5, నవంబర్ 2020, గురువారం

రాహువును శక్తిని

 రాహువును శక్తిని అనుసరించు గ్రహములు ఈశ్వర శక్తిగా, అవి,రవి, కుజ , శుక్ర, శని గ్రహములు. వాటి శక్తిని పురుష, శక్తిగా ఎక్స్ క్రోమెూజోములుగా తెలియుచున్నది. వాటి శక్తిని కేతువు శక్తితో గూడి పరివర్తన చెంది గురు, బుధ, చంద్ర విష్ణు శక్తిగా మారి జీవ చైతన్య లక్షణము కలిగి మార్పునకు మూల కారణంగా అనగా మానవ పరిణామసూత్రంగా, అదియే ప్రకృతి గా మనకు బోధపడుతున్నది. నక్షత్రములను వాటి శక్తని గూడా యీ ప్రాతిపదికన గ్రహములకును నిర్ణయించబడింది. వాటి శక్తికి వారధిగా పై గ్రహములు సంచరించుచు మానవ మనుగడకు ప్రధాన సూత్ర ములుగా వున్నవి. వీర్యకణములకు అధిపతి శుక్రుడు వానివలన ఆయా నక్షత్రములు ప్రవేశించు సమయమునకు నక్షత్ర ప్రభావం వలననే శుక్ర కారక శోభితమైన కణాలు లక్షణములను సంతరించుకొని చంద్రుని శక్తితో కలిసి దేహసంబధ ఆశ్రయమైన జీవిని ప్రభావము చేయుచున్నవి. పరమేశ్వర రూపంలో శక్తి తేజస్సు రేడియేషన్ పురుష రూపంలో దేహంలో ప్రవేశం. దీనికి అతి నీలలోహిత కిరణ లక్షణము గల శని కూడా కారకుడు. అతడు క్షేత్ర కారకుడుగా మనకు తెలియుచున్నది. దీనికి కుజ సంబంధమైన శక్తి పదార్దము అనగా పిండమును గట్టి పడుటకు మూల కారణము. మానవ జీవ లక్షణము లకు వుత్పత్తి మరియు లయమునకును ప్రధానము రాహు శక్తి యని అది నెప్ట్యూన్ రూపంలో గల గుడి గుర్తును మార్గములో అనగా క్లాక్వైజుగా మారుటకు. అపసవ్య మార్గములో యున్న కేతు శక్తి ఏంటీ క్లాక్ వైజ్ గల విష్ణు శక్తి యని, యీ రెండింటి కలయికయే జీవ ఆవిర్భావ మూల సూత్రంగా తెలియుచున్నది. దీనిని వేదము లయమునకును రాహువు మిగిలిన గ్రహములను వాటి శక్తిని లోపరచుకొనుట అనే సూత్రమును మన భౌతిక వాదులు బ్లాక్ హోల్స్ మిగిలిన గ్రహములు అన్నియు కలిసి పోవుట అనే సూత్రమునకు దగ్గరగా యున్నది. అదే కృష్ణ అనగా లయ కారత్వమైన మహా భారత యుధ్దము రచన యని అధర్మమును నాశనము చేసి ధర్మ సంస్థాపనయనే సూత్ర వివరణ. వీటి వునికి గ్రహ మండలంలో మనకు కంటికి కనపడదు. కాని వాని శక్తి విశ్వవ్యాప్తమై తెలియజేయుచున్నది. అణువణువూ వ్యాప్తి చెంది దేనికదే గమనం చేయుచున్నవి. యింత స్పష్టంగా వేదం తెలియజేయుచున్నది. అది భూగమనమునకు మూల శక్తి. యిది ఆగిపోయినఆగిపోయినఅనగా భూతలమంత లేనియెడల ప్రళయము.

కామెంట్‌లు లేవు: