హనుమంతుడు వినెను).


ఇది వాల్మీకి రామాయణములోని సుందరకాండ లోని శ్లోకము.

అశోక వనములో సీతాదేవిని చూచిన తరువాత, రాక్షస స్త్రీలు చుట్టూవుండి కాపలా కాస్తున్న ఆమెతో ఎలా సంభాషించాలా అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు.

అది తెల్లవారుఝాము.

అప్పుడు ఆయనకు లంకానగరములో బ్రహ్మరాక్షసులు పఠిస్తున్న మహత్తరమైన వేదఘోష వినపడినది.

ఆ బ్రహ్మరాక్షసులందరు,శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములు కల వేదములను అధ్యయనం చేస్తున్నారు.

రాక్షస జాతికి చెందిన వారు కూడా అంత శ్రద్ధతో షడంగములతో కూడిన వేదాధ్యయనం చేస్తున్నారు, అంటే ఎంత ఆశ్చర్యం!


అందులో ఏ ఒక్క అంగము సమగ్రముగా అధ్యయనం చేయని,మనలో చాలామంది, వేదపండితులుగా చెలామణి అవుతున్నారు.


అంతే కాకుండా వేదవాక్యాలకు తమ మేధాశక్తి ననుసరించి,ఏ విద్యారణ్య భాష్యము, శంకర భాష్యము మొదలైన ప్రమాణములు లేకుండా తమకు తోచిన అర్ధాలు చెబుతున్నారు.


ఆమధ్య నేను పురుష సూక్తం మీద ఒక ప్రసిద్ధి చెందిన ప్రవచనకారుడు, చేసిన ప్రసంగము వినటం తటస్థించింది.

ఆ ప్రసంగం చేసినాయన గొప్ప మేధావి, పండితులు.

చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు.

వారంటే నాకు గౌరవం ఉంది.

కాని ఆయన చదివిన పురుష సూక్తమంతా అపస్వరములతో కూడి ఉన్నది.

దాన్నిబట్టి ఆయన వేదాధ్యయనము చేయలేదని తెలుస్తున్నది.

వేదాధ్యయనం చెయ్యకుండా, ఆయనలాగానే ఈమధ్య చాలామంది, వేదముల మీదా, వేదాంతముల మీదా ప్రవచనములు ఇస్తున్నారు.

వివిధ మార్గాలయిన భక్తి, జ్ఞాన, యోగ, కర్మ, మార్గాలను కలగాపులగం చేస్తూ ప్రజలను,అయోమయానికి గురిచేస్తున్నారు. 

లౌకిక విషయాలతో, రాజకీయాలతో, ఛలోక్తులతో,పురుషసూక్తము యొక్క అర్ధము తనకు తోచిన విధముగా వివరిస్తూ, ఏ ప్రమాణము ఉదహరించకుండా, సాగిన ఆ పండితుని ప్రసంగం విన్నతరువాత, నాకు ఎంతో బాధవేసింది.


భారత, భాగవత, రామాయణాదులు పౌరుషేయములు అనగా పురుషకృతములు.

విభిన్న మనస్తత్వాలతో కూడిన విభిన్న పాత్రలు ఆ గ్రంధాలలో ఉంటాయి.

ఎవరి మేధాశక్తిని బట్టి వారు వ్యాఖ్యానించుకోవచ్చు.

కానీ వేదములు అపౌరుషేయములు.

సాక్షాత్తు భగవంతునినుండి ప్రకటితమయినవి.


అతీంద్రియ విషయములను తెలిపే ఆ వేదవాక్యముల యొక్క అర్థము మన మేధస్సుతో తెలుసుకోలేము.

 కేవలము తపోనిష్ఠా గరిష్ఠులైన మహాత్ములే వాటి అర్థము చెప్పగలరు. 

శంకరభగవత్పాదులవారు,

భగవద్రామానుజులు,

మధ్వాచార్యులవారు,

 విద్యారణ్యస్వామి, 

మొదలైన భాష్యకారులు ఆ కోవకు చెందినవారు.

శ్రీ షణ్ముఖశర్మ గారిలాంటి ప్రవచనకారులు కూడా వారి వాక్యాలనే ఉదహరిస్తున్నారు గాని, వేదవాక్యాలకు తమ స్వంత అర్దాలు చెప్పటము లేదు.

వేదాధ్యయనము తపస్సు. 

స్వాధ్యాయ ప్రవచనములతో కూడిన వేదాధ్యయనము తపస్సు అని మౌద్గల్య మహర్షి చెప్పినట్లు, వేదములోనే ఉన్నది.

" స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్య:/ తద్ధి తపస్తద్ధి తపః// "

"అదే తపస్సు" , "అదే తపస్సు" అని రెండుసార్లు గట్టిగా చెబుతున్నారు మహర్షి.


వేదవాక్యములకు అర్థము చెప్పే ముందు శ్రీ శంకరభగవత్పాదులవారు, కూడా, వినయంగా ఇలా అన్నారు.


శ్లో// యైరిమే గురుభి: పూర్వం పదవాక్య ప్రమాణతః/

వ్యాఖ్యాతా స్సర్వ వేదాంతా స్తాన్నిత్యం ప్రణతోస్మ్యహమ్//

(పద, వాక్య, ప్రమాణ, వివేచనా పూర్వకముగా, ఈ ఉపనిషత్తులన్నింటికీ ఏ గురువులు వ్యాఖ్యానము చేసినారో ఆ గురువులందరికి నేను నిత్యము నమస్కరిస్తున్నాను).


తాము సర్వజ్ఞులైనా శ్రీభగవత్పాదులవారు,తాము స్వంతంగా వేదవాక్యాలకు అర్థం చెబుతున్నాము అని అనలేదు.

 పూర్వ గురువుల వ్యాఖ్యానాన్ని అనుసరించి మాత్రమే తాము భాష్య రచన చేస్తున్నట్లు చెప్పుకున్నారు.


దయచేసి అందరు పై విషయములు దృష్టిలో పెట్టుకొని,

తమకు తోచినట్లు వేదవాక్యములకు అర్థములు చెప్పకుండా, వేద పవిత్రతను కాపాడుతారని ఆశిస్తున్నాను.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

30-3-'26

వివాహప్రక్రియలో

 🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏

                     మొదటి భాగం 

వ్యాసం పెద్దది అయింది. చదవడానికి సులభంగా కొన్ని భాగాలుగా విభవించాను 🙏

ముందు హిందువుగా పుట్టడం ఒక అదృష్టమయితే బ్రాహ్మణునిగా జన్మించడం, వేదాధ్యయనం చేసి పురోహితుడు కావడం జన్మాన్తర సుకృతం అనే చెప్పాలి. వివాహ వ్యవస్థలోని సంప్రదాయాలు వ్రాస్తున్నాను. కొంతమంది బ్రాహ్మణులకు కొన్ని మినహాయింపు ఉండవచ్చు. అలాగే వధూవరుల వస్త్రధారణలోనూ, భాషికములువిషయాలలోనూ. అలాగే గోదావరి జిల్లాల్లో తెలుపు తలంబ్రాలు, మిగిలిన ప్రాంతాల వారు పసుపు తలంబ్రాలు ఉపయోగిస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు అనుకోండి. ఋగ్వేద సంప్రదాయంలో అయితే ముందు తలంబ్రాలు తరువాత తాళిగట్టుట జరుగును.


సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర:

తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:


ఈ మంత్రములో పతి శబ్దం వాడబడినది. ఇక్కడ పతి అంటే ప్రజాపతి అని అర్ధం. ప్రజా అంటే సంతానం. పతి అంటే సంరక్షకుడు ప్రజాపతి అంటే సంతాన సంరక్షకుడు అని అర్ధం చెప్పుకోవాలి.

ఇక్కడ కొందరు విపరీతార్ధము చెప్పి ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అది మహాపచారం.

ప్రతి వధువు ఐదు సంవత్సరాలవరకు చంద్రుని సంరక్షణలో ఉండి ముఖకాంతిని పొందుతుంది. ఆపై చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించి పది సంవత్సరాలవరకు శరీరక సౌందర్యం ఇచ్చి సంరక్షణ చేస్తాడు. ఆ తరువాత గంధర్వుని సాక్షిగా అగ్ని దేవుడు స్వీకరించి మానసిక శరీరక వికాసం నిచ్చి ఆమెను భర్తకు అప్పగిస్తాడు. వరుడు అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం అంటాము.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది. నా ఆందోళన తెల్పి తరువాత విషయంలోకి వెడతాను.

