20, అక్టోబర్ 2020, మంగళవారం

సుప్రసిద్ధ విద్వాంసులు

 🌀🌀🌀🌀🌀🌀🌀🌀


*తెలుగు దేశంలో సుప్రసిద్ధ విద్వాంసులు చాలామంది జన్మించారు. అనేకమంది మహాకవులు అద్భుత కవితా ఖండాలను సృష్టించి ఖ్యాతిగడించారు. కాని విద్వత్కవులుగా కీర్తి ప్రతిష్ఠ లార్జించినవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అట్టివారిలో గుంటూరు శేషేంద్ర శర్మ గారొకరు. శ్రీశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషాపరశేషభోగి. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలలో నిష్ఠాతులేగాక, హిందీ, ఉర్దు సాహిత్యాలలో సహితం గణనీయమైన కృషి చేశారు.*


*గుంటూరు శేషేంద్ర శర్మ*

*జననం అక్టోబర్ 20, 1927*

*నాగరాజపాడు, నెల్లూరుజిల్లా.*

*వృత్తి రీత్యా ప్రభుత్వోద్యోగి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనరుగా పని చేశారు) ప్రవృత్తి మాత్రం సాహిత్యం. వారి సాహిత్య జీవితం అత్యంత మహోన్నతమైనది. శ్రీనాథ మహాకవి వలె నూనూగు మీసాల నాడే అంటే 20వ ఏటనే (1947లో) రచనా వ్యాసంగం మొదలెట్టారు. అనువాద కావ్యం "సొరాబు" తో ఆయన సాహిత్య ప్రస్థానం ఆరంభ మయింది. తర్వాత 1961వ సంవత్సరం లో శర్మగారి "చంపూవినోదిని" పద్య కావ్యం ప్రచురిత మయింది. ఆ కావ్యం శర్మగారి ఆశు కవిత్వ పటిమకు, పాండిత్య ప్రకర్షకు అద్దం పడుతుంది. శ్రీ శేషేంద్రశర్మ గారు 11 పద్య కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించి పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు. అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ.*


*కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి. "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. శేషేంద్ర శర్మ గారు 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది ,ఆ ప్రసిద్ధమైన పాట  రాశారు.*


🌀🌀🌀🌀🌀🎲🌀

కామెంట్‌లు లేవు: