5, నవంబర్ 2020, గురువారం

దేహ భావన

 దేహ భావన 

నేను అనే దేహంను (శరీరంను) చెతన్యవంతం చేసే దేహి (ఆత్మా) అనే శక్తి వున్నదని ఇంతకుముందు తెలుసుకున్నాం. మరి ఈ చెతన్యమే నేనా లేక జఢమైన శరీరమా నేను అనే ప్రశ్న ఉదయించినప్పుడు మనం చేతన్యాన్ని కలిగించే ఆత్మే నేను అని అనుకుంటాము ఎందుకంటె ఈ శరీరం ఈ భూమి మీద పుట్టింది, మరియు భూమిలో వున్న పంచభూతాలతో తయారయింది. అంతే కాకుండా ఈ శరీరం కొంత కాలం ఉండి తరువాత ఈ భూమిలోనే కలిసిపోతుంది. కాబట్టి ఇది అశాశ్వితం. అశాశ్వితం అయింది ఏది కూడా నేను అనటానికి వీలు లేదు ఎందుకంటె నేను శాస్వితుడిని అంటే నాకు ఈ కాలంతో పని లేదు కాలం కొంత వరకు మాత్రమే ఉంటుంది. 

మరి జడమైన శరీరం నేను కాదన్నప్పుడు మరి ఈ శరీర భావన ఎందుకు కలిగి ఉండాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన కారునే ఉదాహరణగా తీసుకుందాము. కారు వేరు డ్రైవరు వేరు. కానీ డ్రైవరు లేకుండా కారు చెతన్యవంతం కాలేదు అంటే డ్రైవరుకు కారుకు సంబంధం వుంది. డ్రైవరుకు కారు ఉపాధి స్థానం.  కారు లేకుండా డ్రైవరు జీవించ లేడు.  డ్రైవరు లేకుండా కారు కదల లేదు. అంటే రెంటికి మధ్య సంబంధం వుంది. కానీ ఆ సంబంధం ఏర్పరచుకుంది మాత్రమే. ఈ కారు మీద ఉద్యోగం పొతే డ్రైవరు ఇంకొక కారుమీద ఉద్యోగం చేస్తాడు. అంటే ఏ కారు కూడా డ్రైవరుది కాదు. ఇదే విశ్లేషణ మనం శరీరముకు ఆత్మకు అన్వయించుకోవాలి. 

డ్రైవరు రోజు కారుని పరిశుభ్రంగా కడిగి చక్కగా నీటుగా ఉంచుతాడు ఎందుకంటె అతని ఉపాదాన స్థానం కారే కాబట్టి. కానీ డ్రైవరుకు తెలుసు ఈ కారు తనకు కొంతకాలమే ఆసరాగా ఉంటుందని, ఐనా కానీ దానిని శుభ్రంగా ఉంచటం మాత్రం మానడు.  అదే విధంగా ప్రతి మనిషి కారు లాంటి శరీరాన్ని ఏ లోపంలేకుండా చూసుకోవాలి కానీ తాను  శరీరం అనే భావన మాత్రం ఉండకూడదు. 

ఈ శరీరం అశాశ్వితం ఆయన దాని యోగ క్షేమాలు చూడటం మాత్రం మానకూడదు. శరీరం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ వుంటూ, సమయానికి అన్న పానీయాలు సమకూరుస్తూ, ఇతరులతో సత్సంబందాలు కలిగి రాగ ద్వేషాలు లేకుండా ఎల్లప్పుడు ఆత్మలోనే చరిస్తూ ఉండటమే ఆత్మ జ్ఞానీ చేయవలసిన పని. సమాజంలో కలిగే వడిదుడుకులు తనకు కావని అంటే లాభం వస్తే ఆనందించటం, నష్టం వస్తే బాధపడటం, సుఖ దుఃఖాలకు లోను కాకుండా కష్ట సుఖాలు ఈ శరీరానికే కానీ నాకు కాదనే భావనలో ఉండటమే సాధకుడు చేయవలసినది. 

ఓం తత్సత్ 

సర్వ్యే జానా సుఖినో భవంతు. 

కామెంట్‌లు లేవు: