20, అక్టోబర్ 2020, మంగళవారం

జ్ఞానవైరాగ్యస్థిత్యర్థం

 *జ్ఞానవైరాగ్యస్థిత్యర్థం బిక్షం దేహిచ పార్వతి*


అమ్మవారి దగ్గరికి వెళ్లి స్వతంత్రంగా అడగాలి, అమ్మా ఉట్టి అన్నం కాదు, దాని వల్ల జ్ఞానం, వైరాగ్యం ఇవ్వు అని, శంకరులు అంతటా వారు ఎందుకు ఆవిడని అడగాలి అని చెప్పారు? ఆవిడ *ఆబ్రహ్మాకీటజనని* బ్రహ్మగారు మొదలుకొని కీటకం వరకు ఉన్న జీవులకు తల్లి కనుక, అనుకున్న వాడికి కాదు తల్లి, సమస్త జగమ్ములకు ఆవిడే అమ్మ. ఆవిడ అనుగ్రహిస్తే ఏది సత్యమో దాని వైపుతిప్పుతుంది, దేనిపై రాగం ఏర్పడాలో అటువైపు వైరాగ్యాన్ని కనిగిస్తుంది. వారికి నివేదించిన అన్నాన్ని ప్రసాద బుద్ధితో తీసుకుంటే, సత్వగుణం అలవడుతుంది.

సాదరనంగా కూడా మనం తినే ఆహారమే మన మనస్సుని, ఆలోచలనల్ని, కర్మలను ప్రభావితం చేస్తుంది, అందుకే మన పెద్దలు ఆహార విషయంలో చాలా నియమాలు చెపుతారు.


*అమ్మదయ వుంటే అన్నీ ఉన్నట్లే*

కామెంట్‌లు లేవు: