26, సెప్టెంబర్ 2020, శనివారం

ఫలం

మనం ఇవాళ ఒక విత్తనాన్ని జల్లి, తర్వాత అలా జల్లాము అనే విషయాన్ని మర్చిపోతాము. ఎప్పుడైతే దాని ఫలం మన చేతికి అందుతుందో, ఈ ఫలం ఆ విత్తనానికి సంబంధించినది అని మనం గ్రహించలేకపోతాము. "పాపము"అంటే మన చేష్టల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఇతరులకి దుఃఖం కలిగించడం.


రెండు కన్నుల మధ్య ఉన్న భ్రుకుటి మీద ధ్యానాన్ని కేంద్రీకరించు. భ్రుకుటి మధ్యలో గల అజ్ఞాచక్రం సంకల్పం యొక్క స్థానము. ఈ చక్రం మీద ధ్యానం చేసే వాని సంకల్పశక్తికి పరాజయం అనేది ఉండదు. కర్మ యోగికి ఇదే సరైన చక్రము. ధ్యానం చేసేటప్పుడు మీ శ్వాస సమంలో ఉండాలి.


నీవు నీ "నేను"ని విసర్జించాలి అంటే సమర్పణ చేసుకోవాలి. సమర్పణ జరిగేదాకా ముక్తి ఉండదు. ఎవరు గొప్పగా సంకల్పం చేయగలడో, అతనే సమర్పణ చేయగలడు.

కామెంట్‌లు లేవు: