31, అక్టోబర్ 2025, శుక్రవారం

Panchaag


 

కార్తికమాసం-విశ్వావసు*

 *శివస్తుతి - కార్తికమాసం-విశ్వావసు*


సీ॥

అభిషేకమును జేతు నభవు నార్తిని గొల్తు 

త్రిభువనాధిపతిని తీరు గొల్తు 

హిమవంతునల్లుని హిమజాత మగనిని 

సుమమాల నర్పించి మమత గొల్తు 

త్రిపురాసురుల జంపి తీవ్రసంక్షోభమ్ము 

వరలకుండగ జేయు వాని గొల్తు 

లింగమూర్తిని గొల్తు సంగరహితు గొల్తు 

భ్రమరాంబవల్లభు భక్తి గొల్తు 

తే.గీ.

చిచ్చుకంటిని ముదమార చేరి గొల్తు 

మచ్చకుత్తుక కలవాని మెచ్చి గొల్తు 

మచ్చగలవాని నెత్తిన నిచ్చగించి 

కులుకుచుండెడి వానిని కోరి గొల్తు -12

*~శ్రీశర్మద*

30, అక్టోబర్ 2025, గురువారం

పురుషుడు భార్యని

 *పురుషుడు భార్యని ఎలా* 

                                    *చూసుకొవాలి?*


* *స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చేసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.*


* *అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.*


* *భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.*


* *ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.*


* *పిల్లలతొ సరళ సంభాషణలు* *చేయాలి.*


* *పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.* 


* *ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.*


* *భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.*


* *ఆమె అభిప్రాయలను గౌరవించాలి.*


* *భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.*


* *భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.*


* *భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.*


* *భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండా, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి...*

వంకాయ కూర

 వంకాయ కూర 

అబ్బో వంకాయ కూర అనగానే మీకు నోరూరుతుంది కదా అవును నాకు తెలుసు వంకాయ కూరను  తినమనే వారు   ఇష్టపడని  వారు ఉండరన్నది అందరు ఎరిగిన సత్యమే. మీ ఇంట్లో ఏం చేశారు అని ఎవరినైనా అడిగితె వాడు కనుక వంకాయకూర అని అన్నాడా అబ్బా వీడు నన్ను కూడా భోజనానికి పిలిస్తే ఎంతబాగుండును అని అనుకోని వారు ఎంతమంది వుంటారు చెప్పండి. ఇంకా కొంతమంది సిగ్గు విడిచి అరె ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తారా అని మరి వాళ్ళ ఇంటికి వెళ్లి వంకాయ కూరను ఆరగించి వచ్చేవారు ఎంతమంది లేరు చెప్పండి. అందుకే కొంతమంది ఇవాళ మీ ఇంట్లో ఏమి చేశారు అని అడిగితె ఏరా నీవు భోజనం చేశావా అని అడిగి వాడు తిన్నాడని నిర్ధారణ చేసుకున్న తరువాత చిన్నగా అప్పుడు చెపుతాడు మా ఇంట్లో వంకాయ కూర అని. అబ్బా ఈ విషయం కొంచం ముందు చెపితే నేను కూడా మీ ఇంట్లోకి భోజనానికి వచ్చేవాడిని కదరా అని అప్పుడు నాలుక కరుచుకుంటాడు. ఇట్లా ఎన్నో సంగతులు వంకాయ కూర మీద ఉంటాయి. వంకాయ కూర రుచిని ఆస్వాదించి ఆనందించి సంతృప్తి చెందిన ఒక కవిగారు ఊరుకొక ఇలా ఒక చక్కని కంద పద్యాన్ని వ్రాసాడు అది మనందఱకు తెలిసిందే 

"వంకాయ వంటి కూరయు, 

పంకజముఖి సీత వంటి భామామణియున్, 

శంకరుని వంటి దైవము, 

లంకాధిపు వైరివంటి రాజును గలడే?" 

ఇందులో కవిగారు ఏమంటారంటే , "వంకాయలాంటి కూర, తామరపుష్పం వంటి ముఖం కల సీత వంటి భార్య, శివుడి వంటి దేవుడు, రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు" వంటివి ఉన్నాయా అని అంటున్నాడు. ఇది అక్షర సత్యం ఒక వంకాయ కూరను సాక్షాత్తు లోకమాత అయిన సీతాదేవితోటి శ్రీ రామచంద్రునితోటి మరియు పరమ శివునితోటి పోల్చి చెప్పాడంటే ఆ కవిగారు వంకాయకూరను తిని పొందిన అనుభూతి  ఎంతదో చెప్పకనే చూపుతున్నది. ఇదండీ ఒక కవిగారి ఆనందంతో తన కలంనుండి జాలువారిన అమృత కవితా ధార . 

ఇక వంకాయకూర గురించి చెప్పాలంటే వంకాయ కూర ఒక కూర కాదండి అది ఒక కూరల సంపుటి. వంకాయలను తరిగి, తరిగిన ముక్కలను నీళ్లలో వేసి పోపు చేసి ముక్కలను వేసి అల్లం పచ్చిమిరపకాయ ముక్కలను వేసి చేసే కూర సాదారణ కూరే కానీ దాని రుచి మాత్రం అమోఘం. ఇది అతి సాధారణంగా చేసే వంకాయకూర 

ఇంకా పల్లీల పొడి ధనియాలపొడి, శనగపిండి, వాము జీలకర్ర పొడులు అన్నే కలిపి పొడుగాటి వంకాయలను తీసుకొని దానిని నిలువుగా నాలుగు పాయలుగా తరిగి మధ్యలో ఈ మసాలాను నూరి గిన్నెలో నూనె వేసి దానిలో వేసి వేయించి తీసిన గుత్తివంకాయ కూర రుచి అద్భుతం , అద్వితీయం. దీనిని తింటూవుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు ఉండదా చెప్పండి. 

ఇదికాక ఇటీవల కాలంలో అనేక విధాలైన వంకాయ కూరలు మన పాక శాస్త్రజ్ఞులు కనుగొన్నారన్నది అతిశయోక్తి  కాదు. వంకాయ గ్రేవీ కూర వంకాయ కారం కూర, వంకాయ మసాలా చల్లిన కూర అదోరకం కూర ఇదోరకం కూర అని అనేక అనేక కూరలను చేస్తున్నారు టీవీలలో చూపిస్తున్నారు. యూట్యూబులల్లో చూస్తూ చేస్తున్నారు కూడా 

వంకాయకూరకు దాసుడైన ఒక సినిమా దర్శకుడు తన సినిమాలో ఒక పాటను వంకాయమీద పెట్టి హీరో హీరోయిన్లతో నాట్యం చేయించిన విషయం తెలియని తెలుగువారు లేరు. 

వేద వ్యాసుడు మన తెలుగువారికి సరిగా న్యాయం చేయలేదు అని ఒక సుబ్బారావు ఒక రామారావుతో అన్నాడు. అదేమి పాపం వ్యాస భగవానులు వేదాలను విభజించి వేద వ్యాసుడుగా పేరొందారు, అష్టాదశ పురాణాలను వ్రాసారు, మహా భారతాన్ని రచించారు ఇంకా అయన చేయకుండా మిగిలింది ఏమిటి. ఇప్పటికి పండితులు వ్యాస ఉత్తిష్టం కానిది లేదంటుంటే  మీరు ఇంకా వ్యాసులవారు ఏదో వ్రాయలేదని అంటారేమిటని రామారావు అన్నాడు. దానికి సుబ్బారావు నీకు తెలియదా వంకాయ కూరను వ్యాసులవారు ముట్టుకోలేదు అని అసలు విషయం తెలిపాడు సుబ్బారావు. బలే వున్నది సుబ్బారావుగారు అయితే మీరు భారతం పూర్తిగా చదివినట్లు లేదు అని అన్నాడు రామారావు. భారతంలోనా ఎక్కడ చెప్పండి అన్నాడు. నేను చెప్పేది ఏముంది చాలా బాగా సుస్పష్టంగా వ్యాస భగవానులు వంకాయ కూరను వ్రాస్తేను అని అన్నాడు. అప్పుడు అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం సుబ్బారావుకు కలిగింది. అయితే చెప్పండి మహాప్రభూ ఆ కథను అని అన్నాడు. 

అప్పుడు రామారావు సాక్షాతూ శ్రీ కృష్ణ భగవానుడిలాగా ఫోజు పెట్టి అర్జనునికి గీతను బోధిస్తున్నట్లుగా సుబ్బారావుకు చెప్పటం మొదలు పెట్టాడు. నాయనా లక్క  గృహ దగ్డం అయిన తరువాత కుంతీమాతతో సహా పాండవులు ఏకచ్చేక్రపురం అనే గ్రామంలో తలదాచుకున్నారు కదా అవును తెలుసు అన్నాడు అప్పుడు జరిగింది ఏమిటో తెలుసుకదా తెలుసు పాండవులు వున్న ఇంటివాని కుమారుని బకాసురునికి ఆహారంగా పంపటానికి ఆ తల్లిదండ్రులు బాధ పడుతూ బండిమీద బాలుని సాగనంపుతుంటే అవును సాగనంపుతుంటే కుంతీ మాత ఆ తల్లిదండ్రులకు ఊరట కలిగించి ఆ బాలునికి బదులుగా తన కుమారుని పంపుతానని భీముని పంపింది ఇందులో వంకాయ కూర ప్రసక్తి ఎక్కడవుందని సుబ్బారావు అన్నాడు. 

అప్పుడే నాయనా వంకాయకూర వచ్చింది అని రామారావు ఇలా చెప్పాడు. ఆ క్రితం రోజు ఊరివారంతా సమావేశమై బకాసురిని బారి నుంచి తప్పించుకోవటం మన వల్ల కాదు కనీసం వాడిని సమ్మోహితుణ్ణి అయినా చేసి కొంతకాలం వాడు మన ఊరివైపు రాకుండా చేద్దామని అందరు కలిసి వారిలో చక్కగా వంకాయ కూర వండగల సమర్థులను ఎంచుకొని ఒక బాండీ నిండా వంకాయ కూరను వండి మరుసటి రోజు బకాసురిడికి విందుగా పంపే బండిలోకి ఎక్కించారు. నిజానికి తల్లిగారు చెప్పినా బకాసురిడి వద్దకు వెళ్ళటానికి ఇష్టపడని భీముడుగారు ఆ వంకాయ కూర  ఘుమ ఘుమలు ఉరిస్తూవుంటే దానిని సంతృప్తిగా ఆరగించాలని తాను బకాసురిని వద్దకు వెళ్ళాడు. బకాసురుడు చూస్తూఉండగా ఆ కూరను అన్నంలో కలుపుకొని తింటూ వాడిని కూడా ఊరించాడని వాడు అది చూసి సహించక ఓరి మానవ నాకు ఆహారంగా తెచ్చిన వంకాయ కూరను నీవు ఆరగిస్తావా, తిని తిను నీవు తిన్నతరువాట్ నిన్ను నీ కడుపులోని వంకాయకురాను తినేది నేనే కదా అని హా హా కారాలు చేస్తూ భీముని మీద లంకిస్తే ఆకలితో వున్న బకాసురుని వంకాయ కూరను ఆరగించిన భీమసేనుడు అతి సునాయాసంగా  మట్టు పెట్టిన సంగతి అత్యంత రసవత్తరంగా వ్యాసభగవానులు వ్రాసారని దానిని నన్నయ భట్టారకుడు హ్రుద్యంగగా తెలుగించిన విషయం నీకు తెలియదటోయ్ అని సుబ్బారావుతో రామారావు అనేసరికి రామారావు నోరెళ్లపెట్టాడు. అవునండి మీరు చెప్పింది నిజమే వ్యాసభగవానులు వంకాయకూరకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చారు అని ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్లుగా మొహం పెట్టి చెప్పాడు. దీనిని  బట్టి తెలిసేది యేమిటంటే వంకాయకూర ఈ నాటిది కాదు ఇతిహాసాల నాటిదని అర్ధమవుతుంది. అని అన్నాడు సుబ్బారావు.

అంతే కాదు సుబ్బారావు వంకాయకూర గురించి కధ ఒకటి అక్బర్ బీర్బలులది కూడా వున్నది అది నీకు తెలియదా అని ఆంటీ చెప్పు చెప్పు అని చెవులు నిక్కపొడుచుకొని వినటానికి సంసిద్దుడైనాడు  ఆ కధ ఏమిటంటే అని చెప్పసాగాడు రామారావు  ఒకసారి చక్కటి వంకాయకూరతో విందు భోజనం చేసిన అక్బరు బాదుషా ఆ ఆనందాన్ని తట్టుకోలేక బీర్బల్ తో బీర్బల్ వంకాయ కూర ఎంతరుచిగా ఉందొ తెలుసా వంకాయ కూర తినని వాడి జన్మ జన్మే కాదు అని అన్నాడట దానికి మన బీర్బల్ జహాపనా మీరు చెప్పింది నిజం వంకాయను కూరలలో రాజు అని పేరు.   అందుకే భగవంతుడు వంకాయను ప్రత్యేకంగా చూసాడు అంతేకాదు దాని తలమీద కిరీటాన్ని పెట్టాడు అని అన్నాడట. అట్లానా  అని బాదుషా బీరుబలును, వంకాయను మెచ్చుకున్నాడట.

సుబ్బారావూ  వంకాయకూర గురించి చెప్పాలంటే ఎంతసేపైనా పడుతుంది. నీకు తెలుసుకదా మన బెజవాడ బెంజ్ సర్కిలులొ వంకాయ విలాస్ అనే ఆంధ్రభోజాన హోటలు వుంది అది వంకాయ కూరకు పెట్టింది పేరు. ఆ హోటల్లో భజనం చేయని బెజవాడ వాస్తవ్యుడు లేదంటే నమ్మండి. ఇంట్లో భార్య వంట సరిగా చేయకపోతే వెంటనే వంకాయ విలాసకు వెళ్లి భోజనం చేసే పురుషపుంగవులు ఎంతమందో నీకు తేలుసా.   ఇటీవల భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకొవటంతో వాళ్లకు దొరికినప్పుడల్లా వంకాయ విలాస్ హోటలు నుంచి భోజనము తెప్పించుకొని తింటూవున్నారు. అందుకే ఇప్పుడు జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు తమ తమ వ్యాపారాలని వృద్దిచేసుకుంటున్నాయంటే దానికి కారణము వంకాయ కూర అంటే నమ్మండి అని అన్నాడు. . హైదరాబాదు నుండిబెజవాడమీదుగా తిరుపతి పెళ్లే యాత్రికులు ఒక పూట బెజవాడలో దిగి వంకాయ విలాసులో వంకాయ కూరతో భుజించి వెళ్ళటం పరిపాటి.  ఇటీవల బెజవాడ వంకాయ విలాస్ హోటలు వాళ్ళు హైదరాబాదులో డిలీషకానగరులో ఒక బ్రాంచి తెరిచారు.  అంతేకాదు మండపేటలో చాలా చోట్ల వీధి బండ్లమీదఁ వంకాయలో మసాలా పెట్టివంకాయ బాజ్జెలు చేస్తారు అవి ఒకసారి తింటే చాలు మళ్ళి మళ్ళి  తినాలనిపిస్తుంది.

మా వూళ్ళో నాగభూషణం అనే వకీలు ఒక ఆయన  అయన దగ్గరికి విడాకులు తీసుకోవటానికి వచ్చే దంపతులకు సర్దిచెప్పి భార్యకు వంకాయకురా మహత్యం చెప్పి చక్కగా వంకాయకూర చేయటం నేర్పించి అది వాళ్ళ భర్తలకు తినిపించమని సలహా ఇచ్చేవాడట అట్లా చేయటం వలన భార్య చేతి వంకాయ కూర తిన్న భర్త భార్యమీద ప్రేమను పెంచుకొని ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారని. ఇలా సలహా ఇచ్చినందుకు ఆయన వసులు చేసిన పీజులతో ఒక మూడు అంతస్తుల భవనం నిర్మించాడని దానికి వంకాయ నివాస్ అని పేరు పెట్టాడని చెపుతారు. ఈ విషయం తెలుసుకున్న అనేకమంది భార్యలు తమ తమ భర్తలను వశం చేసుకోవటానికి చక్కగా వంకాయ కూర చేయటం నేర్చుకొని వాళ్ళ భర్తలకు తినిపించి భర్తలను కొంగుకు కట్టుకుంటున్నారని ఒక వదన్తి. 

వకీళ్ళకే కాదు డాక్టర్లకు కూడా వంకాయ కూర కల్పవృక్షం లాంటిది అని రామారావు అన్నాడు అది యెట్లా అన్నాడు సుబ్బారావు నాకు తెలిసిన డాక్టరును నేను నీ ప్రాక్టీస్ ఇంత బాగా వృద్ధిలోకి రావటానికి కారణమ్ ఏమిటని అడిగాను.  దానికి ఆయన నీవు ఎవ్వరికీ చెప్పానంటే చెపుతాను అని నాతొ ప్రామిస్ చేయించుకొని మరి చెప్పాడు అది వంకాయ కూర అని అన్నాడు. అదేమిటి వంకాయ కూరకు నీ ప్రాక్టీసుకు ఏమిటి సంబంధం అని నేనన్నాను. వంకాయ కూర అందరు ఇష్టంగా తింటారా లేదా చెప్పు అన్నాడు తింటారు అని అన్నాను నేను. . అప్పుడేమవుతుంది, ఏమవుతుంది వంట్లో వాతం కఫం అజీర్తి పిత్తం అన్నే ముదిరి సంపూర్ణ ఆరోగ్యంగా వున్న వాడు కాస్త అడ్డం పడతాడు. వాళ్ళ వాళ్ళ వయసుని పట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వారి వారి రోగాలు ఆధారపడతాయి. ఇక యెంత చెట్టుకు అంత గాలి అన్నట్లు యెంత రోగానికి అంత ఫీజు నేను వసులు చేస్తాను అని ఆ డాక్టరుగారు చెప్పారు. పేషంటు రాగానే వెంటనే సెలైన్ పెట్టి ముప్పైఆరు రకాల టెస్టులు చేయించి నలభై రకాల మందులు వ్రాసి నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని వేలు లక్షలలో ఫీజులు గుంజి వదిలి పెడతాను అని తన వృత్తి రహస్యం చెప్పాడు డాక్టరుగారు. ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేసాను కాబట్టి నీకు మాత్రమే నేను చెపుతున్నాను అని అన్నాడు రామారావు.  

రామారావు  అంతటితో ఆగలేదు ఇంకా ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. పెండ్లి చూపుల్లో పిల్లవాడి తల్లి అమ్మాయితో నీకు వంట వచ్చా సంగీతం వచ్చా, డాన్సు వచ్చా టైపింగ్ వచ్చా కంప్యూటర్ వచ్చా అని సవాలక్ష ప్రశ్నలు వేస్తూ వుంటారు కానీ సమర్థురాలైన పిల్లవాని తల్లి ఒకే ఒక ప్రశ్న వేస్తుంది. అదేమిటంటే అమ్మాయి నీకు వంకాయ కూర వండటం వచ్చా వస్తే వంకాయను ఎన్ని రకాలుగా వండుతారు చెప్పమని అడుగుతుంది. అని అన్నాడు. 

ఆ తరువాత రామారావు సుబ్బారావుని నీకు వంకాయలలో రకాలు తెలుసా అని అడిగాడు.  నాకు తెలియదు. అయితే విను మాములుగా మనకు తెలిసిన వంకాయ వంకాయ రంగు వంకాయలు అవి పొడుగుగా ఉంటాయి. అవి కాక గుండ్రటి వంకాయలు, తెల్ల గుండ్రటి వంకాయలు, చారల గుండ్రటి వంకాయలు, తెల్ల వంకాయలు, బొండం వంకాయలు, బజ్జే వంకాయలు ఇంకా కొన్ని కొత్త వంగడాలను మన శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారని చెప్పాడు. 

పాఠక మిత్రమా ఇదండీ వంకాయ చెరిత్ర. ఇంకా ఈ రచయితకు తెలియని వంకాయ కూర గురించి మీకు తెలిస్తే చెపితే ఇంకా విస్తృతంగా ఈ రచను చేయగలడు. 

గమనిక: వంకాయను తప్ప ఇతర కూరలను నిందించటం ఈ రచయితా ఉద్దేశ్యం కాదు. కేవలం వంకాయ కూర ప్రాముఖ్యాన్ని తెలపటం మాత్రమే అని తెలుసుకోగలరు.  

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ వంకాయ కూర ప్రియుడు. 

చేరువేల భార్గవ శర్మ 





శుక్రాచార్యుడు

 రాక్షస గురువు శుక్రాచార్యుడు, అతను చెడును కదా ప్రోత్సహించేవాడు,మరి బృహస్పతి వంటి గురువుల కోవలోకి ఎలా చేర్చారు?


~~ జ్ఞానం మరియు తపస్సు :


~ శుక్రాచార్యుడు భృగు మహర్షి కుమారుడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడైన భృగువు వంశంలో జన్మించారు.


~ ఆయన వేదాలు, ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు, రాజనీతి మరియు అనేక శాస్త్రాలలో అపారమైన పరిజ్ఞానం కలిగిన మహాజ్ఞాని. బృహస్పతి కూడా ఇదే విధంగా జ్ఞాన సంపన్నుడు.


~ అపారమైన తపస్సు చేసి, శివుని నుండి మృత సంజీవని విద్యను పొందారు. ఈ విద్య ఆయన గొప్ప శక్తికి, తపస్సుకు నిదర్శనం.


~ రాక్షసులకు గురువుగా ఉన్నప్పటికీ, ఆయన వారికి కేవలం యుద్ధ విద్యలను మాత్రమే కాకుండా, ధర్మాన్ని, రాజనీతిని బోధించారు. కొన్ని సందర్భాలలో, రాక్షసులు ధర్మం తప్పినప్పుడు వారిని మందలించడం లేదా శపించడం కూడా చేశారు ఉదా: యయాతి కథలో శాపం.


~~ గురువుగా అతని స్థానం - దైవత్వం:


~ హిందూ పురాణాలలో గురువు అనే పదానికి వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా విద్య, జ్ఞానం బోధించే పవిత్రమైన స్థానం ఉంది. శుక్రాచార్యుడు, బృహస్పతి ఇద్దరూ తమ శిష్యులయిన దేవతలు లేదా ఆసురులకు అత్యున్నతమైన జ్ఞానాన్ని బోధించారు, కాబట్టి వారిద్దరూ గురు పీఠానికి అర్హులే.


~ నవగ్రహాలలో, శుక్రుడు అంటే శుక్రాచార్యుడు మరియు గురుడు అంటే బృహస్పతి అత్యంత ముఖ్యమైన స్థానాలను కలిగి ఉన్నారు. శుక్రుడు సంపద, ఐశ్వర్యం, కళలు, ప్రేమకు అధిపతి. బృహస్పతి జ్ఞానం, బుద్ధి, శుభాలకు అధిపతి. ఇద్దరూ దైవత్వాన్ని పొందినవారు, అత్యున్నత శక్తి సంపన్నులు.


~~ రాక్షసులకు గురువుగా మారడానికి గల కారణం:


~ శుక్రాచార్యుడు మొదట్లో దేవతలకు లేదా మరే ఇతర పక్షానికి వ్యతిరేకి కాదు. ఆయన గురువైన అంగీరస మహర్షి తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాతం చూపించారనే భావనతో కలత చెందారు.


~ ముఖ్యంగా, విష్ణుమూర్తి ఒకానొక సందర్భంలో శుక్రాచార్యుని తల్లియైన కావ్యమాతను లేదా ఉశనస భార్యను చంపడం జరిగింది. ఆ పగతోనే శుక్రాచార్యుడు దేవతలపై కోపంతో అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన వైరాగ్యానికి, అసురులకు మద్దతుగా నిలవడానికి వ్యక్తిగత కారణాలు, వైష్ణవంతో వచ్చిన విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన స్వతహాగా "చెడు"ను ప్రోత్సహించేవారు కాదు, జ్ఞానాన్ని బోధించే గురువు.


~ శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉన్నప్పటికీ, తన శిష్యుడైన కచుడికి ( బృహస్పతి కుమారుడు, దేవతల పక్షం ) కూడా పవిత్రమైన మృత సంజీవని విద్యను బోధించారు. ఇది ఆయనలోని గురు ధర్మానికి నిదర్శనం.


~~ ధర్మ పరిరక్షణ :


కొన్ని సందర్భాలలో, శుక్రాచార్యుడు శిష్యులకు పక్షపాతం చూపినా, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశారు. ఉదాహరణకు, కచుడిని చంపి, మదిరలో కలిపి త్రాగడం ద్వారా జరిగిన అనర్థాన్ని గ్రహించి, ఆపైన రాక్షసులకు సురాపానాన్ని (మద్యం సేవించడాన్ని) నిషేధించారు. అలాగే, మహాబలి చక్రవర్తి వామనుడికి దానం చేసేటప్పుడు, ఆ దానం చేయడం సరైనది కాదని తెలిసినా, ధర్మబద్ధమైన దానం చేయడాన్ని ఆపడానికి యత్నించడం ఆయన రాజనీతిజ్ఞతను తెలియజేస్తుంది.


ముగింపులో,,,,, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువైనప్పటికీ, ఆయన ఒక మహర్షి, అపారమైన జ్ఞాని, తపశ్శక్తి సంపన్నుడు. ఆయనలోని 'అసుర గురు' అంశం కేవలం దైవ-దానవ యుద్ధంలో ఒక పక్షాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చింది తప్ప, ఆయన గురుత్వం లేదా జ్ఞానం తక్కువైనది కాదు. అందుకే, బృహస్పతి వలె ఆయన కూడా గురు పరంపరలో అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.

29, అక్టోబర్ 2025, బుధవారం

విభూతి ధారణ

 విభూతి ధారణ ప్రాముఖ్యత


విభూతిని ధరించి నప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణవలన తొలగి మన బాధలు నశిస్తాయి.


కనుక ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం, దేవతారాధనచేసి ఈశ్వరకృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.


విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది.


""విభూతిర్భూతిరైశ్వర్యమ్‌''


విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసికోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం.


లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు.


“వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయా ! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!!


భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే .రుద్రాక్ష మాలను కంతమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు.


అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు.


విభూతి - భసితరి, భస్మ, క్షారము రక్షక పర్యాయ వాచక పదాలు. ఆణిమ, మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్దులను బాసింపచేస్తుంది. కనుక భసితమైందనీ, పాపాలను భజించడంవల్ల భస్మమైంది. ఆపదల నుండి కాపాడడంవల్ల క్షారమైంది. భూత, ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. ‘విభూతి’ని శరీరంపై పూసుకోవటంవల్ల తిర్వక్త్రిపుండ్రం పెట్టుకోవడంవల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణముండడంచే సదానొసట విభూతిని ధరించి తీరాలని, మనం పూజా కార్యక్రమాలాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివపూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి.


విభూతి ధారణవల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితవౌతుంది.


విభూతి మూడు విధాలు. ‘శ్రౌతము’ అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసి, ఆ హోమాదులవల్ల ఏర్పడిన భస్మం. ‘స్మార్తము’ అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. ‘లౌకికము’ ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన ‘విభూతి’గా భావిస్తారు.వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము.


సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతివిషయం శివమయమని, అదేమనకు అంతిమలక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకాకాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతివస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

తానికాయ గురించి

 తానికాయ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

 

తానికాయని విభీతక , విభీతకి , కర్షఫల అని సంస్కృతంలో అంటారు.


  తానికాయ ఉపయోగాలు -

    

 * తానికాయ కారముగా , చేదుగా , వగరుగా ఉండును. 


 * తానికాయ వేడితత్వం కలది. కఫాన్ని హరించును . 

 

* నేత్రములకు మేలు చేయును . 

 

* వెంట్రుకలు ఆకాలంలో తెల్లబడుటను నిరోధించును. 


 * మధురాపక్వముగా , తేలికగా ఉండును. 


 * గొంతుబొంగురును పొగొట్టును. 


 * ముక్కురోగాలను నివారించును.


 * రక్తదోషమును నివారించును.


