20, అక్టోబర్ 2020, మంగళవారం

మూకపంచశతి

 *జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌷 మూకపంచశతి 🌷

   

🌷 ఆర్యాశతకము


🌹9.

ఆదృతకాఞ్చీనిలయాం


ఆద్యామారూఢయౌవనాటోపామ్

 

ఆగమావతంస కలికాం


 ఆనన్దాద్వైతకన్దలీం వన్దే ౹౹


🌺భావం: 


కాంచీనగరముననే ఆదరముతో నివసించియుండు కామాక్షీ దేవి ,ఆద్యురాలు . ఆ తల్లి నిత్యయౌవనవతి ,ఆగమములకే వందనీయురాలు.వేదమాతలు అమ్మవారిని పూజ్యతతో తమ శిరమున నిలుపుకొన్నారు.జీవుని యందుండు ద్వైదీభావమే దుఃఖహేతువుకదా.ఉపాసనాక్రమమున సాధకుడు చేరుకొనే అద్వైతసిద్ధియే ఆనందసిద్ధి ! పరమేశ్వరి ఆరాధనతో మాత్రమే చిదానంద స్థితిని పొందగలము.ఆ పరిపూర్ణ స్థితియే పరమశివం!అట్టి శివానందాద్వైతవృక్షమునకు మూలకందము ఐనట్టి ఆ పరాంబికకు నమస్కరించుచున్నాను. 🌺


🔱  అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ.  🔱


🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....

కామెంట్‌లు లేవు: