13, మే 2026, బుధవారం

గురువారం🌷* *🌹14, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌷గురువారం🌷*

    *🌹14, మే, 2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : ద్వాదశి* మ 11.20 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 10.34 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : ప్రీతి* రా 05.53 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం  : తైతుల* మ 11.20 *గరజి* రా 10.00 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 01.00 - 02.00 సా 04.00 - 06.00*       

అమృత కాలం  : *రా 08.20- 09.49*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ప 11.25 - 12.54*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.47 మ 03.04 - 03.56* 

*రాహు కాలం   :మ01.41- 03.17*

గుళికకాళం      : *ఉ 08.51 - 10.27*

యమగండం    : *ఉ 05.37 - 07.14*

సూర్యరాశి : *మేషం*                   

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 05.45* 

సూర్యాస్తమయం :*సా 06.41*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.37 - 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం   :*మ 01.21- 03.56*

*ఆబ్ధికం తిధి        : వైశాఖ బహుళ త్రయోదశి*

సాయంకాలం    :*సా 03.56- 06.31*

ప్రదోష కాలం      :*సా 06.31- 08.44*

రాత్రి కాలం        :*రా 08.44 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


      *శత్రునాశకరం స్తోత్రం* 

     *జ్ఞానవిజ్ఞానదాయకమ్*

           

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*



       *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

               *87వ భాగం*


      *శ్రీరామావతారం-8*


       *రావణ సంహారం*```


లంకకు సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లి ఆశోకవనంలో 

బందీగా రాక్షస స్త్రీల మధ్య ఉంచాడు. సీత మనస్సు మార్చి తనను భర్తగా అంగీకరించేట్టు చేయడానికి రావణుడు అనేక విఫల ప్రయత్నాలు చేసాడు. సీతాదేవి రావణుని గడ్డిపోచగా తృణీకరించి “తనభర్తరాముడేనని, త్వరలో అన్వేషించి రావణుని సంహరించి తీసుకువెళ్ళతాడని, ప్రాణాలు కావాలంటే తనను మర్యాదగా రామునికి అప్పగించ మని" హెచ్చరించింది.


రావణుడు ఆగ్రహంతో సీతకు మనస్సు మార్చుకోవడానికి పన్నెండు మాసాలు గడువు ఇచ్చాడు. మనస్సు మార్చుకోక పోతే ఆమెను చంపి కాపలా ఉన్న రాక్షస స్త్రీలకు ఆహారంగా వేస్తానని హెచ్చరించి వెళ్లి పోయాడు.


సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులు శబరిమాతసూచించినట్లు ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరి వెళ్లారు. 


పర్వతంపైనుండి ధనుర్బాణములు ధరించివస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు "అన్న వాలి తనను చంపడానికి పంపించిన వీరులని" ఆందోళన చెందాడు. 


సుగ్రీవుని మంత్రి అయిన హను మంతుడు "నేనువిషయంతెలుసుకు వస్తానని" భరోసాఇచ్చి బ్రాహ్మణుని వేషంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వివరాలు అడిగాడు.


లక్ష్మణుడు "తాము అయోధ్య రాజకుమారులైన రామలక్ష్మణులమని, వనవాసంలోఉన్న తమను మోసం చేసి వదినగారైన శ్రీరాముని పత్ని సీతాదేవిని రావణుడు అపహరించాడని, సీతాన్వేషణలో శబరి మాత సూచన ప్రకారం సుగ్రీవుని సహాయం కోరుతూ వచ్చామని" చెప్పాడు.


ఆరాధ్యునిగా చిన్నతనం నుండి మనస్సులో కొలుస్తున్న శ్రీరాముడు ఎదురుగా కనపించేసరికి హనుమంతుడు మహదానంద భరితుడు అయ్యాడు. నిజరూపం దాల్చి "తనను సుగ్రీవుని మంత్రి హనుమంతుడిగా" పరిచయం చేసుకున్నాడు. 


కలలో కనిపించిన శ్రీరాముని బాల్యం నుండి ప్రభువుగా ఆరాధిస్తున్న సేవకుడనని, దర్శన భాగ్యం ఇన్నాళ్లకు కలిగిందని శ్రీరాముని పాదాలకు భక్తితో నమస్కరించాడు. 


రాముడు ఆంజనేయుని లేపి ఆలింగనం చేసుకున్నాడు.


హనుమంతుడు తన ఆకారం పెంచి రామలక్ష్మణులను భుజాల పై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం పైన గల సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లాడు. సుగ్రీవునితో మైత్రి కోసం వచ్చారని అయోధ్య రాజకుమారులు శ్రీరామలక్ష్మణులను పరిచయం చేసాడు. 


శ్రీరాముడు "రావణుడు తన భార్య సీతను మోసంతో అపహరించాడని, సీతాన్వేషణలో సహాయం చేయమని" సుగ్రీవుని అడగగా సుగ్రీవుడు "అన్నగారైన వాలి తనను అనుమానించి రాజ్య బహిష్కరణ చేసి, తన భార్య రుమను బలవంతంగా చెఱపట్టడమే కాకుండా తనను చంపడానికి ప్రయత్నం 

చేస్తున్నాడని" తన గురించి చెప్పాడు. 


అగ్నిసాక్షిగా రామ సుగ్రీవులు మైత్రీబంధం ఏర్పరచుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటామని ప్రమాణం చేసారు.


రావణుడు సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకువెళుతున్నప్పుడు రామునికి తన జాడతెలియజేయాలని జారవిడిచిన ఆభరణాల మూట ఋష్యమూక పర్వతం పైన పడ్డాయి. సుగ్రీవుడు ఆ మూట తెచ్చి ఆ ఆభరణాలను "ఒక స్త్రీని రాక్షసుడు బంధించి ఆకాశమార్గాన దక్షిణ దిశ వైపు తీసుకు వెళ్లుతునప్పుడు రక్షించ మని వేడుకుంటూ కిందకి పడ వేసింది" అని రాముడికి చూపించాడు.


రాముడు ఆ ఆభరణాలు సీతవేనని గుర్తు పట్టి బాధపడ్డాడు. సీతను ఎక్కడ దాచినా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ముందుగా సుగ్రీవుని సమస్య పరిష్కరిస్తానని వాలిని ద్వంద్వ యుద్దానికి పిలవమని చెప్పి పంపాడు. వాలి సుగ్రీవులు యుద్దం చేస్తుండగా సమయం చూసి చెట్టు చాటు నుండి బాణం వేసి వాలిని సంహరించాడు. లక్ష్మణుని సుగ్రీవుని వెంట కిష్కింధకు పంపి వానర రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. వానకాలం ముగిసిన పిమ్మట సీతాదేవి అన్వేషణ ప్రారంభించుదామని, అందుకు వానరులను సమీకరించి సిద్దం చేయమని చెప్పాడు.


వానకాలం తరువాత సుగ్రీవుడు సమీకరించిన వానర సేనలను నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకు సీతాన్వేషణ నెలలోపు చేసి రమ్మని పంపారు. దక్షిణదిశ వైపు వెళుతున్న హనుమంతునికి రాముడు తన అంగుళీయకము గుర్తుగా సీతాదేవికి చూపించమని ఇచ్చి పంపాడు. 


సీతాదేవిని వెతుకుతూ దక్షిణ సముద్ర తీరం చేరిన హనుమంతుడి బృందానికి జటాయువు అన్న శంపాతి అక్కడకు సముద్రంలో వందయోజనాల దూరంలో ఉన్న లంకలో రావణుడు సీతను బంధించి ఉంచాడన్న సంగతి తెలిపాడు.


హనుమంతుడు గాలిలో ఎగిరి దక్షిణ సముద్రాన్నిఆకాశమార్గాన దాటి లంక చేరి సీతాదేవి జాడ కనుగొని ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చి త్వరలో రాముడు వానర సేనలతో వచ్చి రావణుని సంహరించి ఆమెను తీసుకు వెళతాడని భరోసా ఇచ్చాడు. రామునికి గుర్తుగా చూపించడానికి సీతాదేవి నుంచి చూడామణి ని తీసుకున్న హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టించి బందీగా రావణుని కలిసి బతికి ఉండాలంటే సగౌరవంగా సీతను రామునికి అప్పగించమని సలహా ఇచ్చాడు.


తిరస్కరించిన రావణుడు విభీషణుని సూచనపై చంపకుండా తోకకు నిప్పు పెట్టి హనుమంతుని వదిలి వేశాడు. హనుమంతుడు ఆ నిప్పుతో సగం లంకను ఆయుధాగారాలతో సహా కాల్చి వేసాడు. కిష్కింధకు తిరిగి వచ్చి రామునికి సీతజాడగురించి చెప్పి చూడామణి ఇచ్చాడు. రాముడు హనుమంతుని కౌగిలించుకుని భరతునితో సమానంగా సోదరుడిని చేసుకున్నాడు.


రామలక్ష్మణులు సుగ్రీవుడి వానర సేనలతో కలసి దక్షిణ సముద్ర తీరం చేరి సముద్రం పై వారధి నిర్మించి లంక చేరారు. సీతను అప్పగించి యుద్దం నివారించమన్న తమ్ముడు విభీషణుని రావణుడు ఆగ్రహంతో రాజ్యం నుండి బహిష్కరించాడు. విభీషణుడు రాముని వద్దకు వెళ్లి శరణు కోరాడు. విభీషణుని రాముడు ఆదరించి రావణ సంహారం తరువాత లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు.


ఆఖరి ప్రయత్నంగా చేసిన అంగద రాయబారం విఫలం అవ్వడంతో రామరావణ సంగ్రామం ఆరంభమైంది. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైన కుమారులు, బంధువులు, సేనాధిపతులు, ఆశేష రాక్షస సైన్యం యుద్దంలో మరణించారు. చివరకు రావణుడు కూడా ఘోర యుద్దంచేసి రాముడి బాణానికి నేల కూలాడు. చని పోబోతున్న చివరి క్షణాలలో రాముని నారాయణుడుగా గుర్తించాడు. సనకసనందాది మునుల శాపానికి గురై నారాయణుని శత్రువులుగా జన్మించిన రెండవ జన్మ ముగిసినందుకు రామునికి మనస్సులో నమస్కరిస్తూ ప్రాణాలు వదిలేశాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*



*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం - 9వ  రోజు 9🌹*


నిన్న మనం హనుమంతుని దివ్యమైన తేజస్సును, శివాంశ సంభూతుడైన ఆయన వైభవాన్ని తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, ఆయన ఎంతటి బుద్ధిమంతుడో, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ ఎటువంటిదో ఈ ఏడవ చౌపాయి ద్వారా దర్శించుకుందాం.


          **ఏడవ చౌపాయి**


 **బిద్యావాన గుణీ అతి చాతుర |**

 **రామ కాజ కరిబే కో ఆతుర ||**


         **ప్రతిపదార్థం**


  * **బిద్యావాన (విద్యావాన్)** సకల విద్యలు తెలిసినవాడా (మహాపండితుడా)!

  * **గుణీ** సద్గుణములు కలవాడా!

  * **అతి చాతుర** అత్యంత సమయస్ఫూర్తి, నేర్పు (చతురత) కలవాడా!

  * **రామ కాజ** శ్రీరామచంద్రుని పనులను

  * **కరిబే కో** చేయడానికి

  * **ఆతుర** ఎల్లప్పుడూ ఉత్సాహముతో (ఆతురతతో) ఉండేవారు.


 **విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. బిద్యావాన & గుణీ (విద్య మరియు సంస్కారం)**


హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు.సూర్యభగవానుడి వద్దే సకల శాస్త్రాలను అభ్యసించిన జ్ఞాని.*అనేన బహుధాశ్రుతం* – ఇతను చాలా విద్యలు తెలిసినవాడని రామచంద్రమూర్తి మొట్ట మొదటి సారి సాదు వేషంలో హనుమ రామ లక్షణులను కలిసిన సమయంలో అంటాడు చతుర్వేదాలు, వేదాంగాలు తెలిసినవాడు.ఎలా తెలుసు అంటే 


ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టిన సందర్భం లో దేవతలందరూ తమ బలాలను హనుమకు ఇచ్చినప్పుడు సూర్యభగవానుడు - "నా తేజస్సులో నూరవ భాగాన్ని ఈయనకు ఇస్తున్నానని" అన్నాడు. సూర్యతేజస్సులో నూరవభాగం హనుమంతునిలో ఎప్పుడూ ఉంటుంది.ఇతనికి చదువుకునే వయస్సు వచ్చినప్పుడు నేను విద్య నేర్పుతాను అంటాడు సూర్యభగవానుడు.సూర్యుడు సకల వేదాలు తెలిసిన వాడు, ఆయనకు నమస్కారం చేస్తే మనము కూడా సకల విద్యల్లో నిష్ణాతులు అవుతాం.


ఆంజనేయస్వామివారికి సూర్యుని వల్ల వర్చస్సు వచ్చింది ఆ విద్య కేవలం హనుమకు మాత్రమే పనికొచ్చిందా...! లోకానికి మేలు చేసిన వర్చస్సు. ఆ విద్యతో లోకానికి ఉపకారం చేశాడు ఆంజనేయస్వామి


భారతజాతికి హనుమంతుడు ఆదర్శం కావాలని స్వామి వివేకానంద చెప్పారు.


త్యాగము, శక్తి, బలము, దృఢత్వము, జ్ఞానము... ఇవన్నీ ఉండేలా మానవుడు తయారు కావాలి అంటే అవన్నీ ఉన్న హనుమనే ఉపాసన చేయాలి.


సూర్యభగవానుడు హనుమకు ఇచ్చింది విద్య. ఆ విద్యవల్ల వచ్చేది వర్చస్సు. ఆ వర్చస్సు పదిమందికి మేలు చేస్తే 'సు-వర్చస్సు'


హనుమకు 'సువర్చస్సు' సూర్యుని వల్ల వచ్చింది. సూర్యుని వల్ల వచ్చిందంటే - దేవతావ్యవస్థలో 'వారి నుండి వచ్చిన దానిని' - కూతురు/కొడుకు అంటారని చెప్పుకున్నాం. సూర్యుని నుండి వచ్చిన 'సువర్చస్సు' విద్య ద్వారా హనుమంతునకు వెళ్ళింది. హనుమ దాన్ని స్వీకరించి ధరించాడు.దీనినే సూర్యుడు తన కూతురైన సువర్చలను హనుమంతునకు ఇచ్చి పెళ్ళిచేశాడని మనకు అర్థం కావడం కోసం కథగా చెప్పారు. పురాణాలు అన్ని విశ్వ విజ్ఞాన రహస్యాలు. వాటిని సూక్ష్మ బుద్ధి తో అన్వయం చేస్తేనే అందులోని రహస్యాలు అర్దం అవుతాయి.


ఇలా సువర్చస్సు తో ఉన్న హనుమ ఉపాసన చేస్తే పర అపర అనే రెండు విద్యలు సిద్ధిస్తాయి.


ఆంజనేయస్వామివారు సూర్యపుత్రికయైన సువర్చలతో ఇప్పటికీ గంధమాదన పర్వతము మీద కదళీవన మధ్యంలో ఉష్ణ వాహనంపై ఉంటారు. ఉష్ట్రం అనగా ఒంటె ఒంటె హనుమంతుని వాహనమని మంత్రశాస్త్రం చెప్తోంది.


ఒంటె వాహనము, కదళీవనము అనగానే సువర్చలా సమేత ఆంజనేయ స్వామివారే దీనిని శక్తి సహిత ఉపాసన అంటారు.అలా హనుమ విద్యావాన్.


హనుమ వేద విద్యలు, వ్యాకరణం మాత్రమే కాదు సంగీతం లోనూ దిట్ట, త్రిశూల రోముడు అనే రాక్షసుడు దుర్భేద్యమైన గుహలో దాక్కుంటే హనుమ సంగీతం తో ఆ రాళ్ళు కరిగించి వాడిని సంహరించాడు. స్వయంగా నారద, తుంబురులే నీ అనుగ్రహం ఉంటే మేం బాగా పాడగలము అంటారు. అందుకు విద్యావాన్ స్వామికి తెలియని విద్య లేదు...


ఇంత విద్య ఉండటం ఒక్కటే కాదు గొప్ప గుణములు కలవాడు హనుమ, రామ కథ మొట్ట మొదట చెప్పింది హనుమ సుందర కాండ లో అశోక వనం లో చెట్టు పై కూచుని కొంత భాగం, దిగిన తర్వాత సీతమ్మను ఓదారుస్తూ ముందు జరగ బోవు కథ చెప్తాడు. అందుకే సుందరకాండ చదివితే రామాయణం చదివినట్టే.


తరగని జ్ఞానం తో పాటు అపార వినయం,ఉత్సాహం,బలం,విశ్వాసం, పరాక్రమం ఇలా ఒక్కటా సకల గుణాలకు ఆలవాలం స్వామి.


మహేంద్ర పర్వతం మీద నుండి ఎగురుతూ రామ బాణం లా లక్ష్యాన్ని సాధించే వస్తాను అని తన బలంగా కాకుండా రామ అనుగ్రహం గా చెప్తాడు. సీతమ్మ దొరక్క దిగులు చెంది నీరసించి పోతాడు మళ్ళీ తనను తానే ఉత్తేజ పరచుకుని వెతకి విజయం సాధిస్తాడు. లంకలో సీతమ్మ ను వెతికే ప్రయత్నం లో చూడకూడనీవి కొన్ని కనపడతాయి వీటి యందు నా మనస్సు లగ్నం కాలేదు కనుక దోషం లేదు అంటాడు.అంటే దేని మీద మనసు పెట్టాలో, ఎక్కడ ఎలా తనను తాను నిగ్రహించు కోవాలో తెలిసిన వాడు హనుమ.

అన్ని తెలిసినా సీతమ్మ దగ్గర నేను వానరులు అందరిలో అల్పుడిని అంటారు.అదీ గొప్ప గుణం.


చిన్న చిన్న పనులు చేసి అంతా నేనే చేశాము అనే మనం హనుమ నుండి ఈ గుణం నేర్చుకోవాలి అంతా రాముని అనుగ్రహం అంటాడు తప్ప తాను చేశాను అనడు,అదే గొప్ప గుణం.ఈ గుణం ఉన్నవాడికి లోకంలో తిరుగులేదు..


ఎంతటి జ్ఞానమున్నా అది సత్ప్రవర్తనతో తోడైనప్పుడే దానికి విలువ అని ఇది మనకు నేర్పుతుంది.


**2. అతి చాతుర (అసాధారణ చతురత)**


చాతుర్యం అంటే నేర్పరితనం. స్వామివారి నేర్పరితనాన్ని అనేక సందర్భాలలో జరిగిన ఘట్టాలలో పరిశీలించవచ్చు. తెలివితేటలు ఉండడమే కాదు, వాటిని ఎలా వినియోగించుకుంటున్నామనేది నేర్పరితనం. విద్య, జ్ఞానం గొప్పతనం వాటి వినియోగదశలో తెలుస్తుంది. దానినే వ్యవహారంలో చురుకుతనం, చలాకీతనమని

అంటారు, సురస ను ఓడించిన సందర్భంలో మనం ఇది చూడవచ్చు.క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఆయనను చూసి నేర్చుకోవాలి.


**3. రామ కాజ కరిబే కో ఆతుర (సేవా తత్పరత)**


రామకార్యం చేయడంలో ఆత్రుత కలవాడు ఆతురత అంటే ఎలాగైనా సాధించాలి. సాధించేవరకూ నిద్రపోకూడదనుకోవడం అది హనుమ వద్ద రామ కార్యంలో కనబడుతుంది. మైనాకుడు కాసేపు ఆగి వెళ్ళవయ్య అంటే నాకు సమయం లేదు అని ముట్టుకుని ఆగకుండా ముందుకు వెళ్తాడు.


భగవంతుని సేవలో ఆయనకు ఉన్న ఆ ఉత్సాహం (ఆతురత) మనకు ప్రేరణ. ఏ పనినైనా వాయిదా వేయకుండా, అత్యంత ఆసక్తితో పూర్తి చేయాలనేది ఇక్కడి అంతరార్థం.


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి,కానీ వివరణ మరీ పెద్దగా అవుతుంది అన్న ఉద్దేశ్యం తో ఇంతటితో ఆపుతున్నాను,మీకు ఇంత వివరణ కావాలా వద్ద కామెంట్ చేయండి👇


ఇన్ని విషయాలు చెపితే ఏదోక విషయం చాలీసా చదివే సమయంలో మనసులోకి వచ్చి నిలబడితే అదే అసలైన పారాయణ అనే ఉద్దేశ్యం తో ఇస్తున్నాను, పైగా రామాయణ స్మరణ, హనుమత్ కథల తో హనుమాన్ చాలీసా యజ్ఞం పరిపూర్ణం అవుతుంది అని. మీరెలా అంటే అలాగే ముందుకు పోదాం...


 **తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం ఇచ్చారు. ఒక వ్యక్తికి **విద్య** ఉండాలి, ఆ విద్యకు **సద్గుణం** తోడవ్వాలి, లోకంలో బ్రతకడానికి **చాతుర్యం** ఉండాలి, వీటన్నింటికీ మించి భగవంతుని సేవలో **నిరంతర ఉత్సాహం** ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు ఉన్నచోట విజయం తథ్యం.


*జై శ్రీరామ్!జై హనుమాన్!*

        🍁🌹🙏🌷🍁


         *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