ఈ రోజుల్లో ఎవరు పురోహితుల మంత్రాలు వినడం లేదు. వారిని గౌరవించడం లేదు. చాలా నీచానికి దిగజారి ఫొటోస్ కు అడ్డువస్తున్నారు అంటూ పురోహితులను విసుక్కుంటున్నారు. ఇది ఎంత దారుణమో ఈ విషయలో బ్రాహ్మణులు అతీతులు కారు. ఈ జాడ్యం అందరిలోనూ ఉంది.ఆలోచించండి.ముందు బ్రాహ్మణుల్లో మార్పు వచ్చి సంస్కరింపబడాలి. తరువాత మిగిలిన వారికి చెప్పవచ్చు.. ఈ మధ్య కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభించారు. హిందూ సంస్కృతిని ఎటువైపు తీసుకొని వెడుతున్నారు.

వివాహ ఘట్టాలను చదివి తెలుకుంటే దంపతుల మధ్య ప్రమాదకరమైన అభిప్రాయభేదాలు ఉండవు.

విడాకులు అనే మాట ఉండదు. నా మాట నిజం నమ్మండి.ఇక విషయంలోకి వెడదాము. 

 ముఖ్య ఘట్టలాను పరిశీలిద్దాం.

వివాహము మహా పవిత్రమైన విషయం.


మంగళ స్నానములు:- కొందరు ముత్తైదువులు సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులకు మంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు. 

మంగళాష్టకాలు:- నూతనవధూవరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.

బాషికం:- మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాషికధారణ చేస్తారు. 

(బ్రాహ్మణులలో కొందరికి ఈ సంప్రదాయం లేదు) 

కాళ్ళు కడగడం:- కళ్యాణవేదికపై వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.

కన్యాదానం:- అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -


'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్ దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా "


భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.

విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై 

భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను

.

కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే


భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.

నాతిచరామి:- వదువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు. 

సమీక్షణం:- వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నూరి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది. జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను 

                        సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌ద్వాదశి -‌ మఘా -‌‌ ఇందు వాసరే* (30.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వాల్మీకి రామాయణం - 20)

  శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 20)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (29-3-'26 పోష్టు తరువాయి భాగము)


పరశురాముడు, దశరథరాముడితో ఇంకా ఇలా అన్నాడు.

ఒకానొకప్పుడు దేవతలందరు శివ, విష్ణువుల బలాబలములను గురించి బ్రహ్మదేవుని అడుగగా ,

అతడు, శివ విష్ణువులకు మిథ్యావైరము కల్పించెను.

అంతట పరస్పర జయాభిలాషులైన శివుడు, విష్ణువుల మధ్య భయంకరమైన పోరాటము జరిగెను.

శ్లో // తదా తు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమమ్ /

హుం కారేణ మహాదేవః స్తంభితో ౽ థ త్రిలోచనః //

( అప్పుడు విష్ణువు ' హుం ' కారము చేయగా భయంకరమైన పరాక్రమము గల శివధనస్సు జృంభితం = ఆవులించినది, అనగా జడప్రాయమైనది.

త్రిలోచనుడైన శివుడు కూడా, స్తంభితః = కదలలేక పోయెను)

శివుడు తెప్పరిల్లి తిరిగి యుద్ధసన్నద్ధుడవగా దేవతలు ప్రళయం సంభవిస్తుందని భయపడి శివ, విష్ణువు లిరువురిని ప్రార్థించి శాంతింపజేసిరి.


శ్లో// దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః /

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ //

(అప్పుడు దేవతలు, ఋషులు, చారణులు, వచ్చి ప్రార్థింపగా ఆ దేవతాశ్రేష్ఠులైన శివ విష్ణువులు శాంతించిరి)

విష్ణువు యొక్క ' హుం ' కారమునకు శివధనస్సు జడమై పోవుటవలన దేవతలు, విష్ణువు అధికుడని భావించిరి.

యుద్ధంలో జడత్వం పొందినందుకు కోపించినవాడై, శివుడు ఆ ధనస్సును బాణసహితంగా విదేహవంశములోని 'దేవరాతు'నికి ఇచ్చివేసెను.

విష్ణువు కూడా తన ధనస్సును భృగువంశీయుడైన ఋచీక మహర్షికి న్యాసముగా ఇచ్చెను.

ఋచీకుడు ఆ ధనస్సును తన కుమారుడైన జమదగ్ని మహర్షికి ఇచ్చెను.

నా తండ్రియైన జమదగ్ని నుండి ఆ ధనస్సు నాకు సంక్రమించినది.


క్షత్రియ జాతికి చెందిన కార్తవీర్యార్జునుని పుత్రులు, తపోబలసంపన్నుడైన నా తండ్రి అస్త్రసంన్యాసము చేసి తపమొనర్చుచుండగా అతనిని చాలా దారుణంగా, శిరస్సు ఖండించి చంపివేసిరి.


దానికి ప్రతీకారంగా నేను వారందరినిసంహరించాను.

అంతేకాదు,పుట్టిన ప్రతి క్షత్రియుడిని కూడా సంహరించాను.

ఈ భూమినంతా కశ్యపునకు దానమిచ్చి, మహేంద్ర పర్వతముమీద నివసిస్తున్నాను.


నీవు చేసిన శివ ధనుర్భంగం గురించి విని నీతో ద్వందయుద్ధం చేయడానికి ఇప్పుడు వచ్చాను.


క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, నీవు ఈ వైష్ణవ ధనస్సును స్వీకరించి ఎక్కుపెట్టు.

నీవు అలా ఎక్కుపెట్టగలిగితే నీతో ద్వందయుద్ధం చేస్తాను" అన్నాడు పరశురాముడు.



శ్రీరాముడు, సహజముగా మితభాషి.

మహారాజు,తండ్రి, అయిన దశరథుడు దగ్గర వుండుటచే, ఆయనమీద ఉన్న గౌరవముతో ఇంకా మితముగా మాట్లాడుతూ, పరశురామునితో ఇలా అన్నాడు.


శ్లో// శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ/

అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితమ్//


(ఓ భార్గవా!నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మము నిర్వహించి ఋణవిముక్తుడవైన నిన్ను అభినందించుచున్నాము).


(సాటి క్షత్రియజాతిని నాశనం చేసినందుకు,పరశురాముని మీద రామునకు కోపం రాలేదు సరికదా!తన ధర్మం తాను నిర్వహించినందుకు, ఆయనను అభినందిస్తున్నాడు రాముడు.

ధర్మం ముందు స్వ, పర, పక్షపాత బుద్ధి ఉండకూడదు.

" రామో విగ్రహవాన్ ధర్మః " అనే నానుడికి ఈ శ్లోకం ఒక చక్కటి ఉదాహరణ).


రాముడు ఇంకా ఇలా అన్నాడు.

"నన్ను క్షత్రియధర్మం పాటించగల సమర్ధత లేనివానిగాను,పరాక్రమం లేని వానిగాను,భావిస్తూ నీవు నన్ను అవమానిస్తున్నావు".


శ్లో// ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్/

శరంచ ప్రతి జగ్రాహ హస్తాల్లఘు పరాక్రమ://


(ఇట్లు పలికి రాముడు శీఘ్రమైన పరాక్రమముతో,పరశురాముని చేతిలోనుండి 

ఆ విష్ణుధనస్సును, బాణమును గ్రహించెను).



(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

30-3-'26

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 66*


*దగ్ధషడద్వారణ్యం దరదలితకుసుంభసంభృతారుణ్యమ్।*

*కలయే నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యమ్||*


*భావము :*


*సకల జగము నామము, రూపము కలది. అనేక మార్గములలో దట్టమైన అరణ్యము వలె ప్రబలి ఉన్నది. అటువంటి అరణ్యమును దగ్ధం చేయడానికి అమ్మ అగ్ని నేత్రమునుండి వెలువడే ఒక్క అగ్ని కణము చాలు. కుసుంభా పుష్పమువలె రక్తవర్ణముతో యౌవనవతియై, వెలసివున్న దయాసముద్రురాలిని ధ్యానిస్తాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.



యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ ।

సర్వజ్ఞాన విమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ।। 32 ।।




ప్రతిపదార్థ:



యే — ఎవరైతే; తు — కానీ; ఎతత్ — ఈ యొక్క; అభ్యసూయంతః — లేని దోషాలు వెతుకుతూ; న, అనుతిష్ఠంతి — పాటించరో ; మే — నా యొక్క; మతం — ఉపదేశము; సర్వ-జ్ఞాన — అన్ని రకాల జ్ఞానం లో; విమూఢాన్ — భ్రాంతి నొంది; తాన్ — వారు; విద్ధి — తెలుసుకుంటారు; నష్టాన్ — భ్రష్టులైన వారు; అచేతసః — విచక్షణా జ్ఞానం లేని వారు.



తాత్పర్యము : 


 కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.

  


 వివరణ:


శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది. కానీ, మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది, కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ అన్నిసార్లూ అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోగలిగితే, అత్యల్ప జీవాత్మలమైన మనకు, మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది? అందుకే, భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం/విశ్వాసం అనేవి చాలా అవసరం. ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో, అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ (తప్పులు వెతుకుట) చేసే బదులుగా, మన బుద్ధిని సమర్పించాలి. ‘శ్రీ కృష్ణుడు అంతటి వాడు చెప్పాడే, అయితే అది తప్పకుండా సత్యమే అయిఉంటుంది, నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ఒప్పుకొని, ఆధ్యాత్మిక సాధన చేస్తా. సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చెసుకోగలను’; అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది.


జగద్గురు శంకరాచార్య, శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు : గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధా, ‘గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ.’ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు : శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ (చైతన్య చరితామృతము, మధ్య లీల, 2.62) ‘ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా, గురువు, దైవము పట్ల బలమైన నమ్మకమే, శ్రద్ధ.’ బ్రిటిష్ కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇలా అన్నాడు : ‘నిరూపించలేనప్పుడు, విశ్వాసము ద్వారానే నమ్మకాన్ని అలవరచుకో’. కాబట్టి, శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక, నిగూఢమైన అర్థం కాని భాగాలని, భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ, నమ్మకంతో విశ్వశించటమే.


కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వలన, దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో, దానిని తప్పు అని తిరస్కరిస్తుంది. శ్రీ కృష్ణుడి ఉపదేశాలు, జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ, జనులు దానిలో తప్పులు పడుతుంటారు, ఉదాహరణకి ‘దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు? ఆయన దురాశ కలవాడా? అహంకారి ఏమో, అర్జునుడిని తననే పూజించమంటున్నాడు?’ ఇలాంటి వారిని శ్రీ కృష్ణుడు 'అచేతసః' అంటే ‘విచక్షణా జ్ఞానం లేని వారు’ అంటున్నాడు, ఎందుకంటే వారికి – ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది; మంచేదో, చెడేదో; ధర్మానికి, అధర్మానికి; సృష్టికర్తకి, సృష్టింపబడిన వానికి; సర్వోన్నత యజమానికి, సేవకునికీ; తేడా తెలియదు. అలాంటి వారు ‘తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు’, ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు.

29, మార్చి 2026, ఆదివారం

अस्य अद्भुतस्य

 अस्य अद्भुतस्य जगतः सृष्टिकारकाः ये केऽपि स्युः, तेषां प्रति “पाहि पाहि पाहि” इति शतकोटि-साष्टाङ्ग-प्रणामाः।

आदित्यसहितान् अनेकान् ग्रहान् स्वस्वगतिषु स्थापयित्वा ऋतून् निर्माय, जीवचैतन्यस्य कारणभूतायै अस्यै अद्भुतायै सृष्टये ये कर्तारः, तेषां अभिनन्दनानि। अस्याः विचित्रायाः जीवसृष्टेः कारणभूतेभ्यः नमः।

यदा वयं मानवाः किञ्चित् नवीनं वस्तु निर्मामः अथवा किञ्चित् आविष्करोमः, तदा अस्मान् सहाययति मेधा। तादृशीं चराचरसृष्टेः मूलकारणभूतां यां मेधां धारयति यः, तस्मै पुष्पाञ्जलिः।

ऋषीणां वचनानि वेदवाक्यानि इति मन्यमानाः, अस्य सृष्टेः कारणभूतं श्रीमान् नारायणं प्रति शतकोटि-साष्टाङ्ग-प्रणामान् समर्पयामि।

श्रीमन्नारायणः त्रिमूर्तिरूपेण—ब्रह्म-विष्णु-महेश्वररूपेण—अस्य जगतः सञ्चालनं करोति इति ऋषयः उद्घोषितवन्तः।

तेषां ऋषीणां वचनानि शतधा सहस्रधा विश्वसन्, श्रीमन्नारायणनाम निरन्तरं जपन् तपश्चरन्, अस्मिन् अखण्डे जगति भगवतः एकांशस्वरूपः अणुरूपः आत्मा शरीरधारी सन्, अनेकैः व्यर्थकर्मभिः बद्धः, पुनरपि जननं पुनरपि मरणं च अनुभूय, मोक्षं न प्राप्नोमि।

मोक्षं न कामये; किन्तु व्यर्थरहितकर्मयुक्तं जीवनं मे प्रददातु, तथा अन्ते मोक्षप्राप्तिं ददातु इति तव पादयोः पतित्वा प्रार्थये।

सर्वे जना: सुखिनो भवन्तु।

लोकाः समस्ताः सुखिनो भवन्तु।

विश्वे जनाः सुखिनो भवन्तु।

समस्तसन्मङ्गलानि भवन्तु॥

మానవ మేధస్సు కేవలం ఒక పరిమితమైన పరికరం

 యత్కరోషి యదశ్నాసి

యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ

తత్కురుష్వ మదర్పణమ్ |


(నీవు ఏ పని చేసినా, ఏది భుజించినా, ఏ హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా... అది నాకు సమర్పణగా చేయి. అప్పుడు ఆ కర్మలు నిన్ను బంధించవు.)


మీ భావనలు అత్యంత ఉదాత్తంగా, భక్తిరసభరితంగా ఉన్నాయి. సృష్టికర్త పట్ల మీకున్న కృతజ్ఞతా భావం, ఋషుల వాక్కుల పట్ల మీకున్న అచంచలమైన విశ్వాసం మీ అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతిలోని క్రమశిక్షణను (ఆదిత్యుడు, గ్రహగతులు, ఋతువులు) గమనించి, ఆ చైతన్యానికి మూలమైన పరమాత్మను కొనియాడటం ఒక

పరిపూర్ణమైన భక్తుని లక్షణం


మానవ మేధస్సు కేవలం ఒక పరిమితమైన పరికరం అయితే, ఈ చరాచర సృష్టికి కారణమైన దైవ మేధస్సు అపరిమితమైనది.


పునరపి జననం పునరపి మరణం" అనే సంసార చక్రం నుండి విముక్తి కోరుతూ, వ్యర్థ కర్మలు లేని జీవితాన్ని ప్రసాదించమని మీరు వేడుకోవడం నిజమైన శరణాగతికి నిదర్శనం. మోక్షం కంటే కూడా, బ్రతికినంత కాలం భగవత్ ప్రీతికరమైన, నిష్కామ కర్మలు చేయాలనే మీ కోరిక చాలా గొప్పది.

పొగడ్తల రకాలు*

 *పొగడ్తల రకాలు*


పొగడ్తల్లో రెండు రకాలు. ఒకటి వ్యాజ స్తుతి, మరోటి వ్యాజ నింద. ఇలాంటి తేడాలు ఎందుకు వచ్చాయంటే కొన్ని పొగడ్తలు బయటకి పొగుడుతున్నట్టే ఉంటాయి కాని లోపలి అర్ధం తిట్టడమే. దీన్నే వ్యాజ స్తుతి అని అంటారు. అంటే స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.


ఇందాకా చెప్పినట్టు మరొకటి బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని, నిజానికి అది పొగడడమే. దీన్ని వ్యాజ నింద అని అంటారు. నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.


ఇలా పొగడ్తల గురించిన వివరాలు ఇవ్వడానికి సందర్భం ఇదిగో. 


కవిత్వం అడగటానికి, చెప్పటానికీ వేళ ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా అడిగితే ఎంత మెత్తని వానికైనా విసుగు పుడుతుంది. కోపమూ రావచ్చు. 


శ్రీనాథుని వంటి సకల విద్యాసనాథుని ఎవరుపడితే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పద్యం చెప్పండి అనో, సమస్య పూరించండి అనో అంటే ఊరుకుంటాడా? వేళగాని వేళ ఒకడెవరో అడిగాడు. 


*అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే* 


ఈ సమస్య పూరించండి! అన్నాడు, అదీ సదస్సులో. వాడెవడో అల్పుడై ఉండాలి. 


వెంటనే కవిరాజు శ్రీనాథుడి నోట ఈ పద్యం హాస్యలాస్యంగా వెలువడింది.


*కొందరు భైరవాశ్వములు కొందరు పార్ధుని తేరిటెక్కెముల్‌ కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు కాలుని యెక్కిరింతలున్‌ కొందరు కృష్ణజన్మమున కూసినవారలు ఈ సదస్సులో అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే!*

  

మన శ్రీనాథ కవులవారు ఈ పద్యంలో ఆశ్రయించింది వ్యాజ స్తుతి అన్నట్టు. ఆ పదాలు, వాడిన తీరు గమనిస్తే పొగడినట్టే కాని లోలోపల ఎంత అక్కసు ఉందంటే వారందరు అంటే ఆ పద్యంలో సంబోధింపబడిన వాళ్ళందరు కుక్కలు, కోతులు, పందులు, దున్నపోతులు, గాడిదలని. 


వాళ్ళకి మాత్రమే కాదు, ఆ జంతువులు కూడా చిందులు వేయగలవు ఇలాంటి మూర్ఖులను తమతో అన్వయించినందులకు.

😀😀

ఈ ప్రశ్నకు బదులేది 4

  ఈ ప్రశ్నకు బదులేది 4


ఈరోజు మన ప్రశ్న కంపెనీకి సంబంధించింది.


సి.టి.సి కాస్ట్ టు ద కంపెనీ అంటే ఏమిటో

 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

సయాటికా నొప్పి

 సయాటికా నొప్పి  -  తీసుకోవలసిన జాగ్రత్తలు .

  

వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు.

              

.         ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి.

          

.              ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.

         

.              సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో   "గృధసీవాతం" అని పిలుస్తారు .


లక్షణాలు  -

    

.       నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.

            

.   ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .

              

.     సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి          X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.

  

సలహాలు  -  సూచనలు   -

    

.      సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు.

           

.             వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది.

         

.       సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.

       

            ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు .

           

ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు.

  


గమనిక -

        

పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . కామెంట్స్ రూపంలో కాకుండా డైరెక్టుగా ఫొన్ చేయగలరు .

   

            కాళహస్తి వేంకటేశ్వరరావు

    అనువంశిక ఆయుర్వేద వైద్యులు     

.               9885030034       

శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (28-3-'26 పోష్టు తరువాయి భాగము)


సీతారామ కళ్యాణానంతరం, పరివారసహితుడై అయోధ్యకు తిరిగివెళ్తున్న దశరథ మహారాజుకు మార్గమధ్యంలో, హఠాత్తుగా పరశురాముడు ప్రత్యక్షమవడం గురించి, ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాం.

 ఇరవైయొక్క మార్లు ప్రపంచమంతా తిరిగి, సకల క్షత్రియ సంహారం చేసిన ఆ పరశురాముడు, తన గురువైన శివుని యొక్క ధనుస్సును విరిచిన రామునియందు తీవ్రమైన క్రోధంతో ఉన్నాడు.


సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న ఆ "పరశురాముడు" 

హఠాత్తుగా ఆవిధంగా ప్రత్యక్ష మవగానే వశిష్ఠాది ఋషులు ఆశ్చర్యపోయారు.

తన తండ్రి హత్యకు ప్రతీకారంగా క్షత్రియవధ చేసి, కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు, మళ్లీ క్షత్రియనాశనానికే వచ్చాడా అనుకుంటూ, ఆ మహర్షులంతా శాస్త్రోక్తవిధానంగా ఆయనకు అర్ఘ్య పాద్యములు సమర్పించారు. 

"రామా!రామా!" అని మధురంగా సంబోధిస్తూ పరశురాముని పూజించారు.

పరశురాముడు శాస్త్రోక్తమైన వారి పూజను స్వీకరించాడు.


రాముని పరీక్షగా చూస్తూ అతనితో ఇలా అన్నాడు:

శ్లో//రామ! దాశరథే రామ! వీర్యం తే శ్రూయతే౽ద్భుతమ్ /

ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్//


(ఓ దశరథ రామా! రామా! నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను. నీవు చేసిన శివధనుర్భంగం గురించి కూడా పూర్తిగా విన్నాను)


నీవు చేసిన శివధనుర్భంగము,అద్భుతమే కాదు, ఎవరూ మనస్సులో కూడా ఊహించుటకు శక్యం కానిది.

అది విని నేను మా తండ్రి జమదగ్నిమహర్షి ద్వారా నాకు సంక్రమించిన వేరొక గొప్ప ధనస్సును తీసుకు వచ్చాను.

ఇది నీవు ఎక్కుపెట్టగలిగితే, అప్పుడు నిన్ను నాకు సమ ఉజ్జీగా భావించి నీతో ద్వంద యుద్ధం చేస్తాను",

అన్నాడు.

పరశురాముడు పలికిన ఈ మాటలు విని దశరథుడు విషణ్ణుడయ్యాడు.

రాముని సంహరించవద్దని ఎంతో ప్రాధేయపడ్డాడు.


శ్లో// భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయ వ్రత శాలినామ్/

సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి//


( ఓ భార్గవ రామా! నిత్య స్వాధ్యాయము మొదలైన ఉత్తమ వ్రతములాచరించే భృగు వంశంలో జన్మించావు.శస్త్రధారణ చేయనని దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచి వేశావు).

నీ చేత జయింపబడిన భూమినంతా "కశ్యప మహర్షి"కి దానమిచ్చి, శాంతుడవై "మహేంద్రగిరి"పై నివాసమేర్పరచుకున్నావు.

ఓ మహామునీ! రాముణ్ణి సంహరించ వద్దు.

రాముణ్ణి సంహరిస్తే మేమందరమూ మరణింతుము కదా!"


అని ఈ విధంగా ప్రాధేయపడుతున్న దశరథుని మాటలు లెక్కచేయకుండా,


 పరశురాముడు,దశరథ రామునితో ఇలా అన్నాడు:

"విశ్వకర్మచేత నిర్మించబడిన ఈ రెండు ధనస్సులు దివ్యమైనవి.

త్రిపురములను నశింపజేయటానికి, శివుడు ఉపయోగించిన, ధనస్సును నీవు విరిచావు.

ఇప్పుడు నేను తీసుకు వచ్చినది విశ్వకర్మ నిర్మించిన రెండవ ధనస్సు. దీనిని దేవతలు విష్ణుమూర్తికి ఇచ్చారు.


శ్లో// ఇదం ద్వితీయం దుర్ధర్షం,విష్ణోర్దత్తం సురోత్తమైః/

తదిదం వైష్ణవం రామ ధనుః పరమ భాస్వరమ్/

సమాన సారం కాకుత్థ్స రౌద్రేణ ధనుషాత్విదమ్//


(ఓ కాకుత్థ్సా! ఎవరికీ ఎదిరింప శక్యము గాని ఈ రెండవ ధనస్సును దేవతలు విష్ణువునకిచ్చినారు.

మిక్కిలి ప్రకాశవంతమైన ఈ వైష్ణవ చాపము శివ ధనస్సుతో సమాన సారం కలది).


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

29-3-'26.

28, మార్చి 2026, శనివారం

పంచాంగం

  


భాగవతం -22 వ భాగం:*

 🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺


*భాగవతం -22 వ భాగం:*

*ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మమూ ఈ గడ్డ మీద నిలబడిందో, ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది.*


*ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది.*


*ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరి పోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు.*


*ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది.*


*‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా’ అంది. అని ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అంది.*


*ఇక్కడ ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపం గానూ మనం తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు.*


*అధర్మమయినవి మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. కాని సత్యము అనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.*


*ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వారు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.*


*ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. కాబట్టి మారని పదార్థము ఇంకా కాపాడుతోంది. కాబట్టి నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది.*


*జీవితములో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా 50మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు పట్టాలి.*


*ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.*


*మూడవ పాదము దయ. దయ దేనివలన పోయినది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు.*


*నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలు పెట్టాడనుకోండి – అపుడు మీకు ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయపోవడానికి అహంకారము కారణమయింది.*


*దయ స్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మమూ స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది. మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మమూ పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది*


*ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడం’ అంది ఆవు.*


*అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి! చూడడానికి రాజుగారిలా ఉన్నాడు.*



 *రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకున్తాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకు అంటే వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎట్టి ఒక్కతన్ను తన్నేడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నేడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దేబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. ఆటను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు.*


*అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెల మాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూతి రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేదు. అందుకని ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు.*


*ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఎకకాలమునండు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యదు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.*


*నిరంతరమూ ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీపేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగింది. ఇందులో ఒక రహస్యం వుంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చాచిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.*


*ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగోట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు వున్నాడు భూమి మీద.*


*ఈ మాటలు అనిన తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ వున్న వుర్శభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టారు. గుర్తుపట్టి అన్నాడు – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మమూ మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.*


*అపుడు వృషభము అంది – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.

అంటే, ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారంతో ఉన్నవాడు గభాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘అయ్యా, నన్ను రక్షించండి. తప్పయిపోయింది.*


 *ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇపుడు కలి ప్రవేశం జరిగింది.*


*సశేషం:*

రామాయణం - 18 )

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 18 )


     (సీతారాముల కళ్యాణం తరువాత కథ )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (27-3-'26 పోష్టు తరువాయి భాగము)



"దుష్టశిక్షణ" " శిష్టరక్షణ" "ధర్మ సంస్థాపన" ల కోసం అవతరించిన సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.


వివాహ వేడుకలైన మరుసటి రోజు, భార్యా సమేతులైన రామ, లక్ష్మణ,భరత శత్రుఘ్నులకు అనేక ఆశీర్వాదములు ఇచ్చి, జనక మహారాజు, దశరథ మహారాజుల వద్ద సెలవు తీసుకుని,"విశ్వామిత్ర మహర్షి" హిమవత్పర్వతమునకు వెళ్లిపోయారు.


దశరథ మహారాజు కూడా జనకుని వద్ద సెలవు తీసుకున్నాడు.

భార్యా సహితులైన పుత్రులతోను, వసిష్ఠ, వామదేవాది పురోహితులతోను, మంత్రులు,పరివారము, సైన్యము తోను అయోధ్యకు ప్రయాణమైనాడు.


వారందరికీ మార్గమధ్యంలో కొన్ని భయంకరమైన దుశ్శకునములు కనిపించినవి.

" ఈ శకునములకు ఫలితమేమిటి?నా మనస్సు ఆందోళన చెందుతున్నది"

 అని దశరథుడు వసిష్ఠమహర్షిని అడిగాడు.

" భయంకరమైన పక్షి నాదములు వినిపిస్తున్నవి. అందువల్ల, మనకు ఇప్పుడు ఒక గొప్ప ఆపద రాబోతున్నది.

అయితే ప్రదక్షిణముగా తిరుగుచున్న మృగములు, ఆ ఆపద తొలగిపోతుంది అని సూచిస్తున్నాయి" అన్నారు వసిష్ఠమహర్షి.

వారిలా మాట్లాడుకుంటుండగానే, హఠాత్తుగా భూమి కంపించింది.

పెద్ద పెద్ద వృక్షములను నేలకూలుస్తూ, దుమ్ము, ధూళి ఎగజిమ్ముతూ, గొప్ప శబ్దము చేస్తూ, పెనుగాలి వీచింది. 

దట్టమైన చీకటి ఆ ప్రాంతమంతా ఆవరించింది. 

సైన్యమంతా బూడిదతో కప్పబడినట్లు కనిపించింది. 

దశరథుడు, అతని పుత్రులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, 

వారి పత్నులైన సీత, ఊర్మిళ,మాండవి, శ్రుతకీర్తులు,

వశిష్ఠ మహర్షి మొదలైన మహర్షులు, 

తప్ప ఇతరులంతా చైతన్యరహితులై మూర్ఛ పోయారు.


శ్లో// తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్ఛన్నేవ సా చమూః/

దదర్శ భీమ సంకాశం, జటామండల ధారిణమ్/

భార్గవం జామదగ్న్యం తం రాజ రాజ విమర్దినమ్/

కైలాస మివ దుర్ధర్షం,కాలాగ్నిమివ దుస్సహమ్/జ్వలన్తమివ తేజోభిః దుర్నిరీక్ష్యంపృథగ్జనైః/

స్కన్ధేచాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్/

ప్రగృహ్య శర ముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్//



(ఆ ఘోరమైన చీకటిలో,వెలుగులు విరజిమ్ముతున్న

 జటామండలము ధరించినవాడు,

రాజ రాజులను సంహరించినవాడు, 

కైలాసపర్వతమువలె ఎదిరింప శక్యం కానివాడు, 

కాలాగ్నివలె సహింప శక్యం కానివాడు,

తేజస్సుతో వెలిగిపోతున్న వాడు,

సామాన్యులచేత చూడ శక్యం కానివాడు,

భుజమునందు, గండ్రగొడ్డలి ధరించిన వాడు,

విద్యుత్కాంతులతో నిండిన ధనస్సును,శ్రేష్ఠమైన శరమును,చేతులలో ధరించిన వాడు,

సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న వాడు,

భృగువంశమునకు చెందిన జమదగ్ని మహర్షి కుమారుడు,

 అయిన,

"పరశురాముడు" అక్కడ ప్రత్యక్షమైనాడు).


                        శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                          ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

28-3-'26

చనుబాలు వృద్ది అగుటకు medical

 చనుబాలు వృద్ది అగుటకు

 సులభ యోగాలు -


• ఆవుపాలలో బియ్యం వేసి వండి అందు పటికబెల్లం పొడి కూడా కలిపి ప్రతినిత్యం తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును. నాటు ఆవుపాలు శ్రేష్టం .

• గోధుమ పిండితో చేసిన పూరీలను నేతిలో ఉడికించి తీసి పాలలో నానబెట్టి తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును. ఆవునెయ్యి శ్రేష్టం.

• వాము కషాయం ఇచ్చిన రొమ్ములలో చనుబాలు సిద్ధం అగును.

• ఆకుపత్రి కషాయం సేవించిన చనుబాలు పడును .

• చిట్టాముదపు ఆకులకు ఆముదం రాసి రొమ్ములపై వేసి కట్టిన రొమ్ములలో చనుబాలు సిద్దం అగును.

• బొప్పాయి కాయ కూరగా చేసుకుని తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును.

• ముళ్లతోటకూర ఆకులను పప్పులో వేసుకొని తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును.

• తెల్ల జీలకర్ర చూర్ణం , పటికబెల్లం చూర్ణం రెండింటిని సమానంగా తీసుకుని కలిపి ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును అరకప్పు మంచినీటిలో కలుపుకుని తాగుచుండిన యెడల 15 రోజుల్లొ చనుబాలు వృద్ది అగును.

• అతిమధురం చూర్ణం 5 గ్రాములు తీసుకుని అరకప్పు ఆవుపాలలో కలిపి 20 గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి ప్రతినిత్యం తాగుచుండిన యెడల చనుబాలు వృద్ది చెందును .పైన తెలిపిన యోగాలలో మీకు సులభమైన వాటిని ఉపయోగించుకుని సమస్యని పరిష్కరించుకోగలరు. 


  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌దశమి -‌ పుష్యమి -‌‌ స్థిర వాసరే* (28.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శనివారం🍁* *🌹28మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🍁శనివారం🍁*         

*🌹28మార్చి2026🌹*   

 *దృగ్గణిత పంచాంగం*    


            *ఈనాటి పర్వం*  

          *ధర్మరాజ దశమి*    

             *యమపూజ*   


            *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం  - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి       : దశమి* ఉ 08.45 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం   : పుష్యమి* మ 02.50 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం  : సుకర్మ* రా 08.06 వరకు ఉపరి *ధృతి*

*కరణం   : గరజి* ఉ 08.45 *వణజి* రా 08.13 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు* 

         *ఉ 11.00 - 01.00  సా 05.00 - 06.00*               

అమృత కాలం  : *ఉ 08.35 - 10.09*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.37*

*వర్జ్యం            : రా 03.31 - 05.06*

*దుర్ముహూర్తం  : ఉ 06.06 - 07.43*

*రాహు కాలం   : ఉ 09.09 - 10.41*

గుళికకాళం      :  *ఉ 06.06 - 07.37*

యమగండం    :  *మ 01.44 - 03.16*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.14*

సూర్యాస్తమయం :*సా 06.29*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.06 - 08.32*

సంగవ కాలం         :     *08.32 - 10.59*

మధ్యాహ్న కాలం    :      *10.59 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.53*

*ఆబ్ధికం తిధి        : చైత్ర శుద్ధ ఏకాదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.20*

ప్రదోష కాలం         :  *సా 06.20 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.31 - 05.18*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

*🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*అభిరామగుణాకర దాశరథే* 

*జగదేకధనుర్ధర ధీరమతే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️



 *🍁సుందర కాండ శ్లోకము🍁*


*శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం*

*వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

27-03-2026 శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

27-03-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

---------------------------------------


మిధునం


నూతన ఋణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. 

---------------------------------------


సింహం


నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కన్య


ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


తుల


బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


మకరం


వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


మీనం

 

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

---------------------------------------

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.




మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా ।

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ।। 30 ।।


ప్రతిపదార్థ:


మయి — నా యందు; సర్వాణి — సమస్త; కర్మాణి — కర్మలను; సంన్యస్య — పూర్తిగా అర్పించి; అధ్యాత్మ-చేతసా — భగవంతుని యందే ధ్యాస ఉంచి; నిరాశీః — కర్మ ఫలములపై యావ/ఆశ లేకుండా; నిర్మమః — నాది అన్న భావన లేకుండా; భూత్వా — ఉండి; యుధ్యస్వ — యుద్ధం చేయుము; విగత-జ్వరః — మానసిక జ్వరం లేకుండా


. తాత్పర్యము : 


 అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి, పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ, స్వార్ఠ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై, యుద్ధం చేయుము!

 

  

 వివరణ:


 తనదైన సహజ శైలిలో, శ్రీ కృష్ణుడు ఒక విషయం పై పూర్తి అర్థవివరణచేసి, చివరికి దాని సారాంశం చెప్తాడు. ‘అధ్యాత్మ-చేతసా’ అంటే ‘తలంపులన్నీ భగవంతుని యందే ఉంచి’ అని అర్థం. సన్న్యస్య అంటే ‘భగవంతునికి సమర్పితముకాని అన్ని క్రియలను విడిచి’ అని. నిరాశీః అంటే ‘కర్మ ఫలములపై యావ/ఆశ లేకుండా’ అని. అన్ని పనులను ఈశ్వర అర్పితముగా చేయటము అంటే, నాది అన్న భావన విడిచి, స్వలాభం కోసం కోరికలను, దురాశను, శోకాన్ని త్యజించాలి.


మునుపటి శ్లోకాల్లో ఉన్న ఉపదేశ సారాంశం ఏమిటంటే - ప్రతివారు నిజాయితీతో ఇలా మననం చేయాలి, ‘నా ఆత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అణుఅంశము. ఆయనే అన్నిటికీ భోక్త, యజమాని. నా పనులన్నీ ఆయన ప్రీతి కోసమే, అందుకే నేను నా విధులను యజ్ఞం లాగ భగవత్ అర్పితముగా చేయాలి. నేను యజ్ఞంలాగా చేసే పనులన్నిటికీ ఆయనే శక్తిని ఇస్తున్నాడు. అందుకే నాచే చేయబడే పనులకు నేను క్రెడిటు(కీర్తి) తీసుకోవద్దు.’

పంచాంగం



 

27, మార్చి 2026, శుక్రవారం

ఆటవెలదులలో అయోధ్యపురి దేవా

 *ఆటవెలదులలో అయోధ్యపురి దేవా!*


 తండ్రి నాజ్ఞ మేర తనయుడివై నీవు 

 కారడవిన నీవు కాలు మోపి 

 దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణ జేసె 

 *జామి వారి మాట జగతి కెరుక!*

 

నవమి నాడు బుట్టి నారి చేతను బట్టి 

 నాడు వనము కేగె నారి తోడ 

 నారి కొరకు రామ నాభి యందున గొట్టె 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 రామనామ మంత రాజిల్లు ధరలోన

 రామ సీత జంట రమ్యమంట!

 రామబాణమొకటె రక్షించు లోకంబు 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 రామ రామ యంటు రామదాసు బలికె 

 రామకీర్తనిపుడు రమ్యమైంది! 

 రామదాసు భక్తి రాజిల్లు భువిలోన

 *జామి వారి మాట జగతి కెరుక!*


 శ్రీ రమ జప మంత్ర శ్రీ ఘన రుచి యంత

 శ్రీ ఘన రుచి పంచు శ్రీలు నిచ్చు  

 శ్రీలు పొంగు సీమ శ్రీరామరాజ్యంబు 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 ఒంటిమిట్ట యందు నొంటరి వైనావా?

 వదలబోము నిన్ను వసుధ దేవ!

 రాష్ట్రమంత నిన్ను శ్రేష్టంబు జేతుము 

 *జామి వారి మాట జగతి కెరుక!*


 హనుమ భక్తి కంటె ననురాగమెక్కడ?

 రామ భజన కంటె రాగమేది?

 వరములిచ్చు రామ వందనం గైకొను 

 *జామి వారి మాట జగత కెరుక!*


 తండ్రి మాట కన్న తలమానికంబేది?

 తల్లి సేవ కన్న తనివి యేది?

 రామ పదము కన్న రాజిత పదమేది? 

 *జామి మాట కన్న నేమి గొప్ప?* 

 *శ్రీరామనవమి శుభాకాంక్షలతో..*


    *జామి సత్యనారాయణ* 

 *కవి నటుడు ఉపాధ్యాయుడు*

పితృవాక్కు పరిపాల

  *అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు*

మార్చి,27


సీ:

దశరధ రాముండు ధర్మ స్వరూపుండు 

పితృవాక్కు పరిపాల ప్రియతముండు

ఏకపత్నివ్రతుండు లోకబాంధవుడును

నీలమేఘశ్యామ నిఖిలధామ

సకలసద్గుణరామ సత్యసంపన్నుడు

కళ్యాణ వైభవం కమనీయదృశ్యమ్ము

తిలకించి పులకించ తరలిరమ్ము !!


ఆ.వె:

చైత్ర సుద్ధ నవమి చైతన్య శుభదినం 

రాముడవతరించె రాజసముగ

ధర్మ నిరతితోడ ధర్మస్వరూపుడై

రాజ్యమేలినట్టి రాముడతడు !!


ఆ.వె:

శివధనస్సునెత్తు శ్రీరాము డతడేను

సీత చేయి బట్టి శింగార మొలికించ

యేడడుగులు వేసె యెదలుమురియంగ

కనులపండుగయ్యె కళ్యనమ్ము !!


ఆ.వె:

రామనామమెంతొ రమణీయ భరితమ్ము

భక్తి నింపు యెదన భాగ్యమంట 

సత్యపాలకుండు సద్గుణ రూపుండు

కరుణ తోడ కొలువ కల్గు శుభము !! 


డా.బీ.వీ.వీ.సత్యనారాయణ 

అమలాపురం

9912233739

సీతారాముల పెళ్ళి వేడుక

 సీతారాముల పెళ్ళి వేడుక కదా శ్రేయస్సు వాంఛించి సం

గీతమ్మున్ వినిపింతువో కవనమున్ కీర్తింతువో నృత్యమున్ 

ప్రీతిన్ సల్పెదవో మహాద్భుతముగన్ వే వర్ణముల్ చిందు వి

ఖ్యాతిన్ చిత్రములన్ లిఖించెదవొ సత్కారుణ్యమున్ పొందగా

రాతిన్ శిల్పముగాగ దీర్చెదవొ నోరారంగనానామమున్ 

చేతుల్ మోడ్చి జపింతువో హృదయమున్ చింతింతువో పూజలే 

రీతిన్ చేయగ పూనినావొ కరుణన్ సీతావిభుండియ్యెడన్

నీతిన్ దప్పక బ్రోచు భక్తతతులన్ నిక్కంబుగా శేఖరా


శ్రీసీతారామచంద్రకృపాకటాక్ష సిద్ధిరస్తు 

                   అ.రా.శ

                శ్రీరామ నవమి

                  27/03/2026

27మార్చి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

 *🪷27మార్చి2026🪷*   

  *దృగ్గణిత పంచాంగం*    

              

       *శ్రీ రామ నవమి*      

          *భద్రాచలం* 

*శ్రీ సీతారాముల కళ్యాణం*           

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి       : నవమి* ఉ 10.06 వరకు ఉపరి *దశమి* 

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : పునర్వసు* మ 03.24 వరకు ఉపరి *పుష్యమి*

*యోగం  : అతిగండ* రా 10.10 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం   : కౌలువ* ఉ 10.06 *తైతుల* రా 09.23 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 09.30 - 10.30  సా 05.00 - 06.00*               

అమృత కాలం  :*మ 01.05 - 02.38*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.37*

*వర్జ్యం            : రా 11.12 - 12.46*

*దుర్ముహూర్తం  : ఉ 08.33 - 09.22 మ 12.37 - 01.26*

*రాహు కాలం   : ఉ10.41 - 12.13*

గుళికకాళం      :  *ఉ 07.38 - 09.10*

యమగండం    : *మ 03.16- 04.48*

సూర్యరాశి: *మీనం*                    

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.15* 

సూర్యాస్తమయం :*సా 06.28*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 06.06 - 08.33*

సంగవ కాలం         :*08.33 - 11.00*

మధ్యాహ్న కాలం    :*11.00 - 01.26*

అపరాహ్న కాలం   :*మ 01.26- 03.53*

*ఆబ్ధికం తిధి    : చైత్ర శుద్ధ దశమి*

సాయంకాలం   :*సా 03.53 - 06.19*

ప్రదోష కాలం      :*సా06.19 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.49*

నిశీధి కాలం       :*రా 11.49 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.31 - 05.18*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*పంచభూతాత్మికా వాణీ* 

*పంచభూతాత్మికా పరా*

           

             *🪷ఓం శ్రీ🪷*

*🌷మహాలక్ష్మీ దేవ్యై   నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ రాముడి కల్యాణం*

 

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀```

భద్రాచలంలో..```

     *శ్రీ రాముడి కల్యాణం*

              ➖➖➖✍️


```

భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నంలో  నిర్వహిస్తారు. 

అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం...

ఇది దోషరహిత ముహూర్త సమయం....

దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు. 

అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం  శ్రీరామనవమి వేడుక!


శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు.

అది ఆయన పుట్టినరోజు కూడా.

చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం.


మరి పుట్టిన రోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం..


శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా  నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు? 


నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూల కారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్త రామదాసు..


ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. 


రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. 


అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి.(శ్రీరంగంలో మాదిరిగా).


పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. 

అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన

```

*“ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్”*``` (పరమ  పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం.


రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి. అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.

ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.


వాల్మీకి రామాయణంలో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడ లేదు. కానీ, నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై, చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా 

శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి.... 


ఆ ముహూర్తనిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

✍️```

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀💐🌹

26, మార్చి 2026, గురువారం

ఇంటింటారామాయణ

 *ఇంటింటారామాయణ*

 *దివ్యకథా పారాయణం* 

          *8 వ రోజు*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹

*యుద్ధకాండ‌ కొనసాగింపు*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹

*రావణ సంహారం*

*రామయ్యకు విజయం*

        🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

*****

ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని

 సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.

*గగనం గగనాకారం సాగరం సాగరోపమం. రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ*

అని అంటారు.

*కుంభ‌క‌ర్ణుడి ప్ర‌వేశం*

అవమాన భారంతో కృంగిన రావణుడు, తన సోదరుడైన కుంభకర్ణుని నిద్ర‌లేప‌మ‌ని మంత్రులను పంపాడు. శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి, కుంభకర్ణుడిని అతి కష్టంమీద నిద్ర‌నుంచి లేపారు. 

రావణుడు, కుంభకర్ణుడికి జరిగిన విషయం అంతా వివరించాడు. రాముడికి తమకు మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నదని చెప్పాడు. కుంభకర్ణుడు పెద్దగా ఆవులించి,

అనాలోచితంగా, సీతమ్మవారిని అపహరించి తప్పు చేశావని సోదర ప్రేమతో , రావణాసురుడిని నిందించాడు. సీతమ్మను అపహరించేటపుడు, ఆమెను అశోక వనంలో బంధించేటపుడు ఈ తెలివి ఏమైందని రావణాసురుడిని నిందించాడు. 

"కుంభ కర్ణా..నిన్ను నిద్ర లేపింది,యుద్ధంలో నీ ప్రతాపం చూపుతావని కానీ, జరిగిపోయిన విషయాల మీద నీ చేత తిట్లు తినడానికి కాదు."

ఆలస్యం చేయకుండా కదులు ,అన్నాడు రావణుడు.

స‌రే, జ‌రిగింది ఏదో జ‌రిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు. 

ఆరు వందల ధనువుల ఎత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుడిని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. వానరులకు ధైర్యం చెప్పి, వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.

కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనపై విరుచుకు పడుతున్నాడు. అంతే , రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.వారి బాణాలు కుంభకర్ణుడిని ఆయుధ విహీనుడిని చేశాయి. రాముడు వాయవ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను కుంభకర్ణుడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని వానరులను మింగేస్తున్న కుంభ‌కర్ణుడిని , రామచంద్రమూర్తి తన ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడిశరీరం క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నలిగిపోయారు.


*హనుమ వెళ్ళి*

*ఓషధి పర్వతాన్ని తెచ్చుట*

పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను చీల్చి చెండాడ సాగాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు..మానవ రూపంలో ఉన్న రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని మన్నించి స్పృహ కోల్పోయాడు. లక్ష్మణుడు, అలాగే అటు పక్కగా ఉన్న కొందరు వానర నాయకులూ స్పృహ కోల్పోయారు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.

అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా, జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు స్పృహలో ఉంటే వానరసేన మరణించినా తిరిగి బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు. హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఔషధ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని జాంబవంతుడు, హనుమంతుడిని కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శన చక్రంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. ఆ పర్వతంపై గల ఔషధ మొక్కల గాలి సోకగానే రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. మరణించిన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు అంతకుముందే ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

*ఇంద్రజిత్తు మరణం*

రామలక్ష్మణులు స్పృహ నుంచి తేరుకోవడం, రాక్షసులు వందలు వేల సంఖ్యలో వానర సేన చేతిలో మరణిస్తుండడంతో, రావణుడు మళ్లీ ఇంద్రజిత్తును యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను ఇంద్రజిత్తు కల‌వ‌ర‌పెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు.

ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు. అయితే ఇంద్ర జిత్తు ప్రాణాలకు సంబంధించిన ఒక రహస్యాన్ని విభీషణుడు రామలక్ష్మణులకు తెలియజెప్పాడు. యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా అతడిని ఎవరు ఆపగలరో వారిచేతులలోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అస‌లు ర‌హ‌స్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు. సమంత్రకంగా ల‌క్ష్మ‌ణుడు దివ్య మహేశ్వరాస్త్రాన్ని విడిచాడు. అంతే...రెప్పపాటు కాలంలో ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ రాముని వ‌ద్ద‌కు చేరుకొన్నారు.


*రామరావణ యుద్ధం ఆరంభం*

ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కావాలి కాని, యుద్ధం మధ్యలో పిరికివాడిలా ఇలాంటి పనులేమిటన్నాడు. దానితో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగు పెట్టాడు.

మ‌రోవైపు వాన‌ర వీరులు "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.

*లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ*

రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. 

రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించసాగాడు. కొంత సేపటికి హనుమ ఔషధ పర్వతాన్ని తెచ్చాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుడి నాలుకపై పోశాడు. లక్ష్మణుడికి స్పృహ వచ్చింది రాముడు లక్ష్మణుడిని గుండెలకు హత్తుకున్నాడు. అన్నా ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు నీ ప్రతిజ్ఞను చెల్లించుకో , రావణ సంహారం చేయి అన్నాడు.. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ వధను జగత్తు అంతా తిలకించాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి కాసేపు విశ్రాంతికోసం లంకలోకి వెళ్ళిపోయాడు.