 * కంఠరోగమును పోగొట్టును .


 * బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్న దగ్గు తగ్గును.


 * క్రిమి రోగాన్ని హరించును .


 * క్షయరోగాన్ని నివారించును .

 

* కుష్టురోగాన్ని హరించును .


 * తానికాయలోని పప్పు వెంట్రుకలకు అమిత హితమైనది.


 * తానిచెట్టు నుంచి తీసిన కల్లు కొంచం వేడి చేయును . కొంచం మత్తు కలిగించును. తేలికగా ఉండును. వ్రణరోగులు , పాండురోగులు , కుష్టురోగులు కి అనుకూలమైనది.

 

* తానికాయలో పప్పు దాహమును , వాంతిని , కఫమును హరించును .

 

* శరీరముకు తేలికగా ఉండును. వగరు కలిగి ఉంటుంది.

 

* తానికాయ తైలం మధురముగా ఉండును. శరీరముకు చలవ చేయును .

 

* తానికాయ తైలం ధాతువులను వృద్దిచేయును . కఫాన్ని పెంచును. వాతాన్ని, పిత్తాన్ని హరించును .

    

ఈ తానిచెట్టు చాలా పెద్ద వృక్షము . దీని ఆకులు ఇప్ప ఆకుల కన్నా కొంచం చిన్నవిగా ఉండును. పూలు గుత్తులుగా పూచి వేలాడుతుండును. కాయ ఆకారం పైన డిప్పవలవని జాజికాయ మాదిరిగా ఉండును.ఈ కాయలు ఫాల్గుణ మాసం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో సంగ్రహించిన బాగుగా పండి సారవంతంగా ఉండును.బాగుగా పెరిగి పండిన కాయ ఒక తులము వరకు బరువు ఉండును. వాడుక యందు ఈ కాయ పైన బెరడు ఉపయోగిస్తారు. ఇది అరణ్యములలో ఉండును. గింజ లోపలి పప్పు నేత్రములకు అద్భుతంగా పనిచేయును .

   

*********** సమాప్తం ************* 


  మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

28, అక్టోబర్ 2025, మంగళవారం

Panchaag


 

వేద పండితులు

 వేద పండితులు, ఆవులు కనిబడితే వదలకండి కనీసం ఒక పండైనా ఇచ్చి నమస్కరించండి.

 అందరూ వేదసభలు చేస్తూ వేద పండితుల ఆశీర్వాదములను తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే వేదపండితులు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి యొక్క స్వరూపం కాబట్టి.

"వేదపండితులను సేవించడం" అనేది భగవత్ భక్తిలో అత్యున్నత పుణ్యకార్యాలలో ఒకటి. వేదాలు అపౌరుషేయాలు.వేదాలు సాక్షాత్ పరమాత్ముని ఉచ్చ్వాస నిశ్వాసలుగా భావింపబడతాయి; ఆ వేదాలను అధ్యయనం చేసి, ఆచరిస్తూ, ధర్మాన్ని నిలబెట్టే వారు వేదపండితులు ( బ్రాహ్మణులు, శ్రోత్రియులు, వేదవేత్తలు).

అటువంటి వేదపండితులను సేవించడం అంటే — వేదమాతను, పరబ్రహ్మను సేవించినట్లే.


ఇప్పుడు దీనికి సంబంధించిన ఫలితాలను వేద, పురాణ, స్మృతి ఆధారంగా లోతుగా చూద్దాం 👇


🌿 1. వేదపండిత సేవా ఫలితం — వేదమూల మహాపుణ్యం


🕉️ మహాభారతం (శాంతి పర్వం 234.17)


“బ్రాహ్మణానాం ప్రియో యస్తు వేదశాస్త్రార్ధతత్త్వవిత్।

తస్య పుణ్యం సమం నాస్తి త్రిభిర్లోకై స్సహస్రశః॥”


అర్థం:

వేదం చదువుకుని వేదార్థాన్ని తెలుసుకుని, ధార్మిక జీవితమునే ఆచరిస్తున్న బ్రాహ్మణుడిని సంతోషపరిచినవారికి మూడు లోకాలలో సమానమైన పుణ్యం మరెక్కడా లేదు.

అంటే — వేదపండితులను సేవించడం ద్వారా కలిగే పుణ్యం అనేక యజ్ఞాలు చేసిన ఫలితానికంటే గొప్పది.


🌿 2. వేదపండిత భోజనం — అన్నదానమందు శ్రేష్ఠం.


🕉️ గరుడ పురాణం


“బ్రాహ్మణేభ్యో హి యద్దత్తం దశజన్మఫలప్రదమ్॥”


అర్థం:

వేదవేత్త బ్రాహ్మణునికి ఇచ్చిన దానం లేదా సేవ పది జన్మల పాపాలను హరించి, దశ జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది.


అంటే వేదపండితునికి భోజనం పెట్టడం, దక్షిణ ఇవ్వడం, గౌరవించడం వలన ఎన్నో జన్మల పాపములు తొలగి అపార పుణ్యం లభిస్తుంది.


🌿 3. వేదపండిత సేవ — గురు సేవా ఫలితం


వేదపండితుడు గురువులాంటి వాడు. వేద జ్ఞానం ద్వారా భగవత్పథం చూపుతాడు. కాబట్టి వేదపండితుని సేవ = గురు సేవ =  దైవసేవ.


🕉️ మానవ ధర్మశాస్త్రం 2.232:


“గురు శుష్రూషయా విద్యా పుణ్యమాప్తం సుభావతా॥”


అర్థం:

గురువును సేవించినవారికి జ్ఞానం, పుణ్యం రెండూ సులభంగా లభిస్తాయి.


🌿 4. వేదపండిత సేవ వల్ల లభించే ఫలితాలు


 • 🔸 పాప విమోచనం – గతజన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి.


 • 🔸 కులపవిత్రత – వేదపండిత సేవ వల్ల ఏడు తరాల పితృదేవతలు సంతృప్తి చెందుతారు.


 • 🔸 ధర్మస్థిరత – ఇంటిలో ధర్మం నిలుస్తుంది; దురదృష్టం, వ్యాధులు దూరమవుతాయి.


 • 🔸 భగవత్ కృప – వేదపండితుడు భగవంతుని ప్రతినిధి కాబట్టి, ఆయన ఆశీర్వాదం దైవానుగ్రహముగా మారుతుంది.


 • 🔸 జ్ఞానప్రాప్తి – భక్తి, వివేకం, శాంతి స్వయంగా వస్తాయి.


 • 🔸 మోక్షప్రాప్తి – వేదపండితుల ఆశీర్వాదం వలన చిత్తశుద్ధి కలిగి, చివరికి ముక్తి లభిస్తుంది.


🌿 5. సంస్కృత సుభాషితం


“విప్రసేవా పరా పూజా పుణ్యానాం సముచ్చయః।

వేదపండితసేవాసు న త్ర్రైలోక్య మీదృశమ్॥”


భావం:

వేదపండితుని సేవ చేయడం అన్నది పుణ్యకార్యాలలో శ్రేష్ఠమైనది. మూడు లోకాలలో దానికి సమానమైన పూజ లేదు.


🌿 6. చిన్న ఉదాహరణ


భగవాన్ శ్రీరాముడు తాను అరణ్యంలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షిని సేవించాడు. పాండవులు దుర్వాస మహర్షులను గౌరవించారు.

అటువంటి సేవ ద్వారానే వారికి దేవానుగ్రహం లభించింది. ఇది వేదపండిత సేవ యొక్క శక్తి.


🔔 సారాంశం


వేదపండితులను గౌరవించడం అంటే వేదమాతను గౌరవించడం,

వేదపండితులకు భోజనం పెట్టడం అంటే యజ్ఞం చేయడంతో సమానం,

వేదపండితులను సేవించడం అంటే పరమాత్మునికి సేవ చేయడం.


అందుకే పూర్వకాలం నుండి “బ్రాహ్మణసేవా పుణ్యం” అనేది ముక్తిమార్గానికి సర్వోత్తమమైన దారి అని పేర్కొన్నారు.


   మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.పుట్టినరోజులలో, పెళ్లిరోజులలో, వివాహం, గృహప్రవేశం ఇలాంటి అనేక శుభకార్యాలలో, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, మహాశివరాత్రి, ఉగాది ఇటువంటి పర్వదినాలలో వేద పండితులను ఆహ్వానించి సత్కరించి ఆశీర్వచనాన్ని అందుకోవడం చేత 33 కోట్ల దేవతలతో కూడిన కాశీ విశ్వనాథుడి ఆశీర్వచనాన్ని అందుకున్న ఫలితాన్ని పొందుతారు, అనేక శుభపులితాలు తప్పక కలుగుతాయి. జైశ్రీరామ్.

ఉపనిషత్తుల వెలుగు*

 *

*ఉపనిషత్తుల వెలుగు*


ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, మనిషి అంతరంగంలో మాత్రం శాంతి కోసం అన్వేషణ ఆగలేదు. 


ఆధునికత, భౌతిక సుఖాలు పూరించలేని ఏదో ఒక శూన్యం మనిషిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే, మన పూర్వీకులు అందించిన ఉపనిషత్తుల జ్ఞానం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.


మన నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన తాత్విక పునాదిని ఉపనిషత్‌ (గురువు దగ్గర కూర్చుని తెలుసుకోవడం అని అర్థం) గ్రంథాలు అందిస్తాయి. 


నవజీవనాన్ని నిర్మించుకోవడానికి ఉపనిషత్తుల సమన్వయం ఎంతో ఉపకరిస్తుంది. 


నేటితరం ఎక్కువగా బాధపడేది అనిశ్చితి, ఒత్తిళ్లతోనే. ఆ దిశగా ఉపనిషత్తులు మనకు అతి ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తాయి. 


బాహ్య రూపం, పదవులు, ఆస్తులు తాత్కాలికమని, మనలో ఉన్నది శాశ్వతమైన, శక్తిమంతమైన ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. 

ఒత్తిడికి విరుగుడు ఇదే. 


శ్రీరాముడికి వశిష్ఠుడు ఉపదేశించినట్లుగా, ‘నువ్వు’ శరీరం కాదు, మనసు కాదు. కేవలం సాక్షి అనే జ్ఞానం స్థిరపడినప్పుడు చిన్న చిన్న వైఫల్యాలు, నిరాశలు మనల్ని కదిలించలేవు. ఒత్తిడికి లొంగిపోకుండా, నిజమైన అంతర్గత శక్తితో పనిచేయడం అలవడుతుంది. 


ఛాందోగ్యోపనిషత్తులోని ‘తత్త్వమసి’ (ఆ సత్యమే నువ్వు) అనే మహా వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆధునిక సమాజానికి ఎంతో అవసరం. 


స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, సర్వజీవులలోనూ ఒకే చైతన్యం ఉందని, మనలో ఉన్న పరమాత్మే ఎదుటివారిలోనూ ఉందని గుర్తించడం మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ భావన మనలో సహానుభూతి, కరుణలను పెంచుతుంది. 


ఇతరుల పట్ల ద్వేషం, అసూయ లేకుండా ప్రేమతో మెలిగే గుణాన్ని అలవరుస్తుంది.


ఈశావాస్యోపనిషత్తు చెప్పే ప్రధాన సూత్రం- ఫలితం ఆశించకుండా కర్మ చేయమని. ఉపనిషత్తుల అధ్యయనం మనకు పని పట్ల కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. 


శ్రద్ధ మాత్రమే మన చేతిలో ఉందని, ఫలితం దైవ సంకల్పం లేదా ప్రకృతి నియంత్రణలో ఉందని తెలుస్తుంది. ఫలితంపై అధికారం లేదని గ్రహించినప్పుడు, భయం తగ్గి, మనం చేయగలిగే పనిపైనే దృష్టి ఉంటుంది. ఇది వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. 


మన జాతీయ చిహ్నంపై ఉన్న ‘సత్యమేవ జయతే’ అనే వాక్యం ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నది. జీవితంలో స్థిరమైన పునాది ఉండాలంటే, అది కేవలం సత్యం, ధర్మం మీదే ఆధారపడాలి. విలువలు లేని విజయం తాత్కాలికం. ఎన్ని ప్రలోభాలు ఉన్నా, సత్య మార్గాన్నీ, ధర్మబద్ధమైన జీవితాన్నీ ఎంచుకున్న వ్యక్తి ఎప్పుడూ పతనమవ్వడు. 


నిజాయతీ, నైతికతలతో కూడిన వ్యాపారాలు, వృత్తులే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయి.


ఉపనిషత్తులు కేవలం గ్రంథాలు కావు, అవి జీవన సూత్రాలు. అవి మనకు కొత్త లోకాన్ని చూపించవు, కానీ ఉన్న ప్రపంచాన్ని సరికొత్తగా, లోతుగా చూసే జ్ఞానాన్ని అందిస్తాయి. అప్పుడు ఆ ఉపనిషత్తుల వెలుగులో మన ప్రతి అడుగు మరింత దృఢంగా పడుతుంది

27, అక్టోబర్ 2025, సోమవారం

తెలియని వన్ని తప్పులని

 తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్

పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ

పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా

రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!

(".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం)

Panchaag


 

తేనె గురించి

 తేనె గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

      

     తేనె వలన మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి తేనె మన ఆహారంలో భాగం అయినది. ఈజిప్టు పిరమిడ్లలో 

మమ్మీల పక్కన తేనెతో కూడినటువంటి పాత్రలు కనుగొన్నారు. ఎంతకాలం ఉన్నను చెడిపోనటువంటి ఒకేఒక ఆహారపదార్ధం తేనె . ఆయుర్వేద ఔషధాలలో తేనెని విరివిగా వాడటం జరుగుతుంది. తేనె జీర్ణక్రియతో సంబంధం లేకుండా గ్లూకోజ్ మాదిరి సరాసరి రక్తంలో కలియును. కావున వెంటనే శక్తిని కలిగించును.

         

         ఇప్పుడు మీకు తేనె గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

 

° తేనె ఉత్పత్తి -

        

     తేనె వివిధ పుష్పముల నుంచి తేనెటీగల ద్వారా సేకరించబడును. ఇది ఎక్కువుగా అడవుల్లో చెట్లకు , గుట్టలు కు దొరుకును. తేనెటీగలు వివిధ పుష్పములనుంచి సేకరించిన తేనెను చెట్లకు గాని గుట్టలకు గాని తెట్టెలుగా చేసుకుని అందులో భద్రపరుచుకొనును. అట్టి తెనే తెట్టలకు జాగ్రత్తగా పొగపెట్టి తేనెటీగలు ను పారదోలి తేనెతెట్టలను సేకరించెదరు . కాని తెట్టలను తేనెటీగ గుడ్లతో మరియు ఈగలతో సహా పిండెదరు ఇలా సేకరించి సేవించిన తేనె ఆరోగ్యానికి చాలా హానికరం. కావున తేనెటీగలు గుడ్లు పుట్టకముందు తేనెని సేకరించాలి. ఇటువంటి తేనె ఆరోగ్యానికి హానికరం మరియు మధురంగా ఉండును. దీనిని నిలువ కూడా చేసుకోవచ్చు. కాని గుడ్లతో ఉన్న తెట్టల నుంచి తీసిన తేనె కొద్దిరోజుల్లోనే పులిసిపోవును. అందువలనే దాని రంగు , రుచిలో మరియు వాసనలో తేడా వచ్చును. కావున తేనెని సంగ్రహించేప్పుడు తగు జాగ్రత్త వహించవలెను.

 

     స్వచ్చమైన తేనెని పరీక్షించు విధానం -

       

       తేనె వివిధ రుతువులలో వివిధ రంగులుగా ఉండును. అదేవిధంగా దాని సాంద్రత , రుచి కూడా వేరువేరుగా ఉండును. కొన్ని తేనెలు ఎర్రగాను , కొన్ని తేనెలు తెల్లగాను , కొన్ని తేనెలు కొంచం నల్లగాను ఉండును. కొన్ని తేనెలు పలుచగాను , కొన్ని తేనెలు చిక్కగాను ఉండును. అనగా తేనె ఒకే రంగు , ఒకే రుచి , ఒకే వాసన ఎప్పుడూ ఉండదు కావున అది స్వచ్ఛమైనదా లేక నకిలీదా అన్నది గుర్తించడం చాలా కష్టం. కాని ఎల్లప్పుడూ తేనె వాడువారు గుర్తించగలరు.

  

 తేనెని పరీక్షించు విధానం -

        

       స్వచ్చమైన తేనె పైన ఈగ వాలినను దానికి అంటకుండా లేచిపోతుంది. అదేవిధంగా తేనెని ఒక కాగితం పైన వేసిన కిందిభాగం తడి కాదు అదే కల్తీ తేనె అయినచో కాగితం కింది భాగం తడిచిపోవును. 

      

           వీలుంటే మీ కళ్ళముందే తేనె తుట్టెని పిండించుకోండి .

 

 తేనెలో రకాలు -

      

         తేనెలో వివిధ రకాలు కలవు. కాని అందులో రెండు ముఖ్యమైనవి అవి.

                  

                 * చిన్న తేనె * పెద్ద తేనె                                  

          

       చిన్న తేనెటీగలు చాలా వాడిగా , చురుకుగా ఉండును. అవి కుట్టినచో చాలా మంట పుట్టును. ఈ తేనె చాలా తక్కువుగా అరుదుగా లభించును.

            

        పెద్ద తేనె ఇది చెట్లకు , గుట్టలకు చాలా ఎక్కువుగా లభించును.మరియు ఇది అన్ని ఋతువుల్లో లభించును.

 తేనె ఉపయోగాలు -

 

* మలబద్దకం కలవారు ఉదయమున గోరువెచ్చని నీటిలో రెండుచెంచాలు తేనె వేసుకొని తాగినచో సుఖవిరేచనం అగును.

 

* అతిసారం వల్ల నీళ్ల విరేచనాలతో భాధపడువారు రెండు చెంచాల తేనె రోజుకు మూడుసార్లు తీసుకున్నచో అతిసారం తగ్గును.పొట్ట నొప్పి మరియు గ్యాస్ నివారణ అగును.

 

* గ్రహణి రోగం అనగా బంకవిరేచనాలతో బాధపడేవారు తియ్యని మజ్జిగలో రెండు చెంచాలు తేనె కలుపుకుని త్రాగినచో రెండుమూడు రోజుల్లొ తగ్గును.


 * అమీబియాసిస్ సమస్యతో ఇబ్బంది పడువారు నీళ్లలో తేనె కలుపుకుని తాగుచున్న బలహీనత తగ్గును.శక్తి వచ్చును.రోగనివారణ అగును.

 

* దగ్గు, అలర్జీ , ఆస్తమా ఉన్నవారు ఉదయం , సాయంత్రం వేడినీటిలో రెండు చెంచాలు తేనె వేసుకొని తాగినచో వ్యాధి నివారణ అగును. తేనె కఫమును నివారించును.


 * జ్వరం , టైఫాయిడ్ , మలేరియా , మశూచి , ఆటలమ్మ మొదలగు వ్యాధులలో నీళ్లతో కలిపి తేనెని తీసుకోవడం వలన మంచి శక్తి వచ్చును. జ్వరమును తగ్గించును .

 

* గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వలన గుండెజబ్బులు నివారణ అగును. కొలెస్ట్రాల్ తగ్గించును .

 

* బలహీనంగా ఉండువారుకి తేనె అత్యద్భుతమైన ఔషధం , వీర్యవృద్ధిని కలిగించును.

 

* మధుమేహ సమస్యతో ఇబ్బంది పడువారు కూడా తేనెని వాడవచ్చు. మధుమేహరోగులు స్వచ్ఛమైన తేనె వాడవచ్చు . తేనె వాడితే షుగరు పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే . రక్తమును శుద్ది చేయును కావున ముత్ర విసర్జన సక్రమముగా జరుగును.

 

* చర్మవ్యాధులు , మొటిమలు , పుండ్లు , గాయాలు , కాలినపుడు , క్యాన్సర్ కణితులకు కూడా తేనె రాసిన నివారణ అగును.

 

* వాంతులు , వెక్కిళ్లు, వేవిళ్లు అగుచున్నప్పుడు రెండు చెంచాలు తేనె తిన్నచో నివారణ అగును.

 

* గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ ఉదయం రెండు చెంచాలు తేనె మంచినీటిలో కాని , కుంకుమపువ్వుతో కాని తీసుకున్నచో మంచి ఎరుపు , తెలుపు కలిగిన ఆరోగ్యవంతమైన శిశువు జనించును.

 

* ప్రతిరోజు రెండుసార్లు చిన్నపిల్లలకు తేనె తాగించినచో వారికి మలబద్దకం , అజీర్ణం , కడుపునొప్పి , అతివిరేచనములు వచ్చే అవకాశం ఉండదు.


 * ప్రతినిత్యం స్త్రీ , పురుషులు ఇరువురు ఉదయాన్నే కాఫీ, టీ లకు బదులు నిమ్మకాయ , తేనె కలిపి తాగినచో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

         

         తేనెలో ఉండు ఔషధ గుణాలు అన్నియు ఆ తేనెటీగలు తిరిగే స్థలంలో ఉండు మొక్కలపై అధారపడి ఉండును. అవి తిరిగే స్థలం నందు ఔషధ మొక్కలు ఎక్కువ ఉన్నచో ఆ తేనె యందు ఔషధ విలువలు ఎక్కువుగా ఉండును.

                       

             

         ******* సమాప్తం ********


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  

గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

26, అక్టోబర్ 2025, ఆదివారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝     *సంపదః స్వప్రసంకాశాః*

            *యౌవనం కుసుమోపమ్|*

            *విధుఛ్చచంచలమాయుష్యం*

            *తస్మాత్ జాగ్రత జాగ్రత||*


తా𝕝𝕝 *మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది... ఈ జీవితమూ మెరుపు వలె క్షణ భంగురము.. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము....*


✍️💐🌸🌹🙏

Panchaag

 


జ్ఞానము

 *జ్ఞానము అనంతము 5*


సభ్యులకు నమస్కారములు.


11) *పంచాగ్ని విద్య* :- ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటి యందు శ్రద్ధ, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అను పంచ ద్రవ్యములను లేక పంచ ఆహుతులను హోమము చేయగా ఉదకములు (వృష్టి) పురుష రూపము చెందుతున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములలో చేరి క్రమముగా ఆకాశము మీద శ్రద్ధా రూపంలో చేరి, వర్ష రూపంలో భూమిపై పడి అన్నం రూపంలో పురుషునిలో చేరి, రేతస్సు రూపంలో స్త్రీ గర్భం యందు ప్రవేశించి, అక్కడ పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవ రూపంలో ఉండుట ధర్మము.

12) *దహార విద్య* :- బ్రహ్మ రంధ్రము నుండి చిన్న కమలము. ఆ కమలము మధ్యన సూక్ష్మమైన శూన్య స్థానము. ఆ శూన్యమే *దహరాకాశ* మనబడును. దీనిని తెలుసుకున్న వాడు బ్రహ్మను తెలుసుకొనగలుతాడు. 

ఈ విద్యనే *దహర* 

విద్య లేక *ప్రాణ* 

విద్య అందురు. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు,హృదయంలో పుండరీకాక్షుని  రూపంలో స్వామిని ఉపాసన చేస్తారు. ఇది *దహర* విద్య కారణంగానే సాధ్యము.

13) *సంవర్గ - వాయు సంవర్గ విద్య* :- వాయువు ఆనగా హిరణ్యగర్భుడు. ఇతడితోనే ప్రపంచ మంతా పుట్టి, స్థితిని, కల్గి లయించుచున్నది. . సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడి (సృష్టి, స్థితి, లయకారుడు) లో చేరి ఉండుట. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రళయ కాలములో చేరి ఈ వాయువుగా వ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తాను గూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. 

14) *మధు విద్య*;-

 సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామ, రూప, క్రియా నటనలను వదిలి, అందలి సారమైనటువంటి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధు విద్య. ఆ సారమే దైవత్వము లేక మధువు లేక అమృతము.  మధు విద్యోపాసకులకు  బ్రహ్మానందము సిద్ధించును.

15) *అపర విద్య* :- 

గడ్డి పరక మొదలు సృష్టి కర్తవరకు గల ప్రకృతి  గుణములను వివేకంతో సరిగ్గా గ్రహించి కార్యసిద్ధిబడయుట.  ధర్మాధర్మములను తెలుసుకొనుట. ఈ రెండింటికి సంబంధించిన విద్యనే అపర విద్య.


శ్లో! *అభ్యసేన క్రియా: సర్వా: !అభ్యాసాత్ సకలా: కళా! అభ్యాసాత్ ధ్యాన మౌనాది: కిమభాసస్య దుష్కరమ్* 


భావం:- అభ్యాసంతో అన్ని పనులు సాధ్యమవుతాయి. అభ్యాసంతో సకల కళలు సాధించవచ్చు. అభ్యాసంతోనే  ధ్యానం, ఆలాగే మౌనం సాధ్యం. అసలు అభ్యాసంతో సాధ్యం కానిదేమిటి. అభ్యాసం మానవుడిని పరిపూర్ణుడిని చేస్తుంది.


ధన్యవాదములు.

*(స్వస్తి)*

శివస్తుతి

 *శివస్తుతి - కార్తికమాసం-విశ్వావసు*


సీ॥

తలపైన గంగమ్మ తాండవంబాడగా 

ఉలుకకుందువు నీకు నోర్పు మెండు 

నాగులెన్నియొ మీద నర్తించి తిరుగాడ 

భూషలందువు గొప్ప పోడిమౌర! 

వ్రేలు పుఱ్ఱెలదండ ప్రీతిగా తలుతువు 

వైరాగ్య మెంతగా ప్రబలెనయ్య! 

వటవృక్షమూలాన వరలు ధ్యానముతోడ 

నిత్యతపము సల్పు నియతి నీది 

తే.గీ.

జాయ పార్వతి తగ్గదై సహకరించ

లోటు లేదయ్య విశ్వేశ లోకములను 

ప్రోచి పాలించు నిన్నేను మ్రొక్కి గొలుతు 

మోక్ష మీయవె దయతోడ వ్యోమకేశ! -6

===========

పోడిమి=ప్రవర్తన

*~శ్రీశర్మద*

నవ్వుకుందాం

 సరదాగా కాసేపు నవ్వుకుందాం 


మన తెలుగు భాష పై చమత్కారం తో కూడిన మాటలు


 నెలవంక ఉంటుంది గానీ

 "వారం వంక" ఉండదు అదేంటో!!!


 "పాలపుంత" ఉంటుంది గానీ

 "పెరుగుపుంత" ఉండదు.


 "పలకరింపు" ఉంటుంది గానీ

 "పుస్తకంరింపు" ఉండ దెందుకు?


 "పిల్లకాలవ" ఉంటుంది గానీ

 "పిల్లోడి కాలవ" ఉండదు. ఎందువల్లనో?

 

 "పామాయిల్" ఉంటుంది గానీ

 "తేలు ఆయిలు" ఉండదు.


 "కారు మబ్బులు" ఉంటాయి గానీ

 "బస్సు మబ్బులు" ఉండ వేమిటో!


 "ట్యూబ్ లైటు" ఉంది గానీ

 "టైర్ లైటు" ఉండదు.


 "ట్రాఫిక్ జామ్" ఉంటుంది గానీ

 "ట్రాఫిక్ బ్రెడ్" ఉండదు.


 "వడదెబ్బ" ఉంటుంది గానీ

 "ఇడ్లీ దెబ్బ" ఉండదు 


 "నిద్రగన్నేరు చెట్టు" ఉంటుంది గానీ

 "మెలకువ గన్నేరు చెట్టు" ఉండదు.


 "ఆకురాయి" ఉంటుంది గానీ

 "కొమ్మరాయి" ఉండదు 


 "పాలపిట్ట" ఉన్నది గానీ

 "పెరుగు పిట్ట", గానీ, "మజ్జిగ పిట్ట" గానీ ఉంటే ఒట్టు.


 "వడ్రంగి పిట్ట" ఉంది గానీ

 "ఇంకో వృత్తి పిట్ట" లేదు ఎందుకనో 


చుట్టరికాలు మాత్రమే ఉంటాయి గానీ

 "సిగరెట్టరికాలు" ".బీడీరికాలూ" ఉండ వేమిటో.


 "రంగులరాట్నం" ఉంటుంది గానీ

 "బ్లాక్ అండ్ వైట్ రాట్నం" ఉండ దెందుకని?


 "ఫైర్ స్టేషన్" లో ఫైర్ ఉండదు 


"పులిహారలో" పులి ఉండదు 


 "నేతి బీరకాయ" లో నెయ్యి ఉండదు.


 "మైసూర్ పాక్" లో మైసూర్ ఉండనే ఉండదు.

మైసూర్ బజ్జి లో మైసూర్ వుండదు 


 "గాలిపటంలో" గాలి ఉండదు 


 "గల్లాపెట్టెలో" గల్లా ఉండదు.


చివరాఖరుగా

 "ఫేసు బుక్కులో" పుస్తకం వుండదు 

"యూ ట్యూబులో" గొట్టం ఉండదు !


హాస్యం మనస్సును ప్రశాంతత చేస్తుంది..!

సంపూర్ణ శ్రీ కాశీ ఖండము

 ...:

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*



*శ్రీవేదవ్యాస ప్రణీత శ్రీ స్కాంద మహాపురాణాంతర్గత*


*సంపూర్ణ శ్రీ కాశీ ఖండము*


*అధ్యాయం - 4*


*పతివ్రతాఖ్యాన వర్ణనము :*


సూతుడు చెప్పాడు-


మహామునీ! అగస్త్య మునీంద్రుడు అడుగగా దేవతలేమి చెప్పారు. సమస్తలోకాల మేలుకోసం దాన్నిచెప్పండి. దేవతలందరు అగస్త్యునిమాటవిని గౌరవపూర్వకంగా బృహస్పతివైపు చూశారు. 


మహానుభావా! అగస్త్య మునీంద్రా! దేవతల రాకకి కారణాన్ని విను. నీవు ధన్యుడవు. కృతకృత్యుడవు. మహాత్ములకు కూడ నీవు మాన్యుడవు. 


మునిశ్రేష్ఠుడా! ప్రతి ఆశ్రమం ప్రతి పర్వతం, ప్రతి అరణ్యంలోను తపోధనులున్నారు. కాని నీమర్యాద భిన్నమైనది. నీలో తపోలక్ష్మి, బ్రహ్మతేజస్సు రెండూ స్థిరంగా ఉన్నాయి. 


పుణ్యలక్ష్మికూడ ఉత్కృష్ట రూపంలో నీలో ప్రకాశిస్తున్నది. ఔదార్యం, మనస్విత కూడ నీలో ఉన్నాయి. తనకథని లోకంలో పుణ్యాన్ని కలిగించేది, నీ సహ ధర్మచారిణి, కల్యాణి అయిన మహాపతివ్రత లోపాముద్రాదేవి నీ శరీరానికి నీడలా నీతోపాటుగా 'ఉంటున్నది. 


అరుంధతి, సావిత్రి, అనసూయ, శాండిల్య, సతి, లక్ష్మి, శతరూప, మేనక, సునీతి, సంజ్ఞ, స్వాహ మొదలైన పతివ్రతల్లో ఈ లోపాముద్రని శ్రేష్ఠురాలిగా చెపుతున్నారు. 


మరి ఇతరులెవ్వరులేరు. ఇది నిశ్చయం, మునీంద్రా! నీవు భుజించిన తరువాత భుజిస్తుంది. నీవు కూర్చున్న తరువాత కూర్చుంటుంది. 


తనను తాను అలంకరించు కోకుండా ఎన్నడు నిన్ను చూడదు. పనిమీద పొరుగూరికి వెళ్ళినప్పుడు అన్నివిధాల ఆభరణాల్ని విడిచిపెతుంది. 

నీ ఆయువు వృద్ధికావడానికి ఎన్నడు నీ పేరును పలుకదు. ఎన్నడు పరపురుషుని పేరునుకూడ తలవదు. కోపంతో పట్టుకున్న ప్పటికి బాధపడదు. కొట్టినప్పటికి ప్రసన్నంగానే ఉంటుంది. 


ఈ విధంగా చెయ్యమనగానే స్వామీ! చేసినట్లుగా తెలుసుకొనండని చెపుతుంది. పిలిచినప్పుడు ఇంటి పనుల్ని విడిచిపెట్టి వెంటనే వస్తుంది. 


నాథా! ఎందుకు పిలిచారో అనుగ్రహంతో చెప్పండి అని అడుగుతుంది. ద్వారంలో చాలసేపు నిలుచుండదు, కూర్చుండదు. నీవు ఇవ్వనిదాన్ని ఎన్నడు ఎవ్వరికి ఇవ్వదు. 


నీవు చెప్పకుండానే పూజాసామగ్రిని స్వయంగా సమకూరుస్తుంది. మడినీళ్ళు, దర్భలు, పత్రాలు, పుష్పాలు, అక్షతలు మొదలైనవాటిని అవసరానికి అనుకూలంగా కంగారుపడకుండగా చాలసంతోషంతో సర్వాన్ని సమకూరుస్తుంది. 


భర్త తినగా మిగిలిన అన్నం, పండ్లు మొదలైన వాటిని తాను తింటుంది. భర్త ఇచ్చినదాన్ని మహాప్రసాదమని స్వీకరిస్తుంది. దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు, గోవులకు, యాచకులకు పెట్టకుండగా ఎన్నడు భుజించదు. 


ఇంటి ఇల్లాలికి అవసరమైన వస్తువుల్ని, అలంకారాల్ని చక్కగా దాచి ఉంచడంలో సమర్థతకలిగి అనసవరమైన ఖర్చుని చెయ్యకుండా ఇంటి సంపదని పెంచుతుంది. 


నీఅనుమతి లేకుండా వ్రతాల్నికాని ఉపవాసాల్నికాని చెయ్యదు. ఆమె సమాజాన్ని, ఉత్సవాల్ని చూడటాన్ని దూరంనుంచే విడిచిపెడుతుంది. 


తీర్థయాత్రలకు, వివాహం మొదలైన వాటిని చూడటానికి వెళ్ళడు. భర్త సుఖంగా నిద్రిస్తున్నప్పుడు కాని, సుఖంగా కూర్చున్నప్పుడు మూడురాత్రులు తన ముఖాన్నే చూపించదు. 


స్నానం చేసి పరిశుద్దురాలైనంత వరకు తన మాటని వినపడనీయదు. చక్కగా స్నానం చేసి భర్తముఖాన్నే చూస్తుంది కాని ఇతరుల ముఖాన్ని చూడదు. లే


కపోతే మనసులో భర్తని ధ్యానించి సూర్యుని చూస్తుంది. పసుపు, కుంకుమ, సిందూరం, కాటుక, రవిక, తాంబూలం, మంగళ ప్రదములైన ఆభరణాలు, కేశసంస్కారం, జుట్టుముడి, అనేవాటిని భర్త ఆయుష్షుని కోరే పతివ్రత విడిచిపెట్టదు. 


పతివ్రత చాకలిస్త్రీతోకాని, సత్కర్మలకి విరుద్ధంగా మాట్లాడే స్త్రీతోగాని, బౌద్ధభిక్షుకురాలితోగాని, దురదృష్టవంతు రాలైన స్త్రీతోకాని ఎన్నడు స్నేహం చెయ్యదు. 


పతివ్రత భర్తని ద్వేషించే స్త్రీతో ఎన్నడు మాట్లాడదు. ఒంటరిగా ఎన్నడు ఉండదు ఎన్నడు నగ్నంగా స్నానంచెయ్యదు. 


రోటి పై కాని, రోకలి పైకాని, చీపురుమీదకాని, రాతిమీదకాని, గోధూమాదుల్ని చూర్ణంచేసే రాతిమీదకాని, గడపమీదకాని ఎన్నడు కూర్చుండదు. 


సంభోగ సమయంలో తప్ప మరెప్పుడు ప్రౌఢంగా సంచరించదు. ఎల్లప్పుడు భర్తకిష్టమైన విషయాల్లోనే ప్రేమని కలిగి ఉంటుంది. భర్తమాటని అతిక్రమించకుండా ఉండటమే స్త్రీలకు ఒకటే వ్రతం అదే పరమ ధర్మం అదే దేవపూజనం అవుతాయి. 


వీర్యహీనుడైనా, కష్టదశలో ఉన్నా, రోగగ్రస్తుడైనా, ముసలివాడైనా, మంచిస్థితిలో ఉన్నా, చెడ్డస్థితిలో ఉన్నా భర్తనొక్కనిని స్త్రీ అతిక్రమించ కూడదు. 


భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను, భర్త నీ బాధతో ఉన్నప్పుడు తాను బాధతోను, సంపదలోను, ఆపదలోను పుణ్యవతి అయిన స్త్రీ ఒక్క రూపంగానే ఉంటుంది. 


నెయ్యి, ఉప్పు, నూనె మొదలైనవి లేకపోయినప్పటికి పతివ్రత అయిన స్త్రీ లేవని భర్తతోచెప్పకూడదు. భర్తకి కష్టాన్ని కలిగించకూడదు. 


తీర్ధ స్నానం చెయ్యాలనే కోరిక కలిగిన స్త్రీ భర్తపాదజలాన్ని త్రాగాలి. ఈశ్వరునికంటే, విష్ణువుకంటే స్త్రీలకు భర్త ఒక్కడే అధికుడు. 


భర్తని వ్యతిరేకించి వ్రతాల్ని, ఉపవాసాల్ని ఆచరించిన స్త్రీ తన భర్తఆయుష్షుని హరిస్తుంది. తరువాత తాను మరణించి నరకానికి వెళుతుంది.

25, అక్టోబర్ 2025, శనివారం

అద్భుతమైన పద్యం

 

అద్భుతమైన పద్యం 

పోతన వ్రాసిన భాగవతంలోని ప్రతి పద్యము ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. అది కందము కానీయండి, మత్తేభం కానీయండి, సేసం కానీయండి. ప్రతి పద్యం చదవటానికి అనువుగా, వినసొంపుగా అర్ధవంతంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు. చిన్న చిన్న పద్యాలలోకూడా ఎంతో భావాన్ని అర్ధవంతంగా పొందుపరచటంలో పోతనకు సాటి వేరొకరు రారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ చూడండి ఒక చిన్న కంద పద్యంలో అన్నే లోకాలను చుట్టుముట్టి వచ్చాడు. 

కం||
లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

 

లోకాలు అంటే మనకు తెలుసు చతుర్దశ భువనాలు అంటే 7 ఊర్ధ్వ లోకాలు 7 అదో లోకాలు వెరసి 14 లోకాలు ఉన్నట్లు మనకు శాస్త్రోవాచ అటువంటి అన్ని లోకాలకు పరిపాలించే రాజులు అంతేకాదు ఆ లోకాలలో నివసించేవారు అన్నీకూడా సృష్టి అంతంలో నశించినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు లోకాలు వుండవు, రాజులు వుండరు, లోకాలలో వుండే జనాలు వుండరు అంతా నశించిపోయి కారు చీకట్లు కమ్మి ఉంటాయి అని సృష్టి వినాశనాన్ని గురించి చెపుతారు. అప్పుడు ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు కూడా నశించిన తరువాత పూర్తిగా అంధకార బంధురంగా ఉంటుంది. అటువంటి చీకట్లలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే పరమేశ్వరుడు అని శాస్త్ర ఉవాచ అంటే కేవలం ఈశ్వరుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఆ పరమేశ్వరుడు మరల సృష్టి కార్యం చేపట్టి క్రొత్తగా సృష్టిని అంటే మరల లోకాలను, లోకేసులను, లోకస్తులను సృష్టిస్తాడన్నమాట. అటువంటి దివ్యమైన శక్తివంతమైన పరమేశ్వరుడిని నేను సేవిస్తాను అని ఇక్కడ కవి అంటున్నాడు. అది ఎంతటి అద్భుతమైన భావనో చుడండి.  

మరిన్ని ఇటువంటి విషయాలకోసం వేచిచూడండి 

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

అద్భుతమైన పద్యం

అద్భుతమైన పద్యం 

పోతన వ్రాసిన భాగవతంలోని ప్రతి పద్యము ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. అది కందము కానీయండి, మత్తేభం కానీయండి, సేసం కానీయండి. ప్రతి పద్యం చదవటానికి అనువుగా, వినసొంపుగా అర్ధవంతంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు. చిన్న చిన్న పద్యాలలోకూడా యంతో భావాన్ని అర్ధవంతంగా పొందుపరచటంలో పోతనకు సాటి వేరొకరు రారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ చుడండి ఒక చిన్న కంద పద్యంలో అన్నే లోకాలను చుట్టుముట్టి వచ్చాడు. 

కం||
లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

 

లోకాలు అంటే మనకు తెలుసు చతుర్దశ భువనాలు అంటే 7 ఊర్ధ్వ లోకాలు 7 అదో లోకాలు వెరసి 14 లోకాలు ఉన్నట్లు మనకు శాస్త్రోవాచ అటువంటి అన్ని లోకాలకు పరిపాలించే రాజులు అంతేకాదు ఆ లోకాలలో నివసించేవారు అన్నీకూడా సృష్టి అంతంలో నశించినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు లోకాలు వుండవు, రాజులు వుండరు, లోకాలలో వుండే జనాలు వుండరు అంట నశించిపోయి కారు చీకట్లు కమ్మి ఉంటాయి అని సృష్టి వినాశనాన్ని గురించి చెపుతారు. అప్పుడు ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు కూడా నశించిన తరువాత పూర్తిగా అంధకార బంధురంగా ఉంటుంది. అటువంటి చీకట్లలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే పరమేశ్వరుడు అని శాస్త్ర ఉవాచ అంటే కేవలం ఈశ్వరుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఆ పరమేశ్వరుడు మరల సృష్టి కార్యం చేపట్టి క్రొత్తగా సృష్టిని అంటే మరల లోకాలను, లోకేసులను, లోకస్తులను సృష్టిస్తాడన్నమాట. అటువంటి దివ్యమైన శక్తివంతమైన పరమేశ్వరుడిని నేను సేవిస్తాను అని ఇక్కడ కవి అంటున్నాడు. అది ఎంతటి అద్భుతమైన భావనో చుడండి.  

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

🌹25అక్టోబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

  *🌹25అక్టోబర్2025🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

               

            *ఈనాటి పర్వం* 

            *నాగులచవితి* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : చవితి* రా 03.48 వరకు ఉపరి *పంచమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : అనూరాధ* ఉ 07.51 వరకు *జ్యేష్ఠ*

సూర్యరాశి : *తుల*                      

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.12* 

సూర్యాస్తమయం :*సా 05.48*

*యోగం : శోభన* *ఈరోజంతా రాత్రితో సహా* 

*కరణం  : వణజి* మ 02.34 *భద్ర* రా 03.48 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 12.54 - 02.42*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*

*వర్జ్యం    : మ 02.08 - 03.56*

*దుర్ముహూర్తం  : ఉ 06.02 - 07.36*

*రాహు కాలం   : ఉ 08.57 - 10.24*

గుళికకాళం      : *ఉ 06.02 - 07.30*

యమగండం    : *మ 01.19 - 02.46*


*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.02 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.42*

మధ్యాహ్న కాలం    :    *10.42 - 01.01*

అపరాహ్న కాలం    : *మ 01.01 - 03.21*


*ఆబ్ధికం తిధి         : కార్తీక శుద్ధ చవితి*

సాయంకాలం        :  *సా 03.21 - 05.40*

ప్రదోష కాలం         :  *సా 05.40 - 08.09*

రాత్రి కాలం           :*రా 08.09 - 11.27*

నిశీధి కాలం          :*రా 11.27 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.24 - 05.13*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁ఆంజనేయ స్తోత్రం🍁*


*గతి నిర్జిత వాతాయ* 

*లక్ష్మణ ప్రాణదాయచ*

*వనౌకసాం వరిష్ఠాయ* 

*వశినే వననాసినే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Doctor

 Doctor: 

How old are you and what's bothering you?


Rakesh: 

Doctor, I'm 65 years old. Every night I go to sleep, I'm afraid someone is hiding under my bed...

This is why I can't sleep.


Doctor: 

You'll have to come every week for six months.


Rakesh: 

How much will it cost, Doctor?


Doctor: 

Around 40,000-50,000 rupees.


After six months, the doctor sees Rakesh on the way...


Doctor: 

What happened, Rakesh? You didn't come back for treatment.


Rakesh: 

Doctor, a friend of mine treated me.


Doctor: 

What's the matter? What kind of treatment did your friend give you?


Rakesh: 

Nothing, he just said...

Sell the bed and sleep on the mattress on the floor.

That's all I'm doing.


 *The moral of the story*...


*Before going to the doctor, talk to your friends* !


*Because...friendship is the medicine that never expires*!


*Where there are friends, you will surely find a way out*.


Dedicated to all friends. Always be happy, be cheerful, be busy... Keep smiling and laughing...


Yours friendly


😃😃😃🌹


Good Night

శివుడాజ్ఞ

 

శివుడాజ్ఞ  

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఇది ఇప్పటి మాట కాదు మన తాత ముత్తాతలనుండి వస్తున్న నానుడి. నిజానికి ఈ చరాచర జగత్తుని మొత్తాన్ని నిర్మించేది, నడిపించేది, నిర్ములించేది ఆ పరమ శివుడే. నా దృష్టిలోకి వచ్చిన ఒక సంఘటన ఇక్కడ పొందుపరిచ ప్రయత్నిస్తాను. 

చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక యదార్ధ గాధ. 

నా మిత్రుడు వాళ్ళ తండ్రిగారు మరియు వారి బంధువర్గం కొంతమంది ఒక మెటాడోర్ వ్యాను ( ఇంతకుముందు ఉండేవి ఇప్పుడు అవి లేవు. అందులో 7-8 మంది ప్రయాణించే సదుపాయం ఉండేది.) తీసుకొని తీర్థ యాత్రలకు వేళ్ళ సంకల్పించారు. కాగా వారికి అందులో ఒక సీటు కాళీగా ఉండటంతో ఆ సీటుని నింపాలని మా స్నేహితుని తమ్ముని రమ్మని అన్నారు. దానికి అతను నాన్న నేను 10వ తరగతి పరీక్షలకు  చదువుకుంటున్నాను కదా నేను చదువు వదిలి పెట్టి రాలేను అని జవాబు చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా మెటాడోరులో ప్రయాణించే ఇతర బంధువులు చాల్లెరా నీ చదువు నీవు ఒక 4-5 రోజులలో నీ చదువు ఏమి పాడుకాదు సరదాగా అందరము వెళదాము ఆ సీటు ఎందుకు కాళీగా  వదలటం  రమ్మని బలవంతం చేశారు. పెద్దవాళ్ళ మాటలను కాదనలేక చివరి ఘడియల్లో బట్టలు సర్దుకొని వాళ్లతో ప్రయాణానికి సిద్దపడి వ్యాను ఎక్కాడు. వారి ప్రయాణం మొదలైయిన్ది . రెండు మూడు రోజులు చూడదలచిన ప్రదేశాలన్నీ చూసి చివరకు శ్రీశైలం నుండి వాళ్ళ వ్యానుతిరుగు ప్రయాణానికి  బయలుదేరింది. శ్రీశైలం కొండలమీదినుంచి వ్యాను వస్తూవుంటే మధ్యలో డ్రైవరు అదుపు తప్పి వ్యానుని కంట్రోలు చేయలేకపోవడంతో వ్యాను బోల్తా పడ్డది .  అందరికి గాయాలు అయ్యాయి కానీ మన 10 వ తరగతి చదువుతున్న మా స్నేహితుని తమ్ముడు మాత్రమే అక్కడికి అక్కడే మరణించాడు. విధి యెంత బలీయమైనదో చుడండి. ఇంట్లో చక్కగా పరీక్షలకు చదువుతున్న కుర్రవాడు యాత్రకు రానన్నా  వినకుండా వాళ్ళ పెద్దవాళ్ళు బలవంతంగా తీసుకొని వెళితే దాని పర్యవసానంగా అతని మృత్యువు అతనిని కబళించింది. వాడి మాట విని వాడిని ఇంట్లోనే వదిలి వేసినా బాగుండేది అని కుర్రవాని తల్లిదండ్రులు బాధపడ్డారు .  కానీ మరణించిన కుమారుడు తిరిగి వస్తాడా చెప్పండి. 

"జాతస్య మరణం ధ్రువం". జన్మించిన వానికి మరణం తథ్యం. కానీ ఎప్పుడు ఎవరు, ఎక్కడ మరణిస్తారో కేవలం ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది. 

సాధకులమైన మనము నిత్యం ఆ పరమశివుని పాదాలను శరణు చొచ్చటం తప్ప ఈ జన్మలో చేయవలసిన  వేరొక పని లేదు. 

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - శరదృతువు  - కార్తీక మాసం - శుక్ల పక్షం - చతుర్థి - అనూరాధ / జేష్ఠ -‌‌ స్థిర వాసరే* (25.10.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నాగుల చవితి*

 …



               *నాగుల చవితి*

                  ➖➖➖✍️

```

*ఆశ్లేష, ఆరుద్ర, మూల,పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.  సర్పము అనగా కదిలేది, పాకేది.  నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. 


జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ. అనగా ‘నాగం’ సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.


కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం ‘కార్తీక శుద్ధ చవితినాడు’  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ‘ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో’  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.


ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ, పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 


నిశితంగా పరిశీలిస్తే... అందులో భాగంగానే ‘నాగుపాము’ ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 


దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక, దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. ‘కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి 

‘నీటిని’ ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా ‘రైతు’ కు పంటనష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.


కద్రువ నాగ మాత, మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.


దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.


వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని  పర్వదినంగా ఆచరిస్తున్నాం.


పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !


పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.


‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.


పంట పొలాలకు శత్రువులు ఎలుకలు, వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 


*ఆధ్యాత్మిక యోగా పరంగా:-* 

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను 

'వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారమువలెనే వుంటుందని ‘యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,  అందరి హృదయాలలో నివసించే 

'శ్రీమహావిష్ణువు’ నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.


నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం:


పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా మజ్జిగను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన మజ్జిగ లో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే మజ్జిగ కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే మజ్జిగ లభిస్తుంది. ఆ మజ్జిగను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.


“దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

```

*నాగుల చవితి మంత్రం:*```

పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. 

అనంత 

వాసుకి 

శేష

పద్మ

కంబాల

కర్కోటకం

ఆశ్వతార

ధృతరాష్ట్ర

శంఖపాల

కలియా

తక్షక

పింగళ

నాగదేవతల పేర్లు.


*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చెప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి:*


 *నడుము తొక్కితే నావాడు అనుకో 

 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో 

 *తోక తొక్కితే తోటి వాడు అనుకో 

 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.


ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.


మనలను ఇబ్బంది పెట్టినవారిని, కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

Panchaag



 

24, అక్టోబర్ 2025, శుక్రవారం

డమరుకధ్వనిహేల

 సీ॥

డమరుకధ్వనిహేల ఢక్కానినదమెంచ 

మాహేశ్వరునిసూత్రమమరె నచట 

గీర్వాణవాణికి గీసె హద్దుల నెమ్మి 

వ్యాకరణము పేర నమరి చెలగి 

కదలె కైలాసమ్ము కంపించె కాశ్యపి 

వడకె స్వర్గ మపుడు వాణి కులికె 

నంది బెదరి జూచె నాగులు చెదరెను 

శశిఖండ మల్లాడె స్వశిరమందు 

తే.గీ.

భవుడు తాండవమాడగా శివము గలిగె 

నిట్లు ముల్లోకములకెల్ల ఈతి దొలగె 

నట్లు నర్తించి వర్తిల్లు నభవు నెపుడు 

భక్తి నర్చింతు నను మెచ్చి ముక్తి నొసగ -2

⚜ శ్రీ బిజాసన్ మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 1274


⚜  రాజస్థాన్ : ఇంద్రగఢ్


⚜  శ్రీ బిజాసన్ మాత ఆలయం



💠 బిజాసన్ మాతా ఆలయం ఇంద్రగఢ్ పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం, ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లాలోని సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉంది. 


💠 ఈ ఆలయం  దుర్గాదేవికి మరొక పేరు అయిన బిజాసన్ మాతకు అంకితం చేయబడింది. 


💠 దుర్గాదేవి రక్తబీజ అనే రాక్షసుడిని శిరచ్ఛేదం చేసింది, ఆ తర్వాత ఆమె ఆ రాక్షసుడిని ఒక వేదికగా చేసుకుని దానిపై కూర్చుంది



💠 శ్రీ దుర్గా శప్తసతి ఎనిమిదవ అధ్యాయంలో, రక్త బీజ అనే రాక్షసుడిపై దుర్గా తన భయంకరమైన యుద్ధం చేసినప్పుడు ఆమె ధైర్యమైన రూపాన్ని మనం చదువుతాము. 

ఈ రాక్షసుడు అసాధారణమైన వరంతో ఆశీర్వదించబడ్డాడు. 

భూమిపై అతని శరీరం నుండి పడే ప్రతి రక్తపు బొట్టు సమాన శక్తి మరియు సమాన పరాక్రమం కలిగిన రక్త బీజంగా మారుతుంది.

ఫలితంగా లక్షలాది రక్త బీజ రాక్షసులు వచ్చారు.

చివరికి దేవత ఈ రాక్షసుల రక్తం భూమిపై పడనివ్వకూడదని నిర్ణయించుకుంది. 


💠 అందువల్ల, ఆమె మండుతున్న జ్యోతులతో గాయాలను కాల్చివేసింది లేదా పడిపోతున్న రక్తాన్ని ఒక గిన్నెలో సేకరించి త్రాగించింది. 

దేవత కూడా రక్త బీజుడు అనే రాక్షసుడిలా అనేక రూపాలను తీసుకుంది. 

ఆ విధంగా దేవత రక్త బీజుడు అనే రాక్షసుడిని అణచివేసి చంపింది మరియు అందుకే ఆమెకు బీజసన్ అనే పేరు పెట్టారు.


💠 ఇక్కడి స్థానికుల ప్రకారం, సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది.

ఈ అడవికి దూరంగా, బాబా కృపానాథ్ జీ మహారాజ్ అనే సాధువు నివసించాడు. అతను దుర్గాదేవికి పెద్ద అనుచరుడు మరియు ఆమెను చూడాలని కోరుకున్నాడు. అందువల్ల, అతను బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు.


💠 బాబా కృపానాథ్ సర్వస్వం

త్యాగం చేశాడు. ఆయనకు ఆహారం, నీరు లేదా సమయం గురించి పెద్దగా పట్టింపు లేదు. ఆయన ధ్యానంలో కూర్చుని రాత్రింబవళ్ళు దేవతను ప్రార్థించేవాడు. ఋతువులు గడిచాయి, కానీ ఆయన తన తపస్సును ఎప్పుడూ ఆపలేదు. ఆయన ప్రార్థనలు ఎంత తీవ్రంగా మారాయంటే అడవిలోని అడవి జీవులు కూడా ఆయన వద్దకు వచ్చి ప్రశాంతంగా ఉండేవి.


💠 ఒకరోజు బాబా ధ్యానంలో మునిగి ఉండగా, ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి అడవి అంతా నిండిపోయింది. ఆ ప్రకాశం ఎంత తీవ్రంగా ఉందంటే చుట్టూ ఉన్నదంతా బంగారంలా మెరిసింది.

బాబా కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ , ఆయన దైవిక శక్తిని అనుభవించగలిగారు . 


💠 ఆయన వాటిని తెరిచినప్పుడు, బిజాసన్ మాత ఆయన ముందు నిలబడింది .

ఆమె ప్రకాశవంతంగా, శక్తివంతంగా , ప్రశాంతంగా, దయగల ముఖంతో కనిపించింది . 

ఆమె దైవిక ఆయుధాలను ధరించింది , మరియు ఒక దివ్య కాంతి ఆమెను చుట్టుముట్టింది . 

భక్తితో ఉప్పొంగిపోయిన బాబా ఆమె ముందు నమస్కరించారు .


💠 దేవత నవ్వి,"నా బిడ్డా, నీ ప్రార్థనలతో నేను సంతోషిస్తున్నాను. నీకు నిజాయితీగల భక్తి ఉంది. 

నేను ఈ ప్రదేశాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా నిష్కళంకమైన హృదయంతో నన్ను ప్రార్థిస్తే వారి కోరికలు తీర్చబడతాయి" అని చెప్పింది.


💠 రాజస్థాన్‌లోని ఇందర్‌గఢ్‌లోని బిజాసన్ మాతా ఆలయంలోని పవిత్ర గుహ లోపల బిజాసన్ మాతా విగ్రహం - ఇది ఒక గౌరవనీయమైన హిందూ పుణ్యక్షేత్రం. 

అందంగా అలంకరించబడిన బిజాసన్ దేవత విగ్రహాన్ని ఈ ప్రశాంతమైన, సహజమైన గుహ ఆలయంలో దైవిక ఆశీర్వాదం, రక్షణ మరియు ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే భక్తులు పూజిస్తారు.



💠 ఈ మాటల తరువాత, బిజాసన్ మాత కొండ లోపల ఒక గుహను సృష్టించి , దానిలో తన సొంత విగ్రహాన్ని ప్రతిష్టించింది . 

ఈ గుహ నేటికీ ఉంది మరియు దీనిని బిజాసన్ మాత ఆలయం ఇంద్రగఢ్ అని పిలుస్తారు .


💠 ఈ ఆలయం ఒక గుహలా నిర్మించబడింది . 

ఆలయం లోపల, బిజాసన్ దేవత విగ్రహం ఉంది. ఇది స్వయంభువుగా చెప్పుకోబడుతుంది. ఇక్కడ నవదుర్గ దేవత యొక్క ఏడుగురు సోదరీమణులను పూజిస్తారు. దుర్గాదేవి యొక్క 6 మంది సోదరీమణుల ఆలయం క్రింద నిర్మించబడింది. ఆలయంలో 750 మెట్లు ఉన్నాయి. 


💠 దుర్గాదేవిని ఆమె వివిధ రూపాల్లో పూజించడానికి అంకితం చేయబడిన తొమ్మిది రాత్రుల పండుగ అయిన నవరాత్రి సమయంలో ఈ ఆలయం ఉత్సవాల కేంద్రంగా మారుతుంది . 

ఈ పవిత్ర కాలంలో రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ మరియు గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మతపరమైన ఆచారాలలో పాల్గొనడానికి ఆలయానికి వస్తారు. 


💠 బుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రోడ్డు మార్గంలో ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు . 

సమీప రైల్వే స్టేషన్ ఇందర్‌ఘర్ సుమేర్‌గంజ్ మండిలో ఉంది, ఇది దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, సమీప విమానాశ్రయం ఇంద్రఘర్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో జైపూర్‌లో ఉంది .



రచన

©️ Santosh Kumar

ధర్మోరక్షతిరక్షితః

 *సీసపద్యం*

విద్యకు దూరమ్మె విప్రుని మరణము

  రాజ్యము చేజార రాజు చచ్చు

వ్యాపారదూరంబు వైశ్యుని మృతియౌ

   శ్రమదూరమైనంత శ్రామికుండు

ఎవ్వారి కులవృత్తు లవ్వారి మానమౌ

   మానమ్ము మించేటి మరణమేది?

కులముగొప్పదనము కులవృత్తి రక్షయౌ

   కులవృత్తి చేజార వెలుగు లేదు (వెలగలేవు).

*ఆ.వె.*

మనిషి జీవితంపు మనుగడ కులవృత్తి

వృత్తి వీడి మనిషి వెలుగు లేదు

కుత్సితముల తోడ కులవృత్తి చేజార

మరణమయ్యు నీకు మహిన నరుడ.

*కులవృత్తులను కాపాడుకోవడమే కులధర్మం..ధర్మోరక్షతిరక్షితః*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Panchaag



 

శివ షడక్షరీ స్తోత్రం

 శివ షడక్షరీ స్తోత్రం

                    (1వ. భాగం)


గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో(ముఖ్యంగా) ఉభయ గోదావరి జిల్లాలలోని శివక్షేత్రాల్ని 

గురించి ముచ్చటించుకున్నాము. ఈ సంవత్సరం అందున్న ఉమా మహేశ్వరుణ్ణి స్తుతించి తరిద్దాం. అందులో భాగంగా 

శివ షడక్షరీ స్తోత్రంతో మొదలు పెడదామని చేసిన చిన్న ప్రయత్నం.



“ నమః శివాయ “అన్నది పంచాక్షరి మహా మంత్రం. దీనికి ముందర ఓంకారం జతచేస్తే అది షడాక్షరి.. “ఓం నమః శివాయ” అవుతుంది.


నమః శివాయ అనగానే నాకు మా చిన్నతనంలో చేసే అక్షరాభ్యాసం గుర్తుకు వస్తుంది.  

 దాన్నే ఓనామాలు దిద్దించడం అనేవాళ్ళు.

(ఓం నమః శివయః…)


ఈ మొత్తం ప్రక్రియలో మనకో అద్భుతమైన విషయం కనిపిస్తుంది.


మొదట పళ్లెంలో బియ్యం. ఆ బియ్యం కూడా క్షతము కానివి (విరగనివి) చక్కగా ఏరి పళ్లెంలోవేయడం. 


అబియ్యంలో అడ్డంగా రెండు గీతలు గీసి, మూడు భాగాలుగా చేసి, పై భాగంలో "ఓం" అని, రెండవ భాగంలో "నమశ్శివాయ" అని, మూడవ భాగంలో "సిద్ధం నమః" అని మూడు పర్యాయములు నాన్నలు పిల్లల చేత రాయిం చడం.


ఓం కారం బీజాక్షరం. బీజాక్షర సమేత మంత్రం ఏదైనా ఉపదేశం ఉండాలన్నది నీమం.

మనకి తెలియకుండా చిన్నప్పుడే మనకి

ఉపదేశం పొందే ఏకైక మంత్రం శివ షడక్షరి.


ఈ అక్షరాభ్యాసం ఒక వైదిక సంస్కారంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.


క్షరము కానిదానిని అభ్యసించడమే 

అక్షరాభ్యాసం. మరి క్షరము కానిది ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా?


యదృశ్యం తన్నశ్యం.. అన్నది లోక విదితమే కదా. కనిపించేది ఏదైనా కనుమరుగవక మానదు. అట్టిచో అక్షరమైనది ఏదైనా ఉన్నదా? 


పోతనా మాత్యులు గజేంద్ర మోక్షణం లో చెప్పినట్టు …ఉన్నది.


లోకంబులు లోకేసులు

లోకస్థులు తెగినతుది నలోకంబౌ పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృత్తి వెలుంగు నతనిననే సేవింతున్!!


అట్టి అక్షరుడైనట్టి పరమేశ్వరుణ్ణి నిరంతరం ఉపాశించడానికి చేసే సంస్కారమే అక్షరాభ్యాసం. అందుకని” ఓం నమః శివాయ “ అనే మంత్రం అందరూ అక్షరాభ్యాసం 

సశాస్త్రీయంగా నేర్చుకున్న వారు జపించవచ్చు. 


ఈ షడక్షరిపై రెండు స్తోత్రాలు కనిపిస్తున్నాయి. ఈ కార్తీకమాస మొదటి రోజు ఈ స్తోత్రాలు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఉమామహేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై మెండుగా వర్షించి జీతాలు పండాలని ఆకాంక్షిస్తూ..


మీ

ఆకెళ్ళ శ్రీనివాసరావు.



1.శివ షడక్షరీ స్తోత్రం


॥ఓం ఓం॥

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।

కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥


॥ఓం నం॥

నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।

నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥


॥ఓం మం॥

మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।

మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥


॥ఓం శిం॥

శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ ।

మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥ 4 ॥


॥ఓం వాం॥

వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ ।

వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ॥ 5 ॥


॥ఓం యం॥

యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।

యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ॥ 6 ॥


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।

తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥


శివశివేతి శివేతి శివేతి వా

భవభవేతి భవేతి భవేతి వా ।

హరహరేతి హరేతి హరేతి వా

భజమనశ్శివమేవ నిరంతరమ్ ॥


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ।


2.శివషడక్షరీ స్తోత్రమ్


ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | 

కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧|| 


నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | 

నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨|| 


మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | 

మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩|| 


శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | 

శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪|| 


వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | 

వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫|| 


యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | 

యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬|| 


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | 

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭|| 


ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

తేజోలింగమ్

 ***తేజోలింగమ్*తిరువణ్ణామలై*

(3)తేజోరూపమయాయ జీవసకలాధారాయ వహ్న్యాత్మనే,

ఫాలాగ్నిప్రభవాయ సర్వసుతనుష్వాధారభూతాయ తే|

దుర్వారాగ్నినివారిణే చ మదనం భస్మీకృతే శంభవే,

తస్మై రక్తగిరీశసుందరమహాదేవాయ తుభ్యం నమః||

 భావం=తేజోరూపమయుడైనటువంటి, సకలజీవులకు జీవాధారమైన వహ్నిస్వరూపుడైనటువంటి, ఫాలభాగమునందు అగ్నిప్రభవించుచున్నటువంటి, అందరి అందమైనశరీరములకు ఆధారభూతుడైనటువంటి, నివారింపశక్యముగానిమదనాగ్నిని భస్మముచేసినటువంటి, అరుణాచలసుందరేశ్వరమహాదేవుని కొరకు నమస్కారము.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝 *అలసస్య కుతో విద్యా ! అవిద్యస్య కుతో ధనం !*

           *అధనస్య కుతో మిత్రం ! అమిత్రస్య కుతఃసుఖం !*


*భావం* 𝕝𝕝:- *బద్ధకస్తులకి ఎలా చదువస్తుంది చదువు రాని వాళ్ళకి ధనం ఎలా వస్తుంది ధనం లేని వాళ్ళకి మిత్రులు ఎలా ఉంటారు మిత్రులు లేనివారికి సుఖం ఎక్కడిది....మన ఇంటికి బంధువులు స్నేహితులు రావాలంటే వాళ్లకు ఉపచారాలు చేయడానికి వాళ్లకు భోజనం పెట్టడానికి డబ్బు ఉండాలిగా మరి ఆ డబ్బు లేని వాళ్ళ ఇంటికి మిత్రులు స్నేహితులు ఎలా వస్తారు. కాబట్టి డబ్బు ఉండాలి. *ఏదో ఒక చదువు ఒక స్థాయిలో వస్తే వాడికి ధనం వస్తుంది.*

*కాబట్టి ఆ చదువు రావడానికి ఏముండాలి అంటే జడత్వం ఉండకూడదు అలసత్వం ఉండకూడదు రేపటికి వాయిదా వేసే లక్షణం ఉండకూడదు*. *ఏరోజు చదవు ఆరోజు చదువుకునే పిల్లలకు జీవితం అంతా సంతోషంగా సుఖంగా ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.*

               

 ✍️💐🌹🌸🙏

సుభాషితాలు

 *🙏💐💐💐💐🙏* 

*🙏💐💐👍సుభాషితాలు👌💐💐🙏*

                                *-- ౦ --*

💐💐👍🙏🙏🙏🙏🙏🙏👌💐💐


*"చదువనివాఁ డజ్ఞుం డగు*

*జదివిన సదసద్వివేక చతురత గలుగుం*

*జదువఁగ వలయును జనులకుఁ*

*జదివించెద నార్యులొద్ధఁ* *జదువుము తండ్రీ..!"*


*భావము:- ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి..!*

*“బాబూ..! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు..!* *చదువుకుంటే..! మంచిచెడు తెలుస్తుంది..! వివేకం కలుగుతుంది..! మనిషి అన్నవాడు తప్పకుండా..! చదువుకోవాలి..! కనుక నిన్ను మంచిగురువుల దగ్గర *చదివిస్తాను..! చక్కగా చదువుకో నాయనా..!అన్నాడు..!”*


*!!దాతృత్వ ప్రియ వక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా!!* 

*!!అభ్యాసేన న లభ్యంతే చత్వారస్స హజ గుణాః!!*  

 

*అర్థము:-- దానము చేసే గుణము,ప్రియముగా మృదువుగా మాట్లాడుట, ధైర్యగుణము, వుచితజ్ఞత అంటే యిది సరియైనది యిది కాదు అను తెలిసుకోను జ్ఞానము ఈ నాలుగు గుణాలు నేర్చుకుంటే వచ్చేవి కావు అవి సహజంగా పుట్టుకతోనే వస్తాయి..!*


*!!విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం!!* 

*!!విద్యా భోగకరీ యశసుఖకరీ విద్యా గురూణాం గురు:!!*

*!!విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరం లోచనం!!* 

*!!విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యా హీనఃపశు:!!*

    *( భర్తృహరి సుభాషితం )*

 

*అర్థము:మానవులకు విద్యయే సౌందర్యము..!* *అదియే గుప్త ధనము;చదువే* 

*కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును;* *విద్యయే గురువులకు గురువైనది..!* 

 *విదేశ ములకు పోయినప్పుడు విద్యయే బంధువు:అదియే మరియొక కన్ను వంటిది;*

*రాజ సభలలో పూజార్హత విద్యకే గానీ ధనమునకు* *కాదు;ఇటువంటి విద్య లేని నరుడు* 

  *వింత పశువు గా పిలువా పడుతాడు..!*


     *నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని*

    *క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా*

    *శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ*

    *జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా..!*


*👍తాత్పర్యము:-👌* 

*ప్రభో..! శ్రీకాళహస్తీశ్వరా..! నీచెంత నాకు భిక్షాన్నమైనా చాలును. నిధులు కలిగినా సరే నేను రాజాధముల సేవ చేయనోపను. సంసారమను ఆశాపాశాములందు నన్ను బంధింపక నీ బంటుగా చేర్చుకొని రక్షించు ప్రభో..!!*

                             *-- ౦ --*

*🙏💐🙌శ్రీరామరక్షసర్వజగద్రక్ష🙌💐🙏*

23, అక్టోబర్ 2025, గురువారం

తిరుఉత్తర_కోసమాంగై

 #తమిళనాడులో రామేశ్వరం నుండి 75 కి.మి. దూరంలో "#తిరుఉత్తర_కోసమాంగై" అని ఊరు ఉంది. 

మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి సొంత ఊరు ఇది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. 

శివభక్తురాలైన #మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్తగా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన #రావణబ్రహ్మను_మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. 

ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని #మొగలి_పువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన #రేగిపండు_చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. 

ఇక్కడ శివుడు #శివలింగరూపంలో, #మరకతరూపంలో, #స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. 

ఆ మరకతం నుండి వచ్చే #కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవలం #ఆరుద్ర_నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. 

అలాగే ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. 

ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు #వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా #రామేశ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయం దర్శనం చేసుకోండి.🙏

అందరికీ కార్తీక్ మాస ప్రారంభ శుభాకాంక్షలు

కృతజ్ఞతాభావం

 ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడిగాడు: కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు? దానికి ఆ బిచ్చగాడు: "సార్… నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది.


గత ఒక సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఏదీ దొరకలేదు. మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు. మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను".


"నీకు తప్పకుండా సహాయం చేయాలని అనిపిస్తోంది. కానీ, నీకు ఉద్యోగం ఇప్పించాలని నా ఆలోచన కాదు. నేను మరొకటి ఆలోచించాను".


"మరోకటా…? ఏదైనా సరే, నా సమస్య తీరితే చాలు" అన్నాడు బిచ్చగాడు.


"నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేయబోతున్నాను".


"ఏంటి వ్యాపార భాగస్వామినా…?"


"అవును… నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. నీకు దుకాణం పెట్టడానికి స్థలం, ధాన్యంతో సహా అన్నీ నేను ఇస్తాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే. ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి. అంతే!"


'పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా? దేవుడు కన్ను తెరిచేశాడురా బాబూ' అని బిచ్చగాడు మనసులో సంతోషపడ్డాడు.


"సార్… అది… లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి…? మీకు 90% నాకు 10% ఆ? లేక మీకు 95% నాకు 5% ఆ? ఎలా??" ఆసక్తిగా అడిగాడు.


"కాదు… నువ్వు 90% తీసుకుని నాకు 10% ఇస్తే చాలు".


అది విన్న బిచ్చగాడికి ఒక్క క్షణం మాట రాలేదు. "ఏం చెబుతున్నారు సార్?" నమ్మలేకపోయి అడిగాడు.


"అవును నాన్నా… నీకు 90% నాకు కేవలం 10% చాలు. నాకు డబ్బు అవసరం లేదు. నువ్వు అనుకున్నదాని కంటే నా దగ్గర చాలా ఉంది. ఈ 10% కూడా నేను అడగడం నా అవసరం కోసం కాదు. నీకు కృతజ్ఞతాభావం ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే".


"నాకు జీవితాన్నే బిచ్చంగా ఇచ్చిన దేవుడా… నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" తర్వాతి క్షణం ఆ బిచ్చగాడు ఆ డబ్బున్న వ్యక్తి కాళ్ళపై పడిపోయాడు.


వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ జరగడం మొదలైంది. బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభించింది. మొదట వేలల్లో ఉన్న డబ్బు కొన్ని వారాల్లోనే లక్షలకు చేరుకుంది.


కానీ ఒక దశలో బిచ్చగాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడిని మర్చిపోయాడు.


కొత్త బట్టలు ధరించడం మొదలుపెట్టి, దుకాణానికి వచ్చి వెళ్ళడానికి ఒక వాహనం కొన్నాడు. మెడలో సన్నని గొలుసు వేసుకున్నాడు. రాత్రింబవళ్ళు లాభమే లక్ష్యంగా కష్టపడ్డాడు. ధాన్యాల నాణ్యత బాగా ఉండటంతో అతని దుకాణంలో అమ్మకాలు రోజురోజుకు పెరిగాయి. కొన్ని నెలలు గడిచాయి. అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీగా 10% వాటా ఇస్తున్న అతడు ఒక దశలో తనలో తాను ఇలా అనుకున్నాడు…


"నేను నా భాగస్వామికి ఎందుకు 10% ఇవ్వాలి? అతను దుకాణానికి రావడం లేదు కదా. కష్టం అంతా నాదే. రాత్రింబవళ్ళు నేను మాత్రమే పని చేస్తున్నాను… ఇకపై లాభం 100% నాకే సొంతం" అని నిర్ణయించుకున్నాడు.


కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి, కొత్తగా డబ్బు పోగేసుకున్న పాత బిచ్చగాడి దగ్గరకు తన లాభం వాటా తీసుకోవడానికి దుకాణానికి వచ్చాడు.


"కష్టం అంతా నాదే. అలాంటప్పుడు నేను మీకు 10% ఎందుకు ఇవ్వాలి? లాభం అంతా నాకే సొంతం!" అని వాదించాడు.


ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరు ఉంటే ఏం చెబుతారు? ఒక క్షణం ఆలోచించండి…


ఇదే మనందరి జీవితంలో జరుగుతుంది. దేవుడే మన వ్యాపార భాగస్వామి. మనం ఆ కొత్తగా డబ్బున్న వ్యక్తి. దేవుడు మనకు బిచ్చంగా ఇచ్చింది ఈ జీవితాన్ని… ప్రతి క్షణాన్ని… మనం పీల్చే ప్రతి గాలిని… ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి, వాటిలో ప్రతి దానికి ప్రత్యేక శక్తులను ఇచ్చాడు దేవుడు. అది మాత్రమేనా?


ఐదు జ్ఞానేంద్రియాలు సరిపోవని చేతులు, కాళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి విలువ కట్టలేని మన శరీర భాగాలను ఇచ్చాడు. ఇలా దేవుడు మనకిచ్చిన వాటిని లెక్కించడం మొదలుపెడితే… అది ఎప్పటికీ అంతం కాకుండానే ఉంటుంది. ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం 10% సమయాన్ని మాత్రమే మనం పంచుకోవాలని అతను ఆశిస్తున్నాడు. అది కూడా అతని అవసరం కోసం కాదు. అతనికి ఏ అవసరాలు లేవు. మన కృతజ్ఞతాభావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు. మనపై మనకు ఉన్న ప్రేమ కోసం.


ఒక వ్యక్తికి కృతజ్ఞతాభావం ఉంటే ఆ తర్వాత జీవితం ఎలా మారుతుందో తెలుసా?


దేవుడిని పూజించడం, వేదాలను చదవడం, దేవాలయానికి వెళ్లడం, సేవ వంటి వాటిలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం లేదా తోటి మనుషులకు సహాయం చేయడం ఇవన్నీ చేయడం మన కోసం, మన మంచి కోసం అయినప్పటికీ, దేవుడు మనకు ఇచ్చిన ప్రాణం, శరీరం, అవయవాలను అతను చెప్పిన మార్గంలో, అతను కోరుకున్న మార్గంలో నడుపుతున్నాము, అనే తృప్తితో, ఇవన్నీ ఇచ్చిన మన దేవుడికి మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించడానికే. అంతే తప్ప దేవుడికి అది అవసరం కాబట్టి కాదు...

20, అక్టోబర్ 2025, సోమవారం

దీపావళపండుగ

 *అందరికీ దీపావళపండుగ శుభాకాంక్షలు*


సీ॥

అజ్ఞానతిమిరాల నంతమొందింపగా 

వెలుగు దివ్వెలపేర్పు మలుపునిచ్చు 

దుర్గుణభూతాల దునుమాడగా ప్రేలు 

బాంబుల మ్రోతలు ప్రాపునిచ్చు 

నిప్పులపువ్వుల నింగినంటుచు వెల్గు 

చిచ్చుబుడ్డుల శ్రేణి శ్రీలనిచ్చు 

వివిధటపాసులరాజి విన్యాసతేజము 

ప్రాకృతీధర్మాల రక్షజేయు 

తే.గీ. 

క్రిమికీటకములబాపు కీడునాపు 

దీపకాంతుల లోకాల దీప్తి నింపు 

చెడుగుపై మంచి గెలువంగ చేవజొనుపు 

దివ్యదీపావళి మీకు భవ్యమగుత! 

*~శ్రీశర్మద*

శారీరక , మానసిక మార్పులు -

 శరీరం నందు వాత, పిత్త , కఫాలు పెరిగినపుడు ఏర్పడే శారీరక , మానసిక మార్పులు - 

 

 # శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు - 

 

 ☆ శారీరక మార్పులు - 

 

* బరువు తగ్గుట. 

 * శరీర దారుఢ్యం , బలం తగ్గును. 

 * నరాల నొప్పులు పెరుగును . 

 * కండరాల నొప్పులు పెరుగును . 

 * నడుములో నొప్పి ముఖ్యముగా నడుము క్రింద .

 * కీళ్లనొప్పులు , కాళ్ల నొప్పులు పెరుగును . 

 * చర్మం గరుకుదనం పెరుగును . 

 * పెదాలు , శరీరం పగుళ్లు ఏర్పడును . 

 * మలబద్దకం . 

 * కడుపుబ్బరం , గ్యాస్ పెరగటం , గ్రహణి సమస్య  

 * అధిక రక్తపోటు . 

 * చలిగాలికి తట్టుకోలేకపోవడం . 

 * ఋతువునోప్పి . 

  

  ☆ మానసిక మార్పులు - 


 * మనసు కుదురుగా ఉండదు. రకరకాలుగా పరుగుతీయును . 

 * పూర్తి విశ్రాంతి తీసుకోలేకపోవడం . 

 * దేనిమీద ఏకాగ్రత ఉండదు. 

 * అధికమైన ఆందోళన . 

 * గాభరా ఎక్కువ అవ్వడం . 

 * అసహనంగా ఉండటం . 

 * దిగులు , నిద్రపట్టక పోవడం . 

 * త్వరగా అలసిపోవడం . 

 * ఆకలి లేకపోవటం . 

 

 # శరీరం నందు పిత్తం ప్రకోపం చెందినపుడు - 

 

 ☆ శారీరక మార్పులు - 

  * అతిగా దాహం వేయడం . 

  * అతిగా ఆకలి వేయడం . 

 * హైపర్ ఎసిడిటి , అల్సర్ ఏర్పడుట. 

 * ఎండని తట్టుకోలేకపోవడం . 

 * వొళ్ళంతా మంటలు . 

 * చర్మం పైన పుళ్ళు ఏర్పడుట . 

 * దద్దురులు , కురుపులు , మొటిమలు వచ్చును .

 * దుర్వాసన , చమటలు అధికంగా పట్టడం . 

 * మొలల వ్యాధి , మలద్వారం వద్ద మంట. 

 * కళ్లు ఎరుపెక్కడం . 

 * మూత్రం మంటగా , బాగా పలచగా , ఎరుపుగా వెళ్లడం . 


  ☆ మానసిక మార్పులు - 


 * ప్రతిదానికి అరవడం , కేకలు పెట్టడం , చికాకు పడటం . 

 * కోపం అధికం అవ్వడం . అసహనం పెరుగుట . 

 * ప్రతిదాన్ని విమర్శించడం . 

 * ప్రతిదానికి ఎదురుమాట్లాడటం . 

 * ప్రతివాళ్ల మీద పగతీర్చుకుంటా అనడం , ప్రవర్తించటం . 

  

 # శరీరము నందు కఫం ప్రకోపం చెందినపుడు - 

  

☆ శారీరక మార్పులు - 

 

* ఛాతి బరువుగా ఉండటం. 

* కంఠం కఫముతో పూడుకొనిపోయినట్టు ఉండటం. 

 * ముక్కు , సైనస్ లు జిగురుతో నిండిపోవడం . 

 * దగ్గు , ముక్కు కారటం , తరచూ జలుబు చేయడం . 

 * చలి , తేమని తట్టుకోలేకపొవడం . 

 * ఎప్పుడూ ఎలర్జీలతో ఇబ్బందిపడటం 

 * ఉబ్బసం కలగడం . 

 * అధిక బరువు పెరగటం . 

 * కొలెస్ట్రాల్ మోతాదు పెరగటం . 

 * శరీరం నందు వాపులు పెరగటం . 

 * కడుపుబ్బరం . 

 * శరీరం చల్లగా , తెల్లగా మారడం . 

 * మధుమేహ సమస్య రావటం . 

 * శరీరంలో గడ్డలు , కండలు పెరగటం . 

    

 

      పైన చెప్పిన లక్షణాలన్నీ చూస్తే మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అనగా శరీరం నందలి వాత, పిత్త , కఫాలు కొన్ని కొన్ని కారణాల వలన హెచ్చుతగ్గులకు లోనగును. అలాంటప్పుడు ఏదైతే పెరిగిందో అలా పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి . ఉదాహరణకు పైన చెప్పిన లక్షణాలు ఆయా శరీర ప్రకృతుల వారికి సహజ లక్షణాలు . అంటే వాత ప్రకృతి గల వారికి ఏ మాత్రం వాతం పెరిగినా నొప్పులు వెంటనే వస్తాయి. అలాగే కఫం పెరిగితే వాళ్లకి నొప్పులు రావా ? అంటే వస్తాయి . కఫ శరీర తత్త్వం గలవారికి నొప్పులు వచ్చాయంటే వారితో వాతం పెరిగిందని అని అర్థం . అలాగే బరువు అధికంగా పెరగటం కఫ శరీర తత్త్వం ఉన్నవారి లక్షణమైన వాత, పిత్త శరీరతత్వం ఉన్నవాళ్లు కూడా బరువుపెరుగుతారు అటువంటప్పుడు వారిలో కఫ సంబంధ దోషం పెరిగిందని అర్థం చేసుకోవాలి . 

          

    వాతశరీరం కలిగిన వారు బరువు త్వరగా తగ్గుతారు , బరువు ఆలస్యముగా పెరుగుతారు. పిత్త శరీరం కలవారు ఆకలి ఎక్కువుగా ఉండటం , స్ట్రెస్ ఎక్కువుగా ఉండటం వలన అతిగా తింటారు. దానివల్ల బరువు పెరుగుతారు . వీరుకొంత ఆలస్యముగా బరువు తగ్గుతారు. కఫప్రకృతి వారు బరువు తగ్గడం అంత త్వరగా సంభవించదు.  



మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034