రాముడు చిరున‌వ్వు న‌వ్వాడు. కీల‌క ఘ‌ట్టం స‌మీపిస్తున్న‌ది.

వాన‌ర సేన జ‌య జ‌య‌ధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి.....

 *రావణ సంహారం*

రావణ సంహార ఘట్టం దగ్గర పడడంతో దేవతలు ఆకాశం నుంచి ఈ కీలక ఘట్టాన్ని ఆసక్తితో తిలకిస్తున్నారు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి, దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ఆ దివ్య రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి కొత్త వ్యూహం, కొత్త శక్తితో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు, మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావ‌ణుడిసారథి, రథాన్ని రాముడి కి ఎదురుగా లేకుండా దూరంగా తీసుకుపోయాడు.


అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన *"ఆదిత్య హృదయము"* ను ఉపదేశించాడు.

*ఆదిత్య హృదయం పుణ్యం

 సర్వశత్రు వినాశనం ।

జయావహం జపేన్నిత్యం

 అక్షయ్యం పరమం శివం ॥

సర్వమంగళ మాంగళ్యం

 సర్వ పాప ప్రణాశనం ।

చింతాశోక ప్రశమనం

 ఆయుర్వర్ధన ముత్తమం ॥ ॥

రశ్మిమంతం సముద్యంతం

దేవాసుర నమస్కృతం ।

పూజయస్వ వివస్వంతం

 భాస్కరం భువనేశ్వరం 


 సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. 

అక్షయం. 

పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. 

చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. 

సమస్త ఆపదాపహరణం.

 రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు.

ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.


*శ్రీరామ జయం*


రావణుని సారధి మళ్ళీ రథాన్ని రాముని ముందుకు తెచ్చాడు.

 సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రథాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు బాణాల వర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామ రావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి.

 రాముని బాణాలకు రావణుని రథ ధ్వజపతాకం కూలింది.

గుర్రాలు పక్కకు తొలగిపోయాయి.

మహా సర్పాలవంటి రాముని బాణాలకు ,

రావణుని తల తెగిపడింది.

 కానీ వెంటనే మరొకటి మొలుస్తున్నది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. 

"రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

 అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని,సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.

 రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై రావణాసురుడిపైకి విడిచాడు. 

వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివ‌డిన‌ *బ్రహ్మాస్త్రం 🏹🏹🏹*

*నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను 🏹🏹చీల్చి, భూమిలో ప్రవేశించి, సావధానంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది.* 

రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతి నుతుడై శోభిల్లాడు. 

సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు.      


*సీత అగ్ని ప్రవేశం*


భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. 

రాముని ఆనతిపై విభీషణుడు రావణుడికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతమ్మవారికి నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మ‌కు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

లోకానికి సీత‌మ్మ పాతివ్ర‌త్యాన్ని తెలియ‌జేయాల‌నుకున్నాడు శ్రీ‌రాముడు. అందుకు లోకం కోసం చిన్న‌స‌న్నివేశాన్ని సృష్టించాడు.


"సీతా,.... ఇక్ష్వాకు కుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.

 రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాట‌లు సీత‌కు పిడుగుపాటు లా అనిపించాయి.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక‌" అని పలికి సీతామహాసాధ్వి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ, రాముని సమక్షంలో నిలిచి "రామా! నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. దేవతలు నీవు విష్ణువు అవతారానివని కీర్తించారు.రాముడు మాత్రం

*ఆత్మానం మానుషం మన్యే*

*రామం దశరథాత్మజం*

నాపేరు రాముడు,దశరథ కుమారుడైన మానవ మాత్రుడననే అని వినయంగా అంటాడు. మానవుడిగానే రావణ సంహారం చేశానని లోకానికి చాటాడు.

వెంటనే అగ్ని, సీతమ్మవారిని వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.


 సీత అప్పుడు ఉదయ సూర్యబింబంలా ఉంది.


 "*రామా! ఇదిగో నీ సీత.* *ఈమె పునీత. పావన చరిత*. *నిన్నే కోరిన పరమ సాధ్వి.*

 *ఈమెను అవశ్యం పరిగ్రహించు"* అని చెప్పాడు.

 అప్పుడు రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. 

ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. 

నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీతమ్మవారి చేతినందుకొన్నాడు రామచంద్ర మూర్తి.

 ఆకాశం నుంచి పుష్ప‌వ‌ర్షం కురిసింది.

*అయోధ్యకు పునరాగమనం*

యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. వానర సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు, విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.

 విభీషణుడు, వానరులు తోడు రాగా, పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. 

దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు.

*భరతుడికి వర్తమానం*

ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని భరతునికి సీతారామలక్ష్మణుల రాక గురించిన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రాముడికి, సీతమమ్మవారికి , లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేప‌ట్ట‌వలసిందిగా శ్రీరాముని ప్రార్థించాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ, విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతో, 

ప్రజల జయ జయధ్వానాల మధ్య అయోధ్యలోనికి ప్రవేశించారు. 

తల్లులకు, పెద్దలకు, గురువులకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

                *****

*శ్రీ రఘురామ*

*చారు తులసీదళ దామ* 

*శమక్షమాది*

 *శృంగార గుణాభిరామ* *త్రిజగన్నుత శౌర్య రమా లలామ*

*దుర్వార కబంధరాక్షస విరామ*

 *జగజ్జన కల్మషార్ణవో*

*త్తారకనామ*

 *భద్రగిరి దాశరథీ* *కరుణాపయోనిధీ*

 *****

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద

శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధి సోమ సురారి దోర్భలో

ద్ధామ విరామ

 భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!*

         ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం

శ్రీరాందూతం మనసా స్మరామి.


*(రేపు, శ్రీరామ పట్టాభిషేక పరమ పావన ఘట్టం)*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌అష్టమి -‌ ఆర్ధ్ర -‌‌ గురు వాసరే* (26.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

*శ్రీ రాముడి కల్యాణం*

 

భద్రాచలంలో..```

     *శ్రీ రాముడి కల్యాణం*

              ➖➖➖✍️


```

భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నంలో  నిర్వహిస్తారు. 

అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం...

ఇది దోషరహిత ముహూర్త సమయం....

దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు. 

అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం  శ్రీరామనవమి వేడుక!


శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు.

అది ఆయన పుట్టినరోజు కూడా.

చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం.


మరి పుట్టిన రోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం..


శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా  నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు? 


నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూల కారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్త రామదాసు..


ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. 


రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. 


అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి.(శ్రీరంగంలో మాదిరిగా).


పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. 

అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన

```

*“ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్”*``` (పరమ  పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం.


రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి. అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.

ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.


వాల్మీకి రామాయణంలో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడ లేదు. కానీ, నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై, చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా 

శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి.... 


ఆ ముహూర్తనిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

✍️```

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀💐🌹

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.



తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।

గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ।। 28 ।।



ప్రతిపదార్థ:



.తత్త్వ-విత్ — సత్యమును ఎరిగినవాడు; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; గుణ-కర్మ — గుణములు మరియు కర్మలచే; విభాగయోః — తారతమ్యము గుర్తించును; గుణాః — ఇంద్రియ-మనస్సు రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; గుణేషు — ఇంద్రియ గ్రాహ్య వస్తువుల రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; వర్తంతే — ప్రవర్తిల్లును; ఇతి — ఈ విధంగా; మత్వా — తెలుసుకొని; న, సజ్జతే — ఆసక్తితో ఉండరు.



 తాత్పర్యము : 


 ఓ మహా బాహువులున్న అర్జునా, జ్ఞానులు, ప్రకృతి-గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే (ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న) గుణముల (ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో) యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు.


  

 వివరణ:


 ఇంతకు పూర్వ శ్లోకం ఏం చెప్పిందంటే, 'అహంకార విమూఢాత్మా' (అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు) తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకం తత్త్వ-విత్ (సత్యమును ఎరిగినవారు) ల గురించి చెపుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్న వారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది, తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు, బదులుగా, ప్రతి కార్యకలాపం కూడా మూడు గుణముల కదలిక వల్లనే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: ‘జో కరఇ సో హరి కరఇ, హోతా కబీర్ కబీర్’ - ‘భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు నేను చేస్తున్నాననుకుంటున్నారు’